Tuesday, August 31, 2010

నేనెరిగిన మా నాన్న .. రతీంద్రనాథ్ టాగూర్

    ఆంద్ర భూమిలో రతీంద్రనాథ్ టాగూర్( రవీంద్ర నాథ్ టాగోర్ గారి కుమారుడు) రాసిన నేనెరిగిన మా నాన్న కు, జానమద్ది హనుమచ్ఛాస్ర్తి గారి అనుసరణ .....నాకు నచ్చి,  చదవని వారి కోసం , మీ కోసం.......




రవీంద్రుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, అశేష శేముషీ ధురంధరుడుగు నాతడు కవి, తత్త్వవేత్త, దార్శనికుడు. అతడు ఆనంద రసామృతమూర్తి.
బాల్యములోనే పెల్లుబుకుచున్న తన పుత్రుని ప్రతిభా విశేషమునకు, మా తాతగారు మిక్కిలి మురిసిపోయేవారు. పుత్రులందరికంటే మా నాన్నగారిపై వారికి మిక్కిలి ప్రేమ. అందరికంటె యితనిపట్ల మిక్కిలి ఉదారముగ వుండేవారు. అన్ని వసతులుగల రెండు గదులను, మా నాన్నగారికి ప్రత్యేకించి ఇచ్చారు. మా నాన్నగారి కోసం ప్రత్యేకమైన ఒక భవమునే నిర్మింపజేశారు. అదియే ‘లాల్‌బారి’ అన్న పేరుతో ప్రసిద్ధమైనది. మా నాన్నగారికి ఒకేచోట వుండడమంటే విసుగు. నిత్య నూతనత నాకాంక్షించే ఆ కవి హృదయానికి పాత ప్రాసాదాలలో పొద్దుపుచ్చడమంటే పడేది కాదు. నాన్నగారికి బాగా వయసువచ్చేటప్పటికిగాని ప్రపంచం, వారి ప్రజ్ఞ్భావాలను గుర్తింపలేదు. వారు యువకులుగనున్నప్పుడే ప్రజానురాగాన్ని చూరగొనగల్గారు. అసమాన సౌందర్యరూపము, కమనీయమైన కంఠమాధుర్యము వారి ప్రజారంజకత్వమున పాలుపంచుకొన్నవి. ఒకమారు ప్రసిద్ధ నవలా రచయిత బంకించంద్ర చటర్జీ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ యొకదానిలో నాన్నగారు ఉపన్యసించారు. కిక్కిరిసిన ఆ సభాభవనము సుదీర్ఘమైన ఉపన్యాసమిచ్చేసరికి నాన్నగారి గొంతుక బొంగరుపోయింది. ఉపన్యాసానంతరం నాన్నగారినొక పాట పాడవలసిందిగా సభ్యులు కోరారు. తుదకు బంకింబాబుగారు పాడమని కోరేసరికి నాన్నగారు కాదనలేకపోయారు. మొదటే అలసినవారి ధ్వనిపేటిక దెబ్బతింది. విశ్రాంతికోసం సిమ్లా వెళ్ళారు. ఆ సుమధుర గాత్రము మాత్రం కరిగిపోయింది.
నాన్నగారికి మంచి వస్తమ్రులన్న మిక్కిలి యిష్టము. యువకులుగా వున్నపుడు పట్టులాల్చీ, ధోవతి, పట్టువుత్తరీయము ధరించేవారు. వదులుగా వూగులాడుతువుండే వంగీయ దుస్తులపై వారికి మిక్కిలి మోజు. వదులైన పట్టులాల్చీ ధరించి ఈతోత్తరీయము వేసుకొను తీరు, చూపరుల మనమోహకముగ వుండేవి. వారి వేషాలంకరణ ననుకరించేవారు. ప్రయాణము చేస్తున్నపుడు పంట్లాము, విలువైన కోటు, చిన్న కుళ్ళాయి ధరించేవారు. మా చిన్నాయనగారైన జ్యోతీంద్రనాథ్‌గారి ‘పిరాలీ పగ్రీ’ అనబడు తలపాగాకట్టు అందముగా ఉండేది.
యాభైయ్యోయేడు దాటిన తర్వాత జుబ్బాలు మెత్తని టోపీ ధరించేవారు. లేత ఆరంజి రంగు దుస్తులంటే వారికి ఇష్టము. వృద్ధాప్యములో వారిని చూచిన వారెవరూ, వారి లేత గులాబీ రంగు దుస్తులను మరచిపోయేవారు కారు.
ఈ సందర్భముననే మరొక ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తేదలచాను. నాన్నగారు గాంధీజీ ఆప్తస్నేహితులు. బహిర్దృష్టికి వారిరువురిలో వ్యత్యాసము అపారము. కొల్లాయిగట్టిన గాంధీజీతో అందమైన దుస్తులు ధరించునట్టి మా నాన్నగారు సమావేశమైనపుడు, ఆ దృశ్యము విచిత్రముగ తోచెడిది. నాన్నగారు ధరించే దుస్తులు అతిమూల్యమైనవి కావు. సామాన్య వస్తువులను కూడా అత్యంత సుందరముగ వుంచుటలోను, అత్యమూల వస్తమ్రులను అతి నిరాడంబరముగా ప్రదర్శిచుటలోను వారి కళాకుశలత స్పష్టమయ్యేది. గాంధీజీ యొక్క కొల్లాయిగుడ్డ లక్షలాది భారత ప్రజల దారిద్య్ర ప్రతీకము. ఈ వ్యత్యాసములోనే వుంది వైశిష్ట్యమంతా. గాంధీజీ వుద్దేశించారో లేదో కాని వారి జీవితమే నిరాడంబరతకు ప్రతీకము. నాన్నగారికి అతినిరాడంబరమంటే అంతగా నచ్చేదికాదు. సదా కొరతతోనే కాలం వెళ్ళబుచ్చే రుూ దేశీయులకు నిరాడంబరం పొదుపరితనం ఒక ఆదర్శం అంటే అంత సమంజసము కాదేమోనని వారి అభిప్రాయము. దురదృష్టవశమున భావసంకీర్ణతకులోనై అసహ్యమైన దుస్తులు, వెగటు పుట్టించు అలవాట్లు; యివే మంచి సాంఘికాచారములుగా పాటించే రోజులు వచ్చినవి. ఈ మార్పు నాన్నగారి కళాహృదయాన్ని కంపింపజేసింది.
నాన్నగారు శాంతినికేతనమున సాగించిన విద్యావిషయిక పరిశోధనలలో గల కష్టనష్టాలను గుర్తించినవారు కొందరు మాత్రమే. శాంతినికేతనము ఒక విప్లవాత్మక విద్యా సంస్థయని గుర్తించుటకు కొన్ని యేళ్ళు పట్టినవి. పైపెచ్చు బ్రిటీష్ ప్రభుత్వము రహస్య పత్రముల ద్వారా పెద్ద ఉద్యోగులెవరూ తమ పిల్లలను ఈ విద్యాలయమునకు పంపకుండునట్లు తెలియజేసినది. లౌకికదృష్ట్యా అప్పటి స్థితిలో నాన్నగారు యిట్టి ప్రయత్నమునకు పూనుకొనడం ఉచితమైనదిగా నాకు తోచినది కాదు. కుష్టియాలో సాగించిన వ్యాపారమునకు పెద్ద నష్టము కల్గినది. పాఠశాల ప్రారంభించుటకుగాను వారు తమ స్వంత వస్తువులను, గ్రంథాలను ఎన్నిటినో అమ్మివేశారు. తల్లిగారి నగలను కూడా అమ్మివేశారు. తమ వివాహ కాలమున మిత్రులొకరు మైత్రీపురస్సరముగా సమర్పించిన బంగారు గడియారమును, గొలుసును కూడా అమ్మివేశారు. మా చిన్నతనములో రుూ గడియారమును మేమెంతో ముచ్చటగా చూచేవారము. మా నాన్నగారి నుండి ఆ గడియారమును కొన్నట్టి యువతీమణి, దానిని 1910లో నాకు పెళ్ళికానుకగా యిచ్చేసరికి విస్మయానంద భరితుణ్ణయ్యాను. నాటినుండి నా వంశ పారంపర్యముగా సంక్రమించిన వస్తువులలో ఆ బంగారు గడియారమును అతి ముఖ్యముగా పరిగణిస్తున్నాను.
విద్యాలయమున విద్యార్థుల సంఖ్య హెచ్చుకొలది వ్యయభారము పెరుగుచుండినది. నాన్నగారు తమ మిత్రులైన లోకేన్ పాలిట్‌గారి తండ్రిగారైన సర్ తారకనాథ్ పాలిట్‌గారినుండి అప్పుతీసుకొన్నారు. ఈ ఋణాన్ని సర్ తారక్‌నాథ్‌గారు జీవంతులుగా వున్నప్పట్లో తీర్చలేకపోయారు. సర్ తారక్‌గారు తమ సర్వసంపదలతో పాటు నాన్నగారినుండి రావలసిన అప్పు కూడా కలకత్తా విశ్వవిద్యాయునకే చెల్లవలసినదంటూ వీలునామా వ్రాసి పరమపదించారు. ఈ ఋణబాధ వారినెప్పుడూ ఒక కోశాన కోస్తూ వుండేది. విద్యాధిదేవత చిరునవ్వుతో సాక్షాత్కరిస్తూ వుండేది కాని భాగ్యాధిదేవత పెడముఖం పెట్టి పరుగెత్తిపోయేది. దౌర్భాగ్యముతోపాటు దురదృష్టం చేరి వారి ప్రగతిని నిరోధించుచుండేవి.
1916-17లో సాగించిన అమెరికా ఉపన్యాస సంచార యాత్ర అత్యంత దిగ్విజయంగా సాగింది. అప్పులన్నీ తీరి, తమ శాంతినికేతనం అతి విస్తృతమై వర్థిల్లేందుకు వలసిన పైకం సమకూరుతుందనీ, మరెక్కడా యాచింపనవసరంలేదనీ, అతి శ్రమకు గురియయ్యారు నాన్నగారు. కాని దురదృష్టం మరల దాపరించింది. వారి సంచార కార్యక్రమమును కొనసాగించుచున్న సంస్థచివరికి దివాలా తీసింది. లక్షలు వస్తాయని ఆశిస్తున్నందుకు బదులుగా, విల్లీసియర్సన్‌గారు ఎంతో కష్టసాధ్యముగా కొన్నివేల పైకం మాత్రం రాబట్టగల్గిరి. ఆ పైకం అంతా కలకత్తా విశ్వవిద్యాలయమునకు చెల్లించవలసిన బాకీకి చెల్లుకాబడినది. యూరప్‌లోని వివిధ దేశాలలో ప్రకటితమైన నాన్నగారి పుస్తకాలవల్ల ఎంతో డబ్బు రావలసి వుండినది. ఈ యశోవ్యాప్తి వారికి రావలసిన రాయల్టీ పైకము చాలా తగ్గిపోయినది. నాన్నగారు తరచు తమ విద్యాలయ నిర్వహణ కోసం యాచకుడై యాత్ర చేయవలసి వచ్చెడిది. 1920లో జరిపిన అమెరికా యాత్రలో నేనూ వారి వెంబడి వెళ్ళాను. శ్రీ మార్గెంథో మరియు శ్రీమతి విల్లర్డ్‌స్ట్రేట్ అను కోట్లాధీశ్వరుల నాయకత్వాన వాల్‌స్ట్రీట్‌లోని కోట్లాధీశ్వరులతో గొప్ప మొత్తాల చందా పట్టీ ప్రారంభమయింది. అప్పట్లో టర్కీ దేశమున అమెరికా రాయబారిగ వున్న శ్రీ మార్గంథో గొప్ప ధనికుడు. ఈ కార్యక్రమమును ప్రారంభించేందుకు ముందు వందపైచిలుకు లక్షాధీశులను తమ యింట విందుకు ఆహ్వానించారు. నాన్నగారు కొన్ని మిలియన్‌ల పైకం లభిస్తుందని ఆశించారు. కాని అమెరికా వదలివచ్చేటప్పటికి కొన్ని వేలు కూడా లభించినవి కావు. నాన్నగారు తీవ్ర నిరాశతో స్వదేశాన్ని చేరారు. న్యూయార్క్ నగర హోటలులో వున్న కొన్నివారాలు డబ్బుకోసం పడిన యాతన, వారి మనస్సుకెంతో కష్టం కలిగించింది. తమ మనోవ్యధనంతటినీ చార్లీ ఆండ్రూస్ గారికి వ్రాసిన లేఖలలో వెళ్లగ్రక్కారు. ఇది నాకు కూడా విచారకరంగా పరిణమించింది. హృదయ విదారకరమైన ఈ పరిణామానికి నేనే కారకుణ్ణి. నాన్నగారిని పర్యటనకు పురికొల్పింది నేనే కాబట్టి చాలా నొచ్చుకున్నాను. నాన్నగారిలాంటి సుకుమార హృదయుడు, కవిపుంగవుడు, కళాతపస్వి విశ్వభారతికై విరాళాలు సేకరించుటకు అవిశ్రాంతంగా తిరుగుటలోగల యాతనను విషాద స్థితిని గమనించిన గాంధీజీ చాలా విచారించారు. 1936లో నాన్నగారు తమ తమ విశ్వభారతి విద్యార్థుల బృందంతో ‘చిత్రాంగద’ నాటక ప్రదర్శన ద్వారా విరాళాల సేకరణ పూనుకున్నట్టు అప్పుడు ఢిల్లీలో వున్న గాంధీజీకి తెలిసింది. నాన్నగారు అప్పట్లో జ్వరపీడితులై వుండేవారు. నాన్నగారికి ఎంత పైకం లోటుగా వున్నది తెలుపవలసిదిగా గాంధీజీ మమ్ము కోరారు. ఢిల్లీ వదలి వచ్చేలోపుగా తాము సేకరించిన మొత్తమునంతటినీ సమర్పించి ఇంక ముందు యాచనార్ధము తిరగనని నాన్నగారివద్ద వాగ్దత్తం కావించుకొన్నారు.
మహాత్ముని ద్వారా అనాయాసముగా లభించిన ఆ విరాళము మాకెంతో సంతోషాన్ని కలిగించింది. కాని నాన్నగారు మిక్కిలి వ్యధ చెందారు. వారి మనస్థితిని గ్రహించుటకు నాకు అట్టే కాలం పట్టలేదు. అప్పటి ఆర్ధిక మాంద్యంనుండి గట్టెక్కుటకు గాంధీ గారి విరాళమెంతో తోడ్పడినప్పటికీ తమ వాగ్దానం ఆ విరాళానికంటే అధికమైనదని వారి భావన. విరామమెరుగక సాగించుచున్న ఈ సంచార ప్రదర్శనా కార్యక్రమము ప్రయాస పూర్ణమైనప్పటికీ తమ విద్యార్థి బృందము ననుసరించుచు తమ రచనలు రూపముదాల్చి సంగీత, నాటక, నృత్యములో ప్రత్యక్షమైనప్పుడు వారనుభవించుచుండిన ఆత్మానందము అవర్ణనీయమని నాకు తెలియును.
నాన్నగారు ఆశావాదులు. హాస్యభరితమైన ప్రవన్న చిత్తము కలవారు. హాస్యగర్భిత ప్రవృత్తియే వారిని, జీవితాంతము వెంటాడుతూ వచ్చిన విషాద సంఘటనలను ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని సమకూర్చినది. ఆర్ధిక దుస్థితి వారినెప్పుడు కుంగదీసేది కాదు. వారి నలుబది ఒకటవ ఏడుననే సంభవించిన నా మాతృవియోగమ వారి సృజనాత్మక కృషికి పెద్ద దెబ్బ. ఆమె గతించడంతో అయిదుగురు పిల్లలు పెంచు బాధ్యత నాన్నగారిపై పడింది. అప్పటికి నా యిరువురు చెల్లెళ్ల వివాహమై వుండినది. నా సోదరుడు సమీంద్రుడప్పటికి ఎనిమిదేళ్ల పిల్లవాడు.. తన సంతానముతోపాటు వందలాది శాంతినికేతన విద్యార్థులను పెంచుభారము కూడా వారే వహించుయుండిరి. విధి వారినెన్నో విషమ పరీక్షలకు గురి చేసింది. నా తాతగారు, వివాహితులైన నా చెల్లెళ్లు, నా ప్రియ సోదరుడు ఒకరి వెంట ఒకరు గతించారు. నాన్నగారు అతి వాత్సల్యంతో పెంచిన బలేంద్ర, నితీంద్రలను నా పెత్తండ్రి కొడుకులు మంచి వ్వనమలోనే అకాల మృత్యువుకు గురియగుట వారికి మిక్కిలి దుఃఖము కలిగించింది. వీటికితోడు శాంతి నికేతనము మీద తనకెంతో సైదోడు వాడోడుగమన్న సతీశ్‌రాయ్ మరియు మోహిత్ చంద్రసేనుల అకాల మరణమునకు పరితపించారు. తాను అమితంగా ప్రేమించి పెంచిన వారొకరి వెంబడి నొకరు తమ జీవిత యాత్ర సాగించి వెళ్లుతూ ఉండు వారు ప్రదర్శించిన మనోధైర్యము ప్రశంసనీయము. ఎంతటి అసాధ్య పరిస్థితులలోనైనను నిర్వికారముతో అచంచలుడై తన కృషిని కొనసాగించే స్థితప్రజ్ఞుడాయన. వారికి విశ్రాంతి కావలసినపుడు వారు రచించిన గేయాలకు స్వరరూపముల కల్పించెడివారు. చిత్రలేఖనము కూడా వారి విశ్రాంతి కాలసాధనము. మా ముత్తాతగారైన ప్రిన్స్ ద్వారకనాధ్ టాగూర్‌గారు 1814లో ఇంగ్లండ్ వెళ్లినప్పుడు వారి మేనల్లుడగు నవీన్‌బాబు వారి ఆంతరంగిక కార్యదర్శిగా వెళ్లి యుండిరట. తనమామగారు తరచుగా తమ కార్యక్రమమును మార్చుకొనుచు తనకెంతో విసుగు కలిగించేవారని తమ యింటికి వ్రాసిన జాబులలో పేర్కొనేవారు. నవీన్‌బాబుగారి రుూ ఆరోపణ టాగూర్ వంశీయులందరికీ వర్తిస్తుందనుకొంటాను. నాన్నగారుకూడా అమాంతంగా తమ కార్యక్రమమును ఆఖరు ఘడియలలో మార్చివేసేవారు. ఈ మార్పులను గురించి ముందుగా తన కోడలికి(నా భార్యకు) తెలియజేసేవారు. ఆకస్మికంగా కార్యక్రమమును తారుమారు చేసినప్పటికీ మేము ఉక్కిరి బిక్కిరి అయ్యేవాళ్లము. మార్పు వారికి అభిలషణీయమ. సృజనాత్మకమైనది వారి శీలము అన్యాయాలను అక్రమాలను అవి సంఘంలో కానివ్వండి, సాహిత్య రంగంలో కానివ్వండి నిర్భయంగా ఎదిరించేవారు. అన్యాయాన్ని, వ్ఢ్యౌన్ని ఎదుర్కొనే విప్లవాత్మక శక్తికి తోడు నూతన సమస్య పరిష్కారానే్వషణకు కావలసిన కర్తవ్య దీక్షా దక్షుడాయన
అసాధారణమైన వారి మేధాశక్తి నాకచ్చరువు కలిగించేది. నిత్యనూతనోత్సాహంతో కొత్తపుంతలు తొక్కేది ఆయన అనన్య కల్పనాశక్తి. వారు తమ డెబ్బదవ యేట ప్రాసబద్ధమైన గీతికారచనలో గంభీర సంవేదన భావోద్వేగము నూతన పంథాతో వెలువడినది. అప్పట్లో రాసిన ఆయన కథానికలు కామప్రబోదకములని సాంప్రదాయ వాదులు అలజడి చేసారు. నాన్నగారు గతించుటకు కొన్ని రోజులు ముందు చెప్పి వ్రాయించిన గీతములు శైలిలోను, పోకడలోను నవ్యతను సమకూర్చుకొన్నవి. వారిననుకరింప యత్నించిన యువరచయితలు విఫలులయిరి. ఎంత శ్రమించి వ్రాసినప్పటికీ వారి జీవిత చిత్రణ మసంపూర్ణమే. ఆత్మ సంతోపనశీలమైన వారి రచనలే వారి జీవిత భాష్యాలు. మరే జీవిత చరిత్ర తెలియజేయని పనిని వారి రచనలు చాటగలవు. వారి గేయ కవితయే వారి జీవిత గాధ. ఆయన జీవితమే ఒక మహత్కావ్యమని చెప్పి ఇక మగిస్తాను

