నా మది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై.........ఎంత శ్రావ్యమైన, తీయటి గొంతు. బహుశా ఆ భగవంతుడు ఆయన్ని పుట్టిచ్చినప్పుడు గొంతులో అమృతం పోసాడేమో. మహ్మద్ రఫ్ఫీ సాహెబ్, హిందీ సిని జగత్తు ను దాదాపు ముప్పయి సంవంత్చరాలపాటు ఏలిన మహా గాయకుడూ. రేపటికి రఫ్ఫీ సాబ్ మనకు దూరమై ముప్పై సంవంత్చరాలు కావస్తుంది.
ఆ గళం లో మాటలకూ అందని మాధుర్యం ఉంది. ఆ గొంతు నుంచి జాలువారిన ప్రతి పాట యావత్ భారత దేశాన్ని సమ్మోహితం చేసింది. ఒక్కొక్క పాట వింటుంటే ఏదో లోకాలకు....
చౌన్ద్వి క చాంద్ హో,
చలో దిల్ దార్ చలో చాంద్ కేపార్ చలో,
తేరే ఘర్ కే సామనే ఏక ఘర్ బనావుంగా ,
ఓ లేకే పహ్ల పహ్ల ప్యార్,
జో వాద కియా ఓ నిభానా పడేగా,
సౌ సాల్ పెహ్లే ముజ్హే తుం సే ప్యార్ర్ త,.....
అంఖో హి అంఖో మే ఇషారా హోగయా....
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నెన్ని ఆణి ముత్యాలు. ఒక ఇరవై సంవంత్చరాలపాటు రఫ్ఫీ సాబ్ పాట లేని సినిమా లేదేమో. ఆ తర్వాత కిశోర్ కుమార్ వచ్చి కొంత తగ్గినా మళ్ళి " చురలియా తుం నే జో దిల్ " అంటూ ఆశా జి తో కలిసి క్యా హువా తెర వాద అంటూ మళ్ళి ఒక పది సంవంత్చరాలపాటు మనని అలరింప జేసినా మహా గాయకుడూ. అతని గురించి ఎంత చెప్పిన, ఎంత రాసినా తక్కువేనేమో. ఎలాంటి పాటనైన తన శైలి లో భావాన్ని రంగరించి జనరంజకంగా పాడిన గాయకుడు. ఆయన పాటలకోసం సినిమాలకు వెళ్ళే వాళ్ళట. మన తెలుగు లో కూడా ఆయన శ్రావ్యమైన గొంతు తో ఎన్నెన్ని పాటలు.
ఆయన మనకు దూరమై మూడు దశాబ్దాలైన ఆయన పాట వినని క్షణం ఉండదు. ఆ పాట లోని మాధుర్యాన్ని ఆస్వాదించని మనిషి ఉండడు.ఎన్నో మరుపురాని చిత్రాలు, ఎన్నో మరుపురాని గీతాలు. ఆయన బౌతికంగా మన మధ్యలో లేకున్నా , ప్రతీ క్షణం ఎంతో మంది గొంతుల్లో ఆయన పాట ధ్వనిస్తూ, ..ప్రతిధ్వనిస్తూ......
" తేరి దునియా సే దూర్ చలే హోకే మజ్బూర్ ,హమే యాద్ రఖ్నా, జావో కహి బి సనం తుమే ఇత్నీ కసం హమే యాద్ రఖ్నా
అంటూ మననించి దూరంగా వెళ్ళిన ఆ మహాగాయకుడికి, అమృతమయమైన ఆ గళానికి, ...
