skip to main |
skip to sidebar
ఏ రోజుకి ఆ రోజు జీవితమైపోతుంది...
ఉదయం పుట్టుక...!
రాత్రి మరణం....!
ఒక రోజు
ఒక జీవితం....!
బాధ నన్ను బాధపెట్టడం మానేస్తున్దేమోనని ఆఖరికి కొన్నాళ్ళకి, నిజమే ...బాధ కూడా నిరంతరం కొనసాగితే మొనాటనస్ గా అయిపోయి నిర్వికారంగా .....
ఇది రోజూ వచ్చే రాతిరే...ఇది నిన్నటి రేయి...రేపు కూడా వచ్చునోయీ...ఇది నిత్య నూతన యామిని...మరి సౌదామిని? అస్సలు వచ్చునా అని?
నేను , జీవితం రెండూ ఒకటేననుకుంటే ఈ నవలలో రెండు ఎప్పటికి కలవని పాత్రల ద్వారా నాయకుడి జీవితపు బండి దొర్లిపోతుంది. ఈ నవల ద్వారా రచయితా చెప్పదల్చుకున్నది "నేను" ప్రధానం, తతిమ్మ సంబందాలన్నీ మన జీవితపు బండి నడవడానికుపకరించేవే.
ఆలోచన పుట్టినప్పుడే నాకీ లోకం పుట్టింది. ఈ లోకం తోటే జీవితం పుట్టింది, జీవితమే నేను అంటే ఆలోచనే నేనన్నమాట. అంటే ఈ యవత్ప్రపంచామూ, దాంతోటి జీవితమూ,అందులో నేనూ...అన్నీ..అన్నీ కలిపి ఈ బుర్ర్రలో ఉన్నాయన్నమాట.దేన్నించి ఎవర్నించి పారిపొయినా ఆలోచన్నించీ మనిషి పారిపోలేదు కదా..! ఆలోచనంటే తనే...! తననించి తానూ పారిపోవటం సాధ్యం కాక మనిషి మల్లగుల్లాలు పది సంఘం అనబడే గుంపై, అన్నిటినీ వ్యవస్తీకరించుకున్నదేమో.
కన్యాశుల్కం - వరశుల్కము: పూర్ణయ్య బిడ్డ గున్నమ్మ ను అవధాన్లు 500 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కాపురానికి తీసుకపోయి భార్యను సనాతన భావాలతో కట్టడి చేస్తుంటాడు. గున్నమ్మ అన్న చలపతి సబిన్స్పెక్తర్. అతను అతని 500 అతనికి ఇచ్చి ,మళ్ళీ కట్నం క్రింద ఇంకో 500 ఇచ్చి సరిగా చూస్కొమ్మని గట్టిగా చెబ్తాడు. అక్కడినించి గున్నమ్మ తీరు మారుతుంది. పల్లెటూరు నుండి రాజమహేంద్రవరం మకాం మార్చి వర్తకం ప్రారంభిస్తాడు. మూడాచారాల నుండి ఆదునికత కు మారిన బ్రాహ్మణ కుటుంబ గురించి చెప్పేది ఈ కథ.
వయస్సూ, బుద్దీ కూడా పెరుగుతాయి.: బాల్య వివాహాల గురించి వాటి పర్యవసానాల గురించీ చెప్పే కథ. పదహారేళ్ళు కూడా నిండని భాస్కారానికి పునస్సందానం తలపెడితే అత్త వారి ఊర్లో అందరూ అనే సూటి పోటి మాటలు విని ఎవ్వరికి చెప్పకుండా తాను చదువుకొనే మద్రాసు కు వెళ్లి పోతాడు. అక్కడినించి ఇంకో నాలుగు , అయిదు ఏళ్ల దాక రానని ఓ ఉత్తరం ముక్క రాస్తాడు. ఊళ్ళో అందరూ ఈ వ్యవహారం గురించి ఎలా మాట్లాడతారు , అక్కడ హెడ్మాస్టారు ఈ కార్యాన్ని వ్యతిరేకించడం మొత్తం చాల చక్కగా రాస్తారు.
నిలువు చెంబు: ఇది ఒక అపరాధ పరిశోధక కథ. పోయిన నగలని చాకచక్యంగా పట్టుకోవడం హాస్యంగా సాగే మంచి అపరాధ పరిశోధక కథ.
ఆచార్యుడు - ఆచార్యుడు: ఇది కులాంతర వివాహానికి సంబంధించిన కథ. మూడంగా వ్యతిరేకించే బ్రాహ్మల గురించి రచయితా వేరే మతాలలో సత్యం ఉంది, దేవుడు ఉన్నాడు, ధర్మం ఉంది, వీళ్ళకి వేదం బోధ పడదు, భోధ పర్చుకోవాలని ప్రయత్నం చేయరు. హిందూ జాతి ఓ ఆచార్యుడి కొరకు ఎదురుచూస్తోంది అంటాడు.