Monday, August 30, 2010

అంధ భిక్షువు

">

వానమ్మ, వానమ్మ, ఒక్క సారన్న   వచ్చిపోవమ్మ,  అంటూ ఎన్నో రోజులుగా రాని ఆ వానకోసం పడే తపన , అప్పడప్పుడు నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ బస్సు స్టాండ్ లోనో, లేదా ఏ చౌరస్తా లోనో వినిపించేది. ఆ పాట,  ఆ గొంతు మనల్ని కట్టి పదేసేదిగా  అనిపించేది.  ఒక సారి  ఎవరా అని చూస్తే , ఒక అంధుడు, తల్లి సాయం తో చేతిలో కంజర తో " వానమ్మ ..వానమ్మ " అని పాడుతూ కన్పించాడు.  ఆ తర్వాత  ఎప్పుడు ఆ బస్సు స్టాండ్ వద్దకు రాగానే నా చూపులు అతని కోసం , నా చెవులు అతని పాట  కొరకు వెతికేవి.  కొన్ని అలా మన మనసులో ముద్రించుకొని పోయి , మనం ఎక్కడున్నా , మన నాలుకపై  ఆడుతూ, అప్రయత్నంగా మనం పాడుకుంటూ ఉంటాం . అలా ఈ పాట నా నోట్లో అప్పుడప్పుడు నానుతుంటుంది.  అతను  కనపడితే  అలాగే  ఆ పాట అయిపోయేంతవరకు ఉండి  వినే వాణ్ని. అతని గొంతులో నిజంగా రాని వాన కోసం పడే బాధ స్పష్టంగా వినిపించేది.  ఆ పాటకు అందం అతను పాడినందు వలననే    వచ్చిందా అనిపించేది. ఆ పాట కొరకు కాదు నేను చూసేది . అతని గొంతులో నుండి ఆవేదనతో తో వచ్చే పాట ఎంతొ అద్బుతంగా  అనిపించేది . అతను  కన్పించక చాల రోజులవుతుంది.  అతను గుర్తుకు వస్తే నాకు విశ్వనాథ వారి అంధ భిక్షువు  పద్యం  గుర్తుకు వస్తుంది.
      
