Sunday, February 27, 2011

వేరే లోకపు బాలలం...మనోచైతన్య


వేరే లోకపు బాలలం అంటూ ఆ పిల్లలు చేసే నృత్యాలు, వాళ్ళ ఆటలు, పాటలు నిజంగా చూస్తుంటే ముచ్చటేస్తుంది. వీళ్ళంతా మానసిక వికలాంగులు. వాళ్ళను చూస్తె అలా అనిపించలేదు. మామూలు పిల్లల్లాగే కనిపించారు.  వాళ్ళ ముందు అన్నీ సరిగ్గా ఉన్న మనం వికలాన్గుల్లా    అనిపించింది.  ఎప్పటి నుంచో ఈ వికలాంగుల పాటశాల వెళ్లాలని మనసులో ఉన్నా , ఆ కోరిక చివరికి ఈ మధ్య ఆ పాటశాల వ్యవస్థాపకులు శ్రీ కృష్ణ కుమార్ గారు పిలవగానే సంతోషంతో వెళ్ళా. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కృష్ణకుమార్ గారు " మనోచైతన్య " పేరుతొ కరీంనగర్ జిల్లా గోదావరిఖని లో ఏర్పాటు చేసి, మానసిక వికలాన్గులయిన  ఈ పిల్లలకు చేస్తున్న సేవ శ్లాఘనీయం.

 మానసికంగా  ఏదో ఒక లోపంతో వయసు ఎదిగినా, మనసు ఎదగక  చిన్న పిల్లలవలె తల్లి తండ్రులకు కూడా భారంగా ఉండే ఈ పిల్లలను  ఒక్క దగ్గర చేర్చి వారి మానసిక ఎదుగుదల కు తోడ్పడుతున్న కృష్ణ కుమార్ గారు అబినందనీయులు.   ఇక్కడ ఈ విద్యార్థులకు చదువే కాక, ఆట పాటలు , శాస్త్రీయ నృత్యాలు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు , ఇవే కాకుండా ఈ పిల్లలకు  శిక్షణ ఇవ్వగా ఇప్పుడు వాళ్ళు లాంగ్  నోట్ బుక్స్, కవర్స్, ఫైల్ ప్యాడ్స్, క్లిప్ ఫైల్స్ , స్వీట్ బాక్స్ లు, మొదలగునవి  ఎన్నో వీళ్ళ చేతుల్లో తయారవుతున్నాయి. వీటిని తయారు చెయ్యటమే కాదు, డబ్బు రూపంలో దానికి దగ్గ ప్రతిఫలం కూడా పొందుతున్నారు.  మనో చైతన్యం అంటే స్తబ్దతగా  నున్న మనస్సును చైతన్యం చెయ్యడం.  స్తబ్దత తో  ఉన్న వీళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళలో  మార్పు తీసుక వచ్చి ఇలా చెయ్యడం నిజంగా నిర్వాహకులను మెచ్చుకోదగ్గ విషయం. " మనో చైతన్య"  గురించి ఈ వీడియో లు చూడండి. వివరాలకు http://www.manochaitanya.in/ సందర్శించండి.





4 comments:

Ennela said...

చాలా బాగుంది భాను గారు. దానిని స్థాపించిన వారు, సంస్థ అభివృధ్ధి కై తోడ్పడుతున్న వారు అందరూ ఎంతో అభినందనీయులు

భాను said...

ధన్యవాదాలండీ ఎన్నెల గారూ

సుమలత said...

చాల బాగుంది బానుగారు ...
అలాంటివారికి ఎన్ని చెప్పిన తక్కువే ....

భాను said...

thanks sumalatha garoo