రేపే హోలీ. మొన్నెప్పుడో దారిలో ఓ మోదుగ పూల చెట్టు విరగబూసి, చెట్టు మీద ఒక్క ఆకు లేకుండా కనిపించింది. అది చూశాక చిన్నప్పటి హోలీ జ్ఞాపకాలు మదిలో ముసురుకున్నాయి. అప్పుడు ఏమీ తెలియని వయస్సు, హోలీ అంటే రంగులు తయారు చేసుకోవడం, స్నేహితులంతా కలిసి ఆ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వూళ్ళో ఆడుకోవడం. ముందు రోజే ఎర్రటి మోదుగు పూలచెట్లను తోటల్లో , రోడ్ల పక్కన వెతికి పట్టుకొని పూలన్నీ తెమ్పుకొని, ఆ రోజు సాయంత్రం ఓ కుండలో నీళ్ళు పోసి ఆ పూలను ఉడికిస్తే ఎర్రటి రంగు ద్రావణం తయారయ్యేది. అదే మాకు హోలీ రంగు. దీంతో పాటు కుంకుమ, ఒక్కోసారి అత్యుత్సాహం గల కొందరు మిత్రులు వాడే ఎడ్ల బండ్ల ఇర్సులులకు వాడే నల్లటి రంగు. కొంత మంది కోడి గుడ్లను కూడా ఉపయోగించే వాళ్ళు. ఇంకా ఉత్సాహం పెరిగితే ఇంటి ముందు గోలెం లో ఉండే కుడితి లో ముచే వాళ్ళు. తెల్లవారి పొద్దున్నే లేచి రంగులు సీసాల్లో నింపుకొని, వూళ్ళో తెలిసిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం, రంగులు పోయడం. కొందరు బయపడి పోయి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు అనుకోండి. అలా మద్యహ్న్నం వరకు ఆడి అందరం కల్సి చెరువుకో, పక్కనున్న కాల్వకో పోయి స్నానం చేసి వచ్చేవాళ్ళం. భలే సరదాగా ఉండేది. ఇప్పుడో రంగు పూసుకోవాలంటే భయం , కళ్ళల్లో పడితే ఏమవుతుందో, నోట్లో కి వెళ్తే ఏమవుతుందో అని. ఆ ఎర్రటి మోదుగ పూల రంగు ముందు ఇవన్నీ దిగదుడుపే.
skip to main |
skip to sidebar
5 comments:
Happy holi....
హోళీ పండుగ శుభాకాంక్షలు!
ఇలా రంగు తయారు చేసుకోవడం నాకు తెలియదండీ..బాగుంది కదా? హాపీ హోలీ..
adee Holi panduga Ante. Vasantha Rutvu lo dorike sahaja siddha maina rangulatho Holi adithe entha sahaja sidhanga untundo kada
vasanthamlo dorike sahaja sidha maina rangulatho Holi adukuntene majjaaaa... Pch Entha missavuthunnamo
Post a Comment