          " అతడు రైలోలో నే బొయినప్పుదేల్ల     నెక్కడో ఒక్క చోట దానెక్కు - వాని     నతని కూతురు నడిపించు చనుసరించు"
           "  అతని కన్నులు బొత్తలే - ఆ సమయము నందు తన్ను రక్షింప నేరైనా  వత్తురేమోయని చూచి చూచి యట్లె నిలబడి "
            "అతని ప్రాణాలు కనుగుళ్ళ యందు నిలిచి......................."              

"రైలు  ప్రయాణం లో పాటలు పాడుతూ అడుక్కొనే ఒక అంధుడి గురించి కవి  హృదయం  లో కల్గిన సంచలనం.  అతడి పూర్వ జన్మలో నూతిలో తన్ను రక్షించే వాడు లేక మరలా వేదన ననుభవిస్తూ  విలపించిన కంట   ధ్వని ,సన్నబడి , సన్నబడి  ఈ జన్మలో వెతుక్కుంటూ అతన్ని చేరుకున్తుందట . అతని  కన్నులు పూర్వజన్మలో నూతిలో పడ్డప్పుడు రక్షించే వారికొరకు ప్రతీక్షించి , పతీక్షించి , కనుగుళ్ళలో   నిలుపుకొన్న ప్రాణాలు , మళ్లీ ఈ జన్మలో అతన్ని చేరినాయట  .ప్రాణాలు పోయిన తర్వాత  మిగిలిన బొత్తలే  ఈ జన్మలో చూపు లేని కళ్ళు." అని ఎంత బాగా చెప్పాడు.

నిజంగా ఈ పద్యం చదువుతుంటే నాకు ఆ అంధుడి కళ్ళు , అతని పాట గుర్తుకు వచ్చాయి. ఆ పాట విని చాలా రోజులవుతున్నది ,  ఆ  అంధుడు, ఆ కళ్ళు, ఆ పాట ఇప్పటికి విశ్వనాథుని  అంధ భిక్షువై నా కళ్ళ ముందు కనిపిస్తూ ,   నా హృదయంలో  లో విన్పిస్తుంటుంది.


Sunday, August 29, 2010

గోరేటి వెంకన్న..పల్లె కన్నీరు పెడుతుందో

గోరేటి వెంకన్న గారు రాసి స్వంతంగా పాడిన ఈ "పల్లె కన్నీరు పెడుతుందో"  వారి గొంతులోనుండి వచ్చిన పాట నిజంగా ఫీల్ ఇస్తుంది. అందుకే ఆ  జానపదం మీరు ఆనందిస్తారని ఇక్కడ.......



భూమాత ఏడ్చింది నా బిడ్డ రైతన్నా....
ఏనాడు స్థిమితంగా తిండి తినదతంచు
చేతి వృత్తులు వారి చేతులిరిగి పాయె
పల్లె కన్నీరోడ్చే పనిపాటల వాండ్ల
ఉనికి కనపడదు నా ఉరిలోనా...  ఆ...ఆ..


పల్లె కన్నీరు బెడుతుందో...కనిపించని కుట్రల
నా తల్లీ  బంది అయి పోతుందో కనిపించని కుట్రల
కుమ్మరి వాములో తుమ్మలు మొలిచెను
కుమ్మరి కొలిమిలో దుమ్ము లేచెను
సాలెల మగ్గము సడుగులిరిగినవి
పెద్ద బాడిశ మొద్దుబారినది
చేతివృత్తుల చేతులిరిగినాయో....నా పల్లెల్లోన
గ్రామ స్వరాజ్యం గంగలోన మునిగే.....

మడుగులన్ని అడుగంటిపోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎన్దిపోయినవి
సాకలి పొయ్యిలు కులిపోయినాయ్
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో - గా బలిసిన దొరలది
బక్క రైతులా బావులేన్డినాయో నా పల్లెల్లోన

ఎరుక బాపలకు గాలాలేసే - తురకల పోరలు యాడికి బోయిరి
లారిలల్ల క్లీనర్లియ్యిర  - పెట్రోల్ మురికిలో మురికైయ్యిన్ద్ర
దుద సేమియాకు దురమైనారా - గాసాఇబు పోరలు
బెకరి కేక్ తో ఆకలి తీరిందో - ఆ పట్టణాలలో
అరకల పనికి ఆకలి తీరక - గడెం నాగలి పని గాసమేల్లక
ఫర్నిచర్ పనులేతుక్కుంటూ - ఆ పట్నం బోయిరి విశ్వకర్మలు
ఆసాములంతా కుసోనున్దేటి - వద్రన్గీ వాకిలి
పొక్కిలి లేసి దుఖిసున్నది - మన పల్లెల్లోన

నరికేమ్పులా తెల్ల జేల్లలు - పరులకు తెలియని మరుగు భాషలో
బెరంజేసే కంసాలి వీధులు - వన్నె తగ్గినవి చిన్న బోయినవి
చెన్నై  బొంబాయి కంపెని నగలోచ్చే  - నా స్వర్ణకారుల
చన్ద్రకొలలతో తరుముతున్నరన్నో - మన పల్లెల్లోన
మేరోల్ల చేతుల కత్తెర - ములనబడి చిలుమేక్కు పోయినది
కుట్టుడు రెట్టల బానిన్లు పోయినవి - సోదేలాగులు జాడెనే లేవు
రెడీమేడ్ దుస్తుల ఫ్యాశానిచ్చినాడా  - మన పల్లెల్లోకి
మన కూలి కంచముల రాళ్ళు గొట్టిరయ్యో - మన పల్లెల్లోన

మాదిగ లొడ్డి నోరు తెరిచినది - తంగేడు చెక్క బెంగ పడినది
తొండము బొక్కెన నిండా మునిగినది - ఆరే రంప
పడునారిపోయినది
పాతరేకులవలె మొగేటి - ఆ ప్లాస్టిక్ డప్పులు
తోలు డప్పులను పాతరేసిరన్న - నా పల్లెల్లోన
ఇల్లు కట్టుకునే ఇటుక రాయికొ సెలక జల్లే ఎరువు కుల్లుకో
ఎద్దుబండి వున్నోడికి చేతుల - ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు తక్కరిచ్చేరన్నో -మన పల్లెల్లోన
ఎడ్లబండి గిల్లిగిరి పడ్డదన్నో - మా పల్లెల్లోన

తొలకరి కురిసితే పులకరించే ఆ నేల పరిమళం ఏడికిబోయే
వానపాములు, నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకుట లేవు
పత్తి మందుల గత్తర వాసన తో - నా పల్లెల్లోన
మిత్తికి  దెచ్చిన అప్పే కత్తాయే - నా పల్లెల్లోన
హరిచ్చంద్ర బజన్నతకపంతులు -హర్మోనియుం చెదలు బట్టినది
యక్ష గానము నేర్పే పంతులు -ఉప్పరి పనిలో తట్టబట్టినపుడు
యాచకులు, నా బుడిగా జంగాలు - ఆ పల్లెలు విడిసి
పాతబట్టలు పాళీలు అమ్ముతుండ్రు  - ఆ పట్టణాలలో
వందల దత్తెలు కట్టే పీర్లకు - ఒకటి రెండు మూతలు బోయి
అలా నిప్పులు ఆరిపోయినై - పలావు  కందులుపాతరబద్దవి  
ఇంటికొక్క అయ్యప్ప వెలిసినాడో - నా పల్లెల్లోన
ఇంటి దేవరలు ఇగుల పట్టినయే న పల్లెల్లోన

పిందోలె  ఎన్నెల రాలుచుండగా - రచ్చబండపై కూసోని రైతులు
ఏనాకట్ట సుద్దలు ఏటలకతలను - యాది చేసుకొని బాధలు
మరిసేరు చుక్క నోటిలో పడ్డదంటే నేడు- నా పల్లెల్లోన
ఒక్కడు రాతిరి బయటకు రాడయ్యో - మా పల్లెల్లోనా
కోలాటం బతుకమ్మ పాటలు - బజానా కీర్తనలు మద్దెల మోతలు
బైరగుల కిన్నెరా తత్వంములు - కనుమరుగాఎర మన పల్లెల్లోనా
స్టార్ టి వి సకిలిస్తూ వున్నదంమో - మన పల్లెల్లోన
సామ్రాజ్య వాద విశామేక్కుతున్నడంమో  - మెల్లంగ పల్లెకు

Saturday, August 28, 2010

పల్లె కన్నీరు పెడుతుంది

 ">

నాకు ఇష్టమయిన జానపదం , జన పదం   "పల్లె కన్నీరు పెడుతుంది" అన్న  గోరేటి వెంకన్న గారి పాట. నాకే కాదు తెలంగాణా లో ఈ పాట తెలవనివారు, ఈ పాటను హమ్ చేయని వారు ఉండరంటే అతిశయోక్తి ఏమి కాదనుకుంట. నేను మొదటి సారిగా. కుబుసం చిత్ర ఆడియో లో ఈ పాట విన్నాను. అప్పటినించి ఈ పాట నా ప్లే లిస్టు లో, నా గుండెల్లో కూర్చొని ఉంది.

 పల్లెలలో చిన్నతనం లో గడిపిన వ్యక్తిగా, పల్లెవాతావరణం కల్మషం గాని రోజుల్లో , పల్లెను చూసి ఆ వాతావరణాన్ని ఆ అందాన్ని అనుభవించిన  వ్యక్తి గా, ఈ పాట వింటుంటే, నిజంగా అప్పటికి , ఇప్పటికి ఎంత తేడ.  దుఖం రాక మానదు. ఈ పాట విన్నప్పుడుల్ల కళ్ళు చెమరుస్తాయి. ఎంత మంచి సాహిత్యం. "పల్లెకన్నీరు  పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బంది అయి పోతుందో  కనిపించని కుట్రల" అంటూ గోరేటి వెంకన్న మనకు మారిన పల్లెల దుస్థితి, పరిస్తితి ని గురించి కళ్ళకు కట్టినట్లుగా తెలియజేస్తారు. 

