Monday, August 15, 2011

హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ!



(ద్రాక్షారం మహాదేవ జీ గారి కవిత..ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబందం సౌజన్యం తో)

గర్భాలయం నుంచి అనల గర్భంలోకి
ట్రాన్సిషన్ భీబత్సం.....
జననక్షేత్రం దాటగానే మారణ క్షాత్రం
ట్రమాటిక్ ఎక్ష్ప్లొప్జన్ ....
నో ప్రాబ్లం.....ఇక్కడ నేను క్షేమం!

పిండం మీద యోని ముద్రలుండవు...ఫికర్ లేదు
పురిటి వాసన పసిగట్టి పోలీసు కుక్కలు రావు....రిలాక్స్
నా బొడ్డున నువ్వు మర్చిపోయిన పేగుమీద....నీ చిరునామా లేదు
బరువు దిగిన్డిగా ..మరేం భయం లేదు...స్వేచ్చగా వొళ్ళు ఆరబెట్టుకో

'నప్శియాల్ నాన్సెన్స్ ' తెలీక త్వరపద్దాను
తాళి బిళ్ళ  లేదని తెలిసీ 'అక్రమంగా' జోరబడ్డాను
తప్పు నాదే....
'ఇల్లిజిటిమెట్ బాస్టర్డ్'ని నాకిలాగే జరగాలి...నో రిగ్రెట్స్
అక్కడ నీవు క్షేమమా?!
అద్దె కట్టకుండా నీ గర్భాన్ని ఆక్రమిన్చుకున్నాను
నన్ను క్షమించు!
గర్భాదానం చేసినవాడేవడో-స్టుపిడ్
వాణ్ని మాత్రం క్షమించను
కండోం కల్చర్ లేని బ్రూట్ కు- కామకేళులెందుకో
నీ తప్పేం లేదు....అక్కడ నీవు క్షేమమా!?
అమ్మవు గదా......
ద్వేషిస్తూనే దేహాన్నిచ్చావు
బహిష్కరించినా బతక నిచ్చావు
పారేస్తే పారేశావ్-పీక నొక్కకుండా వదిలేశావ్
మెనీ మెనీ .......థాంక్స్ 
రెప్ప పాటులో రెండు జన్మలు
ట్వయిన్ బోర్న్ ....ట్వయిస్ లిబరేటేడ్
నతింగ్ సీరియస్...ఇక్కడ నేను క్షేమం!

పేపర్లో చుట్టిగదా పారేశావ్ ....వార్తనయ్యాను
ఉమ్మనీటి బుగ్గను గదా....నిప్పుకన్ను చిదిమేశాను
"దౌ ....షల్ నాట్....డై"
మైఖలాజేలో 'సృష్టి' చిత్రం మాట్లాడింది అప్పుడే
చావు నిషిద్దమయ్యింది...అప్పుడే
కర్ణుడు బతికాడు...మోషే బతికాడు....నేనూ బతికాను
తల్లిని జయించి మృత్యున్జయుడైన వాడిని
నాకిక చావు లేదు
నా కపాలాన్ని గుమ్మానికి ఉరి తీసి
గృహప్రవేశం చెయ్
హ్యాపీ మారీడ్ లైఫ్ మమ్మీ.....
సోలాంగ్....షాలోం !
 





7 comments:

ఆత్రేయ said...

ఒళ్ళు జలదరించింది.
ఎవరిని తప్పు పట్టగలం..?

జల్లు ఎదని తాకింది
ఎలా తుడవగలం..?

ఆ.సౌమ్య said...

నిజంగానే ఒళ్లు జలదరించింది....ఒకలాంటి ఆవేశం, బాధ కమ్ముకున్నాయి.
ఆ బిడ్డ ఎదుట నిలిచి వేలెత్తి చూపిస్తూ చెబుతున్నట్టు అనిపించింది....అబ్బ హృదయం చాలా బరువెక్కింది.

తప్పెవరిది?

Anonymous said...

ఆత్రేయ గారి వ్యాఖ్య తో.. ఆమోదం తెలుపుతూ.. ఒక మాట..
ఆ కవిత వ్రాసిన మహానుభావుడు ఒక తల్లికి పుట్టలేదా? ఈ కవిత మోసుకువచ్చిన మీరు ఒక తల్లి పేగు తెంచుకు పుట్టలేదా? కండోం వాడి సంస్కారంతోవందలసార్లు ప్రక్కకు తప్పుకునే మగజాతి నాన్నలైతే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే చెప్పాలా బిడ్డా? అమ్మ మీద కోపం కాదు..పక్కకు తప్పుకునే నాన్నలు లేకుండా ఉండాలని కోరుకోండి.. తీవ్రంగా గర్హిస్తూ

భాను said...

@ఆత్రేయ గారూ, @ సౌమ్య గారూ
ఆ కవిత చదివి మీలా అనిపించి అందరితో షేర్ చేసుకుందామని పోస్ట్ చేశా. నిజంగా తప్పు ఎవరిదయినా కావచ్చు కానీ మీరన్నట్టు మన ఎదుట నిలబడి వేలెత్తి ప్రస్నత్స్తున్నట్టు గా ఉంది.
@అనానిమస్ గారూ
ఆత్రేయ గారి తో అమ్మోదిస్తున్న అన్నారు. కానీ మీ ఉద్దేశ మేమిటో అర్థం కాలేదు?

వనజ తాతినేని/VanajaTatineni said...

ఆత్రేయ గారిలా నేను స్పందించాను. అమ్మ తనం బండబారి పసిపాపలను..పారేసే..తల్లులని అసహ్యిన్చుకుందాం.అలా అని.. అమ్మలందరినీ కాదు కదా.. మరి హ్యాపీ మేరీడ్ లైఫ్ మమ్మీ..టైటిల్ ఎందుకు? పురుషుల వికృత భావజాలమా? అందుకు నిరసిస్తూ.. నాన్న కండోం వాడనందుకు..నేను అనాధనయ్యాను. కండోం .వాడనందుకు... హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే..చెప్పండి.అప్పుడు అమ్మ,నాన్న లేని అనాధల లోకమే.

Anonymous said...

>> కర్ణుడు బతికాడు...మోషే బతికాడు....నేనూ బతికాను
a small correction, Moses was not an illegitimate child naither did his mother throw him away to get rid of him.

-Ruth

srinath kanna said...

chaalaa chaalaa baagundi Atreyagaaru,sowmya gaaru cheppinatlu nijangaa ollu jaladarinchindi

పారేస్తే పారేశావ్-పీక నొక్కకుండా వదిలేశావ్

nijangaa kallallo niilochaayi..:(

manasu baruvekki mounangaa ghoshinchindi..ilaantivi chadivite ante kadaa..