నాలుగు నెలల క్రితం.....
మా అబ్బాయి హైదరాబాద్ వెళ్తూ ప్రయాణం చేస్తూ ఎస్ .ఎం ఎస్.లో పంపిన సందేశం " ఐ మిస్ యు డాడీ" , సంతోశమనిపించింది. పదిహేనేళ్ళ వాడి కన్స్రన్. ముచ్చటేసింది. ఆ తర్వాత ఆఫీసు కి వెళ్తూ ఉండగా యథాలాపంగా మళ్ళి గుర్తొచ్చింది. ఇంకో రెండు నెలల తర్వాత వాడు పై చదువులకు హాస్టల్ కి పోతాడన్న ఆలోచన , వుయ్ విల్ మిస్ హిం ఫర్ సో మేని డేస్. ఎప్పుడు లేనిది ఒక్క సారిగా నాకు ఈ ప్రపంచానికి మధ్య ఒక సన్నటి కన్నీటి తెర. మనసు దిగాలు పడింది. నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నాను. ఎవరో అన్నారు, మరుపు మనకి దేవుడిచ్చిన వరం. కాలం అన్నిటిని తనలో కలుపుకుంటుంది.
రెండు నెలల క్రితం......
వాడిని పంపే సమయం దగ్గర పడ్తున్న కొద్ది మా ఆవిడ ముఖం లో దిగులు, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు దుఖం. నేనూ ధైర్యంగానే ఉన్నాను. ఇది మొదటినించి అనుకుంటుందే కదా సహజమే కదా వుయ్ షుడ్ బి ప్రిపెరేడ్ అంటూ ఆవిడకి ధైర్యం చెబుతూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ.......
పంపే సమయం సమయం దగ్గర పడింది. ఒక్కసారి వాడిని దగ్గరకు తీసుకొని మంచిగా ఉండు అని చెబుతూ ఉంటె నా కళ్ళల్లో కన్నీటి తెర. ఎక్కువసేపు అలా ఉంటె నేనెక్కడ బయట పడతానోనని వాడిని వదిలేసి దూరంగా వెళ్ళా ...ఆ తర్వాత మా ఆవిడ చెప్పింది మీరు దగ్గరకు తీసుకోగానే వాడి కళ్ళల్లో నీళ్ళు అని.
వాడిని రూం లోకి పంపేముందుమల్లి అదే కన్నీటి తెర. ఎక్కువ సేపు ఉంటె నేనెక్కడ ఏడుస్తానోనానని... ఎవరు ఏమనుకుంటారోనని బిడియం.... మన ఫీలింగ్స్ ని వ్క్యక్తపరిచే ధైర్యం లేక ...నన్ను నేనూ సంబాలిన్చుకుంటూ నా కళ్ళల్లో నుంచి ఉబికి వస్తున్న కన్నీరు అపుకొటానికి ప్రయత్నిస్తూ అందరికి దూరంగా............
ఇంటికి వచ్చాక..... తెల్లవారి లేచి కూర్చుంటే వాడు మదిలో మెదిలాడు. ఉదయమే "గుడ్ మార్నింగ్ డాడి" అనే పలకరింపు...మిస్సింగ్. ( ఇది రాస్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు) ఒక్కసారిగా హృదయం బద్దలయింది. ఇన్ని రోజులు ఆగిన, ఆపుకున్న దుఖం కన్నీరై , వరదలై అలా సెకండ్లు....నిముషాలు....గంటలు....ప్రతిక్షణం గుర్తుకు వస్తు. రియల్లి వుయ్ మిస్సింగ్.హిం
ఆ క్షణం ...నన్ను నేనూ మరిచిపోయ....ఎవరైనా చుస్తారన్న భయం లేదు. ఎవరు ఏమనుకున్తరోనన్న బిడియం సంకోచం ఏది లేకుండా ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకి పోయేవరకు , హృదయం తేలిక పడే వరకు .....
అరునసాగర్ మేల్కొలుపులో అంటాడు "అయిన సరే ఒక్క సారైనా ఏడవాలని ఉంది, మనకది లగ్జరీ, వెక్కి వెక్కి పొంగి పొంగి ధారలుగా ధారలుగా నన్నోకసారి కడుక్కోవలనుంది. కాల్చి ఎండ బెట్టిన సైలెన్సర్ వలె ఖాళీ అయిపోవలనుంది" నిజం ఎందుకు ...మనము ఎందుకిలా, అన్నిటిని మనసులో దాచు కుంటూ లేని గాంభీర్యం నటిస్తూ మన ఫీలింగ్స్ ని హ్ర్యుదయన్తరాలల్లో కప్పేస్తూ, చిన్నపటినుంచి మనకు మగాడు ఏడవకూడదు అని అలవాటుచేసి.....ఎన్నాళ్ళిలా హృదయం లో దాచ్కుంటారు . అవన్న్నీ కలిసి హృదయం తట్టుకోలేక ఒక్కసారి లావాలా ఉప్పొంగితే............
కాలం....గ్రేట్ , అన్నిటిని మరిపిస్తుంది, రెండు రోజుల్లో మళ్లీ మామూలై పోతం ...కాని మనసులో ఆలోచనా స్రవంతి , జ్ఞ్యాపకాల సమూహాలు, ఎవరన్నారు కాలం మరిపిస్తుంది అని, అబద్దం ....ఎందుకంటారా, ఇది రాస్తుంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు. .
skip to main |
skip to sidebar
9 comments:
హృదయాన్ని కలిచివేసింది
గుండెను పిండిన వేదన ...
మీరు .. సరే ...
మరి వాడు .. వాడు పసి మొగ్గ ..
ఆ వయసులో హృదయం .. మరీ మృదులం ..
మిమ్మల్ని .. వాళ్ళ అమ్మను క్షణక్షణం మిస్సవుతూ ..
... ... ...
... ... ...
రోజూ ఫోన్ చేస్తూ మీరు పక్కనే ఉన్నంత గుండె ధైర్యాన్ని వానికి అందించాలి సుమా !
కొన్ని నెలల క్రితం ఇలాంటి ఒక చక్కటి కారణం వల్లే ఒంటరిగా ఓ రెండు గంటలు ధారాపాతంగా ఏడ్చాను. ఇలా స్వఛ్ఛంగా ఏడవగలిగే మనస్సు ఎంతమంది మగవారికి వుంటుందీ?
మీ పోస్ట్ లో చివరి వాక్యాలు అక్షరసత్యాలు.
కాలం....గ్రేట్ , అన్నిటిని మరిపిస్తుంది, రెండు రోజుల్లో మళ్లీ మామూలై పోతం ...కాని మనసులో ఆలోచనా స్రవంతి , జ్ఞ్యాపకాల సమూహాలు, ఎవరన్నారు కాలం మరిపిస్తుంది అని, అబద్దం ....ఎందుకంటారా, ఇది రాస్తుంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు
అవును. కొన్ని అనుభూతులు, జ్నాపకాలు ఎంత కాలం దాటినా ఇంకా పచ్చిగా వుంటాయి మనల్ని కాలుస్తూ....
అందరికి ధన్యవాదములు
mee tapa chadivaka nenu kuda edchesanu
కథనం బాగా ఏడ్చినట్టుంది. నేనూ ఏడ్చాను. :)
Oh గుండె ను కదలించింది. చదువుతుంటే కళ్ళు చెమర్చాయి.
బయటకు రాలేని (రానివ్వని) కన్నీళ్లు, అందరి కళ్ళల్లోనూ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి.
thanks bulusu garu
Post a Comment