Monday, November 29, 2010

సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్తి చేయడానికి 50 సం.లు పట్టింది



శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారు ఆంధ్రప్రభ లో తమ " స్వీయ జీవన కథాకథనం" లో సూర్య రాయంధ్ర నిఘంటువు గురించి మరియి మరికొన్ని  ఆసక్తికరమయిన విషయాలు తెలియ జేశారు. వారి మాటల్లో

" నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారిని దర్శించేవాన్ని. ఆయన గొప్ప పండితుడు. సాదు శీలి. అమలాపురంలో కొంత కాలం హైస్కూల్ లో పని చేసి తర్వాత కాకినాడ లో కూడా ఉన్నత పాటశాల లో పనిచేశారు. కాకినాడ లో స్తిర పడ్డారు  రామారావు పేట లో ఉండేది ఇల్లు. కొంత కాలం ఆంద్ర సాహిత్య పరిషత్తు నిఘంటువు కార్యస్తానంలో పనిచేశారు. ఆ నిఘంటువు " సుర్యరాయాంద్ర నిఘంటువు". ఇది పూర్తి చేయడానికి 50 సం.లు పట్టింది. అయినా ఈ నిఘంటువు లో ఆధునిక తెలుగుభాషా స్వరూపం ఏ కొంచెము లేదు. వ్యవహారిక పదాలు అంటే నేడు వాడుకలో ఉన్నవి ఏ అయిదు శాతమో చెరాయేమో!. అర్థాలు చాలా వినోదం కలిగిస్తాయి.ఆ మహాపండితులను ఆక్షేపించడం  నిజానికి చాలా అపచారమే. అయితే వాళ్ళ సాహిత్య లోకం వేరు. సంప్రదాయ సాహిత్యం. సంస్కృతాంధ్రాల పరిపూర్ణ అధ్యయనం , లక్ష్యలక్షణ గ్రంధాల పట్ల అభినివేశం   వారి పరమ ప్రామాణిక నిష్ఠకు కొలబద్దలు. 20 వ శతాబ్దపు తెలుగు అభివ్యక్తితో వారికి పనిలేదు. కాబట్టి ఆమోదము అంటే పరిమళ మనీ, ఆయాసం అంటే ఇనుము సంబందమయినదనీ అర్థాలు మాత్రమె ఇస్తారు. కాని నేటి వాడుక అర్థాలు ఇవ్వరు. వాళ్లకు శతకాలు కూడా గుర్తుండవు.

 ఒక ఆసక్తికరమయిన ఉదంతం చెప్పారు వెంపరాల వారు. తాము నిఘంటు కార్యస్తానంలో పని చేస్తున్నప్పటిది. ఒకరోజు తాము ఊరి నుండి వస్తూ రైల్వే స్టేషన్ పక్కనే కదా ఆంద్ర సాహిత్య పరిషత్తు ఉన్నది, దారే కదా అని నిఘంటు కార్యస్తానం లోకి తొంగి చూశారుట.  మళ్ళీ ఇంటికి వెళ్లి  స్నాన సంధ్యానుస్తానాలు తీర్చుకొని రావడానికి ఎట్లానూ ఆలస్యమవుతుంది కదా అని. అప్పుడు చాలా పెద్ద పండితులక్కడ    "ఎద్దు" అనే ప్రయోగానికి ఆకారం కోసం అంటే ఆధారం కోసం చర్చిస్తున్నారట. బహు వచన ప్రయోగం కూడా అన్వేషిస్తున్నారట. అప్పుడు శాస్త్రి గారు సద్యః స్ఫురణంగా  ' వడి గల ఎద్దుల కట్టుక, మడి దున్నక బతకవచ్చు మహిలో సుమతీ' అనే ప్రయోగం గుర్తు చేశారట. అప్పుడా మహా పండితులంతా శాస్త్రి గారిని మెచ్చు కొన్నారుట. మా సమయం వృధా కాకుండా రక్షించావు అన్నారుట. శాస్త్రి గారు ఇక అప్పుడు ఇంటికి వెళ్లారు. ఎద్దును గూర్చి ఎన్నో నుడి కారాలున్నాయి.  సామెతలున్నాయి. అయినా అవి వాళ్లకు గుర్తు రావు. ' ఎద్దనవలె, మొద్దనవలె,గద్దనవలె కుందారపు  కవి చౌడప్ప' అని వాళ్లకు గుర్తు రాదు. కవి చౌడప్ప శతకం వాళ్లకు ప్రమాణం కాదు కాబట్టి ' ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి' అనే సామెత వాళ్లకు జ్ఞాపకం రాదు.