మనమంతా మరొక్కసారి నివాళులు అర్పిద్దాం . ">
skip to main |
skip to sidebar
బాబూ, విను: చెయ్యి బుగ్గకింద పెట్టుకొని, రింగులు తిరిగిన బంగారు ముంగురులు చెమ్మగిల్లిన నుదుటిని అతుక్కునుండగా, నువ్వు నిద్ర పోతుంటే, నేనంటున్నాను ఇది, నీకో విషయం ఇప్పుడే చెప్పాలని , నేను నెమ్మదిగా ఒంటరిగా నీ గదిలోకి వచ్చాను. కొద్ది నిమిషాలక్రితం , లైబ్రరీలో కూర్చొని పత్రిక చదువుకొంతుండగా, పెద్ద తప్పు చేసిన భావన నన్ను ఉప్పెనలా ముచెత్తింది అపరాధం చేసిన ఆ భావనతోనే నేను నీ మంచం దగ్గరకొచ్చాను.
బాబూ, నేను కొన్ని విషయాలు మనసులో అనుకున్నవి నీకు చెప్పాలి. నేను నిన్ను కోప్పడ్డాను . స్కూల్ కి వెళ్ళడానికి బట్టలు వేసుకుంటూ నువ్వు తువ్వాలుతో ముఖాన్ని పైపైన తుడుచుకున్నవని కోపగించాను. నీ జోళ్ళు శుబ్రం చేసుకోలేదని, నానా మాటలూ అన్నాను. నీ వస్తువులు కొన్ని నేలమీద పదేసావని కోపంగా అరిచాను.
టిఫిన్ తినేటప్పుడు కూడా నిన్ను తప్పు పట్టాను. నీళ్ళు ఒలక పోసావని సరిగ్గా నమలకుండా మింగావని, మోచేతులు బల్లమీద అనిన్చావని రొట్టె మీద వెన్న మరీ దట్టంగా పట్టించావని, ఇలా అన్నిటికి తప్పులు ఎంచాను. అంతా అయ్యాక నువ్వు ఆడుకోవడానికి, నేను రైలు అందుకోవడానికి ఇంట్లోనుంచి బయట పడ్డాము. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి, చెయ్యి ఉపుతూ, " గుడ్ బై, నాన్న!" అని అన్నావు. అప్పుడు కూడా నేను ముఖం చిట్లించి. " నీ బుజాల్ని నిటారుగా ఉంచుకో!" అని అన్నాను.
Friday, July 30, 2010
Thursday, July 29, 2010
నా కళ్ళల్లో కన్నీళ్ళు
నాలుగు నెలల క్రితం.....
మా అబ్బాయి హైదరాబాద్ వెళ్తూ ప్రయాణం చేస్తూ ఎస్ .ఎం ఎస్.లో పంపిన సందేశం " ఐ మిస్ యు డాడీ" , సంతోశమనిపించింది. పదిహేనేళ్ళ వాడి కన్స్రన్. ముచ్చటేసింది. ఆ తర్వాత ఆఫీసు కి వెళ్తూ ఉండగా యథాలాపంగా మళ్ళి గుర్తొచ్చింది. ఇంకో రెండు నెలల తర్వాత వాడు పై చదువులకు హాస్టల్ కి పోతాడన్న ఆలోచన , వుయ్ విల్ మిస్ హిం ఫర్ సో మేని డేస్. ఎప్పుడు లేనిది ఒక్క సారిగా నాకు ఈ ప్రపంచానికి మధ్య ఒక సన్నటి కన్నీటి తెర. మనసు దిగాలు పడింది. నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నాను. ఎవరో అన్నారు, మరుపు మనకి దేవుడిచ్చిన వరం. కాలం అన్నిటిని తనలో కలుపుకుంటుంది.
రెండు నెలల క్రితం......
వాడిని పంపే సమయం దగ్గర పడ్తున్న కొద్ది మా ఆవిడ ముఖం లో దిగులు, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు దుఖం. నేనూ ధైర్యంగానే ఉన్నాను. ఇది మొదటినించి అనుకుంటుందే కదా సహజమే కదా వుయ్ షుడ్ బి ప్రిపెరేడ్ అంటూ ఆవిడకి ధైర్యం చెబుతూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ.......
