సాక్షి లో ప్రచురితమయిన అబ్బూరి ఛాయా దేవి గారి "సుఖాంతం" కథ రివ్యు చదివితే మనసు కలిచి వేసింది. దుఃఖాంతం అయిన కథకు సుఖాంతం అనే పేరు ఎందుకో. ఆ ఇల్లాలు చిరకాల ప్రయత్నం సుఖాంతం అయ్యిందని కాబోలు. రివ్యు లో ఈ చివరి వ్యాఖ్యలు చుడండి.
ఇదంతా స్ర్తీల దుఃఖం. స్ర్తీలకు మాత్రమే అర్థమయ్యే దుఃఖం. భారతీయ కుటుంబాల్లో స్ర్తీ ఒక జీతం భత్యం లేని పని మనిషి. ఆమె చాకిరీ చేసేందుకే పుడుతుంది. చనిపోయేంత వరకూ చాకిరీ చేసి చేసి చనిపోతుంది. చాకిరి ఆమెకు మాయ. చాకిరి ఆమెకు అన్నం. చాకిరే ఆమెకు నిద్ర. ఈ చాకిరీ నుంచి బయట పడి, మాయ చెదిరిపోయి, ఎవరూ తోడు ఉండని పెద్ద వయసుకు చేరినప్పుడు, ఏకాంతం లాంటి ఒంటరితనం దొరికినప్పుడు మనసు ఒక దెయ్యాల దిబ్బలా మారి గతంలోకో భవిష్యత్తులోకో ప్రయాణిస్తూ నిద్రను శాశ్వతంగా ఎగరగొడుతుంది.
ఏమడుగుతోంది ఈ కథలోని ఆ పాత్ర?
మణులా మాణిక్యాలా? కంటినిండా కాసింత నిద్ర.
ఆ నిద్ర కూడా పోయే తీరిక లేక పాపం ఆ ఇల్లాలు, నిద్ర మాత్రలన్ని మింగి భర్త కు చీటీ లో
‘ఏమండీ... ఆత్మహత్య చేసుకున్నానని భయపడకండి. నిజంగా నిద్ర కోసం నిద్రపోతున్నానంతే’ అని రాసి పెట్టి శాశ్వత నిద్రలోకి జారిపోతుంది.
ఆ రివ్యు ఇక్కడ చదవండి. నిద్ర కొరకు ఓ ఇల్లాలి అంతిమ ప్రయత్నం .
0 comments:
Post a Comment