సిరి వెన్నెల సీత రామ శాస్త్రి గారి చే రచించబడి, శంకర్ మహదేవన్ పాడిన "ఆట" సినిమా లోని ఈ పాట మనల్ని inspire చేసే విధంగా ఉంది. సిరివెన్నెల గారి సాహిత్యం నిరాశ , నిస్పృహల తో ఉన్నవారిని , కార్యోన్ముఖులుగా చేసేవిధంగా చాల మనోహరంగా ఉంది.
ఇది గెలవక తప్పని బతుకాట అంటూ, అనుకొంటే బతకడమొక ఆట, లేదంటే నిత్యం జీవితం బరువే, విజయం సాధించడానికి ఏ మంత్ర దండాలు , అల్లదిన్ అద్బుత దీపాలు అక్కర్లేదు. జీవితం లో నిలబడి చూసేవారికి, చేద్దాం లే అనుకొనే వాళ్లకు కాదు, పనిని చేపట్టే వాళ్లకు, కస్టపడి పనిచేసే వాళ్లకు విజయం ఎప్పుడు వాళ్ళ చెంతనే ఉంటుంది.
గుండెల్లో నమ్మకముంటే , బెదురెందుకు, పదమంటా, సంకల్పం ఉంటె చాలు, ఎ అల్లదిన్ అద్బుత దీపాలు అక్కర్లేదు అంటాడు. ఎ పనిచేసిన ముందుగా దాని లోతెంతో తెలుసుకోమంటూ, ఈ జీవితమనే ఏటిలో ఎదురీత అంత సులభం కాదంటాడు. సాధించే సత్తా ఉంటె సమరం ఒక సైయ్యట, విజయం మన వెంబడి తల వంచుక రావాల్సిందే అంటాడు. ఎవ్వరు దివినుంచి ఈ భువికి రాలేదు, అందరు ఈ భూమ్మీద కష్టపడి పైకొచ్చిన వాళ్ళే, పై కొచ్చిన వాళ్ళంతా మనలోనించి వెళ్ళిన వాళ్ళే, కాబోయే ఘనులంతా మనలోనే ఉన్నారు, పైకొస్తే జై కొడతారు అభిమానులంతా అని ఎంత చక్కగా జీవితం , వ్యక్తిత్వ వికాసం గురించి శాస్త్రి గారు చెప్పారు. మీరు విని ఆనందించండి.
2 comments:
aakveariyem bhalea baagumdi
Sorry for my bad english. Thank you so much for your good post. Your post helped me in my college assignment, If you can provide me more details please email me.
Post a Comment