Thursday, December 9, 2010

మాయా దుప్పట్లు ...నా పాట్లు

పాత పుస్తకాలు పోస్ట్ రాసాక నా మనసు  ఏమి తోచక ఇంట్లో ఉన్న మాయ దుప్పట్ల మీదికి మళ్ళింది.  అవేనండి పాత పుస్తకాలు.  అలా ఒక్క సారి పైనున్నవి తీసి దుమ్మంతా దులుపుతుంటే నా కస్టాలు ఏమని  చెప్పను. చదవండి. 

ఇలా ఓపెన్ చేశానో లేదో   ఓ పక్క నుంచి " గురుజాడ " గారు ఏవయ్య నీకిది న్యాయమా ఇంత పెద్ద మనిషిని నన్నిలా పైకెక్కించి ఉంచడం నీకు తగునా అని నన్ను గుక్క తిప్పుకోకుండా వాయిస్తూ ఇలా కాదు గాని నన్నిలా చేసినందుకు నేను రాసినట్లు పొగ తాగని వాడు కాదోయ్ నన్నిలా దుమ్ము పాల్జేసిన నువ్వు దున్నపోతై పుట్టున్ అంటుంటే లోపల్నించి "ఏమివాయి, మై డియర్ భాను, ముఖం వేల వేసినావ్?" అంటూ మెల్లగా సిగార్స్ కి నా చేతిలో కొంచెం డబ్బు ఉంచవోయ్ ఆ ముసలాయన్ని నేను చూసుకున్టాలేవోయ్  అని గిరీశం అంటే  సరే అని గిరీశం చేతిలో ఇంత చమురు వదిలించుకొని ,   హమ్మయ్య బ్రతుకుజీవుడా అనుకుంటుంటే , మరో పక్క నుంచి కుటుంబ రావు గారు అదేనండి మన కొడవటిగంటి కుటుంబ రావు గారు నీకేమైనా బుద్దుందా, అస్సలు మమ్మల్ని ఇలాగేనా ఉంచేది, మా కిచ్చే గౌరవం ఇదేనా ఎన్నో సంవత్చారాలుగా తెలుగు సాహిత్యా ప్రపంచానికి దిగ్గజాన్ని, అబ్యుదయ సాహిత్యానికి ఇన్స్పిరేషన్ ని, ఆదునిక వచన వికాసానికి పట్టుగొమ్మను, కథానికా రచయితలకు మార్గదర్శకున్ని,  నాకిచ్చే మర్యాద ఇదేనా, గౌరవం ఇంతేనా అంటూ చడా మడా ముఖం మీద తిట్టేస్తుంటే బిక్క మొగమేసుకొని ఎం చెయ్యాలో అర్థం కాక అలానే దిక్కులు చూస్తూ , నాకు నేనే దైర్యం చెప్పుకొని " అయ్యా క్షమించండి"  అంటూ ఓ తువ్వాలు తో వారి మీదున్నదుమ్మంతా దులిపేసి ఓ ప్రక్క కూర్చుండబెట్టి క్షమించమని అడిగేయగానే పాపం పెద్ద మనిషి సరేలేవోవ్ ఇప్పటికైనా  జాగ్రత అని అంటూండగానే  మూల నుంచి పెద్ద ముండా వాణ్ని నన్ను పట్టించుకోవా  అంటూ విశ్వనాథ గారు ఏకవీర లోనుంచి కేకేశారు , మెల్లగా వారిని ఓ చెయ్యి ఆసరాగా ఇచ్చి  బయటికి తీసుక వచ్చి ఓ పక్క కూర్చుండబెట్ట.

