భారత దేశం లోని అగ్ర శ్రేణి రచయిత లలో ఒకరయిన
మహా శ్వేతా దేవి రాసిన కథా సంకలనమే ఈ "చొలీ కే పీచే ". ఇందులో మొత్తం మూడు
కథలు, చోలీకే పీచే, పాల తల్లి, ద్రౌపది ఉన్నయి. ఈ కథలన్నింటిలో కనపడే
సాధారనాంశం , కథా వస్తువు రొమ్ములు. రచయిత్రి రొమ్ములను కథాంశంగా తీసుకొని ,
విభిన్న కథలలో కలవర పెట్టే భయానక దృశ్యాలను ఈ కథల్లో రచయిత్రి
చిత్రిస్తుంది. వీటిలో రొమ్ములు కేవలం ప్రతీకలు మాత్రమె కావు. దోపిడీ,
సామాజిక వ్యవస్థ కర్కశమయిన అత్యాచారాలను అవి బట్ట బయలు చేస్తాయి.
మొదటి కథ " చొలీ కే పీచే " లో ఉసిన్ ఒక ఫోటో గ్రాఫర్ ,వలస కూలీ గా
వచ్చిన గంగోర్ అనే యువతి ఆచ్చాదన లేని అందమయిన రొమ్ములు ఒక పోటో గ్రాఫర్ గా
అతన్ని ఆకర్షిస్తాయి.కూలీ నుంచి ఒళ్ళు అమ్ముకొనే యువతి గా గంగోర్
మారడం...చివరకు ఏ రొమ్ములయితే ఉసిన్ ని ఆకర్షిస్తాయో,వాటి స్తానంలో రెండు
ఎండి పోయిన మచ్చలు, ముడతలు పడిన చర్మం, రెండు అగ్ని పర్వతాలు పేలుతూ
విరజిమ్మిన లావాలా, చూసి పారిపోతూ రైలు కింద పది పోయి ఉసిన్ చనిపోవడం
కథాంశం. సామూహిక అత్యాచారం, కొరకడం, కోరడం,సామూహిక అత్యాచారం , పోలీసులు,
కోర్టు కేసు....మళ్ళీ లాకప్ లో సామూహిక అత్యాచారం... అలా వలస కూలీ నుంచి ఒక
వొళ్ళు అమ్ముకొనే యువతిగా గంగోర్ మారడం వెనుక సమాజం ఆమె ఫై చేసిన
అత్యాచారం రచయిత్రి కలవర పెట్టే విదంగా చిత్రిస్తుంది. రచయిత్రి
చెప్పదల్చుకున్నది రవికె మాటున ఉన్నది అప్రాదాన మయిన అంశం కాదు,
చోలీకే...పీచే...రవికె వెనక ఉన్నది ప్రజలపై సామూహిక అత్యాచారం , అలా గంగోర్
నుండి పారిపోతూ రైలు ప్రమాదం లో ఉసిన్ చనిపోవడంతో కథ విషాదంగా
ముగుస్తుంది.
