"అతడు మసకబారిన అక్షర సూరీడు. జగిత్యాల జైత్ర యాత్ర పాద ధూళిని తన పెన్ను గన్ను తో గర్జించి పాటల తూటాల్ని, సాహితి గాయాన్ని రేపిన అక్షర సైనికుడు.ఊపిరితిత్తులలోని క్షయ ఉక్కిరిబిక్కిరి చేసినా, ఊపిరాడకుండా చేసినా ఉవ్వెత్తున ఎగిసిన ఎర్రెర్ర జెండా. అతడు జన్మించింది, మరణించింది ఒకే తేదీ కావడం యాదృచ్చికం... "మరణం నా చివరి చరణం కాదు" అని ప్రకటించిన అక్షర వీరుడితడు. అతడే ప్రభాకర్. జగిత్యాలలో 1956 జనవరి 12 న పుట్టి, బతికి ఉండగానే మనిషి గుండెల్లో "స్ట్రా" పెట్టి రక్తం పీల్చే క్షయ బారిన పడి 1993 జనవరి 12 న అస్తమించాడు.
జగిత్యాలలోని అంగడి బజార్ ప్రాంతం లో జన్మించిన అలిశెట్టికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. కాగ ప్రభాకర్ ఐదో వాడు. తండ్రి పరిశ్రమల శాఖలో పని చేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో కుటుంబ పోషణ భాద్యతలు స్వీకరించాడు. సిరిసిల్లలో రాం ఫోటో స్టుడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకొని, 1975 లో జగిత్యాలలోని సొంత ఇంట్లో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు. 1978 జగిత్యాల జైత్ర యాత్ర రగిల్చిన నిప్పు సెగ, ప్రభాకర్ అంతరంగం లోని కవినీ, చిత్రకారున్నీ నిద్ర లేపింది. పెత్తందారు వ్యవస్థ మీద పేదోళ్ళు జరుపుతున్న పోరు ప్రభాకర్ లోని అక్షర సూర్యున్ని ప్రజ్వలిమ్పజేసింది. ఆ కవిత జ్వలనం తుది శ్వాస విడిచే వరకూ కొన సాగింది..... తనువు పుండై... తాను పండై...తాను శవమై...వేరొకరి వశమై...తను ఎడారై ... ఎందరికో.. ఒయాసిస్సై.... అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గతుల గురించి రాసిన కవితలు ఇప్పటికీ జనం గుండెల్లో నాటుకున్నాయి. అలిశెట్టి కవిత్వంలో ఆదర్శాలకు అనుగుణంగా పేద రాలయిన 'భాగ్యం' ను పెళ్లి చేసుకొని జీవితం లో సగ భాగం ఇచ్చాడు. భార్య కూడా అలిశెట్టి ఆదర్శాలలో ఇమిడి పోయి తుది శ్వాస వరకు పతి సేవ చేసింది. అందుకే తెగిన తీగల్ని సవరిన్చాడానికన్నట్లు తెల్లవార్లు పరిచర్యలు చేసినా నా భాగ్యమే నాకన్నీళ్ళను తూచే " హృదయ త్రాసు " గా భార్యకు అక్షర సత్కారం చేశాడు.
18 ఏళ్ల వయస్సులోనే బూర్జువాలపై కవితలు రాసిన అలిశెట్టి కి 21 ఏళ్ల వయస్సులో " ఎర్ర పావురాలు" కవిత సంకలనంతో ప్రారంబించి , 1979 లో "మంటల జెండాలు", 1981 లో "చురకలు" వెలువరించాడు. 1982 లో హైదరాబాద్ లో స్థిర పడ్డ ఆయన " రక్త రేఖ" " సంక్షోభ గీతాలు" కవితలు సామాన్యులనూ ఆకట్టుకున్నాయి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో అలిశెట్టి నిర్వహించిన " సిటీలైఫ్" కాలం వేలాది మంది యువ హృదయాల్లో ఆయన్ని హీరో చేసింది."
జనవరి 12 అలిశెట్టి జయంతి, వర్దంతి.......వివేకానందుని జయంతి.......ఇంకా మా బాబు పుట్టిన రోజు....వాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. "A Birthday is a Million Moments, Each holding A promise of Fulfillment of Your Dreams & Accomplishments of Some Special Plans. Wish You A Very Happy Birthday."
8 comments:
Nijanga nenu mimmalni Abhinandistunanu Endukante Atani Attagari Vuri Manissin Ma banduvu Ayana rasina kavitalato nenu spurinayyanu nalo appudu ayana rasina kavilu inka na madilo alane undi poyayi nijanaga valla pillalu ippatiki nannu antaru Ma dadi vakyalu milu gurtu ani Endukanter Akshra Padaniki Neluvettu Nivali Mee Matala RAtala Kadalika Thnku So much-ASHOKBABU ADEPU DUBAI
bhanu garu,
chinni baabuki janma dina subhaakaankshalu...chinni tandri kalalannee neraveraalani abhilashistunnaa
భాను ,
అలిశెట్టి గారి గురించి ఇంకా గుర్తు చేసుకునే మీ లాంటి వాళ్ళు ఉన్నందుకు నిజంగా సంతోషం గా వుంది.
మీ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మీ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.))
@అశోక్ బాబు
థాంక్స్
@ఎన్నెల
ధన్యవాదాలు
@కల్పన
చాలా రోజుల తర్వాత మీ స్పందన :) ధన్యవాదాలు. కొందరు రచయితలూ వారి రచనలు అలా మనసులో భద్రంగా నిలిచి పోయి ఎప్పుడూ మనల్ని పలకరించి పోతుంటాయి.
@ అశోక్ పాపాయి
ధన్యవాదాలు
ప్రభాకర్ లాంటి కవి ని మృత్యువు అంత త్వరగా కబళించడం నాకు మింగుడు పడదు. ఆయన చెల్లెలు విజయ అని వాళ్ళ కుటుంబం మా పెద్దక్క వాళ్ళింటిపక్కనే ఉండే వాళ్ళు నల్లకుంటలో. అప్పట్లో ప్రభాకర్ ఎవరో తెలిసేంత వయసు కాదు.
ప్రభాకర్ కి నివాళి
belated birthday wishes to your son...
అలిశెట్టి, కవితా లోకం లో అస్తమించని సూర్యుడికి నివాళి. ఆయన గురించి మంచి విషయాలను తెలియజేసిన మీకు ధన్యవాదాలు.
Post a Comment