అశ్వ హృదయం: పంచ కల్యాణి అనే అశ్వం కథ. వర్తకుడి దగ్గర కొన్న మేలుజాతి అశ్వం. అశ్వాలను చూసుకొనే గంగడి మాటే కాదు ఎవ్వరి మాట వినదు. గంగులు బంధువు లచ్చిగాడు చెప్పినట్లు వింటుంది. అప్పటినుంచి రోజూ రాజు, లచ్చిగాడి సహాయంతో ఆ అశ్వం తో వాహ్యాళి కి వెళ్ళాల్సిందే. రోజూ దాటే కాల్వ ఒక రోజు ఎంత దాటమన్న వినదు. చివరికి లచ్చిగాడు రాజుగారి పాగా జరిగింది, చూడండి అంటాడు. అప్పుడు రాజు గారు పాగా సర్దుకున్నాక ఒక్క ఊపున కాల్వను , కాల్వ గట్టు ను దాటుతుంది. చివర్లో "ఇది జరిగింది, విన్నదీని, రచన మట్టుకు నాది" అంటాడు రచయిత.
బుచ్చి వెంకాయమ్మ: ఇది కూడా ఒక బాల వితంతువు వివాహమే వస్తువుగా కల కథ. రెడ్డి కులానికి చెందిన ఓ బాల వితంతువు కులాన్ని , సమాజాన్ని ఎదిరించి తన చిన్నప్పడి చెలికాడినే పునర్వివాహం అదీ వీరేశలింగం గారి సమక్షంలో చేసుకోవడం ఈ కథా సారాంశం," పురుషుని మీద ఆశ వున్నా యౌవన వితంతువు వివాహానికవకాశం ఇవ్వక పొతే ఐహిక సుఖాలని జయించలేక పోవచ్చును, తప్పుదారి చూపడం కంటే కొత్త దారీ, ఆక్షేపించడానికి వీల్లేని దారీ ఉంటె పూర్వాచారం అని ఎందుకు కుళ్ళి పోతారూ అని ప్రశ్నిస్తాడు. అలాగే శాస్త్రాలూ మారాలి, మారితే గాని మన సంఘాలు చచ్చిపోతాయి. ఇలాగే మన పెద్దలు ఇంకా బిర్ర బిగిస్తే, కొద్ది రోజుల్లోనే మన శాస్త్రాలు చూసే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక నశించి పోతాయి అంటాడు.
శ్రీపాద గారు మొదటి కథ లో అన్నట్లు " అప్పటి రుచులు వెఱూ , ఇప్పటి రుచులు వెఱూను? అప్పటి ధర్మాలు వెఱూ ఇప్పటి ధర్మాలు వెఱూను.అప్పటి యువకుల సంకల్పాలు వెఱూ ఇప్పటి వారి సంకల్పాలు వెఱూను. అప్పటికీ ఇప్పటికి ఏతాం పట్టంత తేడ వుంది. అప్పటి కథలు అర్థం చేసుకోవాలంటే ముందు హృదయాన్ని అప్పటి కాలంలో ప్రవేశ పెట్టాలి. లేకపోతె విన్నా లాభం లేదు".
స్మృతిపథం - ఇందులో జ్ఞ్యాపకాలకి సంబందించిన వ్యాసాలూ 17 ఉన్నాయి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, శ్రీ శ్రీ , కొ.కు.. పాలగుమ్మి పద్మరాజు, తిలక్, మునిమాణిక్యం, గోరా శాస్త్రి మొదలయిన వారి జ్ఞ్యాపకాలున్నాయి.
ప్రతిభా పరిమళాలు- వివిధ రంగాల్లో ప్రతిభావంతులయిన వారి గురించి 12 వ్యాసాలున్నాయి.
మందార మకరందాలు- ఈ విభాగంలో కొన్ని జ్ఞ్యాపకాలు, కొన్ని ప్రశంసలూ మొత్తం 13 వ్యాసాలున్నాయి.
సమీక్షా సౌరభాలు- ఇందులో చాసో కథలు, శేషేంద్ర, వెంపటి చిన్న సత్యం మొదలగు వారి రచనలపై 5 వ్యాసాలున్నాయి.
చిత్రశాల- నాలుగు వ్యాసాలూ చలన చిత్రాలపై సమీక్షలు ఉన్నాయి.
దూర తీరాలు- ఇందులో మొత్తం 10 వ్యాసాలు పాశ్చాత్య రచయితలూ, కళాకారులపై పొందుపరచిన వ్యాసాలున్నాయి.
వ్యాస విన్యాసం- సరదా వ్యాసాలూ, పరిశీలనా వ్యాసాలూ ఓ అయిదు ఉన్నాయి.
జ్ఞ్యాపకాల నీడలు- ఆనాటి కలలేవి, మరియు కృష్ణ శాస్త్రి గారిపై రెండు వ్యాసాలున్నాయి.
(ద్రాక్షారం మహాదేవ జీ గారి కవిత..ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబందం సౌజన్యం తో)
గర్భాలయం నుంచి అనల గర్భంలోకి
ట్రాన్సిషన్ భీబత్సం.....
జననక్షేత్రం దాటగానే మారణ క్షాత్రం
ట్రమాటిక్ ఎక్ష్ప్లొప్జన్ ....
నో ప్రాబ్లం.....ఇక్కడ నేను క్షేమం!
