skip to main |
skip to sidebar
హింస వీడని బౌద్దాభిమాని :
విధుశేకర్ శాస్త్రి గారు బౌద్దధర్మ నిష్ణాతులు. ఒకరోజు గురుదేవులు వారితో మాట్లాడుతూ కూర్చున్నారు. అప్పుడు ఇతరులు కూడా ఉన్నారు. అకస్మాత్తుగా గురుదేవులు, శాస్త్రిగారూ మీరిన్ని రోజులు బౌద్ద శాస్త్రాలను చదివినా హింసా ప్రవృత్తి ని మాత్రం విడనాడలేదు అని అన్నారు.
దాంతో శాస్త్రే గాక అందరూ ఆశ్చర్యపోయారు. శాస్త్రి గారు ఎవరి మనసును కూడా నొప్పించే రకం కాదు. దాంతో మళ్ళీ గురుదేవులే తన తెల్లని గడ్డాన్ని నిమురుకుంటూ " దీన్ని పెంచండి, బాగా పెరగనివ్వండి, దీన్ని హింసించకండి" అని అన్నారు. దాంతో అక్కడున్న వారంతా రోజూ చక్కగా గడ్డం చేసుకునే శాస్త్రి గారి మొహం వైపు చూస్తూ హాయిగా నవ్వుకున్నారట.
పాదుకా పురాణం :
ఓ సాహిత్య గోష్టి కి శరత్ బాబు, రబీంద్ర నాథ్ టాగూర్ హాజరయ్యారు. శరత్ బాబు కి ఇల్లాంటి చోట్ల చెప్పులు పోతాయని భయం. అందువల్ల ఆయన చెప్పుల్ని ఒక సంచిలో చక్కగా చుట్టి , దాన్ని తనతోపాటే పట్టుకుని కూర్చున్నాడు. రవీంద్రుడు సభానంతరం వెనుతిరిగేటప్పుడు, శరత్ బాబు తో " మీ చంకలో ఏదో ప్యాకేట్టున్నట్టునదే" అన్నారు. శరత్ బాబు ఉలికిపాటు తో " అబ్బే ఎం లేదండీ " అని నెమ్మదిగా అన్నారు. ఆయన్ని అంతటి తో వదలక, రవీంద్రుడు మళ్ళీ " ఏదో పుస్తకం అనుకుంటా?" అన్నారు.
శరత్ బాబు అస్సలు విషయమెక్కడ బయట పడుతుందోనని గాభరాగా " అవును పుస్తకమే" అన్నారు. అంతటితో నన్నా ఆ విషయం వదులుతారేమోనని. కానీ రవీంద్రుడు మళ్ళీ శరత్ తో " ఎం పుస్తకమడీ" అన్నారు. పాపం! శరత్‌బాబు ఈ సారి ప్రమాదంలో పడి పోయారు. ఎం చెబుదామా అనే సందిగ్దంలో పడ్డారు. దాంతో రవీంద్రుడు పకపకా నవ్వుతూ " శరత్! పాదుకా పురాణం కదూ అది? అది లేకుండా ఎవరికీ పని జరగదు లేవయ్యా! అని అన్నారు.
మామిడి పళ్ళ కో నమస్కారం:
గురుదేవులకి మామిడి పళ్ళు అంటే అమిత ప్రీతి. చైనా లో వారున్నప్పుడు ఫిలిప్పీన్స్ నుండి వారికో టెలిగ్రాం వచ్చింది. " మీకు ఫిలిప్ఫీన్స్ మామిడి పండ్లు పంపిస్తున్నాం" అని. మామిడి పండ్లు వచ్చాయి. పండ్లలో పీచు అధికంగా ఉంది. వాటిని కోసి తినడం కష్టమయి పోయింది. మామిడి పళ్ళ ముందు కూర్చుని వాటికి నమస్కరించారు గురుదేవులు.
పళ్లకు ఎందుకు నమస్కరించారు అని అడిగాడట ఓ మిత్రుడు. " వాటి పీచు నా గడ్డపు వెంట్రుకలకంటే పొడుగ్గా ఉంది. నిజానికి అవి పండ్లు కావు నా పెద్దన్నల వంటివి" అని అన్నాడట గురుదేవులు
Sunday, January 9, 2011
రవీంద్రుని కబుర్లు

2 comments:
Beautiful collection,thanks
thanks rajendra kumar garu
Post a Comment