 ఇంకో చాలా ఆసక్తి కరమయిన సన్నివేశం చెప్పారు శాస్త్రి గారు. ఖండవల్లి నరసింహ శాస్త్రి గారని తమ  గురువు గారు చాలా గొప్ప వారు. ఇందుపల్లి లో ఆయన దగ్గర చదువుకుంటుండగా ఊళ్ళో  అప్పుడే కవిత్వ మల్లడం నేర్చుకుంటున్న ఒక భట్టుకవి గురువుగారి దగ్గరకు ఒక సమస్య తీసుకొని వచ్చారుట. ఒక ప్రయోగం అర్థం చెప్పల్సిందని అర్తిన్చాడుట.  ఏమిట్రా ప్రయోగం? ' ఔరగాకేయూర సహిత హతమౌరజితా ' అని. గురువుగారూ , ఆయన దగ్గర చదువుకొంటున్న తనవంటి శిష్యులూ తెల్లబోయారట.ఎవరికీ అర్థం తోచలేదు. 'మౌరజితా ' అనే పదం దగ్గరే అసలు చిక్కు 'హతమౌరజితా' ఏమిటని తలలు పట్టుకున్నారట. తరవాత చాలా కాలానికి ఆ సమస్య విడవదిందని చెప్పారు శాస్త్రి గారు. అది పరమ శివుడికి సంబందించిన సంబోదన అని మొదటి వర్ణన పదాల వల్ల తెలుస్తున్నది . ఉరగకేయూరుడు-పాములే దండ కడియాలు - భుజాలకు అలంకారాలు - ఇక రెండో వర్ణన ఏమిటంటే మురజిత్ అంటే  విష్ణు మూర్తి కదా . (మురారి) (నారీ నారీ నడుమ మురారీ...) మురజిత్ అంటే  విష్ణుమూర్తి  తద్దితాపత్యం - ఆయన కొడుకు మౌరజిత్ - అంటే మన్మథుడు -అంటే పరమశివుడు.- మన్మతున్ని హతం చేశాడు కదా! ఇది శివస్తుతి. మౌరజిత్ - శివుడు - ఓ శివహత మౌరజితా! అని సంబోదన వినడానికి చాలా ఆసక్తి కరంగా ఉంది. 

( ఆంద్ర భూమి ఆదివారం అనుబందం సౌజన్యంతో )