పిండం మీద యోని ముద్రలుండవు...ఫికర్ లేదు
పురిటి వాసన పసిగట్టి పోలీసు కుక్కలు రావు....రిలాక్స్
నా బొడ్డున నువ్వు మర్చిపోయిన పేగుమీద....నీ చిరునామా లేదు
బరువు దిగిన్డిగా ..మరేం భయం లేదు...స్వేచ్చగా వొళ్ళు ఆరబెట్టుకో
'నప్శియాల్ నాన్సెన్స్ ' తెలీక త్వరపద్దాను
తాళి బిళ్ళ లేదని తెలిసీ 'అక్రమంగా' జోరబడ్డాను
తప్పు నాదే....
'ఇల్లిజిటిమెట్ బాస్టర్డ్'ని నాకిలాగే జరగాలి...నో రిగ్రెట్స్
అక్కడ నీవు క్షేమమా?!
అద్దె కట్టకుండా నీ గర్భాన్ని ఆక్రమిన్చుకున్నాను
నన్ను క్షమించు!
గర్భాదానం చేసినవాడేవడో-స్టుపిడ్
వాణ్ని మాత్రం క్షమించను
కండోం కల్చర్ లేని బ్రూట్ కు- కామకేళులెందుకో
నీ తప్పేం లేదు....అక్కడ నీవు క్షేమమా!?
అమ్మవు గదా......
ద్వేషిస్తూనే దేహాన్నిచ్చావు
బహిష్కరించినా బతక నిచ్చావు
పారేస్తే పారేశావ్-పీక నొక్కకుండా వదిలేశావ్
మెనీ మెనీ .......థాంక్స్
రెప్ప పాటులో రెండు జన్మలు
ట్వయిన్ బోర్న్ ....ట్వయిస్ లిబరేటేడ్
నతింగ్ సీరియస్...ఇక్కడ నేను క్షేమం!
పేపర్లో చుట్టిగదా పారేశావ్ ....వార్తనయ్యాను
ఉమ్మనీటి బుగ్గను గదా....నిప్పుకన్ను చిదిమేశాను
"దౌ ....షల్ నాట్....డై"
మైఖలాజేలో 'సృష్టి' చిత్రం మాట్లాడింది అప్పుడే
చావు నిషిద్దమయ్యింది...అప్పుడే
కర్ణుడు బతికాడు...మోషే బతికాడు....నేనూ బతికాను
తల్లిని జయించి మృత్యున్జయుడైన వాడిని
నాకిక చావు లేదు
నా కపాలాన్ని గుమ్మానికి ఉరి తీసి
గృహప్రవేశం చెయ్
హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ.....
సోలాంగ్....షాలోం !
Tuesday, December 6, 2011
Sunday, December 4, 2011
దిగంతం
ఏ రోజుకి ఆ రోజు జీవితమైపోతుంది...
ఉదయం పుట్టుక...!
రాత్రి మరణం....!
ఒక రోజు
ఒక జీవితం....!
ఏ రోజు కారోజు ఒక జీవితాన్ని గడిపినట్టు గడిపెయదమేనా..? నేను జీవించలేక మరణించిన రోజులేన్ని..?మూసేసిన ఫ్యాక్టరీ నుంచి... ఓ పబ్లిషర్స్ లో సేల్స్మెన్ కం గుమస్తా, కం నౌఖర్ కం ఎవ్రీతిన్గాన్నై....నూటాదేబ్బై రూపాయల అద్దెతో , కుంటి మూగి ముసలి తల్లి తో మురికి కూపంలో....చావలేక..కాబట్టి చచ్చే వరకూ బ్రతకాలి కాబట్టి బ్రతుకు వెళ్ళ తీస్తూ....అవసరం అన్నిటినీ అధిగమిస్తుంది అంటాడు.
అయిదున్నర అడుగుల ఎత్తు ,చామన ఛాయా,మొటిమల కుచ్చుల మొఖం, పొడగాటి ముక్కు, ఈ బాహ్య సౌందర్యం చూసి ఎవరోస్తారని....పెళ్ళంటే......
బెస్టియాల్ ఇన్స్టింక్ట్ టు రిప్రోడ్యుస్ ....ప్రత్యుత్పత్తి అనంతరం పిల్లల పెంపకం సోషల్ ఆబ్లిగేషన్ (రెస్పాన్సిబిలిటీ అని సభ సాన్ఘీకులు మేధావులు అంటారు)...ఫ్యాకరీ లాకౌట్ ..అందర్నీ మేపాలంటే, ఎలా...అని పెళ్లి అనే దాన్ని తన నిఘంటువు లోనుంచి తీసేసి....."నేను నా ముఖాన్ని ఎక్కడో పారేసుకున్నాను, అప్పటినించి పారేసుకున్న నా ముఖాన్ని నేనే వెదుక్కుంటూ ఫేస్ లెస్ ఫేస్ తో సంచరిస్తూ....ముందు పరిగెత్తే నేను...వెనక తరిమే మరో నేనూ...నా నేనులు వేటాడేది వెంటాడ్తోన్నదీ, గాలిస్తున్నదీ .....ఎక్కడో కోర్కెల దొమ్మీలో...ఏవో ఆశల తొక్కిసలాటలో...పారేసుకున్న ముఖాన్నే...మనిషి ముఖాన్నే..ఎంతకీ దొరకదా ముఖం...ఎక్కడో దూరంగా దిగంతం దగ్గర లీలగా కనీ కనబడకా....మెరిసే రైలు పట్టాలని చూస్తూ వాటి వెంబడే చూపుల్ని పరిగేట్టిస్తూ అలా చీకట్లోకి ....ఊరి చివర మినుకు మినుకు మంటూ దీపాలు చుక్కలు చుక్కలుగా ..అటునున్చింకా దీర్గంగా మలుపు తిరుగుతూ రైలుపట్టాలు అనంతంగా దిగంతం లోకి....ది..గం....తం.ఎదురుగా ఆకాశం లోకి భూమి అంతమయ్యే చోటికి పట్టాలు మలుపు తిరుగుతూ..! ఎదురుగా...దిగంతం...నా కోసమే...అందులోనే నా అంతం..నేనే ఓ దిక్కుని ..అదే..దిగంతం అంటూ ఆ దిగంతం గురించి ఆలోచనలు.