పంపే సమయం సమయం దగ్గర పడింది. ఒక్కసారి వాడిని దగ్గరకు తీసుకొని మంచిగా ఉండు అని చెబుతూ ఉంటె నా కళ్ళల్లో కన్నీటి తెర. ఎక్కువసేపు అలా ఉంటె నేనెక్కడ బయట పడతానోనని వాడిని వదిలేసి దూరంగా వెళ్ళా ...ఆ తర్వాత మా ఆవిడ చెప్పింది మీరు దగ్గరకు తీసుకోగానే వాడి కళ్ళల్లో నీళ్ళు అని.
వాడిని రూం లోకి పంపేముందుమల్లి అదే కన్నీటి తెర. ఎక్కువ సేపు ఉంటె నేనెక్కడ ఏడుస్తానోనానని... ఎవరు ఏమనుకుంటారోనని బిడియం.... మన ఫీలింగ్స్ ని వ్క్యక్తపరిచే ధైర్యం లేక ...నన్ను నేనూ సంబాలిన్చుకుంటూ నా కళ్ళల్లో నుంచి ఉబికి వస్తున్న కన్నీరు అపుకొటానికి ప్రయత్నిస్తూ అందరికి దూరంగా............
ఇంటికి వచ్చాక..... తెల్లవారి లేచి కూర్చుంటే వాడు మదిలో మెదిలాడు. ఉదయమే "గుడ్ మార్నింగ్ డాడి" అనే పలకరింపు...మిస్సింగ్. ( ఇది రాస్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు) ఒక్కసారిగా హృదయం బద్దలయింది. ఇన్ని రోజులు ఆగిన, ఆపుకున్న దుఖం కన్నీరై , వరదలై అలా సెకండ్లు....నిముషాలు....గంటలు....ప్రతిక్షణం గుర్తుకు వస్తు. రియల్లి వుయ్ మిస్సింగ్.హిం
ఆ క్షణం ...నన్ను నేనూ మరిచిపోయ....ఎవరైనా చుస్తారన్న భయం లేదు. ఎవరు ఏమనుకున్తరోనన్న బిడియం సంకోచం ఏది లేకుండా ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకి పోయేవరకు , హృదయం తేలిక పడే వరకు .....
అరునసాగర్ మేల్కొలుపులో అంటాడు "అయిన సరే ఒక్క సారైనా ఏడవాలని ఉంది, మనకది లగ్జరీ, వెక్కి వెక్కి పొంగి పొంగి ధారలుగా ధారలుగా నన్నోకసారి కడుక్కోవలనుంది. కాల్చి ఎండ బెట్టిన సైలెన్సర్ వలె ఖాళీ అయిపోవలనుంది" నిజం ఎందుకు ...మనము ఎందుకిలా, అన్నిటిని మనసులో దాచు కుంటూ లేని గాంభీర్యం నటిస్తూ మన ఫీలింగ్స్ ని హ్ర్యుదయన్తరాలల్లో కప్పేస్తూ, చిన్నపటినుంచి మనకు మగాడు ఏడవకూడదు అని అలవాటుచేసి.....ఎన్నాళ్ళిలా హృదయం లో దాచ్కుంటారు . అవన్న్నీ కలిసి హృదయం తట్టుకోలేక ఒక్కసారి లావాలా ఉప్పొంగితే............
కాలం....గ్రేట్ , అన్నిటిని మరిపిస్తుంది, రెండు రోజుల్లో మళ్లీ మామూలై పోతం ...కాని మనసులో ఆలోచనా స్రవంతి , జ్ఞ్యాపకాల సమూహాలు, ఎవరన్నారు కాలం మరిపిస్తుంది అని, అబద్దం ....ఎందుకంటారా, ఇది రాస్తుంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు. .

Wednesday, July 28, 2010
జీవితం
జీవితం, ఎవరో అన్నారు "అత్యంత వేగంతో పరుగిడే కాలం తో బాటు పరుగెడుతూ కాలం వేగానికి తట్టుకోలేక బెదిరే జింక జీవితం" నిజమే కదండీ. కాలం ఎవ్వరికోసం ఆగదు. నిరంతరం పరుగెడుతూ ఉంటుంది. ఎన్నో ఆటుపోట్లు కష్టాలు . మన ఘంటసాల గారి గొంతులో నుంచి జీవితమంటే " పడిలేచే కడలితరంగం, వడిలో జడిసిన సారంగం, సుడిగాలిలో.... సుడిగాలిలో ఎగిరే పతంగం , జీవితమే ఒక నాటక రంగం " అవును సముద్రపు ఆటుపోట్ల లాగా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు. సుడిగాలిలో పతంగం లాగా , ఏ గాలి తాకిడికి ఎటు పోతుందో తెలియని ఈ జీవితం పై ఎందుకింత మమకారం . అర్థం కాదు అదేనేమో దీని గొప్పదనం . కాలం వెంట అదే వేగంతో పరిగెడుతూ ఏ సమయంలో ఏ పనిచేయాలో చేస్తే తప్ప ఏ పనిలోనూ విజయం సాదిన్చలేము. జీవితమంటే ఇదేనా కాదు...అదే ఘంటసాల గారు పాడుతూ " పడమట సంధ్య రాగం, కుడిఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహనరాగం, జీవితమే మధురానురాగం" ఆహా! ఇది కాదా జీవితం పచ్చిమాన భానుడు అస్తమించే సంధ్యా సమయంలో ఎక్కడ చుసిన ఆకాశమంతా చెలి చెక్కిళ్ళ పై ఎరుపురంగును తలపింపచేసేలా కుడి ఎడమలుగా పూల పుప్పొడుల చల్లినట్లుగా , ఒడిలో మోహనరాగం ఆలపించే చెలి సమక్షంలో అలాంటి జీవితమే మధురానురాగం. .
సుహాన సఫర్ ఔర్ ఏ మౌసం హంసీ ....మేరి దునియా మేరె సప్నే మిలేంగే శాయద్ యహీ ...............
ఆహ్లాదకరమైన ప్రయాణం...ఆనందదాయక వాతావరణం ...... నా ప్రపంచం ....నా స్వప్నాలు....అన్ని ఇక్కడే లబిస్తాయి కాబోలు .
సుహాన సఫర్ ఔర్ ఏ మౌసం హంసీ ....మేరి దునియా మేరె సప్నే మిలేంగే శాయద్ యహీ ...............
ఆహ్లాదకరమైన ప్రయాణం...ఆనందదాయక వాతావరణం ...... నా ప్రపంచం ....నా స్వప్నాలు....అన్ని ఇక్కడే లబిస్తాయి కాబోలు .
