Tuesday, December 14, 2010

సియస్త ...మధ్యహ్న నిద్ర

.
సియస్త ..అంటే మధ్యాహ్న నిద్రకి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకొన్న పేరట. నాకూ ఇప్పుడే తెల్సింది. అర్థం చూస్తె "a midday or afternoon rest or nap, esp. as taken in Spain అండ్ Latin America. అని ఉంది.  " After lunch sleep a while" అన్నది ఆంగ్ల ఆర్యోక్తి అట. భలేగుంది. ఈ మధ్యాహ్న నిద్ర పోవటానికి  ఎంత అదృష్టం ఉండాలి. అయినా ఈ ఆఫీస్ లకి వెళ్ళే  వాళ్ళకి ఎక్కడ కుదుర్తుంది, అది అందని ద్రాక్షేగా. ఆఫీస్ లో ఎంచక్కా నిద్ర పోవచ్చుగా అంటారా, మా బాసు నేను నిద్ర పోను మిమ్మల్ని నిద్ద్రపోనివ్వను అని చంద్రబాబు నాయుడు టైపు లెండి. కాబట్టి అంత అదృష్టం లేదు. రాత్రి నిద్రే సరిగ్గా పట్టదు,   ఇక మధ్యాహ్న నిద్ర సంగతి దేవుడెరుగు.   ఇదేమి  జబ్బు  అనుకునేరు అదేమీ  లేదు లెండి.  

ఇక ఇంట్లో ఆడవాళ్లకేం  మీరు హాప్పీ గా , పిల్లలు స్కూల్ కి వెళ్ళాక , భర్త ఆఫీస్ కి వెళ్ళాక సంతోషంగా, ఆనందంగా తలుపులేసుకొని ఎంచక్కా నిద్రా దేవత ని ఆహ్వానించి అందమయిన కలలు కంటూ మధ్యాహ్న నిద్ర లోకి  జారుకుని ఆ అలౌకిక ఆనందాన్ని ఆ సుఖాన్ని ఎంచక్కా అనుభవిస్తారు , దేనికయినా పెట్టి పుట్టాలి , ఎంతైనా  మీ ఆడాళ్ళు అదృష్ట వంతులు , మీకు ఏమి పని అని మా ఆవిడతో అంటే కోపంగా ఓ కథ తీసి నా మున్దేసింది.  అది చదివాక నా అభిప్రాయం గోదాట్లో కలిసిపోయింది. ఆ కథ పేరు "సియస్త"  రాసింది సౌమ్య నిట్టల గారు. వచ్చింది ఈనాడు లో.ఈ కథ చదివాక హమ్మో ఆడాళ్ళ మద్యాహ్న నిద్రకి ఇన్ని కష్టాల, మనం ఎంత వీజీ గా ఊహించుకున్నాం. మా బావగారున్నారు, ఎంత అదృష్టవంతులండి. కాస్తంత కునికే అవకాశం దొరికితే చాలు, అది కుర్చీ అయిన, మంచం అయినా, రాత్రయినా, పగలయినా, బస్సు అయిన, రయిలు అయినా, చివరికి నీళ్ళల్లో అయిన సరే అయిదు నిమిషాలు దొరికితే చాలు గురక పెట్టేస్తారు. మనమేమో ఆయనతో మాట్లాడుతున్నాం అని  అనుకుని మాట్లదేస్తుంటాం , ఆయనేమో ఓ పక్క గురక పెట్టేస్తుంటారు.  నీళ్ళల్లో నిద్ర ఎంట అనుకుంటున్నారా, ఆయనకీ  జల స్తంబన విద్య తెలుసు. అదేంటంటే ఎంచక్కా ఎ ఆధారం లేకుండా నీళ్ళ మీద తేలి ఆడడం.  అంతే అనుకున్నార అలాగే నీళ్ళ మీద గుర్రు పెట్టి నిద్ర పోతాడు.  నేను  చూసేదాకా నమ్మలే. కళ్లారా చూసా. ఎక్కడో ఆ ఫోటోలు ఉండాలి సమయానికి అవి దొరకలేదు. లేకపోతె మీకూ చూపించేవాన్ని. ఈ సుత్తంతా ఏంటి అస్సలు ఆ కథేంటి అని అనుకుంటున్నారా, సరే కథలోకి వెళదామా మరి. 

