ఈ 25 వ పుస్తక ప్రదర్శన ప్రారంభం అయినప్పటినించి వెళ్లాలని ప్రణాళికలు వేసుకుంటున్న. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఎంచక్కా రోజూనో, వీలున్నప్పుడో అలా వెళ్లి ఇలా వస్తారు. బయట ఉండేవాళ్లకు అలా కాదాయె. పుస్తక ప్రదర్శన ఒక్కటే కారణం కాదు, అందులో ఉన్న e- తెలుగు స్టాల్ లో పాల్గొనాలని మరియు బ్లాగ్గర్స్ ని కలుసుకోవడం. అందుకని ఆదివారం పోవాలని అనుకుంటే వీలు కాలేదు. సోమ వారం ఏదో ఓ పని పెట్టుకొని స్వామి కార్యం , స్వ కార్యం చక్క పెట్టుకోవచ్చని హైదరాబాద్ వచ్చేశ. పుస్తక ప్రదర్శన శాల చేరేవరకు 7 .30 అయ్యింది. సమయం చాల తక్కువ, రాక రాక వస్తే ఇంత తక్కువ సమయమా అని మనస్సు కాస్త బాధపడింది. సరేలే అనుకోని మొదట e తెలుగు స్టాల్ ని సందర్శించా. నా దురదృష్టం ఒక్క కౌటిల్య గారు తప్ప ఎవరూ లేరు. వారిని పరిచయం చేసుకొని, నన్ను నేను పరిచయం చేసుకొని, కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని, అన్నీ విపులంగా సందర్శించే వీలు లేక, ముఖ్యంగా తెలుగు పుస్తకాలున్నా స్టాల్ల్స్ మాత్రమె చూడడం జరిగింది. తెలంగాణా. ఎమెస్కో., ప్రజాశక్తి, నవయుగ, నేషనల్ బుక్ ట్రస్ట్ స్టాల్ ఇంకా కొన్ని స్టాల్ల్స్ మాత్రమె చూశా.
పుస్తక ప్రదర్శన లో రోజూ సాయంత్రం ఏదో ఒక సాహిత్య కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు తనికెళ్ళ భరణి గారి నాటకాలు ఆవిష్కరణ జరుగుతుంది. భరణి , హేమ, రాళ్ళపల్లి, ఇంకా కొందరు సినీ కళాకారులు పాల్గొన్న ఈ సభ లో భరణి " మా చెల్లికి చేయాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ" అని కురిపించే నవ్వుల జల్లు లో ఓ రెండు నిమిషాలు తడిసి , అక్కడి నించి విశాలాంధ్ర స్టాల్ కి వెళ్తే అప్పటికే సమయం తొమ్మిది కావటం తో స్టాల్ల్స్ తెరలు దించే కార్యక్రమం మొదలై పోయింది. నిరాశ తో వెను తిరిగి వస్తుంటే చివర్లో "ఆర్ట్స్ అండ్ లెటర్స్" కనిపించింది. అందులో మిసిమి కనిపించింది. లేటెస్ట్ ఇష్యూ కొనుక్కొని రెండు మూడు చోట్ల కనపడని బాపిరాజుగారి "గోన గన్నారెడ్డి" కనపడితే అది కూడా కొనుక్కొని బయట పడ్డాము. అంతకు ముందు విశాలాంద్ర స్టాల్ లో గోన గన్నారెడ్డి గురించి అడిగితె నిర్లక్ష్యంగా ప్రింట్ లో లేదు అని సమాధానం వచ్చింది. ఇదీ వారి వరస. ఏవయిన కొత్త కథా సంకలనాలు కొనాలనుకున్న, కాని ఈ రోజే (సోమ వారం) ఆంద్ర జ్యోతి లో వచ్చిన వ్యాసాలూ చదివాక , తర్వాత చూద్దాం లే అని ఊరుకున్న. ఎమెస్కో స్టాల్లో కాస్త గడిపా. కాశీబట్ల పుస్తకాల గురించి అడిగితె ఎక్కడా దొరకలేదు. మొత్తానికి నాకు సమయం లేక కొంత నిరాశతో వెనక్కి వచ్చా. మళ్ళీ వీలు చూసుకొని రావాలి. :
నేను కొన్న పుస్తకాలు
గోన గన్నారెడ్డి .....అడవి బాపిరాజు
కథా భారతి బెంగాలి కథానికలు
మహి.....కుప్పిలి పద్మ
మంచుపూల వాన ....కుప్పిలి పద్మ
విసుర్రాయి...ముదిగంటి సుజాత రెడ్డి
గాలిబ్ గీతాలు ...దాశరథి
మా పసలపూడి కథలు....వంశీ
మనుచరిత్రము.....అల్లసాని - ఎమెస్కో ప్రచురణ
3 comments:
అబ్బో! బోలెడు పుస్తకాలు కొనేసారుగా! మీరందరూ అదృష్టవంతులు....ఎంచక్కా పుస్తకాలు కొనేసుకుంటున్నారు...నేను ఇక్కడనుండీ మా అమ్మకి ఆర్డర్లు వేస్తున్నా..అది కొను..ఇది కొను..అని...హ్మ్! బాగున్నయ్ మీ పుస్తక ప్రదర్సన సందర్సన విసేషాలు....
కాశీభట్ల వేణుగోపాల్ గారి నికషం కినిగె.కాం లో ఇక్కడ దొరుకుతుంది!
http://kinige.com/kbrowse.php?via=tags&tag=Nikasham
కాశీభట్ల వేణుగోపాల్ గారి నికషం కోసం క్లిక్ చెయ్యండి.
Post a Comment