Thursday, January 6, 2011

విందైన వంటకంబు- హ..హ...హ్హా..మనమే ముందు

మన తెలుగు వంటల ఘుమగుమల గురించి " శ్రీ రమణ " గారు వండి వడ్డించిన  ఓ మంచి వంటకం నా జిహ్వ  కు నచ్చి దానిలోని కొన్ని విషయాలు మీకూ వడ్డిద్దామని...మరి మీరు ఆస్వాదించండి ఈ షద్రసోపెతమయిన భోజనం.
" ఎవరి జాతి గొప్ప వారు చెప్పుకోవడం సహజమే. అది మంచి సంప్రదాయం కూడా. " పొగడరా నీ జాతి నిండు గౌరవము.. ఎ దేశమేగినా ఎందుకాలిడినా" అన్నాడు  కదా మహాకవి. కాని తెలుగువాడి జిహ్వ చాపల్యం వేరెక్కడా కనం వినం చవిచూడం. . వంటకాలలో ఎంత వైవిధ్యం ! తెలుగు విందులో వడ్డించిన విస్తరి అమ్మవారి మెడలోని నవరత్నహారపు పతకంలా ఉంటుందట . ఎన్ని రకాలు వడ్డించినా తెలుగువాడి కన్ను ఇంకా దేనికోసమో వెదుకుతూనే ఉంటుందట . తెలుగుజాతి జిహ్వని తృప్తి పరచడం తరమే బ్రహ్మకైన అంటాడు.
" అస్సలీ వంటా వార్పూ అనేది పురుష కళ కాలక్రమంలో అది స్త్రీల చేతుల్లోకి వెళ్ళింది ఇప్పుడు అది ఇద్దరి చేతుల్లోనించి పోయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళింది  అంటాడు. నిజాం నవాబ్  సింహాసనం కోల్పోయినప్పుడు దాదాపు అయిదు వేల మంది వంట వాళ్ళు గరిటెలు భుజాన  వేసుకొని ఎక్కడెక్కడికో వెళ్లిపోయారట. దాంతో   మన హైదరాబాదీ స్పెషల్స్ దేశమంతా వ్యాపించాయత . హైదరాబాది బిర్యాని, బావార్చి బిర్యాని ఎప్పుడయినా తిన్నార..అబ్బో విదేశాలకు కూడా ఈ బావార్చి బిర్యాని ఎగుమతి చేస్తారట ఓ సారి చదివాను.
 ఇగ మన కవుల బోజన ప్రియత్వం గురించి చెబ్తూ ముంగండ అగ్రహారీకుడు పండితరాయలు తెలుగు వంటల ఘుమఘుమల్ని డిల్లీ దాకా విస్తరిమ్పచేశాడట . శ్రీనాథుడు భోజన రాసిక్యత తెలిసిన ప్రౌఢ కవి. ఆవటేనని, ఇంగువ హంగులని అస్వాదిన్చినవాడు. పోతన సాత్వికాహారంతో, భక్తిప్రపత్తులతో భాగవత రచన చేశారు. అన్నమయ్య వైష్ణవ  ప్రసాదాలలో మునిగి తేలినవాడు.  "పాలకూడు" తియ్యందనాలు, పచ్చకర్పూరపు పరిమళాలు అనుభవించినవాడు.
తెలుగు అతిధికి కూర, వేపుడు, పప్పు...ఇలా పది రాకాలు వడ్డించండి. ఇంకా దేనికోసమో ఆ కళ్ళు విస్తరి వేడుకుతాయి. . "మన" అని కాదు గాని, నిజంగానే ఇంత వైవిధ్యం ఎక్కడా లేదు. అవును నిజంగా తెలుగు వారిది షడ్ర సోపెతమయిన భోజనమే!  .మంచి సాహిత్యాన్ని, మధుర సంగీతాన్ని, మహత్తరమయిన భోజనాన్ని సారూప్యత గల మిత్రులతో  తో కలిసి అస్వాదిన్చినపుడు వాటి రుచులు ఇనుమదిస్తాయని కాళిదాసు అభివర్నిన్చాదట . అరవై నాలుగు రకాల వరిధన్యాలు తెలుగు రైతు పండించగలడు. ఆ బియ్యాన్ని వండుకు తిని అరాయిన్చుకోగలదు. ఓ మహా పండితుడు హిమాలయాలను చూసి తన్మయత్వం తో " హిమాలయాలు అన్నపు రాశుల్ల  ఉన్నాయన్నాడట"  తెలుగు వాడు వంటల మీద చేసిన రిసర్చి ఖగోళం మీద చేసుంటే ఈ పాటికి నవగ్రహాల జాతకాలని   బట్టబయలు చేసి వుండే వాడట.  తెలుగు వారి వంటల వైవిధ్యం గురించి చెబ్తూ కారం తో కారాన్ని మిళాయించి కొత్త రుచి తెస్తారట, పులుపులో పులుపు , షడ్రుచులలో రెండు వందల నలభై ఆరు షేడ్స్ తీసుక రాగల శిల్పం తెలుగుజాతి సొంతం అట.