రోజూ అతని ఆలోచనల్లో , అతని చుట్టూ కనిపించే అవిటి ముసలి తల్లి, ఇంటి ముందు పాయిఖానా పరిమళం, సాయిబాబా బంకు, నానా గందరగోలంగా వినిపించే అయ్యప్ప భక్తీ గీతాల రోద,పక్క వీధి లోనుంచి పాల కొరకు వచ్చే మాక్సీ యువతీ, మధ మధ్య లో అతని ఆలోచనల్లో వచ్చే మీనన్ అనే అతని ఏకయిక స్నేహితుడు, తనతో పాటు పనిచేసీ దేవక్రుపామని,అప్పుడప్పుడూ గుర్తొచ్చే తను కోల్పోయిన తన ముఖం , పెళ్లి వద్దనుకున్నా కలిగే లోపలి కోరికా దాన్ని తీర్చే నాగమణి, రైల్వే స్టేషన్ ఆమ్లెట్ బండి దుర్గ, రైల్వే క్వార్టర్స్ లో కనిపించే ఓ మాక్సీ , పోయిన్నెల చూపించే క్యాలెండర్, చూరు మీద సామన్లనుంచి కనిపించే ఓ సైకిల్ ట్యూబ్...ఇలా అతని ఆలోచనలు నిరంతరం వీటి చుట్టూ పరిబ్రమిస్తూ...ఇందులో కథ ఎక్కువగా కనిపించదు.. కథానాయకుడు ,అతడు కేంద్రంగా అతని చుట్టూ కనపడే జీవితం గురించి అతని ఆలోచనల స్రవంతి..మనస్సులో కనిపించే ఆలోచనల నగ్న స్వరూపం.ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా నగ్నంగా నర్తించే ఆలోచనల ప్రవాహం.ఈ ఆలోచనల్లో ఎక్కువగా తారసపడే పాత్రలు అతని తల్లి, నాగరత్న అనే వేశ్య.
జబ్బు పడి చనిపోయిన నాగరత్నం..అతని కోరికలకి రూపం ..ఆమె కి నేనేమైతానని ...చని పోయిన నాగరత్నం స్తానంలో ఇంకో నాగరత్నం..పేరు పుష్ప ..అస్సలు నేనెవర్ని అని తన్ని తానూ వెతుక్కుంటాడు అస్సలు ఎవ్వరికి ఎవరు అని ప్రశ్నించుకుంటూ...ఏది భ్రమ ...ఏది నిజం..భూమి ఆకాశం కలవడం..నిజమయిన అబద్దం..! మనిషీ మనిషీ కలయిక కూడా అంతే...అది దిగంత సత్యం....ప్రతీ సంబంధం పైకి కలిసినట్టు భ్రమ కలిగించేదే..! ఈ ప్రపంచం యావత్తూ ఓ నిరంతర భ్రమ..దిగంతం లాగున...! అంటాడు.
ఆతను ప్రేమించే ఆరాధించే ఏకయిక భావ చిత్రం అతని తల్లి. భావరహితంగా ఉండే ఆమెకళ్ళు, ఆ కళ్ళల్లో శూన్యం, వెరసి ఆమె అతనికి ఆమె ఒక నిశ్శబ్ద చిత్రం..నిశ్శబ్ద ప్రాకృత చిత్రం. ఏదో తెలీని గుర్తించలేని ప్రాచీనత కల్గి...విశ్వ రహస్య సూత్రాల్ని తన ముఖం ముదతల్లో దాచుకున్న ఓ మహాద్బుత చిత్రం... ఎప్పుడూ ఆమె ముఖంలో నవ్వు చూడని అతనికి ఆమె ముఖంలో నవ్వు చూడాలని ఆతను చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చివరికి ఆమె చనిపోయిన తర్వాత , ఆమె ముఖంలో నిర్మలమై...అరిటాకు పొట్లం లో ముద్దా గులాబీ లాగ అమ్మ పెదవులు విచ్చుకునే ఉంటాయి . శాశ్వత హాస రేఖ అయి....పై పెదవి ఆకాశం...కింది పెదవి భూతలం...! విచ్చుకున్న విశ్వాన్తరాల కాంతులై చిరునవ్వు...! అమ్మ చిరునవ్వు...చూడలేనను కున్న చిరునవ్వు ..ఆమె పెదవుల మధ్య కుంచించుక పోయి హీనమై క్షీణమై సత్యమై పేలిపోయిన దిగంతం. దిగంతం చీలింది.
