సామాజిక, ఆర్ధిక , రాజకీయ జీవిత మూలాలలోకి వెళ్లి బడుగు జీవుల వ్యధలను అక్షర బద్దం చేసిన అరుదయిన రచయిత Dr.M.V.తిరుపతయ్య గారి జీవితం మరియు సాహిత్యం అనే ఈ చర్చ కార్యక్రం వరంగల్ ఆకాశవాణి ప్రసారం. ఈ చర్చ లో పాల్గొన్న వారు డా.శ్రీ అంపశయ్య నవీన్ గారు మరియ శ్రీ మెట్టు రవీందర్ గారు. అనుసంధానం వీరాచారి గారు. క్రింద ఈ కార్యక్రమం వినండి.
skip to main |
skip to sidebar
ఈ వారం ఆంద్ర జ్యోతి ఆదివారం అనుబందం లో చదివిన మరియ నాకు నచ్చిన కవిత." పాత పుస్తకాలూ కొత్త వెల్తురూ" ఇది దర్బషయనం శ్రీనివాసాచార్య గారు రాసారు. ఎన్నో సార్లు ఫుట్ పాత్ లపై పాత పుస్తకాలు అమ్మేవాల్లను చూస్తుంటాం. కాని ఇంత మంచి భావాలు, చదువుతుంటే " ఎన్నెన్ని ఇళ్ళ నుండి తరలివచ్చాయో గాని ఇల్లు పక్కనే ఇల్లు ఉన్నట్లు...అంటూ ఇంకా ప్రేమతో బహుమానంగా ఇచ్చిన పుస్తకాలు కూడా రోడ్డెక్కడం గురించి రాస్తూ " ఓ పుస్తకంలో తళుక్కుమని ఓ సంతకం దర్శనమయింది " ఆప్యాయతతో" అంటూ చేసిన తడి సంతకం, తేది తో సహా- తడై పోయాను- బహుమానాలు సైతం ఇలా బజార్న పడినందుకు. అంటుంటే హృదయం తడై పోతుంది. పాత పాత అంటుంది బాహ్య స్వరూపాన్ని చూసే సుమా అంటాడు. నిజమే లోపల కావ్యాలూ, కథలూ , సాహిత్యం ఇంకా ఎన్నెన్నో దాచుకున్న పుస్తకాలకు పాతదనమేక్కడిది చదివినప్పుడల్లా కొత్త దనమే .ఫుట్పాత్ లపై పుస్తకాలు చూసినప్పుడల్లా మనసు అటు లాగుతుంది. మన పాదాలు అప్రయత్నంగా అటు అడుగులేస్తాయి. చేతులు ఆప్యాయంగా వాటిని తడుముతూ, ఆ పుస్తకాల్లోనించి వచ్చే ఆ పాత వాసనలు ఆస్వాదిస్తూ, ఏదో మనకు ఇష్టమయిన వాళ్ళను కలిసిన స్పర్శించిన అనుభూతి . మనం కొన్న కొనకపోయినా ఒకసారి చూడడం. అయినా కొనకుంటా ఉంటామా చెప్పండి. ఎక్కడో మనకు ఇష్టమయిన రచయిత పుస్తకమో, లేకపోతె ఎక్కడ మనకు దొరకని ఓ పాత పుస్తకం మన కళ్ళ కెదురుగా కనపడుతుంటే మనసు ఊరుకుంటుందా. అది మనచేతుల్లోకి మన స్వంతం అయిపోదూ! మీరు చదవండి ఈ కవిత ( ఆంద్ర జ్యోతి సౌజన్యం తో)
ప్రతీ ఆదివారం అతను బరువు బరువుగా వొచ్చి
ఈ గరుకైన రాతి ఫుట్పాత్ ను
మెత్తనైన పాత పుస్తకాలతో అలంకరిస్తాడు
అమ్మకానికి అనువైన అరమరికలో
ఎన్నెన్ని ఇళ్ళ నుండి తరలి వచ్చాయో గాని
ఇల్లు పక్కన ఇల్లు పక్కన ఇల్లు వున్నట్లు
ఇక్కడ పుస్తకం పక్కన పుస్తకం - ఇలా సిలసిల!
