పడమటి చెరువులోకి ఇంకుతున్న పగటి జ్ఞాపకాలు
మలి సంధ్య రాత్రి లోకి కరిగిపోతుంటే
రాలిపోయిన ఉల్కలా నువ్వు ఈ విశాల విశ్వంలో కలిసిపోయి ...
నీలాకాశంలో పురివిప్పుకున నక్షత్రాల్లా కోరికలు
ప్రేమ లేని వాంఛ
వాంఛ లేని ప్రేమ
ఆ రెంటిఅపూర్వ కలయికలను దోసిళ్ళతో త్రాగిన ఆ మధుర స్మృతులు
నన్ను గతం లోకి నేట్టేస్తుంటే
మనస్సులోని ప్రేమ
శరీరం లో జనించే కోర్కెలు
నిశ్శబ్దంగా నిశీధి లో కరిగిపోతుంటే
ఈ నిశి రాత్రిలో నిన్ను వెతికి వేసారి
ఒంటరిగా...
నిరాశా నిస్పృహలతో
తొలిసంధ్య వెచ్చని కిరణాల్లోకి
మళ్ళీ ఇంకో రోజులోకి నా పయనం నువ్వు లేకుండా
ఒంటరిగా...
0 comments:
Post a Comment