ఎన్నో రోజులుగా మనల్ని అలరిస్తున్న తన్హాయి " అయిపొయింది" అన్న అక్షరాలు చూసే సరికి ఒక్క సారి మనసు నిజంగా భారమయిపోయింది.. ఎప్పుడో అప్పుడు అయిపోతుందని మనసుకు తెలిసినా ఒక్క సారిగా అయిపొయింది అని చదివే సరికి, మన ఆప్త మిత్రులు లేదా దగ్గరి వాళ్ళు మన నుంచి దూరమయిన ఫీలింగ్.
నేను మొదటిసారిగా బ్లాగ్లోకంలో నా మొదటి అడుగు వేసినప్పుడు మొదటి కామెంట్ కల్పనా గారిదే. అప్పటికి నాకు కల్పనగారెవరో తెలీదు. ఆ కామెంట్ ని పట్టుకొని వారి బ్లాగ్ లోకి వెళితే నాకు తన్హాయి ఎనిమిదో భాగమనుకుంటా కనిపించింది. ఏముందా అని చదివితే ఆసక్తిగా అనిపించింది. ఇలా కాదని ఇంకా వెనక్కి వెళ్ళ. .ఏక పల్ దగ్గరికి. అలా చదువుతుంటే రచయిత మన చెయ్యి పట్టుకొని ఒకటి రెండు ఎపిసోడ్ లు నడిపించి వదిలేస్తే, అంతే మనం ఆ తన్హాయి సుడిగుండం లో పడి అందులోనే తిరుగుతుంటాం. అలా తన్హాయి ఇన్ని రోజులు మన జీవితం లో ఒక భాగమయింది అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక తన్హాయి గురించి నా అభిప్రాయం, అయితే నేనేమి దీని గురించి సమీక్ష రాయబోవడం లేదు. అంత స్తాయి నాకు లేదు. ఏదో నా మనసుకు తోచిన కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకుందామని ఈ ప్రయత్నం అంతే.
తన్హాయి గురించి ఒక్క వ్యాక్యంలో చెప్పాలంటే, ఇది ఒక (అ)సహజమయిన ఒక అందమయిన ప్రేమ కావ్యం. అసహజం ...సహజం అని ఎందుకంటున్నానంటే. మనం మొదట్లో చదువుతుంటే మనకి కలిగే మొదటి అభిప్రాయం ఇది అసహజం , ఇదంతా మనం ఎలా ఒప్పుకుంటాం రచయిత ఇలా రాస్తున్దేమిటి అని వీరావేశ పడతం.
ఎందుకంటే ఇదంతా మన దృష్టి లో అసహజమే కదా!. ఔను మనం పెరిగిన వాతావరణం, మన సంస్కృతి, మనకి పెద్దలు చెప్పింది...మనం చూసేది (?), ఇవ్వన్నీ మనకు ఇద్దరు వివాహితుల మధ్య ఏర్పడే ప్రేమ ,బంధం అసహజమనిపించడం లో ఎటువంటి తప్పులేదు. కాని మనం ఒక్క సారి మన చుట్టూ ఉన్న సమాజాన్ని , వ్యక్తులను చూస్తె మనకి అలాంటి క్యారెక్టర్స్ కనిపించడం లేదా. మనకి ఆ భగవంతుడు ఎదుటి వ్యక్తుల హృదయాల్లోకి తొంగి చూసి వాళ్ళని చదివే శక్తి ఇస్తే, మనకి ఇలాటివాళ్ళు ఎంతమంది కనపడరు. కాదంటారా. మన మనస్సులో ఎం జరుగుతుందో ఎవ్వరికి తెలీదు కాబట్టి అంతా సవ్యంగానే ఉన్నట్లు అందరూ మంచిగానే కనిపిస్తారు. ఎవ్వరి మనసులో ఎం జరుగుతుందో? మనకి కనిపించేదంతా మనం చదివేదే మన సంస్కృతి అనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే అని నా ఉద్దేశ్యం. మనం రోజు ఎన్నో పత్రికల్లో సమస్యలు ప్రశ్నలు, జవాబులు చదువుతుంటాం. అందులో చూడండి. పెళ్ళయిన వాళ్ళు, పెళ్లి కానివాల్లూ , జీవిత భాగ స్వాములకు తెల్సి, తెలియకుండా ఏర్పరుచుకొనే భందాలు, అనుభందాలు, కొన్ని సరదాగా, కొన్ని పర్మనెంట్గా, ఇలా రక రకాల వ్యక్తులు మన సమాజంలో ఎందఱో కనకి కనపడుతుంటారు. ఉన్నారు. లేరనుకొని ఈ ప్రేమలు , ఈ బంధాలు అసహజం అని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకొన్నట్లే.