బండారు సదాశివ గారు మెల్లగా బయటకు వస్తూ స్వాతంత్రం రాకముందు అంటే జైళ్లకు పోయాం. ఇప్పుడెం ఖర్మయ్యా బాబూ! ఏదో మీ జిల్లా వాణ్ని కనీసం ఆ ఇంగితం కూడా లేకపోతె ఏలనయ్య నన్నిలా జైల్లో ఉంచినట్టు ఉంచావు అంటూ ఆయనా బయటికి వచ్చేసారు. ఆయన వెనకే ఎవరో శోభన్ బాబు లాగున్నాడు అని ఈ సాహిత్యం వాళ్ళతో ఈయన ఎప్పుడు జత కలిసాడా అనుకుంటూ సరిగ్గా చూస్తె శోభన్ బాబు కాదు , ఆయన అంపశయ్య నవీన్ గారు నిజం చెప్పాలి అప్పుడు ఎంత అందంగా ఉన్నాడు అచ్చు శోభన్ బాబు లానే ఉన్నాడు.  నేనూ మీ జిల్లా వాణ్ని ఏవయ్య ఆ లోపల ఉంటె " అబ్బబ్బ ఏమిటో ఆలోచనలు, ఎడతెగని ఆలోచనలు , ఇక ఆలోచించను  i am tired of this habbit , చలో ఏక్  భార్  ఫిర్ సే అజనబీ బంజాయ్ హం దోనో, ఇదేమిటి ఈ పాట  ఇలా రింగ్ ఔతుంది, హంటింగ్ సాంగ్ అంటే ఇదేనేమో అంటూ,నవీన్  ఒక్కసారి ఊపిరి పీల్చుకొని "యెంత హాయి ఈ రేయి యెంత మధురమీ హాయి" అంటూ నన్ను వదిలేసి  పాడుకుంటూ అయన వెళ్ళిపోయారు. హమ్మయ్య అనుకునే లోగా ఎదురుగా ఓ కుర్చీలో  టీవిగా  కూర్చొని జాషువా గారు "నాడు కన్నీటి కథ సమన్వయము సేయ నార్ద్రహృదయంబు గూడ కొంతవసరంబు" అంటూ  (గబ్బిలం) బయట పడ్డారు. 

ఇక లాభం లేదండి. వీళ్ళ తిట్లు బరించే  ఓపిక లేదు. అని మెల్లగా జారుకున్దామనుకున్దామని ఎందుకైనా మంచిదని ఓ సారి ఇంకెవరున్నారని లోపలికి  తొంగి చూసా. తెలుగు వాళ్ళు అయిపోయినట్టున్నారు, ఇంగ్లీష్ వాళ్ళంతా ఇదేమీ  పట్టనట్టు ఓ రౌండ్ టేబుల్ సమావేశం లో ఉన్నారు. ఎవరబ్బా అని పరికించి చూస్తె అమ్మో మహా మహులు , అబ్రాహం లింకన్, ఆకియో మొరిటా, ఆర్థర్ హెలీ,  ఎమిల్ జోలా అందరూ సీరియస్ గా చర్చించుకుంటున్నారు. ఆ పక్కనే టాగూరు రాగ యుక్తంగా గీతాంజలి పాడుకుంటున్నారు. .  ఇప్పుడు వీళ్ళని కదిలిస్తే ఇంకేమన్నా ఉందా .  ఆ దైర్యం చెయ్యలేక మెల్లగా తప్పుకున్దామని అనుకుంటుంటే   లోపల్నించి మెల్లగా "ఈ ఎద లోని బాధ లేటులేమని చెప్పెద సన్నజాజి పూ రేకులు చెప్ప నేర్చునటే మెల్లన కాల్చు నిశాత సూర్య కీ లానల తప్తమై వదిలి వాడి దొరంగును గాక ఎప్పుడో నేనును గూడ నంతియ పరీమళ లేశమునే మిగుల్పకున్ " అంటూ రాగ యుక్తంగా వినపడుతూ ఆ గొంతు నాకు దగ్గరవుతుంటే గుర్తుపట్టా అమ్మో మన బాల గంగాధర్ తిలక్ గారు చాలా అందంగా , ఆర్ద్రంగా పాడుకుంటూ  బయటికి వచ్చారు  మనసెక్కడికో పోయింది.  అయన గోరువంకలు నన్నేమీ అనకుండా " నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమయిన ఆడ పిల్లలంటూ" ఆయన ఆ అందమయిన ఆడ పిల్లల వెంబడి  వెళ్లి పోయాడు.  నేనూ  తెరపిన పడ్డ మనస్సు తో  తిలక్ గీతం