గడిచిన కాలపు దాఖలాగా దుమ్మొకింత పట్టి
పుస్తకాలు కొంచెం దుబ్బపట్టి మసకబారి మాసినట్లున్నాయి
అతను వస్త్రంతో ఒద్దికగా తుడుస్తూ దులుపుతున్నాడు
పాతదనం సాంతంగా పోతూందని కాదు గానీ
ఇంకా ఇంకా పాతగా కనపదోద్దని అంతే!
పాతవే గానీ అన్నీ ఒకేలా పాతబడలేదు
మరీ మరీ పాతవి, కొంచెం పాతవీ, ఇటీవలి పాతవీ....
పాతా పాతా అంటున్నది బాహ్య స్వరూపాన్ని చేసే సుమా!
కళ్ళముందు ఎన్నెన్ని శాస్త్రాలు ఎన్నెన్ని భాశ్యాలూ
ఎన్నెన్ని కల్పనలూ కావ్యాలూ అంతరంగాలూ
ఎందరెందరి లోకంటి చూపుల ఊహల లిఖిత ముద్రలివి
ఎట్లా అంచనా వేసేది వీటిని, ఇట్లా పైపైనే చూస్తూ....
ఆ పుస్తకంలోకీ ఈ పుస్తంలోకీ తొంగి చూస్తుంటే...
ఓ పుస్తకంలో తళుక్కుమని ఓ సంతకం దర్శనమయ్యింది
"ఆప్యాయతతో" అంటూ చేసిన తడి సంతకం, తేదీ తో సహా-
తడై పోయాను - బహుమానాలు సైతం ఇలా
బజార్న పడినందుకు - ఆప్యాయతలెక్కడ?
కొన్ని కాగితపు నోట్లూ, మరికొన్ని కృతజ్ఞతలూ ఇచ్చి
ఆ పుస్తకాన్ని కొనుక్కున్నా, సంతకపు తడితో సహా.....
ఇక్కడ చేరిన వాళ్ళంతా కొంటారని కాదు కానీ
అక్షరాగారాల చుట్టూ ఇందరు కొలువుతీరడం
అక్షరాలా అపురూపం కదా
ఒకడి బతుకు తెరువు ఎందరికో నేత్రోత్చవం!
ఇక పొద్దు వాలిపోతుండగా మెల్లగా అతను
పుస్తకాల్ని పాత పెట్టెల్లోకి సర్దడం మొదలెడతాడు
సర్దుతూ సర్దుతూ లెక్కలేసుకుంటూ చూసుకుంటూ
పొద్దటి బరువు ఎంత తగ్గిందని అనుకున్టాదనుకుంటాను
అతనూ పుస్తకాల వెల్తురూ వెళ్ళిపోయాక
ఖాళీ అయిన ఫుట్పాత్
ఇప్పుడు నిజానికి తెరుచుకున్నట్లా
ఒంటరి చీకట్లో ముసుకున్నట్లా
ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి జీవితం...సాహిత్యం చర్చా కార్యక్రమం ...ఆకాశవాణి ప్రసారం ఇక్కడ వినండి.
Wednesday, December 8, 2010
Sunday, December 5, 2010
పాత పుస్తకాలు

ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి జీవితం-సాహిత్యం
ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి జీవితం...సాహిత్యం చర్చా కార్యక్రమం ...ఆకాశవాణి ప్రసారం ఇక్కడ వినండి.
Friday, December 3, 2010
Thursday, December 2, 2010
Wednesday, December 1, 2010
మా తెలుగు తల్లికి మల్లెపూదండ....టంగుటూరి సూర్య కుమారి
మా తల్లికి మల్లె పూదండ అనగానే మనకు గుర్తుకు వచ్చేది టంగుటూరి సూర్యకుమారి.ఈ పాటకి ఆవిడ ప్రాణం పోశారు. ఆ అద్బుతమయిన గళం లో శంకరంబాడి సుందరాచార్య రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ మీరూ ఆస్వాదించండి .
|
మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి || మా|| గలగలా గోదారి కదిలి పోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి ||మా|| అమరావతీ నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లీ ! జై తెలుగు తల్లీ !