మన సమాజంలో మన చుట్టూ జరిగేదే రచయిత తన సొంత శైలి లో రాసింది. మన చుట్టూ జరుగుతుంటే మనం చూస్తూ ఉరుకుంటాం.కాని రచయిత దాన్ని ఒక కథ వస్తువుగా తీసుకుంటే అది అసహజమెట్ల అవుతుంది, అక్రమసంబంధాలు గురించి రాసినట్లు ఎట్లా అవుతుంది. ఒక అసహజమయిన సబ్జెక్టు ని చాల సహజంగా పాటకులను సంమోహపరిచెంతఃగా చదివించి అందరిచేత ఆమోద ముద్ర వేయించడం ఇక్కడ రచయిత గొప్పదనం. ఇలా ఎందుకు అంటున్నానంటే పాటకులు అక్కడక్కడ రచయిత అభిప్రాయాలతో విభేదించినా...ఈ ప్రేమికుల మధ్య బంధాన్ని , ప్రేమని ఇష్టపడ్డారు. అందులో లీనమయ్యారు. పాత్రలకు ఎం జరుగుందోనని వాళ్ళను సప్పోర్ట్ చేశారు, బాధపడ్డారు, ఆవేదన చెందారు.పాత్రలని ఆరాదించారు.మొత్తంగా పాత్రలను తమ ఆప్త మిత్రులుగా , తమ కి ఇష్టమయిన వ్యక్తులుగా భావించారు. వాళ్ళకేమి కాకూడదని టెన్షన్ కి లోనయి, పాత్రలతో మమేకమయిపోయారు. ఈ పోస్ట్ లు పబ్లిష్ అవుతున్నప్పుడు రీడర్స్ రాసిన కామెంట్స్ దీనికి నిదర్శనం. ఇది సహజమా , అసహజమా ఇది తప్పా, ఇది ఒప్పా, అని రచయిత మనకి ఎలాంటి సందేశం ఇవ్వట్లేదు. మనం తేల్చుకోవాల్సిందే.
ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు వివాహితులు , "కల్హార" మరియు "కౌశిక్" ఒక ఎయిర్పోర్ట్ లో ఏర్పడ్డ పరిచయం స్నేహం....ప్రేమగా...మారి దగ్గరయి ఒకరిని విడిచి ఒకరు విడిపోలేనంత దగ్గరయి, ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏర్పడ్డ పరిణామాలు, వాళ్ళ మానసిక సంఘర్షణలు. ఇక్కడ ఎవ్వరేమనుకున్న రచయిత వాళ్ళ మధ్య స్నేహం, ప్రేమ ఒక అందమయిన దృశ్య కావ్యం లా మన కళ్ళకి చూపిస్తుంది. ఎంత బాగా అంటె మనం కల్హార తో ప్రేమలో పడేంత. వాళ్ళ మధ్య ఈ ప్రేమ ఎలా ఏర్పడింది అంటె సరి అయిన కారణాలు ఏవి కనిపించవు , it just happens ... అంతే, నిజమే మన అభిప్రాయాలకు మన ఇష్టాలకి దగ్గరి వాళ్ళు మన సమీపం కి వస్తే, కాన్స్టంట్ గ కలుస్తుంటే, స్నేహం , ఇష్టంగా ఆపై ప్రేమగా మారుతుంది దీనికి ఎ కారణాలు అవసరం లేదనుకుంటా. ఇక్కడ జరిగింది అదే, కల్హార , కౌశిక్ ల పరచయం అలా అలా కొనసాగి ఒకరి ఇష్టాలు ఒకరు ఇష్టపడి స్నేహం ఘాడమాయి ఇష్టంగా మారి, అది ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా, మెయిల్స్, ఫోన్ కాల్స్, కొనసాగుతుంటే ఇవ్వన్ని వాళ్ళని మానసికంగా దగ్గరికి చేర్చి వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది. కథలో ఇదంతా ఒక అందమయిన ప్రేమ కావ్యంలో కొనసాగుతే, మిగతా కథంతా ఒక ఎత్తు. ఈ భాగం లో నాలుగు పాత్రల మధ్య మానసిక సంఘర్షణలు రచయిత అతి సహజంగా చక్కగా, వారి మనస్సుల్లోకి తొంగిచూసి రాసినట్లు అనిపిస్తుంది. వివిధ ఎపిసోడ్ లలో రచయిత రాసిన ఆ మానసిక సంఘర్షణల విశ్లేషణలు అర్థవంతంగా , కన్విన్సింగా గా మనకి నచ్చుతాయి. ఎవ్వరి గురించి రాసినా వాళ్ళదే కరెక్ట్ అనిపించేతగా రచయిత రాసిన తీరు శ్లాగనీయం. రచయిత కూడా ఎవ్వరిని సప్పోర్ట్ చేసినట్లు కనపడదు. పాత్రలు అల సహజంగా ప్రవర్తిన్చినట్లు మనకి కనిపిస్తుంది. అందుకే అందరూ అంత ఇస్తాపద్దరనుకుంటా.
చివర ముగింపులో ఒక ప్రశ్న రాక మానదు. విడి పోదామని వాళ్ళు నిర్ణయించుకొన్న తర్వాత , వాళ్ళు ఒకళ్ళ కౌగిల్లో ఒకళ్ళు ఒదిగి పోవడం లాంటివి ...మళ్ళీ వాళ్ళ మధ్య బంధం ఇంకా డెవలప్ కావటానికి దోహదపదతాఎమో అనిపించింది. ఇదంతా ఒక కల , ఇక తీయటి జ్ఞ్యాపకంగా వాళ్ళు అనుకున్నా, వాళ్ళ జీవిత భాగస్వాములు ఎంత బాగా వీరిని అర్థం చేసుకొని వీళ్ళని స్వీకరించినా, ఈ సంఘటనలు వాళ్ళ భవిష్యత్తు జీవితాల్లో గుర్తు రావా. ఎక్కడో ఏదో విషయాలపై వాళ్ళ మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాళ్ళ మధ్య అనుకోవతందుకు , అభిప్రాయ బేదాలు రావటందుకు పాత జ్ఞ్యాపకాలు కారణాలు కాకుండా ఉంటాయ? అలాగే కల్హార , కౌశిక్ ల మధ్య వాళ్ళ మనస్సులో ఒకరి పట్ల ఒకరి పై ప్రేమ అలాగే ఉంటుంది కదా. ఎంత మరిచిపోయిన వాళ్ళ కి ప్రతీ క్షణం ఒకరికొకరు గుర్తు రాక మానరు కదా. వాళ్ళ జీవిత భాగస్వాములతో ఉంటూ ఇలా వాళ్ళు గుర్తుకు వస్తే అప్పడు వాళ్ళ పరిస్థితి ఏంటి. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా కొనసాగుతాయి అన్నవి ప్రశ్నలే. బహుశా ఈ విషయాలతో ఈ నవలకి ఇంకో సీక్వెల్ రాయొచ్చేమో. అయిన ఈ ప్రశ్నలకి సమాధానాలు ఉండవు కావచ్చు. కామెంట్లలో మిత్రుడు అన్నట్లు " ప్రతీ కథకి ముగింపులు , కంక్లూజన్లు ఉండవు....జీవితాలకి అస్సలు ఉండవు. ఈ కథ జీవితం లోని ఒక భాగం " నిజమే ఈ జీవితం ఇలానే కొనసాగుతుంది. ఇలాంటి కథలకి ముగింపు ఇదేనేమో.
ఏది ఏమయినప్పటికీ ఇది ఒక అందమయిన ప్రేమ కావ్యం మన మనసుల్ని అలా హత్తుక పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
4 comments:
భాను గారు,
తన్హాయి మీద మంచి విశ్లేషణ అందించారు. మీరు చదవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి...ఒక్క భాగానికి కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు అక్కడ నా బ్లాగ్ లో కామెంట్ పెట్టడమే కాకుండా..ఇప్పుడు మళ్ళీ మొత్తం గా మీ అభిప్రాయాలన్నింటిని ఒకేచోట మరో సారి చక్కగా అందించారు. మీ అందరి అభిమానమే తన్హాయి ని ఇంత దూరం నడిపించింది. మీ లాంటి మంచి పాఠకులు దొరకటం ఆ నవలకు, నాకు కూడా ఒక అదృష్టమే.
నేను నా ముగింపు వాక్యాలు ( పెట్టి...మళ్ళీ తర్వాత పెడదామని తీసేశాను లెండి) ల్లో ఎం రాశానో..దాదాపుగే మీరు అదే విధంగా రాశారు.
ఇక చివరి భాగానికి సంబంధించి మీ సందేహాలు....నో కామెంట్...
మరో సారి థాంక్స్ భాను. తన్హాయి మీద విశ్లేషణాత్మక వ్యాసాలకు మీరు శ్రీకారం చుట్టారు.
ఈ నవల నేను చదవలేదు. టైం దొరికితే చదవాలనే ఉంది. ఉర్దూలో తన్‌హాయీ అంటే ఒంటరితనం అని అర్థం. అయితే అది దేనికి సంబంధించినదో టైటిల్ చూసి ముందే చెప్పలేను.
meeru raasina ee abhiprayamu chaala baagundi, ee navala mugimpu konchamu baadhaga unna kooda paristitulanu drushtilo pettukonte ide correct anipinchela undi.
thanks ravali garoo
Post a Comment