వెలగ పండు గురించి చెబుతూ ఇది పప్పులో కమ్మగా మిలితమవుతుంది, ఇంకా వెలగపండు కుమ్ములో పెట్టి, ఆనక ఆ గుజ్జు తో ఏమి చేసినా ఇహలోక సౌఖ్యాలు అబ్బుతాయత. ఆహా ఏమి రుచి అనుకోకుండా ఉండ లేక పోతున్నారు కదూ. తెలుగు వాడి చల్ల పుసులుసు సెంటిమెంటు కు ఓ చక్కని ఉదాహరణ చెబ్తూ ఆస్తిపంపకాల్లో అన్న తమ్ములు ఇంట్లో ఉన్న పెద్ద రాచిప్పకొరకు   కొట్లాడుతూ  దాంట్లో ఇకడు  అంటాడట " అందులో అమ్మ పెట్టిన మజ్జిగ పులుసుతో ఈ శరీరం పెరిగింది. బచ్చలి కాడలె  వేసిందో , ఆనపకాయ ముక్కలే వేసిందో పెసర పునుకులే వేసిందో నాకనవసరం, నా పాతికేళ్ళ మజ్జిగపులుసు మధురస్మృతులు ఆ రాచిప్పని అంటి పెట్టుకుని వున్నాయి" అంటాడట.   ఇగాపోతే సినారె గారంటారు  శనగపిండి   తో చేసిన వంటకం ప్రియురాలు అట  , ఇడ్లీ ఏమో ఇల్లాలు లాంటిదట.
తిరుపతి వెంకట కవులు పకోడీ ఎట్లా చెయ్యాలో ఒక అవధానంలో చెప్పారట. ఓ గోదావరి తీర విద్వత్కవి అన్నాడట" నాయనా, పప్పు కలుపుకో, కూర నంచుకో, పప్పు కలుపుకో పచ్చడి కలుపుకో, పప్పు కలుపుకో ముక్కల  పులుసు వంచుకో అని పప్పులో శివుడున్నాడురా ..ఆహా పప్పు గురించి ఎంత బాగా చెప్పాడు. నిజంగా వేడి వేడి అన్నం పప్పు అందులోకి నెయ్యి పక్కన ఆవకాయ నంచుకొని తింటే ఇంకేం కావలి.
ముప్పయి ఏళ్ళ క్రితం వేటూరి వారికి ఓ కోరిక కలిగిందట. ఆయన పుట్టినరోజున సన్నిహితులందరికి అచ్చ తెలుగు భోజనం పెట్టాలనీ అదీ మద్రాసులో, ఓ పెద్ద స్టార్ హోటల్లో , పులిహోర, బొబ్బట్లు, గుత్తొంకాయ కూర తో భోజనం ఏర్పాటు చేయించారట. ఎంత భోజన ప్రియులు కాకపోతే "మాగాయ మహత్తరి లాంటి " పద బంధాలు వస్త్తాయి చెప్పండి.
విశ్వనాథ గారి జిహ్వా చాపల్యం గురించి రాస్తూ విశ్వనాథ గారి తమ్ముడు ఓ రోజు పొద్దున్నే ఓ సంచీ నిండా కూరగాయలు తీసుకొని మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి ప్రెస్ ముందునుంచి పోతుంటే మల్లాది గారు ఆయనను ఆపి, సంచిలో ఉన్న చేమ దుంపలు , వంకాయలు, దోసకాయలు పైన ఉన్న పొడవాటి పోట్లకాయలు, ములక్కాడలు చూసి వాటిని పరామర్శించి " అయితే మీ అన్నయ్య ఇవి తినే రామాయణం రాస్తున్నాడ? రాముడు సుక్షత్రియుడు ఈ చప్పిడి కూరలు తింటున్నాడ... ఎం రాస్తాడో ఏమో? అని పెదవి విరిచాడట!
ఇక సినిమా నటీమణుల విషయానికి వస్తే సూర్యకాంతం, షావుకారు జానకి గురించి మీకు చెప్పక్కర్లేదు,  తెలుగు జాతికి శాకాహారంలో ఎంత రేంజ్ ఉందొ మాంసాహారంలో అంతకు మించిన పరిది ఉందంటాడు. గుడ్లు, వాటి తల్లులు తండ్రులు మామూలే. ఇంకా ఎన్నెన్నో  పోలసల  పులుసు, రొయ్యపోట్టు, బొచ్చెల ఇగురు, రొయ్యల వేపుడు ఎన్నని, చింతచిగురు చిన్నచేప గొప్ప కాంబినేషన్ అట.  పోటాని  పచ్చిపులుసు కనుమర్గైయింది , మాగాయ పెసరప్పదము వేల్లిపోయిన్దేల్లిపోయిందని వాపోయారట జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు. అందుకే మనమంతా నడుం కట్టి జాషువా పద్యంలా, చలం గద్యంలా, కృష్ణ శాస్త్రి గేయంలా, ఘంటసాల గానంలా మన జాతికే సాధ్యమయిన వేలాది తెలుగు  రుచుల్ని పదిలపర్చుకున్దామంటాడు. 
త్యాగరాయ స్వామికి వర్తకొలంబు అంటే చాలా ఇష్టమట. పుస్తికాయల వోరుగుతో చేసే పులుసు . ఆయన ఒక వస్త్రం మీద పుస్తికాయల్ని ఎండబెట్టుకొని  కృతిని మనసులో అల్లుకుంటూ కాపలాగా కూర్చున్నాడట. ఇంతలో ఓ పక్కింటి పిల్ల వాడు ఏదో ఆడుతూ వస్తే, అబ్బాయి కాలు తగిలి వొరుగులు చెల్లా చేదురైనాయత. త్యాగయ్యకు కోపం వచ్చి ఒక్కటి అన్తిచ్చాదట . కాసేపటికి ఆ పిల్లవాడి తల్లి తండ్రులు వస్తే ఈ పుస్తికాయల ఆసామి షరతులు లేని క్షమాపనలకు సిద్దపడ్డాడట. ఆ తల్లి తండ్రులు స్వామికి నమస్కరించి " అయ్యా! మావాడు ఏమిసుకృతం  చేశాడో తమరి చేత దెబ్బతిన్నాడు. జాతకుడు మాకా అదృష్టం లేదు కదా!" అంటూ త్యాగయ్య పాదాలంటి వెళ్లిపోయారట. ఇదంతా ఎందుకంటే " ఎంతవారలైన జిహ్వ దాసులేనని అనడానికి! 

