Saturday, October 16, 2010

Capturing the Atom Bomb on Film

http://www.nytimes.com/interactive/2010/09/14/science/20100914_atom.html?ref=science

Friday, October 15, 2010

నువ్వు నువ్వు


ఈ
 రోజెందుకో నా పెదాలపై ఈ పాట పదే పదే ...ఓ మంచి రొమాంటిక్ సాంగ్ . ఖడ్గం 
సినిమా లోది, సుమంగళి పాడింది.   వింటుంటే  వినాలనిపిస్తుంది. ఎక్కడికో 
తీసుకెల్లిపోతుంది. నా జీవితంలో ప్రతి నిమిషం నువ్వే నంటూ సాగుతూ 
...చివరికి నా అంతం కూడా నువ్వే నంటూ...ఈ రోజెందుకో నా మనసంతా 
నువ్వు..నా పెదవి పైన నువ్వు నువ్వు........
   
నా లోనే నువ్వు నాతోనే నువ్వు 
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు 
నా పెదవి పైన  నువ్వు నా మెడ వంపున నువ్వు 
నా గుండె మీద నువ్వు వొళ్ళంతా నువ్వు 
బుగ్గల్లో నువ్వు మొగ్గల్లే నువ్వు 
ముద్దేసే నువ్వు 
నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వు 
ప్రతి నిమిషం  నువ్వు 

నా వయసును  వేదించే వెచ్చదనం నువ్వు 
నా మనసును లాలించే చల్లదనం నువ్వు 
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు 
బైట పాడాలనిపించే  పిచ్చిదనం నువ్వు 

నా ప్రతి యుద్ధం నువ్వు నా సైన్యం నువ్వు 
నా ప్రియ శత్రువు నువ్వు నువ్వు 


మెత్తని ముల్లె గిల్లే తొలి చినుకే నువ్వు 
నచ్చే కష్టం నువ్వు నువ్వు 

నా  సిగ్గుని దాచ్కొనే కౌగిలివే నువ్వు 
నా వన్ని దోచుకునే కోరికవే నువ్వు 
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు 
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు 
తీరని దాహం నువ్వు నా మొహం నువ్వు 
తప్పని స్నేహం నువ్వ్వు నువ్వు 
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు 
అయినా ఇష్టం నువ్వు నువ్వు 

మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తునేట్ నువ్వు 
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు 
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తూనే నువ్వు 
 నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు 
నా అందం నువ్వు ఆనందం నువ్వు 
నేనంటే  నువ్వు 
నా పంతం నువ్వు నా సొంతం నువ్వు 
నా అంతం నువ్వు  

Wednesday, October 13, 2010

రఫీ గారి మధురమయిన పాట ..నా మది నిన్ను పిలిచింది గానమై

 

రఫీ అనగానే మనకు గుర్తుకు వచ్చే పాట ఆరాధన సినిమా లోని " నామది నిన్ను పిలిచింది గానమై"  ఇదే పాట హిందీ లో కూడా రఫీ పాడాడు. ఉప్కార్ సినిమాలోని  " మేరె మితవ ..ఆజా తుజ్ కో  పుకారే మేరె గీత రే " రెండు పాటలు ఎంతో మధురంగా,  వింటుంటే వినాలనిపించే పాటలు. ఈ పాట వినగానే రఫీ సాబ్ మన గుండె తలుపుల్ని తట్టి , తెరిచి తెరవగానే నేరుగా వచ్చేసి మన గుండెలో తిష్ట వేసుకు కూర్చుంటాడు. అలా ఆ మధురిమలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. " తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరుపుల  రూపమై"    సి.నా. రే గారి సాహిత్యం ఎంత అందంగా ఉంది.

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...ప్రియతమా...
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను

తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను

వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

చిత్రం : అరాధన
గానం : మహమ్మద్ రఫీ
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం :సాలూరి హనుమంత రావ్ 




">

">

హిందీ లో.......