అభివృద్ధి పేరిట, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పేరిట పల్లెల్లో మారిన వాతావరణం, అభివృద్ధి కంటే ఎక్కువ పల్లె రూపాన్ని  ఏ  దిశగా మార్చింది , కులవృత్తులు  ఎలా నాశన మయ్యాయో, ఎంతొ బాధతో వివరిస్తాడు. 

." చేతి వ్రుత్తులా  చేతులిరిగిపాయే  నా పల్లెల్లోన, నా గ్రామ స్వరాజ్యం గంగలోన పాయె ఈ దేశం లోన",  " తల్లి దుడ్ సేమియలకు దురమైనార సహెబుల పొరలు అంటూ ఉంటె దుఖం రాక మానదు. చివరికి నుదుట కుంకుమ కూడా పోయి "బొట్టు బిళ్ళలు నొసటి కొచ్చే గదరా  నా పల్లెల్లో","మన బుడ్డి దాసరి బతుకులాగామాయే" ట్రాక్టర్ లు యంత్రాలు వచ్చిన తర్వాత, " మా ఎద్దు బండి  గిల్లి గిరి పడ్డ ధమ్మో "    అంటుంటే గుండె ద్రవిస్తుంది.

 తొలకి జల్లుకు తడిసిన నేలా,  మట్టి పరిమలాలేమై  పోయేర " అంటూ అ పల్లె పరిమళాల గురించి అడుగుతుంటే........చివరికి పల్లె భూముల్లో "వానపాములు, నత్తగుల్లలు  ఎందుకు బతుకుతలేవు  అంటూ" , దీనికి కారణం పత్తి మందుల గత్తర వాసనరా అంటూ , పత్తి మందుల అప్పే రైతు కుతికె మీద కత్తి అయ్యింది అంటూ రైతు ఆత్మ హత్యల గురించి చెబుతుంటే.........కళ్ళకు నీళ్లు రాకుండా ఉంటాయా .

"బుక్క నోటిల పడ్డదంటే నేడు. ...అయ్యో  ఒక్కడు రాతిరి బయటికేల్లడంమో, ఇది ఏమి సిత్రమో" "బతుకమ్మ కోలాట పాటలు, భజన కీర్తనల మద్దెల మోతలు, బైరాగుల కిన్నెరా తత్వంములు కనుమరుగాయేర,  అరె స్టార్ టి.వి సకిలిస్తా ఉన్నదంమో" అంటూ ఎఫ్ టి వి ల పేరిట సామ్రాజ వాద  విషం ఎక్కుతుందని ఎంత హృద్యంగా ...

..కుల  వ్రుతులు మాయమవుతున్నాయి, కుటీర పరిశ్రమల్ ఎందుకుపెట్టారు అని ప్రశ్నిస్తాడు. బహుళ జాతి కంపెని ల మాయల భారత పల్లెలు నలిగిపోయి కుమిలె అంటూ ఉంటె.......పల్లెల్లో కుల వ్రుతులు మాయమైపోయి అందరు పట్టనాలల్లకు  వలస పోయి,  పల్లె కన్నీరు పెడుతుంది అంటే..... పల్లె కాదు మనం కనీరు పెట్టక మానం......

గోరేటి వెంకన్న గారే పల్లెటూరు అనే పాటలో, పల్లె అందాల గురించి చాలా చక్కగా చెప్పారు.  అలాంటి, పచ్చాని నా పల్లెటూరు, తొలకరి జల్లు పడితే కిలకిల నవ్వేటి నా పల్లె.....అమ్మఒడిలోన  ఉయ్యాల తీరు, గల గల పారేటి యేరు, గంతులేయంగా నిలిచింది చూడు,  ఇలాంటి పల్లెలు ఈ రోజు కన్నేరుపెడుతుంటే,  మన కళ్ళు కూడా కన్నీరు, మున్నీరవుతాయి. 

గోరేటి వెంకన్న, ఈ పాట వందేమాతరం  గళంలో, శ్రీహరి ముఖంలో , కళ్ళల్లో కనిపించే ఆ ఎక్ష్ప్రెశన్స,  రియల్లీ వండర్ఫుల్. ఆ పాట చిత్రీకరించిన విధానం, దర్శకుదేవ్వరో  గాని పల్లె  చూడని వాళ్ళ కు కూడా ఈ పాటను ఇష్ట పడేటట్లు , హృదయం ద్రవించి పోఎంతగా,     చిత్రీకరించిన వైనం అభినందనీయం.  శ్రీహరి  కళ్ళల్లో , ముఖం లో వ్యక్తం చేసిన ఆ expressions మనల్ని ఎప్పుడు  వెంటాడుతుంటాయి. 

( గోరేటి  వెంకన్న గారి పూర్తి పాట ఈ సినిమా లో  చిత్రీకరించా బడలేదు. గోరేతిగారు స్వంతంగా పడిన పాట, మరియు సాహిత్యం ఇంకో పోస్ట్ లో )

Wednesday, August 25, 2010

ఇదీ మన జీవితం

రాఖి శుభాకాంక్షలు. రాఖీ   అన్న చెల్లెళ్ళ  అనుబందానికి ప్రతీక.  రాఖి అంటే ఒకప్పుడు కుటుంబ సబ్యులు  అందరు ఒకచోట కలుసుకొని  పొద్దున్నే  తలంటు స్నానం చేసి చెల్లెళ్ళు  రాఖి కడుతుంటే  ఆ సమయo లో మనం ఏదో  పెద్దవాళ్ళ లా  అక్షింతలు జల్లి,  దీవిన్చినట్లు  ఓ  ఫోసే కొట్టి! ఏదో సరదాగా పండగ ముగించేవాళ్ళం. 

ఇప్పుడు మనం ఒకచోట, వాళ్ళు ఒకచోట.  సెల్ లో  లోనే పలకరింపులు, Email లో లేదా కొరియర్లో రాఖీలు,  ఆర్కుట్ లో దీవెనలు.  ఉదయమే  హడావుడిగా  తలంటు స్నానం  ఆదరాబాదరాగా చేసి,  కొరియర్లో వచ్చిన  రాఖిలు కట్టుకొని మనకు మనమే దీవిన్చికొని,  మన పనిలో ఎప్పుడు పడదామా అని తొందర.  ఇదీజీవితం! ఓ సరదా లేదు, ఓ  ముద్దు  లేదు,  ముచ్చటా  లేదు.  ఎప్పుడు హడావుడే,

అసలు మనకంటూ ఈ లైఫ్ లో టైం లేదా? ఎవరికోసం బ్రతుకుతున్నాము - ఎవరికొరకు ఈ లైఫ్. లైఫ్ ఈస్  సో షార్ట్ అని ఎవరో  అన్నారు. మరి ఈ చిన్ని జీవితం లో మనకంటూ ఇంత స్పేస్ లేదా?. బిజీ......బిజీ.....ఆల్వేస్   బిజీ,  భార్య తో సినిమా చూసే తీరిక ఉండదు,  ఇంట్లో పిల్లలతో గడిపే టైం ఉండదు. మరెందుకు ఈజివితం . తినటందుకు బ్రతుకుతున్నమా,  బ్రతికేటందుకు  తింటున్నామా?. పనికోసం   జీవిస్తున్నామా  జీవించటం కోసం పని చేస్తున్నామా?. ఏమో ఏమి అర్ధం కావటం లేదు.

ఓ కథ   గుర్తుకు వస్తుంది.   ఎక్కడో ఓ మారుమూల దీవిలో  ఓ జాలరి జీవిస్తుంటాడు.  ఓ సిటీ నుండి ఓ వ్యాపారి, పెద్ద మనిషి   పోయి  అతనితో నువ్వు సిటీ కిరా  నీకు డబ్బులు ,ఇస్త ఆదునిక సామాగ్రి ఇస్తా, మనుషులను పెట్టి చేపలను పట్టి బిజినెస్ చేద్దువు కాని  అంటాడు. ఆ జాలరి ప్రశ్నిస్తాడు , ఆ తరువాత ఏమవుతుంది అని.  ఆ వ్యాపారి నువ్వు డబ్బులు బాగా  సంపాదించవచ్చు, ఇల్లు కారు ఇంకా ఎన్నో కొనుక్కోవచ్చు అంటాడు. ఆ తర్వాత  అని అడుగుతాడు.  కాలుమీద కాలు వేసుకొని   కూర్చొని  జీవితం గడపొచ్చు అని   అంటాడు వ్యాపారి.  అప్పుడు ఆ జాలరి  నేను  నా పని తర్వాత,  ఇప్పుడు  అదే చేస్తున్నానుగా  అని ఆంటాడు. చూసారా అతను తన చిన్ని జీవితాన్ని ఎంత  హ్యాపీ గా  గడుపుతున్నాడు. మరి మనం-బిజీ... బిజీ... బిజీ .... సాయంత్రం ఇంటికి వచ్చాక చూసుకుంటే ఏముంటుంది,  stress తప్ప.

 మొన్న  ఈ మధ్య చాలా రోజుల తర్వాత  కాదండి,  చాల నెలల   తరువాత పిల్లలతో  కలిసి సినిమాకు వెళ్ళాను.  మధ్యలో ఫోన్ కాల్ ...... ఎమర్జెంసీ !  అంతే వాళ్ళను అక్కడే  వదిలేసి మనం జంప్ !  పని చూసుకొని తిరిగి  హాల్ కి వచ్చే సరికి climax దగ్గర పడింది. ఇదండీ మన లైఫ్. అస్సలు మన గురించి మనం జీవించడం మానేసి ఎంత కాలమయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అస్సలు  మన జీవితంలో మనం ఉన్నామా?  అందులో మనం కన్పించం. అందులో మన ప్రేఫెరేన్సుస్ లిస్టు చుస్తే అది ఇలా ఉంటుంది. ఇతరులు, ఉద్యోగం, ఫ్రెండ్స్, భార్య పిల్లలు, మనం. చూసారా ఈ లిస్టు లో మనం చివర. దీన్ని రివర్స్ చేస్తే ఎంత బాగుంటుంది. మన కంటూ మన జీవితం లో ఓ చిన్న స్పేస్, మన చిన్న చిన్న, పెద్ద పెద్ద సరదాలు, మనకు, మనకే ఇష్టం అయిన పనులు చేస్తూ ...జస్ట్ ఒక్క సారి imagine చేయండి..............నిజ్జంగా బాగుంది కదూ!.