Tuesday, November 23, 2010

కవితా కాదంబిని.....దాశరథి రంగాచార్య


దాశరథి రంగాచార్య ...ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. తరాల అంతరాలకు అతీతంగా అయిదు దశాబ్దాలుగా తెలుగువారు వారి రచనలను అభిమానిస్తున్నారు , ఆదరిస్తూనే ఉన్నారు. చరిత్ర లో తొలిసారిగా నాలుగు వేద సంహితాలను వచనంలో అందించిన ఆద్యుడు.  వాల్మీకి రామాయణాన్ని, వ్యాస భారత, భాగవతాలను తేట తెనుగున అందించిన రచన శిల్పి. తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొని  తెలంగాణా జన జీవన స్పందనలను నవలలుగా మలిచిన విప్లవ శిల్పి. దాశరథి వచనమే కాదు కవిత్వం కూడా రాసారు. మా అన్నయ్య దాశరథి క్రుష్ణమాచార్ర్యులకు కవిత వదిలి నేను వచనం చేపట్టాను అని అంటారు దాశరథి. అట్ల అన్న దాశరథి, వచనంలో వయ్యారాలు పలికించి నానని, ఉద్యమాలు రగిల్చినానని చెప్పి ఎందుకో నా మనసు కవిత కుహూ అనమన్నది. అందుకే కవిత రాసానంటాడు." మా అమ్మ చదువుల  రాణి /చనుబాలు నాముఖాన పితుకుతుంది/  ఎంత అందమయిన భావన. దాశరథి రాసిన ఈ కవితా కాదంబిని లో మానస కవిత పేరిట దాశరథి మానస సరోవరంలో విరిసిన  163 అందమయిన కమలాలు, 1962 -63 లో జన-రంగం పేరిట రాసిన శతకం. అలాగే 63 -64    లో రచించిన ఉర్దూ కవితలు "ఉర్దూ మదిర" పేరుతొ ఇందులో చేర్చారు. ఇవే కాకుండా భారత సూక్తం ఇంతకూ ముందు ఆంద్ర ప్రభలో వచ్చిన దానిని కూడా ఇందులో చేర్చారు. 

ఈ కవిత లన్ని మనసులోనించి దూకి వచ్చినవి కాబట్టి  వీటికి " మానస కవిత" అని పేరు పెట్టానంటారు. ఆసుపత్రి లో ఉండి రాసిన కవితలే ఇవి. ఆ తర్వాత రాయమని అడిగితె " కవిత కురియలేదు నేను రాయలేదు" అని అంటారు. ఇది కవితా కాదంబిని  - మబ్బుల వరస - మేఘమాలను మీకు అందిస్తున్నాను. జల్లు కురిపించుకోవడం మీ పని అంటారు.  మరి ఆ మేఘ  మాల నుంచి జాలు వారిన  జల్లులు ,  చదువుతుంటే నా మదిని హత్తుక పోయిన   ఎన్నో కవితలు. అందులో నించి కొన్ని కవితా జల్లులు చూడండి. 

స్వామి పాదాల సవ్వడి విన్నాను/వెదకు చున్నాను/వెర్రివాన్ని/అది నా ఎడద సవ్వడియని ఎరగకున్నాను/ 
విశ్వాసం ఉంటె శిల శివుడవుతాడు/  విశ్వాసం లోపిస్తే శివుడు శిల అవుతాడు/
కవిత ఒక వారథి/ఒక సారథి/అది సాగరాలు దాటుతుంది/మనసులను మొలిపిస్తుంది మురిపిస్తుంది/
నరుడు శ్వాస మీదనే జీవించటం లేదు/ విశ్వాసపు  శ్వాస మీద జీవిస్తున్నాడు /విశ్వాసం మీద జీవిస్తున్నాడు/
మనసుకు ఎ కులాలు లేవు/ కులాలన్నీ మనుషులకే/ మాయలకే మనసుకు కులాలు లేవు/
ఆకాశంలో మల్లెల మాల ఏమిటి/అది కొంగల దండ ఆకాశంలో/
అందనిదే అందం / అందితే ఏమున్నది శూన్యం/
జీవితం ఒక విహంగం/ఏదో కొమ్మ మీద వాలుతుంది/కిచకిచ మంటుంది/తుర్రుమంటుంది జీవిత విహంగం/
ఆమె కురులు విరియ బోసింది/కారు మబ్బులు కమ్ముకున్నాయి/ఆమె చూపు విసిరింది/ కమలాలు  వికసించాయి /ఆమె కురులు మబ్బులు/
అద్దం మలినమవుతే ముఖం కనిపించదు/మనసు మలినం అవుతే తాను కనిపించడు/లోకం కనిపించదు/
నెలలు నిండనిది  బిడ్డ రాదు/గుండె నిండనిది కవిత రాదు/