 కథలోకి వెళ్తే  ఈ కథ లో ఆవిడకి పేరు లేదు, కాబట్టి మన సౌలభ్యం కొరకు కాస్సేపు ఆవిడ అని అనుకుందాం. ఆవిడకి  చిన్నప్పటి నుంచి  మధ్యాహ్న నిద్ర పోవాలనే ఒక బలమైన  కోరిక. ఎ వయసులోనూ అది తీరదు. చిన్నప్పటినుంచి చివరికి కోడలు వచ్చినా కూడా ఆ కోరిక అలాగే ఉంటుంది. "రాత్రి నిద్ర యాంత్రికం, బడి గంట కొట్టినట్టు పదవ్వగానే టి.వి. కట్టేసి లైటార్పేసి అదేదో డ్యూటీ లాగ పడుకుండి  పోతం కాని మద్యాహ్నం నిద్ర అలౌకికం. ఆ సుఖాన్ని ఆస్వాదించడానికి భావుకత్వం కావాలి. ఎక్కాల  పుస్తకానికి, పద్య కావ్యానికి ఉన్నంత తేడ ఉంది రెండింటికి. నాకు భావుకత అయితే ఉంది కాని ఆ సుఖాన్ని అనుభవించే అదృష్టం మాత్రం లేదు, ఇది నిరాశావాదం కాదు యధార్ద  వాదం అంటుంది ఆవిడ". చిన్నప్పుడు ఆటల సంబరంలో పడి వాళ్ళ నానమ్మ పడుకోబెడితే ,  పడుకోక ఆ తర్వాత జీవితాంతం విచారించని రోజు లేదంటుంది. తర్వాత స్కూల్లో మద్యాహ్న నిద్ర ని స్కూల్ కి ఎదురు ఫీజు ఇచ్చి మరీ రాసిచ్చేశారట. కాలేజి  బస్సులో ఫ్రెండ్స్ నవ్వుతారేమోనని, మెళ్ళో బంగారు గొలుసు ఒకటి భయంతో  పడుకోనివ్వలేదని అంటుంది. పెళ్ళయ్యాక అత్తగారు  " పగటిపూట నిద్ర మేమేరుగమమ్మా, ఇంట్లో ఇల్లాలు చలాకీగా బొంగరంలా తిరుగుతూ ఆపనీ ఈ పనీ చూసుకోవాలి తప్పితే ఇలా బద్దకంగా పండి నిద్ర పోకూడదు" అని ఫత్వా జారీ చేసిందట. ఇంకే ఎన్నో కలలు కన్న  ఆ మద్యాహ్న నిద్ర అలా హుష్ కాకి.

 ఆ తర్వాత వేరే వూరు ట్రాన్స్ఫర్ అయ్యిందని ఇంటికి తనే మహా రాణి , అత్తగారు లేదు అనేవాళ్ళు ఎవ్వరు  లేరు ఎంచక్కా నిద్ర పోవచ్చు అనుకుందే కాని అక్కడే మొదలయ్యాయి ఆమె కస్టాలు. సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, పాత చీరలకు స్టీల్ సామాన్లు అమ్మే ఆడవాళ్ళు, పక్కింటివాళ్ళు, కొరియర్ వారియర్లు,... అడ్రస్ వెతుక్కుంటూ పొరపాటున ఇంటి తలుపు తట్టేవాళ్ళు,  ఆడబిడ్డల ఫోన్లు  చివరికి ఏదో మర్చి పోయాను  అని వాళ్ళ ఆయన ఫోన్లు ఇలా నిద్రా భంగానికి ఇంద్రుడు పంపిన అప్సరసలు ద్యుతీలేసుకున్నాట్లు  నా కంటి మీద కునుకు లేకుండా చేశారు అని వాపోతుంది ఆ ఇల్లాలు. ఇవే అనుకునేరు ఆమె పాలిట నిద్ర పోకుండా చేసినవి, మద్యాహ్న దొంగతనాలు, ఎక్కడో టి,వి లో చూసిన జ్ఞ్యాపకంతో , మద్యాహ్నం నిద్ర పొతే లావేక్కుతారని తెలిసిన  నిజాలు నిద్రకు దూరం చేశాయట ఆమెని.