అంటాం కాని. మనకు అదీ సాధ్యం కాదండి. ఇన్ని చెప్పుకున్న  ఒక్కరోజు ఆఫీసు పోక పొతే కొమ్పలన్తుకుపోవు. ఒక్క 24  గంటలు ఇంట్లోనించి కాలు కదపకుండా ఉండగలమా.  feverish  గా ఉందని ఇంట్లో సెలవ్ పెడ్తే, అది ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదు. అదేంటో ఆఫీసు లో జనం మధ్య ఉంటె ఏది గుర్తుకు ఉండదు. ఎందుకంటే మనం బ్రతికేది మన కొరకు కాదు కదా అందుకు. ఫ్రాయిడ్ అన్నాడు మనం చేసే పనులన్నీ, రెండు రకాల ప్రేరణల వల్ల, చేస్తామట. ఒకటి లైంగిక వాంచ, రెండోది గొప్ప వాల్లమవ్వాలన్న కాంక్ష. నిజమే వీటి కొరకు నానా  గడ్డి కరుస్తం,  చివరికి మనల్ని మనమే మరిచిపోతం.నేను ఇందాకే చెప్పా కదా. చివరికి వెనక్కి తిరిగి చూసుకొంటే అందులో మనం ఎక్కడ కన్పించం. ఇది మన లైఫ్.
                                                                                               

Friday, August 20, 2010

తుమ్మేటి గారితో కాసేపు (2)

నేను ఇదివరకే చెప్పినట్లు నన్ను  తుమ్మేటి గారిని మల్లి కలిసేలా వారి కథలు  నన్ను పురిగొల్పాయి   అనడంలో ఎటువంటి సందేహము లేదు. అవి చదివిన , క్షమించాలి చూసి విన్న మరునాడే, జోరున వర్షం పడుతుంది. అయినా అదే వాన లో వారికీ ఫోన్ చేసి వారి ఇంటికి వెళ్లి కలిసా.  ప్రశాంతంగా ఉన్న ఇల్లు, పక్కనే ర్యాక్ లో ఎన్నో రకాల సాహిత్యం. వారితో మాట్లాడినంతసేపు నేను ఇంత పెద్ద రచయిత ముందు కుర్చున్ననా  ,అని ఒక ఫీలింగ్. ఎంత నిరాడంబరంగా. ఇక వారి మాటల్లో వారికి సాహిత్యం మరియు సాహిత్యలోకం పట్ల ఉన్న పట్టు అవగాహన ప్రతి మాటలో కన్పించింది. ఇప్పుడెందుకు మీరు రాయట్లేదు అన్న ప్రశ్నకు సింపుల్ గా ఎంతో మంది రాస్తున్నారు. కొత్తగా రాయటందుకు ఏముంది అంటారు.   వర్తమాన సమాజం పట్ల వారి ఆలోచన , విబిన్న ఆలోచన దృక్పథం ఎదుటివారిని వారిని మళ్ళి కలిసేలా కట్టిపడేస్తాయి.సెకండరీ గా రాయడం నాకిష్టం లేదు అని చెప్పారు.

అంతకుముందు రోజు నేను చుసిన వారి విడియో కథల గురించి చాలా సేపు మాట్లాడారు. బయట నా ఎదురుగా మాట్లాడుతున్న తుమ్మేటి గారికి, విడియో లో కథలను నర్రేట్  చేస్తున్న తుమ్మేటిగారికి ఏమి తేడ లేదు. నాతొ ఎలా మాట్లాడుతున్నారో అదే రీతిలో వారు కథ చెప్పిన విధానం , ఏదో మనం ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్లుగా , బాగుంది అన్నాను. ఒక చిన్న నవ్వు నవ్వి,  తన బాధ వ్యక్తం చేసారు. ఆ సి.డి లను వంద కాపీలు తీసి మిత్రులకు పంపితే ఒక్క ఆరుగురు మాత్రమే రెస్పాన్స్ ఇచ్చారని. 
 
 వారు చెప్పినట్లు ఈ రోజుల్లో ఉన్న క్షణ కాలం తీరిక లేని ఈ జీవితాల్లో ( నిజమేనా, మనం అలా అనుకున్తున్నమా  ) ఎంతమందికి పుస్తకాలు కొని చదివే ఓపిక ఉంది. అందరు ఎక్కువగా t .v  లకు అలవాటు పడుతున్న ఈ రోజుల్లో కథలను దృశ్య రూపకన్గా చూపిస్తే కథ అనేది పాటకులకు ఇంకా దగ్గరవుతుంది  కదా అంటారు.నిజమే నాకు ఈ సమయంలో గుర్తొచ్చింది .

కల్పనా రెంటాల గారు కుడా ఇలాంటి ప్రయత్నమే చేసి కవిత్వాన్ని శ్రవణ మాధ్యమంలో వినిపించారు. ఆడియో బ్లాగ్గింగ్  శీర్షికన వారు కూడా కవితలను వినిపిస్తూ వారు ఏమంటారంటే "  మౌనం గా లోపల్లోపల చదవటం కన్నా పైకి చదవటం వల్ల, పైకి చదివినది శ్రధ్ధగా వినటం వల్ల మరింత ఎక్కువగా మనసుకి హత్తుకొని దగ్గరవుతుందనిపిస్తుంది."   చదవడం కన్నా వినడంలో ఉన్న ఆనందం ఆ అందాన్ని వారన్నట్లు కవిత్వం యొక్క శబ్ద లయ సౌందర్యాని ఎంతో ఆస్వాదించవచ్చు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.నిజమే నేనుప్రత్యక్షంగా   ఆస్వాదించా.


తుమ్మేటి గారు  అలా అనడమే  కాదు, దానిని ఆ రూపకంగా  సి.డి. రూపకంలో తీసుకొచ్చారు. మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న ఇతివృత్తాలనే కథాంశాలుగా ఎన్నుకొని, వాటిని చాల చక్కగా  మనం మాట్లడుకొన్తున్నట్లుగ్గా చెప్పడం చుస్తే ఈ ప్రక్రియను ఆహ్వానిన్చాలనిపిస్తుంది.కథ మరియు ఆ కథాంశం మన మనసులకు ఇంకా  హత్తుకొని దగ్గరవుతుంది.


మనం రోజు చూసే  విషయాలపట్ల వారి విభిన్న ఆలోచనా ధోరణి చాల స్పష్టంగా ఈ కథల్లో కన్పిస్తుంది. ఈ కథలను  మరియు వీడియో లను నేను పరిచయం చేస్తాను అంటే సంతోషంగా ఒప్పుకొన్నారు. ఈ ప్రక్రియ ఎంత మంది లోకి పొతే అది అంత ప్రాచుర్యం పొందుతుంది. ఇంకా ఇలా ఎంతోమంది ముందుకు వస్తారు అని అంటారు. నిజమే. ఇంకా మీ స్నేహితులకి కూడా పరిచయం చేయండి అని చెబుతుంటే  వారికి ఈ ప్రక్రియ పట్ల ఉన్న తపన వారి కళ్ళల్లో స్పషంగా కనిపించింది. ఇంకా  ఎన్నో ఎన్నెన్నో విషయాలు వారితో మాట్లాడుతుంటే సమయం తెలిలేదు.  వారి విడియో కథలతో మల్లి కలుద్దాం.

Sunday, August 15, 2010

ఆర్తితో ......., ఆరాటంతో......

ఎన్నో  రోజులు.......ఎన్నో యుగాలనిపిస్తింది
నీవు రాక,  నీవు లేక 
నన్ను మరిచి పోయావా 


నువ్వు వస్తావని ఆశతో, ఎదురుచూస్తూ
నా దేహం ఆణువణువూ , నీ స్పర్శ కొరకై
ఆర్తితో,    ఆరాటంతో వేచి చూస్తూ
ఎన్నాళ్ళు ఇలా.....
.
నేను ఒంటరిగా పోతుంటే , ఒక్కసారిగా నాకు ఎదురై
నేను తేరుకొనేలోగా
ముద్దులతో మున్చేతావు 
నా దేహాన్ని  ఆణువణువూ ఆర్తితో స్ప్రుశించావు
నీ స్పర్శలో, నీ ప్రేమలో,తడిసి ముద్దయి
ఇంతలోనే మాయమయ్యావు


ఎక్కడ, ఎక్కడ అని వెతకను నిన్ను
కారు మబ్బులు కమ్మినప్పుడల్లా
ఆకాశం కేసి వెర్రివాడిలా నీకోసం
నువ్వు మల్లి వస్తావని
ఆర్తితో ......., ఆరాటంతో........

Friday, August 13, 2010

తుమ్మేటి గారితో కాసేపు (1 )

    
చాలా   రోజుల క్రితం అనుకోకుండా ఒక దినపత్రిక లో సెజ్ లపై ఒక కథ చదివా. ఎందుకో ఆ కంటెంట్, రాసిన విధానం , సెజ్ లపై  విబిన్న ఆలోచన ధోరణి నాకెందుకో బాగా నచ్చింది. ఎవరు రాసారు అని చూస్తే "తుమ్మేటి రఘోత్తం రెడ్డి" అని ఉంది. మా కొలీగ్ సర్ అతను ఇక్కడే ఉంటారు, నాకు తెల్సు, రోజు వాకింగ్ చేస్తూ ఇటు వస్తారు అని అంటే నేను కొంత ఆశ్చర్య పోయా. అంతటి రచయిత ఇక్కడే ఉన్నాడని నాకు తెలియనందుకు.

ఆ తర్వాత రెండు రోజులకు అనుకోకుండా వారిని  కలవటము జరిగింది. వారిని చూడగానే మొదట విస్మయానికి లోనయ్యా. ఎంత సాధారణంగా ఉన్నారు అనుకొని . .కూర్చొని ఓ కప్పు కాఫీ తాగి వారితో గడిపిన పది నిమిషాలు నాకు వారిపట్ల ఒక అవగాహన రావటందుకు తోడ్పడింది.  అనుకోకుండ  ఒక గొప్ప రచయిత తో  జరిగిన ఆ పరిచయం నా కెంతో సంతోషాన్ని మిగిల్చింది. వారితో గడిపిన ఆ కొద్ది క్షణాల్లో వారి గురించి కొన్ని ముచ్చట్లు మీతో పంచు కోవాలని ........

చాల సింపుల్ గా కన్పించే వారు, తనకున్న వనరులు తను తన కుటుంబం జీవించటానికి చాలు అని సింగరేణి లో  సూపర్ వైసెర్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్   తీసుకొని , ఆరోగ్యం బాగా లేని తన తండ్రికి సేవ చేయటందుకు కూడా అదొక కారణమని అన్నారు. డబ్బులున్నవాడు ఇంకా సంపాయించాలని , ఇంకా వెనకేసుకోవాలని ఆలోచించే ఈ రోజుల్లో ఇలా ఆలోచించే ఒక గొప్ప వ్యక్తిని చూశా.ఆ కాసేపట్లో నేను తెల్సుకొన్న విషయాలు  ఏమిటంటే  ...