ఇలా ఎన్నో కవితా జల్లులు. కొన్ని ఆ భగవంతుని తో సంభాషణ,  ఓ బాధ్యతతో , ఓ బాధతో , ఓ వేదనతో భగవంతునికి నివేదించిన వినతిపత్రం, అంతే కాదు కొంత భావుకత్వం, ఒక చోట అంటాడు. " కష్టపడితే కవిత రాదు/ గుండె నిండాలే/పొంగి పొరలాలే/ కవిత జలపాతం అవుతుంది/కవితా జలపాతం పొర్లుతుంది" నిజమే దాశరథి గుండె నిండి పొంగి పొరలిన అందమయిన కవితా జలపాతం. ఆస్వాదించండి. ఆ కవితా జల్లుల్లో తడిసి ముద్దయి ఆ ఆనందాన్ని మీరు అనుభవించండి. ఆంద్ర ప్రభ  సంపాదకులు శ్రీ వల్లూరి రాఘవ రావు మాటల్లో" సాహిత్యమనే తూరుపు వేదిక పై కవిత్వమనే వేకువ నర్తకి చేసిన చైతన్యపు శ్రీకారం హృదయ రవళి ఓంకారం దాశరథి మానస కవిత్వం

ఆకాశ వాణి ప్రసారాల నిలిపి వేత...రేడియో ఉద్యోగుల సమ్మె

మద్యాన్నం రేడియో విందామని ట్రై చేస్తే రాలేదు. ఇప్పుడే తెల్సిన వార్త ఏమిటంటే అల్ ఇండియా రేడియో ఉద్యోగులు సమ్మె చేస్తున్నారట.  వివరాలలో కి వెళ్తే ఈనాడు నెట్ లోని వార్త ప్రకారం   " దేశ వ్యాప్తంగా అల్ ఇండియా రేడియో ఉద్యోగులు రెండు  రోజుల సమ్మె చేపట్టారు.. ప్రసార భారతిని రద్దు చేసి తమను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా ఆకాశవాణి కార్యక్రమాలు   నిల్చి పోయాయి. విజయ వాడ ఆకాశవాణి కేంద్రం ముందు ఉద్యోగులు భైటాయించి ధర్నా చేపట్టారు "  రేడియో ప్రియులకు విచారకరమయిన వార్త అయిన వారి కోరికలూ న్యాయ సమ్మతమే కదా.

ఈ వార్తను  ఇక్కడ చూడవచ్చు

Sunday, November 21, 2010

బ్లాగుల్లో వన భోజనాలు ...తాంబూలం

అందరు అన్ని చేశారు.  తిన్నాక హమ్మయ్య భుక్తాయాసం తో ఉన్నారుగా ..ఇదిగో  సేవించండి...తాంబూలం  నా వంతుగా మీ అందరికి. బాగాలేకపోతే తిట్టకండి మరి

Wednesday, November 17, 2010

How I Escaped My Rapist


ఈ రోజు అంతర్జాలం లో విహరిస్తుంటే  ఈ  పోస్ట్ కనిపినించింది. ఓకే అమ్మాయి ఓకే రేపిస్ట్ నుంచి ధైర్యంగా తప్పించుకున్న కథనం మరియు అతనికి శిక్ష పడటందుకు ఆమె చేసిన ప్రయత్నం.........క్రింద లింక్ క్లిక్ చేసే చదవండి. 


Saturday, November 13, 2010

కాళోజి రామేశ్వర రావు జీవితం-సాహిత్యం,,,,,ఆకాశవాణి చర్చా కార్యక్రమం


కాళోజి సోదరులలో పెద్ద వాడయిన పెద్ద కాళోజి గా పిలవబడే ప్రఖ్యాత ఉర్దూ సాహిత్య వేత్త , కవి , క్రిమినల్ లాయర్ అయిన శ్రీ కాళోజి రామేశ్వర రావు గారి పై ఆకాశ వాణి ప్రసారం చేసిన చర్చా కార్యక్రమం ఇక్కడ వినవచ్చు.

           "కాళోజి రామేశ్వర రావు జీవితం - సాహిత్యం" పై చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న వారు రామేశ్వర రావు గారి మానస పుత్రిక అయిన " మిత్ర మండలి " పూర్వ కన్వీనర్ శ్రీ నాగిళ్ళ రామశాస్త్రి గారు మరియు ప్రస్తుత కన్వీనర్ శ్రీ విద్యార్థి గారు. 