 ఇలా కాదని ఓ పుస్తకం పట్టుకుని కూర్చుంటే, పట్టుకొన్న కొన్ని లిప్తల్లోనే అక్షరాలూ మసకై పోవడం, పై వరసలో ఉన్న అక్షరాలూ కింది వరసలో కలిసిపోవడం, కళ్ళు అక్షరాల వెంబడించినా భావం అర్థం కాకపోవడం, ఆఖరికి పుస్తకం చెయ్యి జారి పోవడం వంటి పరిణామాలు సంబవిన్చాయత  .  పోనీ లోపలికెళ్ళి పడుకుందామ అంటే  ఊభ కాయం మరియు చోర భయం.  చివరికి కొడుకుతో సినిమా కెళ్ళి  ఎ.సి. హాల్లో కునుకు తీయొచ్చు అనుకుంటే అది మాయ బజార్ సినిమా. నిద్ర సంగతి దేవుడెరుగు, కను రెప్పలార్పితే ఒట్టు అంటుంది. ఇలా చివరికి కోడలు వచ్చిన తరవాత పడుకుందామంటే , అత్తయ్య మీకు మనవడో, మనవరాలో పుట్టపోతుంది అంటూ ఆమెను ఇలా నిద్ర పోకుండా చేసిన కస్టాలు నవ్వు పుట్టిస్తాయి. టి.వి కయిన స్లీప్ మోడ్ ఉంటుంది నాకు అంత అదృష్టం  లేదే, నేను యంత్రం కంటే అద్వాన్నమ  అని వాపోతుంది. 

కథ ఆసాంతం సరదా, ఆసక్తి గా సాగింది. ఎంత సరదాగా ఉన్న అంతర్లీనంగా ఒక స్త్రీ పడే ఆవేదన ఓ మూల హృదయాన్ని  కలిచి వేస్తుంది. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకొనే  వరకు శరీరం పడే శ్రమ, నిద్ర, విశ్రాంతి కి కరువై ఎంత ఆవేదన పడతారు అన్నది ఈ కథ లో స్పష్టంగా కనపడుతుంది. ఈ కథ చదువు తుంటే ఇదే కథాంశం తో ఈ మధ్యే చదివిన  రెండు కథలు గుర్తుకు రాక మానవు.  ఒకటేమో అబ్బూరి ఛాయా దేవి గారి సుఖాంతం అనే కథ. ఈ కథ లో ఆ ఇల్లాలు అడిగేది మణులు మాణిక్యాలు కాదు , కంటి నిండా కాసింత నిద్ర. ఆ నిద్ర కూడా పోయే తీరిక లేక పాపం ఆ ఇల్లాలు, నిద్ర మాత్రలన్ని మింగి భర్త కు చీటీ లో  ‘ఏమండీ... ఆత్మహత్య చేసుకున్నానని భయపడకండి. నిజంగా నిద్ర కోసం నిద్రపోతున్నానంతే’ అని రాసి పెట్టి శాశ్వత నిద్రలోకి జారిపోతుంది. ఇక రెండో కథ సత్యవతి గారి "సూపర్ మాం సిండ్రోం "  మంచి తల్లిగా ఆమె సక్సెస్స్ అయినా దాని వెనక ఆమె పడిన వేదన, కష్టం ,  ఆ కష్టాన్ని మర్చిపోవటందుకు, ఆమె అనుక్షణం జీవితాంతం వాడిన టాబ్లెట్లు.  చివరికి  ఆమె శరీరం ఒక టాబ్లెట్ గా మారెంతగా .  చదువుతుంటే  కళ్ళు చెమర్చక మానవు.  ఇదీ  చదివాక మనలో ఉన్న అపోహలు తొలిగితే సంతోషమే. ఇదండీ సంగతి. ఎలా ఉందొ మీరూ  చెప్పాలి. 

