Friday, January 7, 2011

నా ఎలుక గీసిన చిత్రం

ఎలుకేంటి ..చిత్రమేంటి అని బుర్ర గోక్కున్టున్నార:). అవునండీ ఈ   ఎలుక నా పెంపుడు ఎలుక. రోజూ ఇంటికి వొచ్చి కంప్యుటర్ ముందు కూర్చోగానే ఎంచక్కా వచ్చి చేతిలో ఒదిగి పోతుంది. నేను ఉన్నంత సేపూ నాతొ ఉంటుంది ఎం చెప్తే అది చేస్తుంది.  ఇక్కడి వరకు బాగానే ఉంది, మొన్నేం  జరిగిందంటే.... చెబ్తా.. చెబ్తా. అక్కడికే వస్తున్నా.  
మనకు పూర్వాశ్రమంలో అంటే ఎప్పుడో చాలా రోజుల ...ఆహా... ఏళ్ల క్రింద బొమ్మలు గీసే అలవాటు ఉండేది. దీనికేలా తెలిసిందో కాని గత రెండు, మూడు రోజులుగా నా ప్రాణం తింటుంది. నాకూ బొమ్మలు గీయడం నేర్పమని. నేను మర్చిపోయాలెమ్మని చెప్పా తప్పించుకుందామని.ఉహూ వినలేదు, బతిమిలాడా అస్సలు వినలేదు.  ఇలా కాదని నాకు బొమ్మలు గీయడం రాదు నీకెవరో అబద్దం చెప్పారు అన్నా:). నీ పని ఇలా ఉందా అని మొరాయిన్చేసింది.  సరే ఇక తప్పేట్టు లేదనుకొని సరే రా నేర్పుతా  అని పిలిచా. చెంగున చేతిలో కొచ్చి గురూ గారూ నేను రెడీ అని గారాలు పోయింది, సరే అని ఓ చెవ్వు  గట్టిగా పట్టా.  అమ్మో అని అరిచింది. మరి బొమ్మలు  గీయడం నేర్చుకోవాలంటే తప్పదంటూ ఆ చెవ్వు అలానే గట్టిగా పట్టుకొని మెల్లగా నేర్పటం మొదలెట్టా.  పాపం మంచిగానే చెప్పినట్టు విన్నది కాని మొదటిసారి కదా అక్కడక్కడా మొరాయించింది. సరే మొదటి సారి కదా అని నేనూ ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. ఎలాగోలా గీసిన్దనుకోండి .
 హమ్మయ్య అయిపొయింది అనుకోని లేద్దామని అనుకొనే సరికి , గురూ గారూ అని  పిలిచింది. ఏమిటి అన్నాను. నాతొ బొమ్మ గీయించారు బానే ఉంది. అది మీ సిస్టం లో దాచుకుంటే నాకేంటి లాభం అంది. మరేం చెయ్యాలి. మీరు గీసిన బొమ్మయితే అలా హాల్లో అందరూ చూసేలా పెట్టుకున్నారు, ఎలుక గీసింది కదా అని అంత చిన్న చూపా అంది. ఏంచెయ్యాలి అని అడిగా, నాదో చిన్న కోరిక అంది. చెప్పు  అన్నాను. మీకు ఏదో ఆలోచన రాగానే ఈ అంతర్జాలం లో మీ బ్లాగ్మిత్రులతో పంచుకుంటారు కదా అని అంది. అవును దానికి దీనికి సంబంధమేమిటి అని ఓ ప్రశ్నార్ధకం గుర్తెశా! మరేమో...మరేమో ...నాన్చకుండా  తొందరగా  చెప్పు  అవతల అస్సలే కృష్ణ  కమిటీ రిపోర్ట్ వచ్చింది, ఎం జరుగుతుందో , నేను వెళ్ళాలి, అని కొద్దిగా కోపంగా అన్నా. మరేమో నేను గీసిన బొమ్మ మీ బ్లాగ్లో పెట్టి మీ బ్లాగ్మిత్రులకు చూపించండి అంది. అమ్మ ఎలుకా:) ఎన్ని కోరికలే అనుకోని తప్పుతుందా ఎంతయినా  "పెంపుడు ఎలుక" కదా అని ఒప్పేసుకున్న.  ఇంకో కోరిక అంది, మల్లేంటి అన్నా. ఏంలేదు గురూ గారూ , అదే చేత్తో వాళ్లకి ఏమి చెప్తారంటే నా బొమ్మెల ఉందొ కామేన్టమని   చెప్పండి, బాగుంటే ఇంకా వెయ్యొచ్చు కదా, అంది. అమ్మ నీ తెలివి తెల్లార  అనుకోని సరే రాస్తాలే అని ఒప్పేసుకున్న. అదండీ నా ఎలుక  అది గీసిన చిత్రం కథ. అది ఎలా గీసిందో మరి, ఇక దానిష్టం మీ ఇష్టం. ఎలా భరిస్తారో నాకేమి సంబంధం లేదు:) . 
మళ్ళీ పిలిచింది. మల్లెంటే అని  విసుగ్గా అన్నా. అప్పటి నుంచి చూస్తున్న నన్ను ఎలుక ..ఎలుక అని పది మందిలో నన్ను అవమానిస్తున్నారు అంది. మరేమనాలంటావు అని అడిగా. ఎంచక్కా నాకు ఇంగ్లీష్ లో పేరు పెట్టారు గా  " మౌస్" అని నన్ను ఆ పేరుతొ పిలవండీ అంది. సరేలే రేపటినుంచి అలానే పిలుస్తలే అని వదిలించుకున్న. ఇంతకీ అది గీసిన చిత్రం చూపించలేదు కదూ. క్రింద చూడండి. ఎలా ఉందొ దానికి చెప్పండి. మొదటిసారి కదా, ఎలా ఉన్న పాపం కాస్త అడ్జస్ట్ కండీ:) పోతుంటే , పోతుంటే అదే మంచిగా నేర్చుకుంటుంది లెండి. పాపం చిన్న ప్రాణి కదా కాస్త బాగుందని అంటే సంబర పడిపోతుంది, అల్పసంతోషి లెండి మా ఎలుక...సారీ అదే మా మౌస్.