రెండవ కథ "పాల తల్లి, " ప్రమాదం లో కాలు పోయిన భర్త, విధి లేని
పరిస్తితుల్లో, కిరాయికి పాలిచ్చే తల్లి గా వృత్తి స్వీకరించిన యశోద కథే ఈ
పాల తల్లి కథ.ఎవరివల్ల అయితే కారు ప్రమాదం అవుతుందో వాళ్ళ ఇంట్లో
కిరాయికి పాలిచ్చే తల్లిగా పాలివ్వడం ఒక వృత్తి గా స్వీకరించి, మరి
ఎప్పుడూ పాలివ్వాలంటే తను కూడా ఎప్పుడూ కడుపులో బిడ్డతో ఉండాలన్న భర్త
ఆలోచనను గౌరవించి ఇరవై బిడ్డలకు తల్లి అయి, యజమాని ఇంట్లో ఇంకో ముప్పయి
మందికి పాలిచ్చి, యశోద వృత్తి తల్లి అవుతుంది. అమ్మ తనం ఆమె జీవన
విధానం అవుతుంది. కాలం ఎప్పుడూ ఒక్క తీరుగా ఉండదు కదా, యజమానురాలు
చనిపోవడం, కుటుబం చెల్లా చెదురు కావడం, ఇప్పుడు పాలు ఇవ్వలేని, యశోద భారమయి చివరికి భర్త తో కూడా పోట్లాడి, వంట మినిషి గా మారుతుంది. ఎ రొమ్ములయితే ఆమె
జీవనాదారంయ్యయో అదే రొమ్ము క్యాన్సర్ తో ఆమె చనిపోవడం తో కథ
ముగుస్తుంది. ఏళ్ల తరబడి తను పాలిచ్చి తను సాకిన కొడుకులు, చివరికి తన
అస్తిత్వానికి ప్రతీకలయిన రొమ్ములు ఆమెకు విద్రోహం చేస్తాయి. చివరి
క్షణాల్లో యశోద పరిస్తితిని రచయిత్రి కలవర పెట్టే విదంగా చిత్రిస్తుంది. ఒక
కిరాయి కి పాలిచ్చే తల్లి వృత్తిని చేపట్టి, ఏళ్ల తరబడి ఎంతో మందికి
పాలిచ్చి చివరికి తన కడుపున పుట్టిన బిడ్డలు, భర్త, పాలిచ్చి సాకిన
కొడుకులు, అందరూ కాదనుకొని, చివరకు తన అస్తిత్వానికి ప్రతీకలయిన రొమ్ములు
కూడా ద్రోహం చేసి(క్యాన్సర్ బారిన పడి) యశోద ఒంటరిగా హృదయ విదారకంగా
చనిపోవడం తో కథ ముగుస్తుంది.
మూడవ కథ "ద్రౌపది".ద్రౌపది కథలో ప్రధాన
పాత్ర దోపది. ఒక ఆదివాసీ విప్లవ కారిణి. భర్త చనిపోయి న తర్వాత పోలీసులు
ఆమెను అరెస్ట్ చేస్తారు. పోలీసు కస్టడీ లో ఆమెను చిత్ర హింసలు పెట్టి,
సామూహిక అత్యాచారానికి పాల్పడతారు.చివరికి తెగించిన ఆమె, పచ్చిగా కొరకబడ్డ,
నెత్తురోడుతున్న వికృతంగా కోసేసిన రొమ్ములతో , చీలికలైన చను మొనలతో,
బట్టలు తొడగానివ్వకుండా, మొండి పట్టుదల నిండిన పెను అట్ట హాసంతో ఆమె ఊగి
పోతూ ముందుకు నడుస్తుంటే నిరాయుదురాలయిన ఆమె ముందు నిలబడడానికి సాయుదులయిన
శత్రువులు వణికి పోతారు. ఈ కథలో గాయపడ్డ రొమ్ములను రచయిత్రి శత్రువును
వణికించే ఆయుధాలుగా చిత్రీకరిస్తుంది. కథలో అంశంగా ఆదివాసీలపై జరుగుతున్న
దోపిడీ, దాన్ని ఎదుర్కోవడానికి ఆదివాసీలు సాయుధులుగా మారడం, వాళ్ళ
పరిస్తితులు కళ్ళకు కట్టినట్టు తెల్పుతుంది.
రచయిత: మహా శ్వేతా దేవి
పబ్లిషర్స్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
వెల:కేవలం రూ.13
అనువాదం: కలేకూరి ప్రసాద్, సహవాసి
3 comments:
నాకు మీ విశ్లేషణ చాలా నచ్చింది, ఈ బుక్ తప్పక చదవాలనిపించేలా...
bhanu sir chaala rojula tharvatha me blog chuusha maha swetha devi CHOLI KE PEECHE KYA HY KATHALA MEEDA MEE VISHLESHANA CHDIVANU CHAALA BAAGUNDI. AAME NAVALA OKATI NENU CHADIVINATLU NAAKU GURTHU.
bhanu sir chaala rojula tharvatha me blog chuusha maha swetha devi CHOLI KE PEECHE KYA HY KATHALA MEEDA MEE VISHLESHANA CHDIVANU CHAALA BAAGUNDI. AAME NAVALA OKATI NENU CHADIVINATLU NAAKU GURTHU.
Post a Comment