6 comments:

ఇందు said...

నాకు ఇంట్లో ఉంటే మధ్యాహ్నాలు నిద్ర రాదుగానీ...అదేంటో..స్కూల్లో..కాలేజీలొ భలె భలె నిద్రొచ్చేసేదీ...దీనిని ఆంగ్లంలో 'నాప్' అంటారని అనుకున్నా..ఇలా అంటారా? చాల విపులంగా వ్రాసారు మీరు...కాని ఇంట్లో ఉండే ఆడవారికి ఈ నిద్ర చాలా ముఖ్యం.పని చేసీ..చేసి..అలసిన వారికి ఇదేకదా స్వాంతన :) అందుకే...నేను ఇంట్లో ఉంటే మా అమ్మని బలవంతంగా పడుకోబెడతా...మనం ఎటూ పనులు చేయం...కనీసం పనులన్ని చేసే అమ్మకి కాస్తయినా రెస్ట్ ఇవ్వాలిగా!! :) బాగుంది మీ టపా!

Ennela said...

bhaanu gaaru,
chaala baagundandee.... yee madhyana oka friend chanti pillaadito americaalo untoo ilaagey request chestondi.. please kaassepu nidra ponivvandee ani...paapam anipistundi... maa intiki vachcheyyamani cheppaanu kaani visa ledanta.....
ennela

సుజాత వేల్పూరి said...

ఏ రోగమో వస్తే తప్ప, మధ్యాహం నిద్ర పోవడం ఎంత ప్రయత్నించినా అలవాటు కాలేదండీ నాకు! తీరిక లేకపోవడం కారణం అలా ఉంచి, తీరిక ఉన్న సెలవు రోజుల్లో కూడా ఇది నా వల్ల కాదు. ఏ పుస్తకాలో చదువుతూనో, మరేదైనా పని చేస్తూనో గడిపేస్తా!

మొత్తానికి కథ బాగుంది.

భాను said...

@ఇందు
స్కూల్లో..కాలేజీలొ భలె భలె నిద్రొచ్చేసేదీ... హహహ మరి నిద్ర పోయే వార లేదా? టపా నచ్చినందుకు సంతోషం.ధన్యవాదాలు
@ఎన్నెల గారు
మీ ఆలోచన బాగుంది. ధన్యవాదాలు
@సుజాత గారూ
అందరూ అలా ఉంటారని కాదు. కాని నిద్ర పోవాలని పోలేని వాళ్ళ పరిస్థితి అది. మీరన్నట్లు ఇంట్లో ఉన్న రోజు మంచిగా నిద్ర పొడమనుకుంతం కాని అదేంటో ఆరోజు అస్సలే నిద్ర రాదు. టి.వి. లేకపోతె ఎ పుస్తకమో చదువుకుంటూ అల గడిపేస్త నేను కూడా. ధన్యవాదాలు

తృష్ణ said...

సుజాతగారి వ్యాఖ్యేనండీ నాదీను. ఎప్పుడన్నా ఖాళీ ఉన్నా కూడా అదేమిటో ఎంత ప్రయత్నించినా మధ్యాహ్నం నిద్ర రాదు నాకు. కథ మాత్రం బాగుంది.

లత said...

చాలా బావుంది
నిజం, నిద్ర వచ్చినప్పుడు టైం ఉండదు.టైం ఉన్నప్పుడు నిద్ర రాదు.
ప్రతి ఇల్లాలికీ ఇది అనుభవమే.