ఉదయం తలుపు తెరవగానే
బాల్కనీ లో నన్ను తాకిన ఓ చిరుజల్లు
నువ్వు నన్ను ఆత్రుత తో
నా ముఖాన్ని నీ దోసిట్లోకి తీసుకొని ముద్దాడినట్లు
నీ దేహ పరిమళం లో నేను ఉక్కిరి బిక్కిరి అవుతుంటే
నన్ను చూసి
తల ఊపుతూ కిలకిలమని
నిన్ను తలపిస్తూ నువ్వు పెంచిన గులాబీలు
దగ్గరికి వెళ్ళా!
మృదువుగా నన్ను తాకింది ఓ గులాబి
నీ చెక్కిలి ఎమో అని అనుకున్నా
మళ్ళీ ఒక్కసారి పక్కున నవ్వింది
పరిహాసంగా
గులాబీ రెమ్మలపై చిరుజల్లు నీటి తుంపరలు
అప్పుడే స్నానించిన నీ దేహం పై పరుచుకున్న
నీటి ముత్యాల్లా మెరిసిపోతూ
అన్నీ కలిసి నువ్వై
నువ్వు నా నుంచి దూరంగా ఉన్నా
నీ సాన్నిధ్యాన్ని తలపిస్తూనే ఉన్నాయి
1 comments:
బాగుంది.
Post a Comment