     

Wednesday, November 10, 2010

ముద్దు ..టాగూర్ కవిత


రెండు జతల పెదాలు
ఒకరి చెవిలో ఒకరు గుసగుసలాడుతున్నట్లున్నాయి
ఒకరి హృదయాన్ని ఒకరు
పీల్చుకుంటున్నట్లున్నాయి
రెండు ప్రేమలు
స్వస్థలాలు వదిలి
ఏదో తెలియని దేశానికి బయలుదేరుతూ
కలుసుకున్నట్లున్నాయి
కలిసి ప్రవహించబోతున్నట్లున్న
పెదాలు-రెండు తరంగాలు
రసమయ సంద్రపు తీరమంతా వ్యాపించి
ప్రేమతో ఇసుకను తడిపినట్లున్నాయి
ఉవ్వెత్తున లేచిపడిన ప్రేమ కెరటాలు
విడిపోయి కలుసుకుని
శరీరపు సరిహద్దుల మీద ఐక్యమై
రెండు కామనలు,
మనోభావనలు
ముద్దుల పొరలమీద
సున్నిత పదాలతో
ఒక పాట రచిస్తున్నట్లున్నాయి
వాళ్లు ప్రేమ పుష్పాలు తెంపుకుంటూ
అలా ఇంటికి చేరతారు
రెండు జతల పెదాలతో మాలలల్లుకుంటూ...
విచిత్రం, వినోదం, రంగులమయం
పెండ్లి పూలపాన్పుమీద కలవడం!
ఎంత మధురం ఆ కలయిక!!
(గురుదేవుల 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన సంచార ప్రదర్శన శాల: సంస్కృతీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రదర్శితమైన కవిత)
మూలం: విశ్వకవి రవీంన్రాథ్ టాగూర్
తెలుగు: డా.దేవరాజు మహారాజు
(ఆంద్ర భూమి ప్రచురితము)

అక్షరమే ఆయుధం...అలిశెట్టి ప్రభాకర్


అక్షరమే ఆయుధంగా జీవించిన అలిశెట్టి ప్రభాకర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే అంచెలంచెలుగా కవిత్వం రాసి జీవితమనే అనేక సంఘర్షణల వెనక మెడలో కెమేరాతో మదిని తొలిచే చిత్రాలను అందిస్తూ చిత్రకారుడిగా ముందుకు సాగిన వ్యక్తి. 1982 లో హైదరాబాద్ కు చేరిన అలిశెట్టి ఆంద్ర జ్యోతి దిన పత్రికలో సిటీ లైఫ్ పేరిట మినీ కవితలు అందించాడు. టిబీ అతన్ని మృత్యువుకు చేరువ అయిన  కాలంలో సిటీ లైఫ్ పారితోషికమే జీవనాదారమైంది.అంచెలంచెలుగా కవిత్వాన్ని అందించిన ప్రభాకర్ తనలో ఉన్న చిత్రకారుడు అంతరించి పోతున్న బాదేదో తనను వేదిస్తున్దంటు తరచూ చెప్పేవాడట. ఇప్పటికి మినీ కవిత లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న అలిశెట్టి 1993 , జనవరి 12  న ఈ సాహితీ లోకానికి దూరమైనాడు.
అతి ప్రయత్నం మీద దొరికిన " మరణం నా చివరి చరణం కాదు " అనే కవిత సంకలిని లో 65 కవితలలో కొన్ని  అముద్రిత కవితలు ఆయన గీసిన చిత్రాలు, తీసిన ఫొటోలతో ఉన్న ఈ సంకలిని లో కొన్ని నాకు నచ్చిన కవితలు.