చౌన్ద్వి క చాంద్ హో
గురుదత్ ఈ పాట వింటుంటే ఎంత ఆనందం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం వదిలేసి ఎక్కడికో దూరంగా.............ఒక గొప్ప మ్యూజిక్ , గొప్ప లిరిక్, గొప్ప వాయిస్, రఫీ గారి గొంతు లో పలికిన ఆ రొమాంటిక్ పోయట్రీ రియల్లి రియల్లి గ్రేట్ . ఇకపోతే ఈ పాట ఇంత అందంగా ఉంటె , వహిదాజి గారు...... అలా చూస్తూ .....ఉండాలినిపిస్తుంది కదండీ. ఆమెకు తగిన పోయెట్రి గురుదత్ గారి ఎక్ష్ప్రెశన్స ఓహ్ వహిదాజి మోములోని ఆ అమాయకత్వం ....... KHAWBON KI SHAHZADI WAHEDA
">
జో భీ తుం లా జవాబ్ హో.... మీరు ఆనందిచండి
">
జో భీ తుం లా జవాబ్ హో.... మీరు ఆనందిచండి
Monday, July 26, 2010
నాన్న మరిచిపోతాడు
ఒక అమెరికన్ రచయిత లివింగ్ స్తాన్ లార్నేడ్ రాసిన నాన్న మరిచిపోతాడు అనే వ్యాసం నాకు నచ్చి మీ కోసం "
బాబూ, విను: చెయ్యి బుగ్గకింద పెట్టుకొని, రింగులు తిరిగిన బంగారు ముంగురులు చెమ్మగిల్లిన నుదుటిని అతుక్కునుండగా, నువ్వు నిద్ర పోతుంటే, నేనంటున్నాను ఇది, నీకో విషయం ఇప్పుడే చెప్పాలని , నేను నెమ్మదిగా ఒంటరిగా నీ గదిలోకి వచ్చాను. కొద్ది నిమిషాలక్రితం , లైబ్రరీలో కూర్చొని పత్రిక చదువుకొంతుండగా, పెద్ద తప్పు చేసిన భావన నన్ను ఉప్పెనలా ముచెత్తింది అపరాధం చేసిన ఆ భావనతోనే నేను నీ మంచం దగ్గరకొచ్చాను.
బాబూ, నేను కొన్ని విషయాలు మనసులో అనుకున్నవి నీకు చెప్పాలి. నేను నిన్ను కోప్పడ్డాను . స్కూల్ కి వెళ్ళడానికి బట్టలు వేసుకుంటూ నువ్వు తువ్వాలుతో ముఖాన్ని పైపైన తుడుచుకున్నవని కోపగించాను. నీ జోళ్ళు శుబ్రం చేసుకోలేదని, నానా మాటలూ అన్నాను. నీ వస్తువులు కొన్ని నేలమీద పదేసావని కోపంగా అరిచాను.
టిఫిన్ తినేటప్పుడు కూడా నిన్ను తప్పు పట్టాను. నీళ్ళు ఒలక పోసావని సరిగ్గా నమలకుండా మింగావని, మోచేతులు బల్లమీద అనిన్చావని రొట్టె మీద వెన్న మరీ దట్టంగా పట్టించావని, ఇలా అన్నిటికి తప్పులు ఎంచాను. అంతా అయ్యాక నువ్వు ఆడుకోవడానికి, నేను రైలు అందుకోవడానికి ఇంట్లోనుంచి బయట పడ్డాము. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి, చెయ్యి ఉపుతూ, " గుడ్ బై, నాన్న!" అని అన్నావు. అప్పుడు కూడా నేను ముఖం చిట్లించి. " నీ బుజాల్ని నిటారుగా ఉంచుకో!" అని అన్నాను.
ఆ తర్వాత సాయంత్రం ఇంటికొచ్చాక మళ్ళీ మొదలు! నేను ఇంట్లోకి వస్తు నువ్వేమి చేస్తున్నవోనని రహస్యంగా గమనించాను. నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని గోలీలు ఆడుకొంతున్నావు. నీ మేజోళ్ళు చిరిగి పోయి ఉన్నాయి. నిన్ను ఇంట్లోకి పొమ్మని చెప్పి నీ స్నేహితుల ముందు నిన్ను అవమానించినాను. మేజోళ్ళు చాల ఖరీదు అయినవని నువ్వే వాటిని కొనవలసి వస్తే జాగ్రత్త పదేవనివని అన్నాను. ఒక నాన్న అనవలసిన మాటలేనా అవి!
నీకు జ్ఞ్యాపకం ఉందా ? ఆ తర్వాత నేను లైబ్రరీలో కూర్చొని చదువుకొంటుంటే, నువ్వు భయభయంగా నా దగ్గర కోచ్చావు. నీ కళ్ళల్లో బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది. నా చదువుకి అడ్డు వచ్చావని విసుగ్గా నేను తలపైకెత్తి నీకేసి చూసాను. నువ్వు తలుపు దగ్గరే ఆగిపోయవు. " ఏమి కావాలి నీకు?" కర్కశంగా అడిగాను.
