Friday, July 30, 2010

నా మది నిన్ను పిలిచింది గానమై

నా మది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై.........ఎంత శ్రావ్యమైన, తీయటి గొంతు. బహుశా ఆ భగవంతుడు ఆయన్ని పుట్టిచ్చినప్పుడు గొంతులో అమృతం పోసాడేమో.  మహ్మద్ రఫ్ఫీ సాహెబ్,  హిందీ సిని జగత్తు ను దాదాపు ముప్పయి సంవంత్చరాలపాటు  ఏలిన మహా గాయకుడూ. రేపటికి రఫ్ఫీ సాబ్ మనకు దూరమై  ముప్పై   సంవంత్చరాలు కావస్తుంది.

ఆ గళం లో మాటలకూ అందని మాధుర్యం ఉంది.  ఆ గొంతు నుంచి జాలువారిన ప్రతి పాట యావత్ భారత దేశాన్ని సమ్మోహితం చేసింది.  ఒక్కొక్క పాట వింటుంటే ఏదో లోకాలకు....


చౌన్ద్వి క చాంద్ హో,
 చలో దిల్ దార్ చలో చాంద్ కేపార్ చలో,
తేరే ఘర్ కే సామనే ఏక ఘర్ బనావుంగా ,
 ఓ లేకే పహ్ల పహ్ల ప్యార్, 
 జో వాద  కియా ఓ నిభానా పడేగా, 
సౌ సాల్ పెహ్లే ముజ్హే తుం సే ప్యార్ర్ త,.....
అంఖో హి  అంఖో మే ఇషారా హోగయా....

ఇలా చెప్పుకుంటూ పొతే  ఎన్నెన్ని ఆణి ముత్యాలు. ఒక ఇరవై సంవంత్చరాలపాటు రఫ్ఫీ సాబ్ పాట లేని సినిమా లేదేమో. ఆ తర్వాత కిశోర్ కుమార్ వచ్చి కొంత తగ్గినా మళ్ళి " చురలియా తుం నే జో దిల్ " అంటూ ఆశా జి తో కలిసి క్యా హువా తెర వాద అంటూ  మళ్ళి ఒక పది సంవంత్చరాలపాటు మనని అలరింప జేసినా మహా గాయకుడూ. అతని గురించి ఎంత చెప్పిన, ఎంత రాసినా తక్కువేనేమో.  ఎలాంటి పాటనైన తన శైలి లో భావాన్ని రంగరించి జనరంజకంగా  పాడిన   గాయకుడు. ఆయన పాటలకోసం సినిమాలకు వెళ్ళే వాళ్ళట.  మన తెలుగు లో కూడా ఆయన శ్రావ్యమైన గొంతు తో ఎన్నెన్ని పాటలు.

ఆయన మనకు దూరమై మూడు దశాబ్దాలైన ఆయన పాట వినని క్షణం ఉండదు. ఆ పాట లోని మాధుర్యాన్ని ఆస్వాదించని మనిషి ఉండడు.ఎన్నో మరుపురాని చిత్రాలు, ఎన్నో మరుపురాని గీతాలు. ఆయన బౌతికంగా మన మధ్యలో లేకున్నా , ప్రతీ క్షణం  ఎంతో  మంది గొంతుల్లో ఆయన పాట ధ్వనిస్తూ, ..ప్రతిధ్వనిస్తూ......

" తేరి దునియా సే దూర్ చలే హోకే మజ్బూర్ ,హమే యాద్ రఖ్నా, జావో కహి బి సనం తుమే ఇత్నీ కసం హమే యాద్  రఖ్నా
అంటూ మననించి దూరంగా వెళ్ళిన ఆ మహాగాయకుడికి, అమృతమయమైన ఆ గళానికి, ...
మనమంతా మరొక్కసారి నివాళులు అర్పిద్దాం . ">

2 comments:

కల్పనరెంటాల said...

రఫీ కి మీ నివాళి బావుంది. రఫీ తెలుగు పాట, మీరు పెట్టిన టైటిల్ పాట కూడా పెట్టకపోయారా? మరో సారి వినేవాళ్ళమూ.

భాను said...

thanks kalpana gaaru