వారు నిగర్వి , ఈ సమాజం పట్ల జీవితం పట్ల వారికి అపారమయిన  అవగాహన ఉంది. సాహితీ లోకం తో వారికున్న పరిచయం, సమాజం లో జరిగే సంఘటనలపట్ల  వారి విభిన్న ఆలోచనా  ధోరణి , నాకు  వారిపట్ల ఒక ఇంట్రెస్ట్ పెరిగేలా చేసాయి. కథలు రాయడమే కాకుండా, ఇప్పుడున్న దృశ్య మాధ్యమాన్ని ఉపయోగించుకొని , కథలను మౌఖికంగా  మరియు వీడియో రూపం లో చెప్పాలన్న ఒక ప్రక్రియ వారి నోటి గుండా విని ఆశ్చర్యపోయాను.  వారు ఇదివరకే అలా కొన్ని కథలను ఒక సి.డి. రూపంలో విడుదల చేసారని చెప్పారు.

 తక్కువ సమయం ఉండడంతో వారితో ఎక్కువ  మాట్లాడలేక పోయా. ఆ తక్కువ సమయంలో వారితో మాట్లాడిన మాటలు , వారి గురించి నేను ఇంకా ముందుకు పోవటందుకు నన్ను పురిగొల్పాయి. ......మరిన్ని విషయాలతో మల్లి కలుద్దాం.

Wednesday, August 11, 2010

మధుశాల

">
ఈ మధ్య పద్మభూషణ్  శ్రీ హరివంశ రాయ్ బచన్ చే రచించబడి తెలుగు లోకి దేవరాజు మహారాజు గారిచే అనువదించబడిన " మధుశాల" కవిత అనే పుస్తకం చదివా. ఇది సమీక్ష కాదు. నాకు నచ్చి ఏదో మీతో దానిగురించి పంచుకుందామని ఈ ప్రయత్నం....
హరివంశ రాయ్ బచన్ 1907 - 2003  మధ్య తొంబై ఆరేళ్ళపాటు జీవించి ఎన్నో రచనలు చేసినారు. 30 కవితః సంపుటిలు మరో 50 ఇతర గ్రంధాలు రచించాడు. 1935 లో రాసిన ఈ మధుశాల అతని కి ఎంతో ప్రక్యాతి ని తెచ్చింది.    హిందీ రాష్ట్ర బాష కావడానికి ముక్యమయిన బుమికను పోషించారు. హిందీ సాహిత్య రంగం  లో "హాలావాదాన్ని" (మధువాదాన్ని) ప్రతిపాదించి పోషించిన వాడి గా పేరొందాడు. మట్టె ఈ కాయం మనసే ఉల్లాసం, క్షణ బంగురం ఈ జీవితఃమ్, అదే నా పరిచయం అని తనను తానూ పరిచయం చేసుకోనేవాదట. ఈ మధుశాల కవిత్వాన్ని ఎన్నో సభలలో తానూ స్వంతగా చదివి వినిపించేవాడట.
ఇక మధుశాల కవిత సంపుటి లో మొత్తం 135 కవితలు (రుబాయీలు)ఒక్కొక్కటి నాలుగు పాదాలుగా రచించబడినది. ప్రతి కవితలో " మధువు" ,"మధుపాత్ర", "సాకి" మరియు "మధుశాల" నాలుగు  పదాలు వాడుతూ సమకాలీన జీవితం, తాత్వికత, దేశభక్తి , మతసామరస్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక విషయాలపై కవితలల్లారు. ఇక్కడ మధువు అంటే మధువు కానక్కరలేదు మధుశాల అంటే మధుశాలే కాదు అని కవి అంతరార్థం. ఒక ధ్యేయానికి , ఒక గమ్యానికి అది సంకేతం, ధ్యేయాన్ని బట్టి ఒక్కొక్కరి మధుశాల మారుతూ ఉంటుంది అని రచయిత తన ముందుమాటలో తెలియజేసారు.
  కవిని సాకీ గా చెబుతూ కవిత్వమనే మధువును మధుపాత్రలో నింపుకొని వచ్చాడు అని ఎంత తాగిన ఖాళీ అవదు అంటూ పాటక  జనమే తాగేవారు, పుస్తకమే మధుశాల అంటాడు.  మధుశాల కు భావుకత్వాన్ని జోడిస్తూ " గోరింటాకు పండిన చేతితి మణి భూషిత  మధు పాత్ర తీసుకొని మిసమిసలాడే బంగారు చ్చయతో ద్రాక్ష రసం , సాకీ అందిస్తే తాగే యోధులు రకరకాల  సంప్రదాయ దుస్తులతో ఉంటె ఇంద్రధనస్సు పోటిపదడా రంగురంగుల మధుశాల  అంటాడు. 
ఒక చోట పూజారి ని సాకీ గా పవిత్రగంగా జలాన్ని  మధువుగా జపమాలలను మధు పాత్రల మాలగా ఇంకా తాగు అన్నదే మంత్రోచ్చారనగా , మందిరాన్నే  మధుశాలగా అభివర్ణిస్తాడు.  మసీదుకు తాళం వేసినా రాజుల కోటలు బీటలు వారిన, కోశాగారాలు గుల్లయి పోయినా ఏమయినా సరే, తెరిచి  ఉండనీ  మధుశాలను అని అజ్ఞ్యాపిస్తాడు. పనివాడైనా , యజమాని  అయినా మధువు దగ్గర ఒకటే అంటాడు.మనందరికీ ఏడాదికి ఒక్క సారే  హోలీ, దీపావళి కాని మధుశాల లో రోజు పగలే హోలీ ,రాత్రి దివాలి అని రాస్తాడు.
అమ్మను సాకి అయి పాలిస్తే తొలి తొలి  మధువులు అందిస్తే అని, ఇంకో చోట సూర్యుడు మధు వర్తకుడు ,సముద్రమే ఒక మధు కలశం, మేఘమే సాకి, వర్షపు జలమే మధుధార, అని వర్షపు రుతువును మధుశాలతో పోలుస్తాడు.
ప్రకృతిని వర్ణిస్తూ, "ప్రభాత ప్రాతః కాలం సాకి ఉషస్సు పంచుతూ సాగేనహో, భుమ్యాకాశం కలిసే చోట మధువులు పారెను కిరణాలై, మధు కిరణాలు తాగిన పక్షులు పాటలు పిచ్చిగా పాదేనహో ,ప్రతి ప్రభాతము ప్రకృతిలోన వికసిన్చునదే మధుశాల" ఎంత అందమయిన భావన.హిమజాల్న్ని మధువుగా  నదులను సాకిలుగా పచ్చగా  ఉగెను పంటపొలాలు తాగిన మత్తులో అంటూ వ్యవసాయ భారతాన్ని మధుశాల గా ఆవిష్కరిస్తాడు. దేశ భక్తిని వర్ణిస్తూ, రుదిరాని మధువుగా ఆశిస్సుల మధుపాత్ర తీసుకోని మున్డుకునడువు అతి ఉదారము గుణము భారతిది త్యాగ శీలి సాకి, బలికోరే స్వాతంత్ర్యమే కాలిక - ఇక బలి వెదికే మధుశాల అంటాడు. .
మనల్ని మందిరం,మజీదే విడగోట్టిందని, మధువు దగ్గర అందరు సమానులే, అందరి మనసులు కలిపేదే మధుశాల అంటాడు. చివరికి చనిపోయేటప్పుడు నా ఆధరంములపై   తులసి దళ పాత్ర కారాదు, జివ్హాగ్రముపై గంగాజలమధువు అంటూ, శవయాత్రలో సత్యం మధుశాల అనమంటాడు. చితిపై నెయ్యి బదులు మధువు పోయ్యమంటాడు.పరలోకప్రయానానికి  పిలిపించండి తాగేవాల్లను, తెరిపించండి మధుశాలను అంటాడు. ఇలా చెబుతూ పొతే ఎన్నో ఎన్నెన్నో...

నీ హృదయపు లోతెంతుందో  మధు పాత్ర లోతంతుతుంది
నీ మనసున మతెన్తుందోమధువున మత్తతుంటుంది
నీ భావుకత అందం ఎంతో సాకి అంతటి సుందరమూ
ఎవ్వడేన్తటి  రసికుడయితే ,అంతటి రసమయము మధుశాల.

 జీవితం ఓక  సత్యం. పదం ఒక సత్యం ఈ రెండు వేర్వేరు, ప్రపంచ సాహిత్యమంతా పదాలతో రూపు దిద్దుకోన్నదే ,జీవితాన్ని అందుకోవడానికి పదాలు చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం - సాహిత్యం    అని అంటాడు హరివంశ రాయ్ బచన్.

బాల్యం

బాల్యం .....చిన్నతనం.... ఏమి తెలియని వయస్సు, అయినా ఎంత హ్యాపీ గా గడిచాయి. ఇప్పుడు జ్ఞ్యాపకమొస్తే.....
మొదటి సారి మా ఇంటి దగ్గర ఉండే శుబ్రం అని ఒకతను అంటే మా మొదటిగురువు, మా ఇంటికి ఓ నాలుగు  ఇండ్ల ఆవల ఉండేది వాళ్ళ ఇల్లు. మా ఉళ్ళో అప్పుడు అది మొట్టమొదట అ...ఆ...లు నేర్చుకోనేవారికి  ప్రైమరీ స్కూల్ .  ఇప్పుడు ఏవో ప్లే వే స్కూల్స్ ఉన్నాయిగా అల్లా అన్నమాట.చింతా చెట్టు కింద, చాపలు లేదా గోనే సంచులు వేసుకొని కూర్చొని చదివే వాళ్ళం. అప్పుడప్పుడు చింత కాయలు కుడా తినే వాళ్ళం లెండి.  అలా కొన్నిరోజులు అక్కడ , తర్వాత ఒక అయ్యగారు ఉండేవాడు. అది యు.కేజీ అన్నమాట. అక్కడ కొద్దిగా స్ట్రిక్ట్ లెండి.  కొద్దిగా ఏంటి  "కోదండం" ఇప్పటివాల్లకు తెలియదు అనుకుంట! చదవకపోయినా, రాయకపోయినా అయ్యవారు కోదండం ఎక్కిచ్చేవారు. కోదండం అంటే ఓ తాడు పట్టుకొని వేల్లాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు కింద రేగు కంప కుడా పెట్టేవాడు. మరి కోపమొస్తే.  ఇంకో పనిష్మెంట్  కూడా ఉండేదండి అది ఏంటంటే గోడ కుర్చీ . మనం కుర్చీ లాగ గోడకు అనుకోని ఎ ఆధారము లేకుండా ఓ పావు గంటో, అర్థ గంటో  అలా కూర్చోవాలి. ఇవ్వన్ని మనం చూడడమే లెండి. మనకు లేవు. ఎందుకంటే మనం గుడ్ బాయ్  కదా, మీదుగా పట్వారి గారి మనవడినాయే..  మనకి కొంత కన్సిస్సన్ ఉండేది లెండి.....ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేతప్పుడు ఆ పక్కనే  ఒక రేగు చెట్టు ఉండేది .ఎంచక్కా రేగు పండ్లు ఏరుకొని  కొట్టుకొని  తినే వాళ్ళం  .ఇలా అక్కడ పెద్ద బాల శిక్ష అంతా చదివేసాం. ఇప్పుడు కుడా అక్కడక్కడ టీచర్ లు మంచి మంచి పనిష్మెంట్ లు ఇస్తున్నారట. ఈరోజు టి.వి. లో చూసానండి. మహబాద్ దగ్గర జమాండ్లపల్లి అనే ఉళ్ళో హెడ్ మాస్టర్ గారి కి కోపమోచ్చేసి , మండే పోయ్యిలోనించి కొరకాసు తీసుకొని అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా వాతలు పెట్టేసింది. మల్లి ఎంచక్కా చెబుతోంది అంటే వాళ్ళు అల్లరి చేసుకుంటూ తిరుగుతుంటే కోపం వచ్చేసి కాల్చిందట. పాపం ఆ పిల్లల వంటిపై ఎన్నెని కాలిన గాయాలు...జీవితాంతం ఆ బాల్యం గుర్తుండేలా......అన్యాయం....అమానుషం  కదండీ.....డి.ఈ.ఓ.గారు ఆమెను సస్పెండ్ చేసారు గాని ఆమెను కుడా నిలబెట్టి ఓ పెద్ద కొరకాసు తీసుకొని ఆ పిల్లల చేత కాల్పిస్తే ఎలా ఉంటుందో  ఒక్క సారి ఉహించుకోండి. .......మళ్లీ  కలుద్దాం ..అప్పటివరకు శెలవ్ ...