ఇది రోజూ వచ్చే రాతిరే...ఇది నిన్నటి రేయి...రేపు కూడా వచ్చునోయీ...ఇది నిత్య నూతన యామిని...మరి సౌదామిని? అస్సలు వచ్చునా అని?
నేను , జీవితం రెండూ ఒకటేననుకుంటే ఈ నవలలో రెండు ఎప్పటికి కలవని పాత్రల ద్వారా నాయకుడి జీవితపు బండి దొర్లిపోతుంది. ఈ నవల ద్వారా రచయితా చెప్పదల్చుకున్నది "నేను" ప్రధానం, తతిమ్మ సంబందాలన్నీ మన జీవితపు బండి నడవడానికుపకరించేవే.
ఆలోచన పుట్టినప్పుడే నాకీ లోకం పుట్టింది. ఈ లోకం తోటే జీవితం పుట్టింది, జీవితమే నేను అంటే ఆలోచనే నేనన్నమాట. అంటే ఈ యవత్ప్రపంచామూ, దాంతోటి జీవితమూ,అందులో నేనూ...అన్నీ..అన్నీ కలిపి ఈ బుర్ర్రలో ఉన్నాయన్నమాట.దేన్నించి ఎవర్నించి పారిపొయినా ఆలోచన్నించీ మనిషి పారిపోలేదు కదా..! ఆలోచనంటే తనే...! తననించి తానూ పారిపోవటం సాధ్యం కాక మనిషి మల్లగుల్లాలు పది సంఘం అనబడే గుంపై, అన్నిటినీ వ్యవస్తీకరించుకున్నదేమో.
ఇలా ఎన్నో ...ఎన్నెన్నో... ఆలోచనల స్రవంతి...అతని ఆలోచనల స్రవంతి..మనస్సులో కనిపించే ఆలోచనల నగ్న స్వరూపం.ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా నగ్నంగా నర్తించే ఆలోచనల ప్రవాహం. మొదలుపెట్టిన దగ్గర్నించి చివరి పేజీ వరకు మనల్ని ఆపకుండా చదివించే కాశిబట్ల వేణుగోపాల్ నవల " దిగంతం"
Wednesday, October 5, 2011
నిలువు చెంబు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
విశాలాంధ్ర లో ఏవో పుస్తకాలు వెతుకుతుంటే అనుకోకుండా నా చేయి తాకి ఓ పెద్దాయన క్రింద పడి పోయాడు. అయ్యో క్షమించండీ అంటూ లేపి నా మానాన నేను పోదామని , ఎందుకైనా మంచిదని ఎవరా అని చూశా...శ్రీపాద వారు. పెద్దాయన కదా వీరితో మనకెందుకులే అని ఓ నమస్కారం పెట్టుకొన్నా. శ్రీపాద వారి గురించి విన్నవి , చదివినవి ఓ సారి మనసులో మెదిలాయి. వారి కథల నేపద్యం "గోదావరీ తీరం", పాత్రలు ఎక్కువగా శ్రోత్రీయ బ్రాహ్మణులూ అదే కాకుండా ఎక్కువగా వితంతు వివాహాలు , మూడాచార నిరసనలు, సాంసారిక జీవితంలో మాధుర్యం, స్త్రీ స్వాతంత్రం, అంటరాని తనం మొదలగు కథా వస్తువులతో కథలు రాశాడని, భాష విషయంలో వ్యావహారిక భాషను, నుడికారానికి పట్టాభి షేకం చేసిన మహానుభావుడని అన్నీ గుర్తొచ్చాయి. ఇంత పెద్దాయన కదా ఓ సారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయ భాగ్యం చేసుకుంటే ఎలా ఉంటుంది. మనకు కొరుకుడు పడతారా లేదా అనే అనుమానం తో ధైర్యం చేసి వారి ని తీసుకొని వారి " నిలువు చెంబు" నా చేత పట్టుకొని ఇంటికి చేరా. ఇంటికెళ్ళగానే ఆ " నిలువు చెంబులో " ఏముందో అని చూశా. నీళ్ళు అనుకున్నా కాదు...తేనే..అమృతం ఆ అమృతం లోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ మీకు కూడా కొంత పంచుదామని ఈ చిన్న ప్రయత్నం....ఆస్వాదించండి మరి. ఈ నిలువు చెంబు లో మొత్తం 8 కథలున్నాయి.
ప్రణయ తపస్సు: వితంతు వివాహం గురించి సాగే కథ. ఓ బైరాగి నలబై ఏళ్ల కు పైగా , తను పెళ్లి చేసుకుందామని అనుకున్న బాల వితంతువు అనుకోని పరిణామాల వల్ల చనిపోతే ఆమె తండ్రి ఆమెకు కట్టించిన సమాధి మండపం పై చేసే ప్రణయ తపస్సు ఈ కథ. నలభై ఏళ్ల క్రింద జరిగిన విషయాలు ఆ బైరాగి మనకు చెప్పడమే ఈ కథ.
