ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వంశీ " మా పసలపూడి కథలు" మొన్నే 17 నుంచి మా టివిలో మొదలయ్యాయి. చూడాలి, చూడాలి అనుకొని, అనుకోకుండా పనుల వత్తిళ్ళ వాళ్ళ , హైదరాబాద్ పోవడం వల్ల రెండు రోజులు మిస్ అయ్యా. ఈ రోజు యు ట్యూబ్ లో మొదటి ఎపిసోడ్ చూశా. వంశీ సంగీతం లో మా పసలపూడి కథలండీ అంటూ సాగే టైటిల్ సాంగ్ అద్భుతంగా వంశీ స్టైల్లో చిత్రీకరించబడింది. కోన సీమ అందాలు, గోదావరి. కాలువగట్లూ. కొబ్బరి చెట్లూ బాపూ బొమ్మలతో పాట వింటూ ఉంటె ఆ కొబ్బరిచెట్ల మధ్య కూర్చొని ఆ గోదారి మీదినుంచి వచ్చే గాలి ని ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది.
మొదటి కథ " నల్లమిల్లి పెదభామిరెడ్డి గారి తీర్పు" మొదటి భాగం బాగుంది. ఎలా ఉంటుందో అనుకున్నా కాని ఆ కొబ్బరి చెట్లు అడుగడుగునా పచ్చదనం వంశీ స్టైల్లో పాత్రలు ,దర్శకుడు శంకు అద్బుతంగా తీశాడు. నటుల నటన కూడా ఈ మధ్య వచ్చే సీరియల్స్ లో కాకుండా చక్కగా పాత్రల్లో ఒదిగి పోయి నటించారు. ముందు ముందు ఎలా ఉంటుందో కాని మొదటి భాగం మాత్రం మనల్ని మిగత భాగాలు మిస్ కాకూడదు అని టివి ముందు కూర్చోనేట్లు చేసింది. మీరూ చూడండి.
7 comments:
భాను గారు, ముందుగా మీకు ధన్యవాదాలు, మొదటి ఎపిసోడ్ బ్లాగులో పెట్టినందుకు:) ఆఫీసులో ఓపెన్ కాదు. ఇంటికి వెళ్లి చూస్తా.. వంశీ పసల పూడి కథలు చదువుతూ ఉంటే భలే ఉంటాయి. వాటికి దృశ్యరూపం ఇస్తే ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నా కానీ, పని వత్తిడి వలన కుదరలేదు నాకు కూడా. మీకు బోలెడన్ని థాంకులు..:))
భాను గారు,
మీరన్నట్టే నేను కూడా ఎదురు చూశాను. కథ చదివితే వచ్చే ఆనందంలో పదో వంతుకూడా నాకు కలగలేదు. మరీ డ్రామాలాగా సాగతీతలు.. ప్రతి వాక్యాన్నీ దృశ్యంగా చూపించాలనే ప్రయత్నంలో అభాసుపాలైందనిపించింది..!!
What Mr.Satya Prasad said is correct to the core. I have been waiting for this for a long time for this.But not upto the mark.Its like a doordarsan serial.Somehow I am very much disappointed.I really enjoyed a lot while reading the stories.
Sreerama,Chennai
Satyaprasad garu,
I'm with you sir!
బాగా సా...గుతూ ఉన్నాయ్ ఎపిసోడ్స్. ఒక్కో కథ ఒక వారం తీస్తాడు లాగుంది.
సత్యప్రసాద్ మరియు శ్రీ గార్లు చెప్పిందే నామాటానండీ..
పచ్చదనం,గోదారిగట్లు,గోదారి యాసలో డైలాగులు,అక్కడి జీవనశైలి..అంతా బానే ఉన్నా...మరీ కథని లాగీ పీకీ...సాగదీసి...దీసి...నావల్ల కాదండీ..నాకు సీరియల్స్ అందుకే నచ్చవు! నేను వంశీ తీస్తడేమో అనుకున్నా! శంకు పర్లేదు...కాని టైటిల్ సాంగ్ పాడింది ఎవరో కని అద్భుతం.అది మాత్రం ఒప్పుకుని తీరాలి.కథనంలో వేగం పెంచి...కొంచెం డ్రామా తగ్గిస్తే ఏమన్నా చూడబుల్ గా ఉంటుందేమో!
Post a Comment