13 comments:

మనసు పలికే said...

hahhahhaa.. bomma super..:))

ఇందు said...

Bagundi.Computerlo ee matram geeyagaligaru.Nenaitaenaa....ashtavankaralu vachchedi :))

Unknown said...

supero super...!!!

శరత్ కాలమ్ said...

బాగోలేదు కానీ మొదటి చిత్రం అంటున్నారు కాబట్టి ఓకే.


మా పెద్దమ్మాయి కంప్యూటర్లో చక్కటి ఆర్ట్ వేస్తుంది. తను ఏనిమే ఆర్ట్ స్పెషలిస్ట్.

Padmarpita said...

బాగుంది ఎలుక వేసిన బొమ్మ:)

గిరీష్ said...

bomma ok kaani..meeku nijam ga yeluka ade ade mouse friend unda ani kaasta doubt..kaaste lendi..:)

tnswamy said...

నఖ చిత్రాలు, కుడ్య చిత్రాలు , శిల్పాలు, సైకత శిల్పాలు గురించి విన్నాం కాని ఈ ఎలుక చిత్రమ్ ఏంట్రా బాబోయ్!

భాను said...

@ అపర్ణ
థాంకులు
@ ఇందు
ధన్యవాదాలు , కొంత పెషేన్స్ తో చేస్తే తప్పకుండా వస్తుంది ఎలుక మన మాట వినాలిగా:)
@తెలుగు శాల
తాన్క్సో ...థాంక్స్

భాను said...

@ శరత్
పాపం మా ఎలుక మొదలే చెప్పింది ఇది మొదటి ప్రయత్నమని. ధన్యవాదాలు. మీ పాప ఈ రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనసార కోరుకుంటున్న
@పద్మార్పిత
మా ఎలుక మీకు ధన్యవాదాలు చెబుతుంది

భాను said...

@ గిరీష్
బొమ్మ బాగున్నది అన్నందుకు థాంక్స్ ...మౌస్ ఫ్రెండ్ ఉందా ?అన్నారు :) అది నా పెప్మ్పుడు ఎలుక అన్నాను కాని ఫ్రెండ్ అనలేదు కదా :) సరదాగా అలా బొమ్మ ఒక్కటే పెడ్తే ఎం బాగుంద్తుందని అలా రాసా!
@ స్వామి
ఓహ్ నువ్వింకా వినలేదా. ఇప్పుడు ఎలుక చిత్రాలు ఫేమస్ అవుతున్నాయి, నా తోనే ప్రారంబం హ..హ..హ్హా.:) నువ్వు నేర్చుకుంటావా వచ్చేసేయ్ :)

Ennela said...

ammo, meeru artistu koodaanaa! bhale undi bomma...

విరిబోణి said...

మొదటి ప్రయత్నం లో చాల వరకు సక్సెస్ అయ్యారు , బొమ్మ బావుంది , nenu కూడా enthaku మునుపు ట్రై చేసెదాన్ని mouse tho ..కొంచం కష్టం గానే వుంటది ..బట్ Practice makes man perfect అన్నారు కదా ! మీరు అలా వేస్తూ పొండి ,చచ్చినట్టు అదే వస్తది .

Anonymous said...

nice. bagumdi. kiranmai