కన్యాశుల్కం - వరశుల్కము: పూర్ణయ్య బిడ్డ గున్నమ్మ ను అవధాన్లు 500 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కాపురానికి తీసుకపోయి భార్యను సనాతన భావాలతో కట్టడి చేస్తుంటాడు. గున్నమ్మ అన్న చలపతి సబిన్స్పెక్తర్. అతను అతని 500 అతనికి ఇచ్చి ,మళ్ళీ కట్నం క్రింద ఇంకో 500 ఇచ్చి సరిగా చూస్కొమ్మని గట్టిగా చెబ్తాడు. అక్కడినించి గున్నమ్మ తీరు మారుతుంది. పల్లెటూరు నుండి రాజమహేంద్రవరం మకాం మార్చి వర్తకం ప్రారంభిస్తాడు. మూడాచారాల నుండి ఆదునికత కు మారిన బ్రాహ్మణ కుటుంబ గురించి చెప్పేది ఈ కథ.
ప్రణయ భంగము: ఇది కూడ ఒక బ్రాహ్మణ బాల వితంతువు కథ. చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని భర్త ను తల్లిని కూడా పోగొట్టుకొన్న యువతి కథ. దుక్కమే తోడూ , నీడ, జీవం, ధైర్యం,సకలం అలా రూపొందిన దుక్కమై పోతుంది. తండ్రి వితంతువైనా సరే లోకాన్ని ఎదిరించి పెళ్లి చేస్తా అంటాడు. తనూ సంతోషించి ఎదురింట్లో ఉన్న బ్రాహ్మన్ని కోరుకుంటుంది. అతడు భార్య చని పోయి ఒక భోగం దాని ని ఉంచుకుంటాడు. నా శరీరం చెడిపోయింది అని ఒప్పుకోడు. తర్వాత ఈమె తండ్రి అనుమతితో అతనికి సేవ చేస్తుండగా అనుకోని పరిస్తితులలో పరిస్థితి విషమించి అతడు చనిపోతాడు. ఇంతజరిగాక సంసారం లో ఏముందని ఆ జగన్మాతని ఆశ్రయించడం ఈ కథా సారాంశం.
వయస్సూ, బుద్దీ కూడా పెరుగుతాయి.: బాల్య వివాహాల గురించి వాటి పర్యవసానాల గురించీ చెప్పే కథ. పదహారేళ్ళు కూడా నిండని భాస్కారానికి పునస్సందానం తలపెడితే అత్త వారి ఊర్లో అందరూ అనే సూటి పోటి మాటలు విని ఎవ్వరికి చెప్పకుండా తాను చదువుకొనే మద్రాసు కు వెళ్లి పోతాడు. అక్కడినించి ఇంకో నాలుగు , అయిదు ఏళ్ల దాక రానని ఓ ఉత్తరం ముక్క రాస్తాడు. ఊళ్ళో అందరూ ఈ వ్యవహారం గురించి ఎలా మాట్లాడతారు , అక్కడ హెడ్మాస్టారు ఈ కార్యాన్ని వ్యతిరేకించడం మొత్తం చాల చక్కగా రాస్తారు.
నిలువు చెంబు: ఇది ఒక అపరాధ పరిశోధక కథ. పోయిన నగలని చాకచక్యంగా పట్టుకోవడం హాస్యంగా సాగే మంచి అపరాధ పరిశోధక కథ.
ఆచార్యుడు - ఆచార్యుడు: ఇది కులాంతర వివాహానికి సంబంధించిన కథ. మూడంగా వ్యతిరేకించే బ్రాహ్మల గురించి రచయితా వేరే మతాలలో సత్యం ఉంది, దేవుడు ఉన్నాడు, ధర్మం ఉంది, వీళ్ళకి వేదం బోధ పడదు, భోధ పర్చుకోవాలని ప్రయత్నం చేయరు. హిందూ జాతి ఓ ఆచార్యుడి కొరకు ఎదురుచూస్తోంది అంటాడు.
అశ్వ హృదయం: పంచ కల్యాణి అనే అశ్వం కథ. వర్తకుడి దగ్గర కొన్న మేలుజాతి అశ్వం. అశ్వాలను చూసుకొనే గంగడి మాటే కాదు ఎవ్వరి మాట వినదు. గంగులు బంధువు లచ్చిగాడు చెప్పినట్లు వింటుంది. అప్పటినుంచి రోజూ రాజు, లచ్చిగాడి సహాయంతో ఆ అశ్వం తో వాహ్యాళి కి వెళ్ళాల్సిందే. రోజూ దాటే కాల్వ ఒక రోజు ఎంత దాటమన్న వినదు. చివరికి లచ్చిగాడు రాజుగారి పాగా జరిగింది, చూడండి అంటాడు. అప్పుడు రాజు గారు పాగా సర్దుకున్నాక ఒక్క ఊపున కాల్వను , కాల్వ గట్టు ను దాటుతుంది. చివర్లో "ఇది జరిగింది, విన్నదీని, రచన మట్టుకు నాది" అంటాడు రచయిత.