మరణం నా చివరి చరణం కాదు/మౌనం నా చితాభస్మం కాదు/మనోహరాకాశంలో  లో విలపించే చంద్రబింబం/నా అశ్రు కణం కాదు,


ఘనీభవించే నిశ్శబ్దంలోనైన/కనురెప్ప తెరుచుకొనే చప్పుడు వినకుంటే ఎలా/

అశ్రుకణం/రాల్చలేని/శిదిలనేత్రం/అనుభూతిని /కోల్పోయిన/శిలాస్తన్యం/ ఆమె ఎవరు..ఆమె ఎవరు/అమావాస్యల/అట్టడుగున  పది/నలిగిపోయిన మొగిలిరేకు/పట్టపగలు/విద్వంసంలో /పడివిరిగిన/చంద్రవంక.

రహస్సంద్య అనే కవిత లో - చంద్ర గుప్తులూ, మౌర్యులూ. శాతవాహనులూ అంతరించి/చంద్రుడి చాటున  మబ్బులే మళ్ళీ రాజకీయాలు దోబూచులాడి/ప్రజల ప్రాణాలు తీస్తాయి/కాషాయం చెలరేగిరూళ్ళకర్ర విరిగిపోతుంది/భక్తీ పారవశ్యంతో రామశిలలు ఉప్పొంగి/రిజర్వేషన్ని రెండుగా చీలుస్తాయి/ధర్మం నాలుగు పాదాల నడుస్తూనే/చార్మినార్ చర్మం ఊడి మతం మళ్ళీ నెత్తురోడుతుంది/భయాన్ని పొదిమి  పట్టుకున్న పసిబిడ్డ ఖండ ఖండాలుగా నరకబడ్డ చుండూరు/భారత ఖండంలో నిశ్శబ్దంగానే ఉండిపోతుంది.


 విషాద సాక్షాత్కారం అనే కవిత లో కన్నీళ్ళని ఎ భాష లోకి అనువదించినా/విషాదం మూర్తీభవించిన స్త్రీ యే/సాక్షాత్కరిస్తుంది , అంటూ  నాలుగేళ్ల  మృదుత్వం/ మానభంగం శీర్షిక కింద/పడి చితికిన  హృదయ శకలాల్నించి// కళాశాల గోడలే కబంధ హస్తాలై/కబళించిన విద్యార్థినుల జీవితాల్నిచ్న్హి/కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి అంటుంటే ప్రణీత పై  ఆసిడ్ దాడులు. శ్రిలక్ష్మి లాంటి వాళ్ళు  గుర్తొచ్చి కన్నీళ్ళు రాక మానవు. ఎంత అధునాతనంగా ఎదిగినా/అసృబిందువునించి/స్త్రీ కింకా విముక్తి కలగలేదంటే/నిజంగా కన్నీరు సముద్రమై /నిజంగా కన్నీరు సముద్రమంతా అవేశమై/ అంటూ పోరాటం చేయాలంటాడు.

మృత్యువు తనని కబలిస్తుందని మొదలే తెలుసు కాబోలు, పర్సనల్ పొయం అనే కవితలో తెరవెనక లీలగా/మృత్యువు  కదలాడినట్టు/తెరలుతెరలుగా దగ్గొస్తుంది/తెగిన తీగెలు సవరించాదానికన్నట్లు /గబగాబాపరుగేత్తుకోచ్చి నా భాగ్యం/గ్లాసుడు  నీల్లన్దిస్తుంది అని రాసుకుంటాడు. భాగ్యలక్ష్మి అనే కవిత లో వారి గురించి రాస్తూ ఇద్దరం కలిసి ఒక కలగా/కలగాపులగంగా కలిసిపోయిన్ రోజుల్లో/ఇంచుమించు  ఒకే కంచం లో/ఇంద్రధనుస్సుల్ని తుంచుకొని తిన్నరోజుల్లో/మా గుండెల్లో సమస్యలు మందని  రోజుల్లో/సిగరెట్ పీక లాంటి నన్ను/సిగలో పువ్వులా తురుముకొని/అంటూ  తనని ఏమి అడగని తన అర్ధాంగి గురించి రాస్తూ, గాజు కుప్పెల్లాంటి  నా కళ్ళలోనే ఆశల  అగరొత్తులు  వెలిగించుకోంది అంటాడు. ఇంకా ఎన్నో కవితలు మనల్ని కదిలించేవి, గుండెలకు హత్తుకు పోయేవి.కొన్నైతే. ఆలోచిమ్పజేసేవి కొన్ని  , ఉత్తెజపరిచేవి కొన్ని.