రఫీ గారి సరదా పాట

ఆదివారం సెలూన్ లో కట్టింగ్ చేయిన్చుకున్తుండగా, ఆ సెలూన్ అతను పాత తెలుగు పాటలు పెట్టాడు. అన్ని మహ్మద్ రఫీ   తెలుగు లో పాడిన పాటలు వస్తున్నాయి.ఆ షాప్ అతని అభిరుచి ని మనసులోనే మెచ్చుకుంటూ ,  ఆ పాటలు ఆస్వాదిస్తూ ఉంటె ఎప్పుడు వినని ఒక పాట నన్ను ఆకర్షించింది. రఫీ   గారు ఎ పాటయినా  ఎల్లన్టిదయినా  పాడతారని తెలుసు గాని. ఇంత ఫాస్ట్ బీట్ పాడగా నేను ఎప్పుడు వినలేదు. రఫీ  తో ఇలాగ కూడా పాడిన్చారా అని ఆశ్చర్యమేసింది. కొన్ని ఫాస్ట్ గా పాడినవి  విన్న గుర్తు ఉంది కాని ఈ పాట నేను ఇంతకుముందు వినలేదు. తెలుగు లో రఫీ  గారు పాడితే ఆయన గళం లో ఒక  మాధుర్యం వినిపిస్తుంది. ఎన్నో పాటలు విన్నా కాని ఈ పాట రఫీ గొంతులో సరదాగా ,గమ్మత్తుగా విచిత్రంగా సాగింది. రఫీ  ఏదయినా పాడగలడు అని ఇప్పుడు మనం కితాబు ఇయ్యల్సిన పని లేదు కాని ఈ పాట వింటే ఏదయినా , ఎలా అయినా పాడగలడు అనిపిస్తుంది. రఫీ గారి మధురమయిన పాటలు ఎన్నో ఉన్నాయి.ఇదీ మంచి పాట అని కాని మధురమయిన పాట అని కాని నేను ఇక్కడ రాయట్లేదు. అదీ రఫీ గొంతులో వినడానికి సరదాగా, విచిత్రంగా ఉంది అన్నది  నా ఆలోచన.

 అతన్ని ఎందులోది అని అడిగితె చెప్పలేకపోయాడు. ఇంటికి వచ్చాక గూగులమ్మ ను ఆశ్రయిస్తే అది భలే తమ్ముడులోది అని చెప్పింది. మహానటుడు యెన్ .టి.ఆర్. మరియు కే.ఆర్. విజయ నటించిన ఈ చిత్రం  బి.ఎ.సుబ్బారావు గారి దర్శకత్వం లో 1969  లో విడుదలయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ టి.వి.రాజు గారు.   సుశీల గారితో కలిసి రఫీ  పాడిన ఈ పాట ను ఆ అంతర్జాలం నుంచి దిమ్పెసా , అదేనండి  "డౌన్లోడ్" చేశా , తెలుక్కి వచ్చిన కష్టాలు లెండి, ఇప్పుడు ఆ లంకె ను మీ ముందుంచా. అదేంటో అక్కడక్కడ ఆగిపోతుంది. ఎందుకో అర్థం కాలేదు.   సరదాగా  మీరు వినండి.




Monday, October 11, 2010

కరీమున్నీస నవ్వు - రహమతుల్ల గారి కథ- ఆకాశవాణి ప్రసారం

ఈ వారం వార్త ఆదివారం అనుబంధం లో (అక్టోబర్ , 10 ) లో ప్రచురితమయిన (సృష్టి శీర్షికన) కాత్యాయని విద్మహే గారు "అస్తిత్వ సమస్యలోని సంక్లిష్టతల ఆవిష్కరణ" అంటూ రహమతుల్ల రచయిత యొక్క " నర్గిస్" కథ గురించి పరిచయం చేశారు. విద్మహే గారు రహమతుల్ల గురించి " అల్ప సంఖ్యాక వర్గంగా సమాజం చివరి అంచులకు నేట్టబడిన  ముస్లిం మతమానవ సమూహాల జీవన వేదనలను కథలుగా మలుస్తూ తెలుగు కథా సాహిత్యానికి వస్తు గౌరవం పెంచుతున్న నేటి రచయిత రహమతుల్ల" అని అంటారు. 

  ఇది చదివాక ఈ మధ్యే నేను ఆకాశవాణి లో విన్న కథ ప్రసారం  మరియు ప్రసార సమయంలో   నేను రికార్డ్ చేసిన రహమతుల్ల గారి కథ గుర్తుకు వచ్చింది. నాకు రహమతుల్లా గారి గురించి తెలీదు. కాత్యాయని గారి రివ్యు చదివిన తర్వాత, రహమతుల్ల గారి " బా" అనే కథ కూడా చదివాను. తండ్రి గురించి , వారి జ్ఞ్యాపకలను, ముస్లిం సంప్రదాయాలను, పల్లెటూరి  వాతావరణాన్ని చాలా చక్కగా వివరించారు. ఒకసారి చిన్నప్పటి పల్లెటూరి జ్ఞ్యాపకాలు,  మనల్ని చుట్టుముట్టుతాయి.   ఇంటరెస్ట్ అనిపించి అంతర్జాలం లో వెతికితే రహమతుల్ల గారి కథల సమీక్షలు కనిపించాయి. అవి ప్రాణహితలో, మరియ  ప్రజాశక్తిలో  చదవవచ్చు. 

