మిసిమి సంస్థాపక సంపాదకులు శ్రీ ఆలపాటి రవీంద్రనాథ్ గారు. వీరిది గుంటూరు జిల్లా గోవాడ గ్రామం. చదువు ఉన్నత పాటశాల విద్య మాత్రమె. తమ తండ్రి గారు వారి గ్రామంలో 1918 లో ప్రారంబించిన రాజ రాజ నరేంద్ర గ్రందాలయంలోని పుస్తకాలను ఔపోసన పట్టారు. అభిరుచి గల అంశం పై స్వేచ్చా జీవితం కొన సాగించాలనే ఉద్దేశ్యం తో సొంత పెట్టుబడితో, తెనాలి లో జాకోబిన్ ప్రింటర్స్ 1943 లో ప్రారంభించి, ఇందులో పుస్తకాలు ముద్రించడంలో నేర్పు సంపాదించారు. 1946 లో తెనాలి నుంచే "జ్యోతి" పక్ష పత్రిక ను తదుపరి రేరాణి, కినిమా మాస పత్రికలను నిర్వహించి పత్రికా రంగం లో కొత్త ఒరవడి ని సృష్టించారు. 1990 లో వీరు మిసిమి మాస పత్రిక ను స్తాపించారు. ఆ మిసిమి నామ కరణ ఎలా జరిగిందట అంటే మిసిమి అన్న పేరు సూచించిన వారు డాక్టర్ బూదరాజు రాధ కృష్ణ గారట. ఇదివరలో ఎ పత్రికకి లేనటువంటిది, కుడి ఎడమల ఎటువేపు నుంచి చదివిన తేడా రానిది ఆయన సూచించారు. " మిసిమి" అంటే నూతన కాంతి, నవనీతం(వెన్న) అని రెండర్థాలు. ఆ పదం, దాని అర్థం సప్రమాణంగా చూపనిదే ఆయనకు సంతృప్తి కలిగింది కాదట.
నే వెలుంగుల దొర జోడు రే వెలుంగు"
అని బూదరాజు గారు అల్లసాని పెద్దన రాసిన "మనుచరిత్ర" లో నుంచి పై చరణాలు ఉతంకిన్చారట . అలాగే నవనీతం అన్న అర్థంలో ఎవరు, ఎక్కడ వాడారో ఉదహరించారు .
"మినుకు టూర్పులవాని
"మిసిమి" మేతల వాని
మెరుగు చామన ఛాయా మేనివాని...."
అని తెనాలి రామకృష్ణ కవి ప్రనీతమయిన "పాండురంగ మహత్యం" నుండి తీసుకున్నారట. ఈ విధంగా " మిసిమి" పత్రికకి నామకరణం బూదరాజు రాధ కృష్న గారు చేసారు.
మిసిమి అంటే ఆసక్తి కల వారు ఆన్ లైన్లో ఇక్కడ చూడవచ్చు .
2 comments:
గుంటూర్ కాదండోయ్ గుంటూరు.గుంటూర్ అంటే ఒకనాటి ఇండోనేషియా పాలకుడు సుకర్ణో గారి కొడుకు,ఇప్పటి మెగావతి సుకర్ణొపుత్రి గారి సోదరుడు.
రవీంద్రనాథ్ గారు నాపట్ల ఎంతో ఆప్యాయంగా ఉండేవారు.నేను గతంలో కొన్ని వ్యాసాలు రాసాను.ఆయనపోయాక,వేరే వ్యాపకాల్లో పడి మానేసాను,మరలా మొదలుపెట్టాలి కాకపోతే ఎప్పుడో తెలీదు.ఒక మంచి పత్రిక మీద,ఆ పత్రిక అధిపతి మీద ఒక మంచివ్యాసం రాసారు,మాచే చదివించారు,అభినందనలు.
@ రాజేంద్ర కుమార్ గారూ
క్షమించాలి. కరెక్ట్ చేశాను. మీ లాంటి వారు, అంటే గొప్ప వాళ్ళతో సన్న్హితులుగా ఉన్న వాళ్ళు , వాళ్ళ అనుభవాలు రాస్తే బాగుంటుంది కదా. త్వరలో రాస్తారని ఆశిస్తూ మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు.
Post a Comment