తను శవమై..
ఒకరికి వశమై...
తనువు పుండై...
ఒకరికి పండై...
ఎప్పుడూ ఎడారి అయి...
ఎందరికో ఒయాసిస్సై....



Tuesday, November 9, 2010

వార్తలు చదువుతున్నది డి. వెంకట్రామయ్య

  

ఈ మధ్య అంతర్జాలం లో అలా విహరిస్తుంటే  రచన సంచికలు చూస్తుంటే డి. వెంకట్రామయ్య గారి పై ఫిబ్రవరి నెల రచన ప్రత్యెక సంచిక కనిపించింది. అది ప్రివ్యు ఎడిషన్. ఆయన్ని తలచుకోగానే " వార్తలు చదువుతున్నది డి. వెంకట్రామయ్య" అన్న మాటలు వినిపిస్తాయి. ఆ సంచికలో ఎ.బి.కే.ప్రసాద్ గారు, బండారు శ్రీనివాసా రావు గారు ఇంకా ఎందరో డి.వి. గురించి చాల చక్కటి విషయాలు తెలియ జేశారు. మూడు దశాబ్దాలు ఆకాశవాణి లో అనౌన్సర్ గా , న్యూస్ రీడర్ గా  పని చేసిన వెంకట్రామయ్య గారు మంచి కథకుడిగా కతాభిమానుల గుర్తింపు పొందారు. కార్మికుల కార్యక్రమం లో చిన్నక్క, ఏకాంబరం, రాంబాబు పాత్రలు సృశించి రెండు దశాబ్దాలకు పైగా శ్రోతల్ని ఆకట్టుకోవడమే కాకుండా రేడియో రాంబాబు అన్న పేరు సంపాదించుకున్నారు. ఇంకా ఈ సంచికలో ఎన్నో విషయాలు ఎన్నెన్నో విశేషాలు. ప్రివ్యు సంచిక ఇక్కడ చూడండి. ఆ సంచిక డిజిటల్ ప్రతి ఉంటె పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఇదే సంచిక నుంచి వారు ఆకాశవాణిలో నా అనుభవాలు" అనే పేరుతొ తమ అనుభవాలను చాలా చక్కగా మనకు తెలియని ఎన్నో విషయాలను వివరిస్తున్నారు. ఈ శీర్షిక మొదటి వ్యాఖ్య వారి మాటల్లో " శ్రోతల అదృష్టం కొద్ది నాకు పాటలు  చేత గాదు అందువల్ల ఆ ఒక్కటి వదిలేసి రేడియోలో ఇంకెన్ని రకాల పనులు చేయవచ్చో అవన్నీ చేసాను అంటారు.

 ఈ మధ్య వచ్చిన సంచికల్లో నేను ఈ అనుభవాలు  చదవడం జరిగింది.  మన తోలి ప్రధాని జవహర్ లాల్ మరణ వార్త ప్రకటన చేసిన అనుభవాలు రాస్తూ,   నెహ్రు గారు పోయిన్రోజు పగలు ద్యుటీలో ఉన్నప్పుడు ప్రైం మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రు ఈజ్ నో మోర్ అన్న వార్త చూసి ఆ తర్వాత అప్పుడు డ్యూటీ లో ఉన్న అనౌన్సర్ గా ఆ ప్రకటన చేస్తూ " ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రు కొద్ది సేపటి క్రితం కొత్త డిల్లీ లో ఆకస్మికంగా మరణించారని తెలియ పరచ టానికి చింతిస్తున్నాం..." అంటూ తెలుగులో తను, హిందీ మోహన్ సిన్హా అనే హిందీ అనౌన్సర్ అప్పుడు ప్రసారమౌతున్న కార్యక్రమాలు మధ్య మధ్యలో ఆపి ప్రకటించినట్లుగా  ఆ విషయాలు చాలా చక్కగా వివరించారు. ఇంకా ఎన్నో విశేషాలు తెలియజేస్తున్న ఆ రచన రేడియో ప్రియులు తప్పని సరి గా చదవలసిన రచన. 



