Monday, July 26, 2010

నాన్న మరిచిపోతాడు







ఒక అమెరికన్ రచయిత లివింగ్ స్తాన్ లార్నేడ్ రాసిన    నాన్న మరిచిపోతాడు అనే వ్యాసం  నాకు నచ్చి మీ కోసం 


బాబూ, విను: చెయ్యి బుగ్గకింద పెట్టుకొని, రింగులు తిరిగిన బంగారు ముంగురులు చెమ్మగిల్లిన నుదుటిని అతుక్కునుండగా, నువ్వు నిద్ర పోతుంటే, నేనంటున్నాను ఇది, నీకో విషయం ఇప్పుడే చెప్పాలని , నేను నెమ్మదిగా ఒంటరిగా నీ గదిలోకి వచ్చాను. కొద్ది నిమిషాలక్రితం ,  లైబ్రరీలో కూర్చొని పత్రిక చదువుకొంతుండగా, పెద్ద తప్పు చేసిన భావన నన్ను ఉప్పెనలా ముచెత్తింది అపరాధం చేసిన ఆ భావనతోనే నేను నీ మంచం దగ్గరకొచ్చాను.



బాబూ, నేను కొన్ని విషయాలు మనసులో అనుకున్నవి నీకు చెప్పాలి. నేను నిన్ను కోప్పడ్డాను . స్కూల్ కి వెళ్ళడానికి బట్టలు వేసుకుంటూ నువ్వు తువ్వాలుతో ముఖాన్ని పైపైన తుడుచుకున్నవని కోపగించాను. నీ జోళ్ళు శుబ్రం చేసుకోలేదని, నానా మాటలూ అన్నాను. నీ వస్తువులు కొన్ని నేలమీద పదేసావని కోపంగా అరిచాను.



టిఫిన్ తినేటప్పుడు కూడా నిన్ను తప్పు పట్టాను.    నీళ్ళు ఒలక పోసావని సరిగ్గా నమలకుండా మింగావని, మోచేతులు బల్లమీద అనిన్చావని రొట్టె మీద వెన్న మరీ దట్టంగా పట్టించావని,  ఇలా అన్నిటికి తప్పులు ఎంచాను. అంతా అయ్యాక నువ్వు ఆడుకోవడానికి, నేను రైలు అందుకోవడానికి ఇంట్లోనుంచి బయట పడ్డాము. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి, చెయ్యి ఉపుతూ, " గుడ్ బై, నాన్న!" అని అన్నావు. అప్పుడు కూడా నేను ముఖం చిట్లించి. " నీ బుజాల్ని నిటారుగా ఉంచుకో!" అని అన్నాను.

ఆ తర్వాత సాయంత్రం ఇంటికొచ్చాక మళ్ళీ మొదలు!  నేను ఇంట్లోకి వస్తు నువ్వేమి చేస్తున్నవోనని రహస్యంగా గమనించాను. నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని గోలీలు ఆడుకొంతున్నావు. నీ మేజోళ్ళు చిరిగి పోయి ఉన్నాయి. నిన్ను ఇంట్లోకి పొమ్మని చెప్పి నీ స్నేహితుల ముందు నిన్ను అవమానించినాను. మేజోళ్ళు చాల ఖరీదు అయినవని నువ్వే వాటిని కొనవలసి వస్తే జాగ్రత్త పదేవనివని అన్నాను. ఒక నాన్న అనవలసిన మాటలేనా అవి!

నీకు జ్ఞ్యాపకం ఉందా ? ఆ తర్వాత నేను లైబ్రరీలో కూర్చొని చదువుకొంటుంటే, నువ్వు భయభయంగా నా దగ్గర కోచ్చావు.  నీ కళ్ళల్లో బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది.  నా చదువుకి అడ్డు వచ్చావని విసుగ్గా నేను తలపైకెత్తి నీకేసి చూసాను. నువ్వు తలుపు దగ్గరే ఆగిపోయవు. " ఏమి కావాలి నీకు?" కర్కశంగా అడిగాను.

