Wednesday, July 28, 2010

జీవితం

జీవితం, ఎవరో అన్నారు "అత్యంత వేగంతో పరుగిడే కాలం తో బాటు పరుగెడుతూ కాలం వేగానికి తట్టుకోలేక బెదిరే జింక జీవితం"  నిజమే కదండీ.  కాలం  ఎవ్వరికోసం ఆగదు. నిరంతరం పరుగెడుతూ ఉంటుంది. ఎన్నో ఆటుపోట్లు కష్టాలు .  మన ఘంటసాల  గారి గొంతులో నుంచి  జీవితమంటే   " పడిలేచే కడలితరంగం,  వడిలో జడిసిన సారంగం, సుడిగాలిలో.... సుడిగాలిలో ఎగిరే పతంగం , జీవితమే ఒక నాటక రంగం "  అవును సముద్రపు ఆటుపోట్ల లాగా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు.  సుడిగాలిలో పతంగం లాగా ,  ఏ గాలి తాకిడికి ఎటు పోతుందో తెలియని ఈ జీవితం పై ఎందుకింత మమకారం . అర్థం కాదు అదేనేమో దీని గొప్పదనం .  కాలం వెంట అదే వేగంతో పరిగెడుతూ  ఏ సమయంలో ఏ పనిచేయాలో చేస్తే తప్ప  ఏ పనిలోనూ విజయం సాదిన్చలేము. జీవితమంటే ఇదేనా కాదు...అదే ఘంటసాల గారు పాడుతూ " పడమట సంధ్య రాగం, కుడిఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహనరాగం, జీవితమే మధురానురాగం" ఆహా! ఇది కాదా జీవితం   పచ్చిమాన భానుడు అస్తమించే సంధ్యా సమయంలో ఎక్కడ చుసిన ఆకాశమంతా  చెలి చెక్కిళ్ళ పై ఎరుపురంగును తలపింపచేసేలా   కుడి ఎడమలుగా  పూల పుప్పొడుల చల్లినట్లుగా ,  ఒడిలో మోహనరాగం ఆలపించే చెలి సమక్షంలో అలాంటి  జీవితమే మధురానురాగం. .

సుహాన సఫర్ ఔర్ ఏ మౌసం హంసీ ....మేరి దునియా మేరె సప్నే మిలేంగే శాయద్ యహీ ...............
 ఆహ్లాదకరమైన ప్రయాణం...ఆనందదాయక  వాతావరణం ......  నా ప్రపంచం ....నా స్వప్నాలు....అన్ని ఇక్కడే లబిస్తాయి కాబోలు .

0 comments: