మా తల్లికి మల్లె పూదండ అనగానే మనకు గుర్తుకు వచ్చేది టంగుటూరి సూర్యకుమారి.ఈ పాటకి ఆవిడ ప్రాణం పోశారు. ఆ అద్బుతమయిన గళం లో శంకరంబాడి సుందరాచార్య రాసిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ మీరూ ఆస్వాదించండి .
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి || మా||
గలగలా గోదారి కదిలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి ||మా||
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తీయందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ ! జై తెలుగు తల్లీ !
అవునండీ...సూర్యకుమారిగారి 'మా తెలుగు తల్లీ'....ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి 'వేంకటేశ్వర సుప్రభాతం' వారు పాడితేనే వినసొంపుగా ఉంటాయి :) ఇంకెవ్వరు పాడినా చెవులకి వినపడదు..ఆ మాధుర్యం ఉండదు.
Please see my blog www.kasstuuritilakam.blogspot.com I have added one more stanza to maa telugu talliki .also please visit my maa telugu talliki mallepudanda 1 given below: http://kasstuuritilakam.blogspot.in/search/label/మా%20తెలుగు%20తల్లికీ%20మల్లెపూదండ Mallina Narasimharao. Awaiting for your response.
3 comments:
chalaa bagundandi
అవునండీ...సూర్యకుమారిగారి 'మా తెలుగు తల్లీ'....ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి 'వేంకటేశ్వర సుప్రభాతం' వారు పాడితేనే వినసొంపుగా ఉంటాయి :) ఇంకెవ్వరు పాడినా చెవులకి వినపడదు..ఆ మాధుర్యం ఉండదు.
Please see my blog www.kasstuuritilakam.blogspot.com
I have added one more stanza to maa telugu talliki .also please visit my maa telugu talliki mallepudanda 1 given below:
http://kasstuuritilakam.blogspot.in/search/label/మా%20తెలుగు%20తల్లికీ%20మల్లెపూదండ
Mallina Narasimharao. Awaiting for your response.
Post a Comment