Saturday, August 7, 2010

దేఖ ఏక్ క్వాబ్

లతాజీ, కిషోర్ పాడిన సిల్సిలా లోని ఈ  పాట ఎంత మధరం , అందమయిన దృశ్యాలు,  మధురానుభూతులు అందించే సాహిత్యం తులిప్ పూల  అందాలూ  అన్నింటికీ  మించి , అమితాబ్ రేఖ  ఎంత అందమయిన ప్రేమ జంట , మరీ మరీ,  వినాలనిపిస్తుంది. మీకోసం..


<">

కభి కభి మేరె దిల్ మే ఖయాల్ ఆతా హై

నాకు నచ్చిన ఈ పాట మీకోసం ఇక్కడ.....
">

Friday, August 6, 2010

కలలు కల్లలైన వేళ.

రోజు పేపర్ లో ఎన్నో చదువుతుంటాం. కొన్ని మనకెందుకులే అని వదిలేస్తాం . కొన్ని చదివి అయ్యో పాపం అని ఒక నిట్టుర్పు వదిలి మన పనిలో పడతాం. కాని ఈరోజు డెక్కన్ క్రానికల్ లో చదివిన ఒక వార్త మనసును కదిలించి, రోజంతా వెంటాడుతు ఉంది. అదేంటంటే "  SCHOOL BUS RUNS OVER LKG BOY".

 హైదరాబాద్ లో మనికంట అనే అయిదు ఏళ్ల ఎల్.కే.జి అబ్బాయి హరిహరా గ్రామర్ స్కూల్లో చదువుతూ రోజాటిలాగే పాపం , బస్సు  దిగగానే అగుపించే తల్లి కోసం ఆరాటపడుతూ, సంతోషంగా ఆ స్కూల్ బస్సు దిగి బస్సు ఎదురుగాకనపడుతున్న తల్లి తండ్రి లను చూస్తూ బస్సు ముందు నుంచే రోడ్డు దాటుతుండగా, ఆ బస్సు డ్రైవర్ చూసుకోకుండా బస్సును ముందుకు కదిలించాడు. అంతె,   పాపం ఆ బస్సు చక్రాల కింద, ఆ పసిమొగ్గ ప్రాణాలు గాలిలో కలిసిపోయి. తల్లి తండ్రుల ఎదురుగానే, ఆ కొడుకు ప్రాణం లేకుండా మిగిలి పోయాడు. పాపం ఆ పిచ్చి తల్లి ఇంకా బతికి ఉన్నాడేమో అని విగత జీవి అయిన ఆ పసిమొగ్గ ను ఒడిలో పెట్టుకొని పిలుస్తూ కన్నీరు మున్నీరు అయిందని  చదువుతుంటేనే మనసు ద్రవించి పోతుంది. కళ్ళు చెమర్చాయి.  ప్రత్యక్షంగా కళ్ళెదుటే సంతోషంగా వస్తు ఒకేసారి ప్రానాలోదిలిన ఆ కొడుకును చుస్తే ఆ తల్లి తండ్రుల  వేదన మాటల్లో చెప్పలేము.

 పాపం ఆ పిల్లవాడి తండ్రి వెంకటేష్, చిన్న ఉద్యోగి అయినా, కొడుకు మంచిగా చదువుకోవాలని ఎన్నో ఆశలతో ఒక మంచి స్కూల్లో చదివిస్తూ, కళ్ళెదుటే ఆ కొడుకు మరణిస్తే,  ఆ తండ్రి కడుపు కోత ........ ఒక చిన్న నిర్లక్ష్యం తో ఒక చిన్న మానవ తప్పిదంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. దీనికి ఎవ్వర్ని తప్పు పట్టాలి.  సరి అయిన శిక్షణ లేని డ్రైవర్ లను తీసుకొన్న యాజమాన్యాలద,లేక పట్టిచ్చుకొనే ప్రభుత్వానిదా.? ఏది ఏమయినప్పటికీ వారి ఆశలు గాలిలో కలిసి పోయినై మరి వారి కలలు కల్లలయినాయి. 

Wednesday, August 4, 2010

ధ్యానం

స్వామి జగదాత్మానంద గారి జీవనవికాసము  నుండి "ధ్యానం" గురించి ...........


ఒక గిన్నెలో నుంచి మరొక గిన్నెలోకి నూనె పోస్తున్నప్పుడు ఏర్పడే తెగిపోని తైల  ధార లాగ  మనస్సు భగవంతుడి వైపు ప్రవహించే పద్ధతినే ధ్యానం అని అంటారు. జపం మరింత తీవ్రమైనప్పుడు అది ధ్యానం లో లీనమవుతుంది. శ్రీ రామకృష్ణులు ధ్యానం చేసేందుకు "హృదయం" చాల మంచి స్థానం  అని చెబుతారు. కొన్ని సార్లు జ్ఞ్యానులు కనుబొమ్మల మధ్య,   భక్తుల హృదయంలో ధ్యానం చేస్తారని చెప్పబడుతుంది. అప్పుడే మొదలుపెట్టిన వారికి ధ్యానం చేసేందుకు  హృదయమే మేలైన స్థానం అనడంలో సందేహం లేదు. కాని ఈ హృదయం అనేది ఏమిటి? ఎక్కడుంది.
      జాగ్రత్తగా పరిశీలిస్తే మనం మూడు రకాల హృదయాలు ఉన్నాయని చూడవచ్చు. శరీరం లోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపు చేసే హృదయం అందరికి తెలిసినదే. ఈ హృదయం తన పనిని తానూ చేయటం మాని వేస్తె శరీరం చేసే అన్ని పనులు ఆగి పోతాయి. కాని, "నేను నా గుండె లోతులలోనించి మాట్లాడుతున్నాను" ,"అతడి హృదయం పవిత్రమైనది" మొదలైన మాటలు అన్నప్పుడు మనం భావోద్రేకాలకు స్థానం అయిన హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాము. ఇది రెండవరకపు హృదయం.  ప్రేమ, భక్తీ, నిస్వార్థత, కరుణ, సేవాభావం, వినయం ఇవ్వన్ని దయా గుణానికి , సౌహార్ద్ర భావానికి చిహ్నాలు. ఇక మూడవ హృదయం  ఆధ్యాత్మిక హృదయం దీనినే అనాహత చక్రం అని కూడా అంటారు. (యోగ శాస్త్రములో స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు కలిసే కుడల్లను చక్రాలు అని పిలుస్తారు. )
         హృదయం మీద ధ్యానం చేయాలనీ చెప్పినప్పుడు ఈ ఆధ్యాత్మిక మయిన హృదయం మీద అలా చెయ్యాలని వారి ఉద్దేశ్యం. మన శారిరకమయిన, జీవన సంబంధమైన అవసరాలను తీర్చుకోవటం  కోసం , మన "అహంకారాన్ని" కాపాడుకోవడం కోసం మన యొక్క మానసిక శక్తులను మనలో చాలమంది అమితంగా వృధా చేస్తున్నారు. మనలో ఆధ్యాత్మిక చైతన్యం కలగాలంటే "మూలాధారం" లో నిద్రిస్తూ ఉన్న కుండలిని శక్తిని మేల్కొలిపి మనస్సుకున్న అన్ని సంకెళ్ళను త్రుంచి వేయడం అవసరం. దీనికి అర్థం ఏమిటంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు అనాహత చక్రం స్థాయి కి పైకి లేవాలి. రమణ మహర్షి చెప్పిన దాని ప్రకారం మనం "నేను"(అహం) అనే దాని యొక్క మూలాన్ని  వెతుకుతూ పొతే అప్పుడు ఈ అనాహత చక్రాన్ని లేదా ఆద్యాత్మిక హ్ర్యుదయాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది.
     కాని ఇది అంత సులభమైన పద్దతి కాదు. ఈ అహం అనేది ఎవరు? ఈ అహం ఎక్కడినుంచి పుడుతుంది? మనం మెలుకువ తో ఉన్న సమయం లో ఈ అహం అనేకమంది మనుష్యులతో కలుస్తూ ఉంటుంది. గాడమయిన నిద్రలో ఉన్న్డప్పుడు ఈ " అహం" ఎక్కడికి పోతుంది? నిదర లేచ్చినప్పుడు ఈ అహం ఎక్కడినించి వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఈ అహం యొక్క పుట్టుకను తెలుసుకోవాలను పయత్నించినపుచు ఒక స్థాయి ని దాటి ముందుకు కొనసాగలేని స్థితి ఒకటి వస్తుంది. ఇది ఆధ్యాత్మిక హృదయం ఉండే స్థానం. కాని ఎక్కువ మందికి ఇటువంటి అన్వేషణ ను పట్టు వదలకుండా కొనసాగించడం కష్టమవుతుంది. దీని కన్నా సులభమయిన పద్దతి ఏమిటంటే భగవంతునికి ప్రార్థన చేయడం.
          ప్రార్థన ధ్యానానికి తోడుగా పనిచేసి , అందులోని కొరతలని పూరిస్తుంది. తీవ్రమయిన ప్రార్థనతో ధ్యానం మరింత సులభమవుతుంది. ధ్యానం చేయబోయే ముందు పది, పదిహేను నిమిషాలపాటు ఎకాగ్రమయిన  మనస్సు తో ప్రార్థన  చేస్తే మంచిది. మబ్బులు కమ్మినప్పుడు, వర్షం కుఇసినట్టే ప్రార్థన తీవ్రమయినప్పుడు మనస్సు పయికి లేచి భావోద్రేకాల - హృదయపు - స్థాయిని దాటి ఆహ్యత్మిక హృదయాన్ని చేరుకుంటుంది. భగవతుడి పట్ల తీవ్రమయిన వ్యాకులత ఇక్కడే మొదలవుతుంది. ధ్యానానికి పరిపూర్ణత ఇక్కడే కలుగుతుంది.