 ఆకాశవాణి మరియు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు సంయుక్తంగా నల్గొండ లో నిర్వహించిన కార్యక్రమంలో  కథకులే తమ కథలను చదివి విన్పించారు .అట్టి కార్యక్రమాన్ని ఆకాశవాణి ప్రసారం చేసింది.  ఆకాశవాణి అట్టి ప్రసారంలో భాగంగా రహమతుల్ల గారు స్వయంగా తను రాసి చదివిన కథ  ఈ " కరిమున్నిసా  నవ్వు" .

 రహమతుల్ల గారు తన చెల్లెలు జ్ఞ్యాపకాలను మన కళ్ళ ముందు  సజీవంగా ఉంచుతారు. స్వచ్చమయిన నవ్వుతో అమాయకంగా పెరిగిన తన చెల్లెలు, పదమూడవ ఏటనే పెద్దమనిషి కాగానే చదువు మాన్పించడం ఇది సాయెబుల ఇళ్ళల్లో ఇదొక మామూలు విషయంగా, పద్దెనిమిదవ ఏటనే పెళ్లి చేయడం. ఆ తర్వార రెండేళ్లకే కొడుకును  కనడం, తర్వాత  కరీమున్నిస అనారోగ్యంతో అర్ధాంతరంగా జీవితాన్ని అనుభవించకుండానే  ఈ లోకం వదిలి వెళ్ళటం , గురించి వివరిస్తూ మల్లెమొగ్గ,  పువ్వులా వికసించి పరిమళాలు వెదజల్లక ముందే రాలిపోయింది. భర్తంటే  ఒక  దూరంతో కూడిన అనురాగం వీడి ఒక చనువుతో కూడిన స్వేచ్చ రాకముందే వెళ్ళిపోయింది అని అంటాడు. దేవుడు అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఏది అనుభవించకుండానే తిరిగి రప్పించుకున్నాడు అని తన చెల్లెలు జీవితం లో ఏది అనుభవించకుండా వేల్లిపోవడాన్ని చాలా బాధతో  తెలియ జేస్తాడు. కథలో భాగంగా ముస్లిం సంప్రదాయాలును కూడా తెలియజేస్తారు . తన చెల్లెలు నవ్వు మేఘం కదులుతున్నట్లు  ఉంటుందని ఎం చేసిన నవ్వుతు , కరీం అంటేనే నవ్వని ఆడపిల్ల నవ్వోద్దన్న నవ్వేదని నవ్వినప్పుడు  బుగ్గమీద సొట్ట చాంద్ కోసంటి వీనస్ వెలుగులా ఉండేదని. ఎప్పుడు నవ్వుతు ఉండే  కర్రీ  అల్లా కు ప్యారీ  బన్ గయీ     , జిందగీ బారి హస్కే , పచ్చిస్  సాల్ హస హస్కే మరి.  స్వేచ్చగా నవ్వనన్న  నవ్వనియ్యకపోతిమి, నవ్వు నవ్వు కు అడ్డు కట్టలేస్తిమి , పాతికేళ్ళు  నవ్వి వందేళ్ళు మమ్మల్ని నవ్వకుండా చేసింది.   కరిమున్ ఒక నవ్వు . నవ్వు విశాదమేట్లయితడి. . అదొక దివ్యానుభూతి "హసి జైసీ కర్రీ హమేషా హమారీ యాదీ " అంటూ చేల్లెల్లి నవ్వును, చెల్లెలి జ్ఞ్యాపకాలను, సజీవంగా మన కళ్ళ ముందుంచుతాడు . చదివిన దాని కంటే విన్నప్పుడు కథలో ఆ  అనుబుతిని ఇంకా ఎక్కువగా  మనమిక్కడ పొందవచ్చు మీరు వినండి. 

Friday, October 8, 2010

మా తల్లీ బతుకమ్మ ..




బతుకమ్మ పండగ విశిష్టత తెలుపుతూ   ఆకాశవాణి లో ప్రసారమయిన   రూపకం ఇక్కడ మీరు వినవచ్చు.
(గమనిక : ఆడియో ప్లే కావటందుకు కొంత సమయం తీసుకుంటుంది.)





Wednesday, October 6, 2010

ఆకాశ వాణి లో తెలుగు కథ

ఆకాశ వాణి లో తెలుగు కథ గురించి ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జానకి రాణి గారి ప్రసంగం ఇక్కడ వినవచ్చు 
( ఎందుకో తెలీదు ఏదయినా సాంకేతిక సమస్య కావచ్చు. ఆడియో ప్లే ఆలస్యముగా అవుతుంది. ప్లే నొక్కిన తర్వాత కొంత సమయం వెయిట్ చెయ్యండి   ప్లే అవుతుంది. అసౌకర్యానికి మన్నించ గలరు )




(గమనిక : ఇదీ ఆకాశవాణి లో ప్రసారంయ్యింది. ప్రసార సమయం లో నేను రికార్డ్ చేసిన ఆడియో . నాకు నచ్చి మీతో పంచుకుందామని .....)