నువ్వు లేవు నీ పాట ఉంది; ఇంటి ముందు
జూకా  మల్లె తీగల్లో  అల్లుకొని
లాంతరు  సన్నని వెలుతురులో క్రమ్ముకొని
నా గుండెల్లో చుట్టుకొని
గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో
దాక్కొని నీరవంగా నిజంగా ఉంది
జాలిగా హాయిగా వినపడుతూ ఉంది....
అలా వినపడుతుంటే హాయిగా నిద్ర పోయా. ఇదండీ నా మాయ దుప్పట్ల అనుభవం. మీకెలా ఉందొ చెప్పండి మరి.

10 comments:

ఇందు said...

బాగుందండీ..చక్కగా అందరిని పరిచయం చేసేసి..నిద్రపోయారా? హ్మ్! పాపం అలా అటక మీద పెట్టసారా! అందుకే అలిగి ఇలా తిట్టరేమో!

పద్మవల్లి said...

మీ మాయాదుప్పటి కబుర్లు బాగున్నాయండీ. అలాగే అందరి పరిచయాలు కూడా బాగా చేసారు. గిరీశం సమయానికి మిమ్మల్ని బాగానే ఆదుకున్నాడు.

నేను కూడా అప్పుడప్పుడు ఇలాగే, పోగొట్టుకోగా మిగిలినవాటిని తడుముకొని పలకరించి, ఏదో ఒక పుస్తకం ఎంచుకొని చదువుకుంటాను. అప్పుడు మళ్లీ అమ్మ వొళ్ళో పడుకున్నట్టుగానో, బెస్ట్ ఫ్రెండ్ తో ఆదమరిచి కబుర్లు చెప్పుకున్నట్టుగానో ఉంటుంది.
పద్మవల్లి

Admin said...

మీ మాయాదుప్పటి కబుర్లు బాగున్నాయండీ.

భాను said...

@ ఇందు
దుమ్ములో చీకట్లో ఉంచేస్తే తిట్టరు మరి. ధన్యవాదాలు
@ పద్మవల్లి
నిజమేనండి. అప్పుడప్పుడు ఏమి తోచనప్పుడు ఓ సారలా పాత పుస్తకాలు తిరగేసి ఓ పుస్తకం పట్టుకొని , చదివిన్దయినా సరే మల్లె చదివితే అదో అనుభూతి , మనసుకో ఆహ్లాదం. మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు
@ లక్ష్మి
ధన్యవాదాలండి

కొత్త పాళీ said...

beautiful

వేణూశ్రీకాంత్ said...

భలేరాసారు.

tnswamy said...

గురూ గారూ ! నాకు ఈ సందర్భం లో ఒక శ్లోకం గుర్తుకు వచ్చింది చెప్పమంటారా!
"పుస్తకం వనితా విత్తమ్,పర హస్తం గతం గతః!
అథవా పునరా యాతం జీర్ణం భ్రష్ఠంచ ఖండచ !!"

Ennela said...

ayya,
nEnu kuLs.....antE chaala chaala kullukuntunnanu... inni pustakaalu chadive time dorikinda lifelo meeku? yelaagabba? paiga... second time kaaka appudappudu teesi chaduvukuntaaraa? meeru baaga roju nidra pothaanani cheppinna naaku intha "J' feeling undedi kaademo....
ennela

భాను said...

@కొత్త పాళీ
థాంక్స్
@వేణు శ్రీకాంత్
ధన్యవాదాలు
@స్వామి
బాగా చెప్పావు థాంక్స్

భాను said...

@ ఎన్నెల గారూ
కుల్లుకున్తున్నర....:)) ఏదో అలా అప్పుడప్పుడు సమయం కుడుర్చుకొని చదివేయడమే. అంత జేలసీన భలే జోకేశారు.. :)) ధన్యవాదాలు