Tuesday, August 3, 2010

మరిన్ని జ్ఞ్యాపకాలు.............

తొలకరి జల్లు పడితే రైతుల కళ్ళల్లో చూసిన ఆనందం.......జ్ఞ్యాపకం
ఆ చిరుజల్లుల్లలో ఎగిరి తడిసి ముద్దైన  ఆనందం ......జ్ఞ్యాపకం
తెల్ల వారు ఝామున రెల్లు గడ్డిపై మెరిసే మంచు బిందువులను చూసిన ఆనందం..... జ్ఞ్యాపకం
 

గడ్డిలో ఆరుద్ర పురుకులకై పడిన ఆరాటం......జ్ఞ్యాపకం
చెరువులో రాళ్ళతో కప్పగంతులు వేయించిన ఆనందం....జ్ఞ్యాపకం .
అక్కడే పడమరకు వాలి పోతున్న సూరీడు ఎరుపు .......జ్ఞ్యాపకం

ఆకాశంలో ఎగిరే కొంగల బారులు చూసి కేరినతలు కొట్టిన ఆనందం...జ్ఞ్యాపకం .
ఇంట్లో అందరికి అవ్వైన లింగావ్వ బొక్కి నోటి నవ్వుల.....జ్ఞ్యాపకం
సాయంత్రం చేలగట్ల పై బర్లు  కాసే పిల్లవాడు వాయించిన  పిల్లనగ్రోవి విన్న....జ్ఞ్యాపకం

గోదులివేళ.. ....జ్ఞ్యాపకం
రాత్రి నిద్రలోకి జరుకుంటుంటే ఎక్కడినుండో విన్న పల్లె పదాల .....జ్ఞ్యాపకం
పచ్చటి పైరుమించి వచ్చే పిల్ల గాలి....జ్ఞ్యాపకం

చేలల్లో పనిచేసే పడతులు పాడిన జానపదాల ....జ్ఞ్యాపకం .
చేలగట్టు మీదనుంచి నడుస్తుంటే జరా జరా జారి పోయిన పాము ....జ్ఞ్యాపకం
చిలక కొరికిన జామపండ్ల.........జ్ఞ్యాపకం

ఇంట్లో సీతాపలాలు  రాశి గా పోసిన ....జ్ఞ్యాపకం
తెల్ల వారు ఝామున కోడి కొక్కొరోకో తో లేచిన......జ్ఞ్యాపకం .
చలికాలం ఇంటిముందు మంట తో చలి కాగిన.........జ్ఞ్యాపకం

ఇంటిముందు  లేగ దూడల .....జ్ఞ్యాపకం
ఆ లేగ దూడలు తల్లి పొదుగులో పాలు  తాగుతున్న ....జ్ఞ్యాపకం

 రెల్లుగడ్డి, చెరువు అలలు, రామచిలుకలు, కొంగల బారులు, 

 ఎన్నో, ఎన్నెన్నో, పల్లె అందాల ...జ్ఞ్యాపకం
ఇంకా ఎన్నో ఎన్నెన్నో...................................

Monday, August 2, 2010

జ్ఞ్యాపకాలు

జ్ఞ్యాపకం .
మొట్టమొదట శుబ్రం దగ్గర    అ...ఆ...లు నేర్చుకున్న .   జ్ఞ్యాపకం
అయ్యవారి దగ్గర కోదండం చూస్తూ,  అక్షరాలూ చివరి వరకు నేర్చ్కున్న   జ్ఞ్యాపకం
ఇంటి పెరట్లో చింత చెట్టు కింద చింత కాయలు ఏరుకొని తిన్న....  జ్ఞ్యాపకం 

ఎండాకాలం ఆరుబయట  నాయినమ్మ పక్కన పడుకొని చుక్కలు చూస్తూ ఆమె చెప్పిన కథలు వింటూ నిద్రలోకి జారిన....జ్ఞ్యాపకం
 పొద్దున్నే సద్దెన్నం తిని బడికి పోయిన ....జ్ఞ్యాపకం
తాతయ్య తో పొలం గట్ల వెంబడి నడిచిన.....జ్ఞ్యాపకం
ప్రతి శుక్రవారం బియ్యం శర్కర నాయినమ్మ ఇస్తే తీసుకోయి మజీద్ లో ఇచ్చిన... జ్ఞ్యాపకం .
తోటి పిల్లలతో ఉరి బయట పిల్ల కాల్వ లో సరదాగా ఆడిన ....జ్ఞ్యాపకం
ప్రతి ఏడు బతకమ్మలకు మా బతుకమ్మ ఉల్లో పెద్దగుండాలని అమ్మమ్మ పడ్డ కష్టం... జ్ఞ్యాపకం .
సద్దుల రోజు ఆడవాళ్ళూ  "చిన్నీరి మీరు ఏమిట్లు చిన్నరక్క మీరు ఏమిట్లు" అంటూ ఇంటి ముందునుంచి పోయిన. జ్ఞ్యాపకం ....
పొలం దగ్గర రాత్రి ఒక్కడినే కావాలి పన్న ...జ్ఞ్యాపకం
మొదట స్కూల్ లో హెడ్ మాస్టర్ ముందు భయంగా  నిలబడి పేరు చెప్పిన .... జ్ఞ్యాపకం .
సద్దుల రోజు అమ్మతోని చెరువు దగ్గరికి పోయి చెరువుగట్టు మీద ఆడిన ....జ్ఞ్యాపకం
నీళ్ళల్లో దీపాలతో బతుకమ్మ ను వదిలి పెడ్తే కేరింతలు కొడ్తూ ఆనందించిన ....జ్ఞ్యాపకం
ఎడ్లబండ్ల తో ఉల్లో అందరు పోటిగా తిరిగిన .....జ్ఞ్యాపకం
పీరీల పండక్కు దూల దూల అంటూ పీరీల వెంబడి పోయిన....జ్ఞ్యాపకం
సురభి నాటకాల వాళ్ళు వస్తే బాలనాగమ్మ చుసిన ....జ్ఞ్యాపకం
ముత్యాలమ్మ బావి దగ్గర ఆడవాళ్ళూ నీళ్ళు తీసుకెళ్ళే .......జ్ఞ్యాపకం
ఊరిబయట ఏరు పొంగితే బండ్లు కట్టుకొని పోయి చుసిన..... జ్ఞ్యాపకం .
మామిడి  తోటలో దొంగతనంగా మామిడికాయలు కొట్టుకొని తిన్న....జ్ఞ్యాపకం
ఎప్పుడు మొదటి బెంచ్ లోనే కూర్చున్న ....జ్ఞ్యాపకం
చెరువు మత్తడి పోస్తుందంటే పోలో మని వెళ్లి చుసిన ....జ్ఞ్యాపకం
సంక్రాంతి కి కుండల వాయినాలు అమ్మ ఇస్తుంటే  చుసిన.....జ్ఞ్యాపకం
పొద్దున్నే గంగిరెద్దుల వాళ్ళు ఉదుకుంటు ఇంటి ముందరికి వచ్చిన....జ్ఞ్యాపకం
పేపెర్ బాయ్ అంటూ పెద్ద తాతయ్య నోరార పిలిస్తే వార్తలు చదివి విన్పించిన....జ్ఞ్యాపకం
బండ్లు కట్టుకొని పక్క ఉరికి పోయి ఇందిరా గాంది ని చుసిన......జ్ఞ్యాపకం
ఈత నేర్చుకుండామని బావి గట్టున  నిలబడితే బావయ్య నీళ్ళలోకి తోసేసిన ...జ్ఞ్యాపకం .
దీపావళి కి  నాన్న పటాకులు తెస్తే అక్కతో పంచుకొని వాటిని కాల్చిన....జ్ఞ్యాపకం
స్కూల్లో ఎప్పుడు ఫస్టు వచ్చిన......జ్ఞ్యాపకం .
సాయంత్రం చావట్లో బొబ్బడాలు కొనుక్కొని తిన్న ....జ్ఞ్యాపకం .
ఉగాది రోజు ఊరంతా తాతయ్య ఇంటి దగ్గరకి వస్తే  అయ్యగారు పంచాంగం చదివిన ....జ్ఞ్యాపకం
హోలీ రోజు అందరం స్నేహితులం మోదుగ పూల తో రంగులు తయారు చేసుకొని ఉల్లో తిరిగిన ......జ్ఞ్యాపకం
మొదటిసారిగా సైకిల్ కంచి తొక్కినా......జ్ఞ్యాపకం
బాబాయి దగ్గర లెక్కలు నేర్చుకున్న ...జ్ఞ్యాపకం
సెలవుల్లో పనివాళ్ళతో పాటు పావలాకి సోల శేనక్కాయలు కొట్టిన జ్ఞ్యాపకం....

వాన పడుతుంటే చూరు కింద   నీళ్ళ లో తడుస్తూ కాగితపు పడవల తో ఆడిన...జ్ఞ్యాపకం .
రాత్రి  పుట డప్పు సాటిమ్పుతో ఉల్లో వాళ్ళకు విషయాలు చెప్తుంటే విన్న ....జ్ఞ్యాపకం
పొద్దున్నే సరదాగా బర్రేపాలు పితికిన.... జ్ఞ్యాపకం 

  రాత్రి పుట చిడతల రామాయణం , బుర్రకత , హరికత విన్న .......జ్ఞ్యాపకం
స్కైలాబ్ పడుతుందంటే తలుపులు  వేసుకొని కూర్చున్న.....జ్ఞ్యాపకం
ఉల్లోకి తాటకి వేషం వస్తే బయపడి ఇంట్లో అమ్మ చాటు దాక్కున్న ....జ్ఞ్యాపకం

పొలాల వెంబడి, చెట్ల కింద, ఏటిగట్టున, పిల్ల కాల్వల్లో, చెరువుగట్టున, బడిలో ,
మామిడి తోటల్లో, చావట్లో, మజీద్ లో , గుడిలో,    ఇంకా ఇంకా,

తాతయ్య వెంట, అమ్మమ్మ చేత్తో,  అమ్మ చాటున,
నాయనమ్మ ఒడి లో ఎన్నో....ఎన్నెన్నో.....పల్లె .జ్ఞ్యాపకాలు ..