Thursday, November 4, 2010

If the story of Irom Sharmila will not make us pause, nothing will..... షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు పదేళ్ళు


మానవ హక్కుల ఉద్యమ కారిణి షర్మిలా ఇరాం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మంగళ వారం  ,నవంబర్ 2 తో పదేళ్ళు నిండాయి. భద్రత  దళాలు హక్కుల ఉల్లంఘన కు పాల్పడుతున్నయంటూ..సైన్యానికి ప్రత్యెక అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన భద్రతా దళాల ప్రత్యెక అధికారాల చట్టం- 1958 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2000 , నవంబర్ 2  న షర్మిలా ఈ దీక్షను ప్రారంబించారు. ఆ రోజు మాలోం అనే పట్టణంలో బస్స్టాండ్ లో అస్సాం రైఫిల్స్ సాయుధులు పదిమంది సాధారణ పౌరులను కాల్చి  చంపేసిన దారుణ సంఘటన జరిగినపుడు షర్మిలా తీవ్రంగా చలించిపోయి శాంతి యాత్ర నిర్వహణకు అక్కడికి వచ్చిన ఆమె ఆ ఆలోచన విరమించుకొని అంత కంటే తీవ్రమయిన కార్యాచరణకు పూనుకోవాలని నిర్ణయించుకొని   ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. మూడు రోజుల దీక్ష అనంతరం ఆత్మహత్యా నేరం కింద పోలీసులు షర్మిలా ను అరెస్ట్ చేసి జైలు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటినించి ఆమె జైలు లోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు. నిరాహార దీక్ష చేస్తున్న  తన బిడ్డ గురించి మీరు మీ బిడ్డ ను చూడటానికి ఎందుకు వెళ్ళ లేదు అన్న ప్రశ్నకు ఆమె తల్లి అన్న మాటలు వింటే మనకు ఆ తల్లి పట్ల ఒక గౌరవం కలగక మానదు ఆమె జవాబు " నా గుండె చాల బలహీనమైనది. నేను షర్మిలను చుస్తే ఏడుస్తాను,నా ఏడుపుతో తన దృడ నిర్ణయాన్ని చెదరగొట్ట దలచలేదు. అందుకే షర్మిలా తన గమ్యం చేరేవరకు తనను చూడ దలుచుకోలేదు."

ఇది చదువుతుంటే, మనసు చలించి కళ్ళు చెమర్చక మానవు. శొమ చౌదరి రాసిన ఆర్టికల్ ఇక్కడ చదవండి .

"in 2006, Irom Sharmila had not eaten anything, or drunk a single drop of water for six years. She was being forcibly kept alive by a drip thrust down her nose by the Indian State. For six years, nothing solid had entered her body; not a drop of water had touched her lips. She had stopped combing her hair. She cleaned her teeth with dry cotton and her lips with dry spirit so she would not sully her fast. Her body was wasted inside. Her menstrual cycles had stopped. Yet she was resolute. Whenever she could, she removed the tube from her nose. It was her bounden duty, she said, to make her voice heard in “the most reasonable and peaceful way”.

ఇంకా వివరాలకు ఇక్కడ చూడవచ్చు.

ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రాకపోతే ఎ క్షణం మనం ఎం వింటామో అని మనసులో  ఒక కలవరం కలుగుతుంది. బ్లాగ్మిత్రులు ఎవరయినా ఏదైనా కార్యక్రమం సంతకాల సేకరణ లాంటిది చేపట్టి ప్రభుత్వానికి విజ్ఞ్యాప్తి చేస్తే  ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.   . ఆమెను కాపదేతందుకు , మనమూ సహకరించిన వాళ్ళం అవుతాం.శొమ చౌదరి చివర్లో అన్నట్లు "
if the story of Irom Sharmila will not make us pause, nothing will