ఇదండీ  మన తెలుగు వంటల ఘుమ ఘుమలు. అందరి జీవితాలు ఈ నూతన సంవత్సరంలో వడ్డించిన విస్తల్లుగా వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ,  మరి మీ ఘుమ గుమలాడే తెలుగు వంటల, రకరకాల కూరల, పచ్చళ్ళ, రక రకాల రుచుల కామెంట్లు వడ్డిస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీఅందరికి  ఘుమఘుమలాడే నూతన సంవత్సర శుభాకాంక్షలు.  

15 comments:

మనసు పలికే said...

భాను గారు, పోస్ట్ భలే బాగుంది:) నోరూరిపోతుంది.
>>తెలుగు విందులో వడ్డించిన విస్తరి అమ్మవారి మెడలోని నవరత్నహారపు పతకంలా ఉంటుందట
>>తెలుగు వాడు వంటల మీద చేసిన రిసర్చి ఖగోళం మీద చేసుంటే ఈ పాటికి నవగ్రహాల జాతకాలని బట్టబయలు చేసి వుండే వాడట.
హహ్హహ్హా.. బాగా చెప్పారు..

shankar said...

"ఎన్ని రకాలు వడ్డించినా తెలుగువాడి కన్ను ఇంకా దేనికోసమో వెదుకుతూనే ఉంటుందట . తెలుగుజాతి జిహ్వని తృప్తి పరచడం తరమే బ్రహ్మకైన అంటాడు."

నిజమే, చాల తెలుగు రుచుల గురించి చెప్పారు కానీ ఆవకాయ, గోంగూర గురించి మర్చిపోయారు. హ హ హ నేనూ తెలుగువాడినే కదా.

గీతిక బి said...

Same to you...

చాలా బాగా వ్రాశారు...

కానీ మీరు అన్యధా భావించనంటే చిన్న మాట...
అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్.. సరిచేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుందనుకుంటున్నాను..

భాను said...

@అపర్ణ
ధన్యవాదాలు. నోరూరితే తినేయ్యడమే:) విస్తరి మీముందు వడ్డించి ఉందిగా:)
@శంకర్
గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అందుకేగా కామెంట్ల లో మిమ్మల్ని వద్దిన్చామంది తెలుగువాడి ఆవకాయ , గోంగూర వడ్డించినందుకు థాంక్స్
@గీతిక
ధన్యవాదాలు మీ సలహా కి కూడా థాంక్స్ అయితే టైపింగ్ లో స్పెల్లింగ్ అప్పుడప్పుడూ ఎందుకనో ప్రాబ్లం వస్తుందండీ. అప్పటికి ఎంత ప్రయత్నించినా పదాల ఆప్షన్స్ చూసిన సరి అయిన స్పెల్లింగ్ తో లభించలేదు అందుకే చివరికి కొన్ని అలానే వదిలేశ. మీరయినా ఇంకెవరయిన ఓ సలహా ఇస్తే దన్యున్ని.

గీతిక బి said...

మీకు ఏ అక్షరాలు టైప్ చెయ్యడానికి ప్రాబ్లెం అవుతున్నాయో చెప్పండి. నేను సాల్వ్ చెయ్యగలనేమో చూస్తాను.

నా మెయిల్ ఐడి ఇది b.geetika@ymail.com

భాను said...

@గీతిక
థాంక్స్ అండీ

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అబ్బో! వంటమాటలన్నీ అదిరాయండి.(న్ వెజ్ వదిలేస్తే)
సినారె గారితోనూ, తిరుపతి వేంకటకవులతోనూ పూర్తిగా ఏకీభవించాల్సిందే.

ఇందు said...

అయ్యబాబొయ్! ఎన్ని వంటలగురించి రాసేసారో!

>> శనగపిండితో చేసిన వంటకం ప్రియురాలు అట , ఇడ్లీ ఏమో ఇల్లాలు లాంటిదట

హ్హహ్హహ్హా! ఏం చెప్పారండీ సినారే గారు!

పప్పులో శివుడున్నాడా? నేను పప్పు కనిపెట్టినవాడిని పట్టుకుని నాలుగు పీకాలి అని అనుకుటాను ఎప్పుడూ :)))

అవునండీ..నేను చివరిదకా...మా గుంటూరు గోంగూర...ఆంధ్రా ఆవకాయ గురించి ఎదురు చూసా! అది మీ పోస్ట్ లో పెడితే కానీ మీ పోస్ట్ షడ్రసోపేతమవదు :))

మొత్తమ్మీదా మాంచి పోస్ట్ పెట్టారు..ఫొటోలైతే నోరూరింగ్స్ :))

భాను said...

@మందాకినీ
ధన్యవాదాలు మరి నాన్ వేజ్ని ఎందుకో వదిలేసారండీ.
@ఇందు
గుంటూర్ గోంగూర, ఆవకాయ మీకొదిలేశానండీ. మీ గోంగూర కదండీ:) ధన్యవాదాలు. ఫోటోలోని వన్నీ గూగులమ్మ వడ్డించింది లెండి. నోరూరితే తినేయ్యడమే మరి:)

జ్యోతి said...

భానుగారు,
మంచి షడ్రుచోపేతమైన వ్యాసం కాని ఈ అప్పుతచ్చులు పంటికింద రాయిలా తగులుతున్నాయి. మీరు డైరెక్టుగా బ్లాగులో రాస్తే ఇలా అవుతుంది. లేఖిని లేదా బరహాతో వర్డ్ లోరాసుకుని ఎడిట్ చేసాక బ్లాగులో పెట్టండి. అవునూ మీ టపాలో ట లు ఎక్కువయ్యాయి ఎందుకని??

Geetika said...

జ్యోతి గారూ..

అచ్చుతప్పులా... అప్పుతచ్చులా..?

చిన్నప్పుడు నోరు తిరక్క ఇలాగే మాట్లాడేవాళ్ళం... అప్పుతచ్చులనీ, రిక్షాకి రిష్కా అని...

జ్యోతి said...

గీతికగారు,,

అర్ధం చేసుకోరూ!! తప్పులున్నాయనే అలా రాసింది చేయి(ఇక్కడ మాట్లాడటంలేదు కదా) తిరక్క కాదు. భానుగారు ఇది మిమ్మల్ని వెక్కిరించడం కాదండోయ్..

భాను said...

@జ్యోతి
ధన్యవాదాలు చాలా రోజుల తర్వాత నా బ్లాగ్ పావనం చేశారు. ఇక పొతే నావి అచ్చు తప్పులే ఒప్పుకుంటా. ఎపిక్ లో ఒక్కోసారి సరి అయిన స్పెల్లింగ్స్ టైప్ చేయలేక పోతున్న. మీ సలహా కి మల్లె ఒక్క సారి ధన్య వాదాలు. సరి చేస్తా సమయం దొరకట్లేదు. ప్రస్తుతానికి ఇలాగే భరించండి:)
@గీతికా గారూ
భలే జోకేశారు జ్యోతి ..గీతికా...నావి అచ్చు తప్పులు ...మీవేమో అప్పు తచ్చులే నేనేమి అనుకోవట్లేదు లెండి. థాంక్స్ ఇలా అన్న నా బ్లాగ్ మళ్ళీ పావనం చేసినందుకు :)

Geetika said...

ఓహ్హో... అదా. నా మట్టిబుర్రకి వెలగలేదు.

Ennela said...

tammee bhaanu, ginni choopichchi ooriste etla, jera vandinchi pettu raaduree!evalanna vandite dini chaana rojulaaye....

baagundandee....tapa