నువ్వేం జవాబు చెప్పలేదు, కానీ ఒక్క అంగలో నన్ను చేరుకొని,నా మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకున్నావు. నీ బుజ్జి చేతులు నా మెడని గట్టిగా వాటేసుకున్నాయి. నీ చిన్ని గుండెలో ఆ దైవం నింపిన ప్రేమ నేనెంతగా నిన్ను కోప్పడిన వాడిపోనేలేదు.మరుక్షణం నీ అడుగుల చప్పుడు మెట్ల మీద వినిపించింది నువ్వు వెళ్ళిపోయావు.
బాబు... కొద్ది సేపట్లోనే నా చేతిలోని పేపరు జారి కిందపడింది.ఉన్నట్టుండి విపరీతమైన భయం నన్ను చుట్టుకుంది.అలవాటనేది నన్ను ఎలా మార్చేసింది? తప్పు పట్టడం అనే అలవాటు, తిట్టడం అనే అలవాటు!నాకొడుకువైనందుకు నీకు నేను ఇచ్చిన బహుమతి ఇది. నాకు నీ మీద ప్రేమ లేక కాదు, ఒక పసివాడి దగ్గరి నుంచి నేను అతిగా ఆశించాను. నా వయసుని కొలమానంగా తీసుకొని నువ్వు ఎలా ఉండాలో అంచనా వేయసాగాను.
నీలో ఎంత మంచి తనం, నిజాయితి,ప్రేమ ఉన్నాయి.నీ చిన్ని గుండెలో ఉన్న ప్రేమ కొండల వెనక నుంచి తొంగి చూసే ఉదయమంత విశాలమైనది.నువ్వు ఎంతో సహజంగా పరుగెత్తుకొని నా దగ్గరకు వచ్చి, నన్ను ముద్దు పెట్టుకొని "గుడ్ నైట్" చెప్పటంలోనే, నీ ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది.బాబూ, ఈ రాత్రికి ఇంతకన్నా నాకేమి అక్కర్లేదు. నేను ఈ చీకట్లో నీ మంచం దగ్గరికి వచ్చి సిగ్గుతో తల దించుకున్నాను!
ఇది చాలా చిన్న ప్రాయశ్చిత్తం. నువ్వు మేలుకొని ఉండగా నేను ఇవన్ని నీతో చెపితే నువ్వు అర్ధం చేసుకోలేవు.కాని రేపు నేను నీకు నిజమైన నాన్న గా కనిపిస్తాను! నీతో స్నేహితుడిగా ప్రవర్తిస్తాను.నువ్వు బాధపడితే నేనూ బాధపడతాను.నువ్వు నవ్వితే నెనూ నవ్వుతాను.నా ఓర్పు నశించి నిన్ను ఏదైనా అనాలనిపిస్తే నాలిక కరుచుకుంటాను. ఏదో మంత్రం వల్లించినట్టు "వీడు చాలా చిన్న పిల్లవాడు!" అని నాలో నేనూ అనుకుంటూ ఉంటాను.
నేనూ నిన్ను ఒక పసివానిగా కాక ఒక పెద్దవాడిలా చూసాను. కాని బాబూ,నిన్నిప్పుడలా మంచం మీద ముడుచుకొని పడుకొని ఉండగా చూస్తుంటే,అలసిపోయిన నువ్వు పసిపిల్లవదిలాగే కనిపిస్తున్నావు.నిన్న నువ్వు మీ అమ్మ ఒడిలో నీ తలని ఆమె బుజానికి ఆనించి పడుకొని ఉన్నావు. నేనూ నీ నుంచి మరి ఎక్కువగా ఆశించాను, చాలా ఎక్కువగా!
"మనుషులని నిందించటం మాని వాళ్ళని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం."