రచన మాస పత్రికలో " పిల్ల కోతి కిచ కిచలు" అని ఈ నెల మాస పత్రిక నుంచి " జ్యోతి" పత్రిక ప్రారంభ సంచిక విశేషాలు పంచుకుంటున్నారు. మహా మహుల్లాంటి సంపాదక వర్గం తో తీర్చి దిద్దిన "జ్యోతి" కుర్ర కారునే కాక ఇంటిల్లిపాదిని ఆ రోజుల్లో ఆకట్టుకుందట. రచన "శాయి" గారు జ్యోతి రుచులను ఒక సంచికలో కాకుండా " పిల్ల కోతి కిచ కిచలు" అనే శీర్షికన ధారా వాహిక గా ప్రచురిస్తున్నారు. మంచి సాహిత్యం పట్ల జిహ్వ చాపల్యం ఉన్న వారందరినీ ఈ షడ్రుచులు తనివితీరా అలరిస్తాయని శాయి గారు తెలియ జేస్తున్నారు. మరి మీరు ఆస్వాదించండి. 1963 లో ఆవిర్భవించిన " జ్యోతి" పత్రిక ప్రారంభ సంచికలో ప్రచురితమయిన " కళ జమునాయె....కళ నిజమాయె" అన్న ఫోటో ఫీచర్ ఇక్కడ మీకోసం.. మీరూ చూసి ఆనందించండి. చిత్రంలో ఉన్నది కూడా బాపు గారనుకుంటా.
( రచన మాస పత్రిక సౌజన్యం తో మరియు శాయి గారికి ధన్యవాదాలతో )
1 comments:
It is so wonder and nice
Post a Comment