బుచ్చి వెంకాయమ్మ: ఇది కూడా ఒక బాల వితంతువు వివాహమే వస్తువుగా కల కథ. రెడ్డి కులానికి చెందిన ఓ బాల వితంతువు కులాన్ని , సమాజాన్ని ఎదిరించి తన చిన్నప్పడి చెలికాడినే పునర్వివాహం అదీ వీరేశలింగం గారి సమక్షంలో చేసుకోవడం ఈ కథా సారాంశం," పురుషుని మీద ఆశ వున్నా యౌవన వితంతువు వివాహానికవకాశం ఇవ్వక పొతే ఐహిక సుఖాలని జయించలేక పోవచ్చును, తప్పుదారి చూపడం కంటే కొత్త దారీ, ఆక్షేపించడానికి వీల్లేని దారీ ఉంటె పూర్వాచారం అని ఎందుకు కుళ్ళి పోతారూ అని ప్రశ్నిస్తాడు. అలాగే శాస్త్రాలూ మారాలి, మారితే గాని మన సంఘాలు చచ్చిపోతాయి. ఇలాగే మన పెద్దలు ఇంకా బిర్ర బిగిస్తే, కొద్ది రోజుల్లోనే మన శాస్త్రాలు చూసే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేక నశించి పోతాయి అంటాడు.
Sunday, September 4, 2011
అక్షర యాత్ర - నండూరి కి నివాళి
నండూరి రాం మోహన్ రావు గారి మరణం వార్త వినగానే, నేను చదివిన నండూరి వారి "అక్షర యాత్ర" గుర్తొచ్చింది. వారి గురించి రాసేంత వాణ్ని కాదు కానీ. నేను చదివిన ఆ పుస్తకం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఈ పుస్తకం 70 వ్యాసాల సంపుటి. వారి మాటల్లో చెప్పాలంటే " ఈ సంపుటం సుమారు అయిదు దశాబ్దాల నా అక్షరయాత్ర సింహావలోకనం. ఇందులో ఎక్కువ భాగం నేను అభిమానించే సాహితీ మూర్తులు, మిగిలిన శాతం నా అభిమాన గాయకులు , చిత్ర కారులూ, నటులు మొదలయిన వారు, ...అన్నీ కలిపి ఈ సంకలనం ఒక పెద్ద కలగూర గంప. రక రకాల రంగు రంగుల పూల కదంబం." ఇందులోని వన్నీ పత్రిక రచనలే. " ఇది నా వైయక్తిక అభిరుచులకు, అభిమతాలకు, అభినివేశాలకు, అనుభవాల స్మృతులకు, నిలువుటద్దం లాంటి సంకలనం అన్న నండూరి మాటలు గమనార్హం. ఈ వ్యాసాల్లో ఎన్నో రకాల వ్యక్తులు. కాదేదీ వ్యాసానికి అనర్హం అన్నంతగా విభిన్న వస్తువులపై వ్యాసాలు రాశారు.ఇందులోని వ్యాసాలను వివిధ రకాలుగా వర్గీకరించారు, అవేంటంటే " స్మృతిపథం", "ప్రతిభా పరిమళాలు", మందార మకరందాలు, సమీక్షా సౌరభాలు, చిత్రశాల, దూర తీరాలు, వ్యాస విన్యాసం, జ్ఞ్యాపకాల నీడలు,
స్మృతిపథం - ఇందులో జ్ఞ్యాపకాలకి సంబందించిన వ్యాసాలూ 17 ఉన్నాయి. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, శ్రీ శ్రీ , కొ.కు.. పాలగుమ్మి పద్మరాజు, తిలక్, మునిమాణిక్యం, గోరా శాస్త్రి మొదలయిన వారి జ్ఞ్యాపకాలున్నాయి.
ప్రతిభా పరిమళాలు- వివిధ రంగాల్లో ప్రతిభావంతులయిన వారి గురించి 12 వ్యాసాలున్నాయి.
మందార మకరందాలు- ఈ విభాగంలో కొన్ని జ్ఞ్యాపకాలు, కొన్ని ప్రశంసలూ మొత్తం 13 వ్యాసాలున్నాయి.
సమీక్షా సౌరభాలు- ఇందులో చాసో కథలు, శేషేంద్ర, వెంపటి చిన్న సత్యం మొదలగు వారి రచనలపై 5 వ్యాసాలున్నాయి.
చిత్రశాల- నాలుగు వ్యాసాలూ చలన చిత్రాలపై సమీక్షలు ఉన్నాయి.
దూర తీరాలు- ఇందులో మొత్తం 10 వ్యాసాలు పాశ్చాత్య రచయితలూ, కళాకారులపై పొందుపరచిన వ్యాసాలున్నాయి.
వ్యాస విన్యాసం- సరదా వ్యాసాలూ, పరిశీలనా వ్యాసాలూ ఓ అయిదు ఉన్నాయి.
జ్ఞ్యాపకాల నీడలు- ఆనాటి కలలేవి, మరియు కృష్ణ శాస్త్రి గారిపై రెండు వ్యాసాలున్నాయి.
పేరులోనే ఉన్నది పెన్నిధి అన్నట్లు నండూరి వారు వ్యాసాలకు పేరు పెట్టడం లోనే ఎంతో శ్రద్ధ , నైపుణ్యం కనపరిచారు.
వ్యాసాలు ప్రారంభించడంలో, ముగింపు చేయడంలో ఆయన చాకచక్యం గమనించండి. కృష్ణ శాస్త్రి గురించి " అది గంధర్వలోకం, ఆ లోకంలో "మధుర సుషమా సుధాగాన మంజువాటి" అందులో ఒక వియోగ గీతిక. ఆ వియోగ గీతిక పేరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి అంటూ ప్రారంబిస్తారు.. శ్రీ శ్రీ గురించి ప్రారంబిస్తూ " జగమెరిగిన మహాకవికి పరిచయమేల ? శ్రీ శ్రీ ని తెలుగు వారికి పరిచయం చేయడం సూర్యుడికి దివిటీ పట్టడం. అయనా ఇది ఒక లాంచనం, ఒక వేడుక" అని అంటారు. " వెలుగుతున్నంత సేపు తార. వెలుగు తగ్గితే ప్రమిద. ఈ మాట చలన చిత్ర నటీనటులకు వర్తిన్చినంత బాగా ఎవరికీ వర్తించదు", నాగయ్య గురించి మొదలుపెడ్తూ అన్న మాటలు. నిజమే ఈ రోజు కాంతారావు గురించి చదువుతుంటే ఇలానే అనిపించింది. ఇలానే " జీవితపు సహారాలో ఒయాసిస్సుల వంటివి సైగల్ పాటలు నాకు" అనేది ఓ ముగింపు. లత గురించి ముగిస్తూ " ఆమె వయస్సు ఇప్పుడు 23 ఏళ్ళు,ఇంకా అవివాహిత" అంటాడు. కృష్ణ శాస్త్రి గురించి రాస్తూ " విచ్చల విడిగా పెరిగిన జుట్టు, గ్లాస్గో పంచె, లాల్చీ, పల్లెవాటు, కళ్ళకు కాటుక మొదలయిన హంగులతో రంగేలిలా...." అంటుంటే మన కళ్ళ ముందు కృష్ణ శాస్త్రి ప్రత్యక్షం కాకుండా ఉంటాడా.
ఇలా కాదేదీ వ్యాసానికి అనర్హం అన్నట్లున్న ఈ వ్యాస సంపుటి మళ్ళీ ఒక సారి చదువుతూ నండూరి కి నివాళి అర్పిస్తున్నాను. వ్యాసాలు ప్రారంభించడంలో, ముగింపు చేయడంలో ఆయన చాకచక్యం గమనించండి. కృష్ణ శాస్త్రి గురించి " అది గంధర్వలోకం, ఆ లోకంలో "మధుర సుషమా సుధాగాన మంజువాటి" అందులో ఒక వియోగ గీతిక. ఆ వియోగ గీతిక పేరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి అంటూ ప్రారంబిస్తారు.. శ్రీ శ్రీ గురించి ప్రారంబిస్తూ " జగమెరిగిన మహాకవికి పరిచయమేల ? శ్రీ శ్రీ ని తెలుగు వారికి పరిచయం చేయడం సూర్యుడికి దివిటీ పట్టడం. అయనా ఇది ఒక లాంచనం, ఒక వేడుక" అని అంటారు. " వెలుగుతున్నంత సేపు తార. వెలుగు తగ్గితే ప్రమిద. ఈ మాట చలన చిత్ర నటీనటులకు వర్తిన్చినంత బాగా ఎవరికీ వర్తించదు", నాగయ్య గురించి మొదలుపెడ్తూ అన్న మాటలు. నిజమే ఈ రోజు కాంతారావు గురించి చదువుతుంటే ఇలానే అనిపించింది. ఇలానే " జీవితపు సహారాలో ఒయాసిస్సుల వంటివి సైగల్ పాటలు నాకు" అనేది ఓ ముగింపు. లత గురించి ముగిస్తూ " ఆమె వయస్సు ఇప్పుడు 23 ఏళ్ళు,ఇంకా అవివాహిత" అంటాడు. కృష్ణ శాస్త్రి గురించి రాస్తూ " విచ్చల విడిగా పెరిగిన జుట్టు, గ్లాస్గో పంచె, లాల్చీ, పల్లెవాటు, కళ్ళకు కాటుక మొదలయిన హంగులతో రంగేలిలా...." అంటుంటే మన కళ్ళ ముందు కృష్ణ శాస్త్రి ప్రత్యక్షం కాకుండా ఉంటాడా.
Friday, September 2, 2011
తెలుగుకు వెలుగు
తెలుగు భాషాభిమానులకు శుభ వార్త. యునికోడ్ లో శాశ్వత సభ్యత్వం పొందడం
ద్వారా తెలుగు భాష కు అరుదయిన గౌరవం దక్కింది. దీనితో మన రాష్ట్ర ప్రభుత్వం
కూడా ఐ.టి. దిగ్గజాల సరసన చేరింది. ఈ సభ్యత్వం తో ఇంటర్నెట్ తెలుగు లిపి
లోని పొరపాట్లను సవరించి, యునికోడ్ లిపి ప్రమాణాలకు అనుగుణంగా కొత్త
లిపిని రూపొందిస్తారు. కొత్తగా ఆరు ఇంటర్నెట్ ఫాంట్లు రూపొందిస్తారు.
వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తారు. తెలుగులో తెలుగు
సైట్ లను వెతుక్కోవడానికి వీలుగా ఓ ప్రత్యెక బ్రౌసర్ తీసుకరావాలని
ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే కాకుండా తప్పులు దొర్లితే వెంటనే
పసిగట్టేందుకు వీలుగా స్పెల్ చెక్ సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు.
తెలుగు భాష కోసం శాశ్వత ప్రమాణాలతో కూడిన కీబోర్డ్ కూడా అందుబాటులోకి రావడం
మనందరికీ శుభవార్త.
Monday, August 15, 2011
హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ!