Friday, September 2, 2011

తెలుగుకు వెలుగు


తెలుగు భాషాభిమానులకు శుభ వార్త. యునికోడ్ లో శాశ్వత సభ్యత్వం  పొందడం ద్వారా తెలుగు భాష కు అరుదయిన గౌరవం దక్కింది. దీనితో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐ.టి. దిగ్గజాల సరసన చేరింది.  ఈ సభ్యత్వం  తో ఇంటర్నెట్ తెలుగు లిపి లోని పొరపాట్లను సవరించి, యునికోడ్ లిపి ప్రమాణాలకు అనుగుణంగా కొత్త లిపిని రూపొందిస్తారు.  కొత్తగా ఆరు ఇంటర్నెట్ ఫాంట్లు  రూపొందిస్తారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తారు. తెలుగులో  తెలుగు సైట్ లను వెతుక్కోవడానికి వీలుగా ఓ ప్రత్యెక బ్రౌసర్ తీసుకరావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇదే  కాకుండా తప్పులు దొర్లితే వెంటనే పసిగట్టేందుకు వీలుగా స్పెల్ చెక్ సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు.  తెలుగు భాష కోసం శాశ్వత ప్రమాణాలతో కూడిన కీబోర్డ్ కూడా అందుబాటులోకి రావడం మనందరికీ శుభవార్త.

3 comments:

భాస్కర రామిరెడ్డి said...

ఈ న్యూస్ ఈనాడులో నేనూ చదివాను. కానీ ఏంటి వళ్ళుచెప్పినవన్నీ 75 లక్షలకే?? ఇందులో అందరివాటాలు పోగా డెవలపర్స్ కి జీతాలివ్వడానికి కూడా డబ్బులుండవు.

భాను said...

61 లక్షలనుకుంట...అన్ని ప్రభుత్వ పథకాల్లాగే ఇదీ మూలకు పడుతుందేమో చూద్దాం

Bhupatiraju vihang said...

really,
its
a gd news