రేడియో డైరక్టర్ గా వున్న రజనీకాంత రావు గారు ఓ మాట అనేవారట. " కవులూ కథకులూ, రచయితలూ....వీల్లున్నారే...వీళ్ళకి మేం సాయం చేయటం లేదు. వాళ్లే మాకు సాయం చేస్తున్నారు, మా నిర్వహణకు మంచి పేరు రావాలంటే సమర్థులయిన రచయితలూ, వారి రచనలూ...మాకు లభించాలి. అప్పుడే నార్లకు మంచి ఎడిటర్ అని, రజనీకాంత రావుకి మంచి రేడియో స్టేషన్ డైరెక్టర్ అనీ పేరు వస్తుంది.అందుకే ఎక్కడ మంచి రచయిత ఉన్నాడా? అని ఎప్పుడూ వెతుకుతూనే వుంటాం. మా చుట్టూ ప్రదక్షిణాలు చేసే వాళ్ళతో సరిపెట్టుకోం... " అని. అద్బుతమయిన ప్రతిభ పాటవాలున్న రచయితలూ పత్రికాఫీసుల చుట్టూ.. రేడియో, టి.వి. స్టేషన్ల చుట్టూ తిరగరు. కనుక వారిని వెతికి పట్టుకోవాలి. ఈ రోజుల్లో ఆ పరిస్తితులున్నాయా? ఈ శ్రద్ద కూడా రాను రాను తగ్గిపోయింది. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారికి , " భారతి" ఆఫీస్ నుండి వచ్చిన మూడు ఉత్తరాలు చూడండి. రాను రాను రచయితల పట్ల ఆదరణ ఎలా తగ్గుతూ వచ్చిందో స్పష్టంగా అర్థం అవుతుంది.
మొదటి ఉత్తరం 1940 లో నాగేశ్వర రావు పంతులు రాసింది...." హనుమచ్చాస్త్రి గారూ! నమస్కారం...దయచేసి మీకు వీలయినప్పుడు మంచి కథ గాని, కవిత గాని 'భారతి' కి పంపండి. పారితోషికం ముందుగా ఈ జాబు తో పంపుతున్నాను."
రెండవది 1955 లో శంబూ ప్రసాద్ గారు రాసింది- " శాస్త్రి గారూ! మాకు అప్పుడప్పుడూ ఏదయినా రచన పంపుతూ ఉండండి."
మూడవది 1966 లో రాధాకృష్ణ గారు రాసింది- " అయ్యా ! మీరెప్పుడయినా రచన పంపిస్తే పరిశీలిస్తాం."
0 comments:
Post a Comment