నువ్వేం జవాబు చెప్పలేదు, కానీ ఒక్క అంగలో నన్ను చేరుకొని,నా మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు  పెట్టుకున్నావు. నీ బుజ్జి చేతులు నా మెడని గట్టిగా వాటేసుకున్నాయి. నీ చిన్ని గుండెలో ఆ దైవం నింపిన ప్రేమ నేనెంతగా నిన్ను కోప్పడిన వాడిపోనేలేదు.మరుక్షణం నీ అడుగుల చప్పుడు మెట్ల మీద వినిపించింది నువ్వు వెళ్ళిపోయావు.

బాబు... కొద్ది సేపట్లోనే నా చేతిలోని పేపరు జారి కిందపడింది.ఉన్నట్టుండి విపరీతమైన భయం నన్ను చుట్టుకుంది.అలవాటనేది నన్ను ఎలా మార్చేసింది? తప్పు పట్టడం అనే అలవాటు, తిట్టడం అనే అలవాటు!నాకొడుకువైనందుకు నీకు నేను ఇచ్చిన బహుమతి ఇది. నాకు నీ మీద ప్రేమ లేక కాదు, ఒక పసివాడి దగ్గరి నుంచి నేను అతిగా ఆశించాను. నా వయసుని కొలమానంగా తీసుకొని నువ్వు ఎలా ఉండాలో అంచనా వేయసాగాను. 

నీలో ఎంత మంచి తనం, నిజాయితి,ప్రేమ ఉన్నాయి.నీ చిన్ని గుండెలో ఉన్న ప్రేమ కొండల వెనక నుంచి తొంగి చూసే ఉదయమంత విశాలమైనది.నువ్వు ఎంతో సహజంగా పరుగెత్తుకొని నా దగ్గరకు వచ్చి, నన్ను ముద్దు పెట్టుకొని "గుడ్ నైట్" చెప్పటంలోనే, నీ ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది.బాబూ, ఈ రాత్రికి ఇంతకన్నా నాకేమి అక్కర్లేదు. నేను ఈ చీకట్లో నీ మంచం దగ్గరికి వచ్చి సిగ్గుతో తల దించుకున్నాను!

ఇది చాలా చిన్న ప్రాయశ్చిత్తం. నువ్వు మేలుకొని ఉండగా నేను ఇవన్ని నీతో చెపితే నువ్వు అర్ధం చేసుకోలేవు.కాని రేపు నేను నీకు నిజమైన నాన్న గా కనిపిస్తాను! నీతో స్నేహితుడిగా ప్రవర్తిస్తాను.నువ్వు బాధపడితే నేనూ బాధపడతాను.నువ్వు నవ్వితే నెనూ నవ్వుతాను.నా ఓర్పు నశించి నిన్ను ఏదైనా అనాలనిపిస్తే నాలిక కరుచుకుంటాను. ఏదో మంత్రం వల్లించినట్టు "వీడు చాలా చిన్న పిల్లవాడు!" అని నాలో నేనూ అనుకుంటూ ఉంటాను.

నేనూ నిన్ను ఒక పసివానిగా కాక ఒక పెద్దవాడిలా చూసాను. కాని బాబూ,నిన్నిప్పుడలా మంచం మీద ముడుచుకొని పడుకొని ఉండగా చూస్తుంటే,అలసిపోయిన నువ్వు పసిపిల్లవదిలాగే కనిపిస్తున్నావు.నిన్న నువ్వు మీ అమ్మ ఒడిలో నీ తలని ఆమె బుజానికి ఆనించి పడుకొని ఉన్నావు. నేనూ నీ నుంచి మరి ఎక్కువగా ఆశించాను, చాలా ఎక్కువగా!
       
              "మనుషులని నిందించటం మాని వాళ్ళని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం."
                        
                        

4 comments:

శరత్ కాలమ్ said...

ఈ గొప్ప ఉత్తరం నేను ఎక్కడో చదివాను. డేల్ కార్నెగీ పుస్తకాల్లోనా? మంచి విషయం అందించారు. ఇది చదివి ఆర్ద్రత చెందని మనసులు వుంటే మనుష్యులే అవరు.

Anonymous said...

I should have read it 20 years ago.
if i had read it then, There wouldn't have been that much distance between me and my son..
it is too late now..
Anyhow thanks

భాను said...

thanx

Kalpana Rentala said...

శరత్ గారు అన్నట్లు మనసు ని ఆర్ధం గా వుంచేవే రాస్తున్నారు. ఈ ఒక్క లేఖ లో ఎందరు తండ్రులు, ఎందరు కొడుకులు వున్నారో కదా...