Wednesday, November 10, 2010

ముద్దు ..టాగూర్ కవిత


రెండు జతల పెదాలు
ఒకరి చెవిలో ఒకరు గుసగుసలాడుతున్నట్లున్నాయి
ఒకరి హృదయాన్ని ఒకరు
పీల్చుకుంటున్నట్లున్నాయి
రెండు ప్రేమలు
స్వస్థలాలు వదిలి
ఏదో తెలియని దేశానికి బయలుదేరుతూ
కలుసుకున్నట్లున్నాయి
కలిసి ప్రవహించబోతున్నట్లున్న
పెదాలు-రెండు తరంగాలు
రసమయ సంద్రపు తీరమంతా వ్యాపించి
ప్రేమతో ఇసుకను తడిపినట్లున్నాయి
ఉవ్వెత్తున లేచిపడిన ప్రేమ కెరటాలు
విడిపోయి కలుసుకుని
శరీరపు సరిహద్దుల మీద ఐక్యమై
రెండు కామనలు,
మనోభావనలు
ముద్దుల పొరలమీద
సున్నిత పదాలతో
ఒక పాట రచిస్తున్నట్లున్నాయి
వాళ్లు ప్రేమ పుష్పాలు తెంపుకుంటూ
అలా ఇంటికి చేరతారు
రెండు జతల పెదాలతో మాలలల్లుకుంటూ...
విచిత్రం, వినోదం, రంగులమయం
పెండ్లి పూలపాన్పుమీద కలవడం!
ఎంత మధురం ఆ కలయిక!!
(గురుదేవుల 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన సంచార ప్రదర్శన శాల: సంస్కృతీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రదర్శితమైన కవిత)
మూలం: విశ్వకవి రవీంన్రాథ్ టాగూర్
తెలుగు: డా.దేవరాజు మహారాజు
(ఆంద్ర భూమి ప్రచురితము)

2 comments:

నిషిగంధ said...

Beautiful! thanks for sharing..

Anonymous said...

muddu kavitha andajesinanduku thanks. veelaithe where the mind is without fear telugu anuvadam kuda andinchandi