Thursday, December 30, 2010

పంచదార బొమ్మ ..పట్టుకొవద్దనకమ్మ

పంచదార బొమ్మ ..పట్టుకొవద్దనకమ్మ , మగధీర లోని ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట. ఈ సినిమా వచ్చాక ఏ  ఇంట్లో చూసిన, ఏ  సెల్ ఫోన్ రింగ్ విన్న  ఇదే పాట అంటే అతిశయోక్తి కాదేమో.  కొన్ని వేల సెల్ ఫోన్లలో ఉండి ఉండవచ్చు.  మంచి  మెలోడీ  తో , మంచి సాహిత్యం తో ఈ పాట వింటుంటే వినాలనిపిస్తుంది.  హీరో హీరోయిన్ను పంచదార బొమ్మ..నన్ను ముట్టుకోవద్దంటే ఎట్లా, నీ కోసమే పుట్ట నేను ,నువ్వు అందకపోతే ఈ జన్మ వృధా ,  నీకొరకు వరదయిన వరమని వరిస్తా, మునక కూడా నీ కోసం సుఖంగా భరిస్తానని అంటాడు.  ఈ పాట లో నాకు నచ్చిన చరణాలు, చూడండి.  

 గాలి నిన్ను తాకింది.. నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పేంది అని అతడు అడిగితె, ఆమేమో గాలి నాకు ఊపిరి అయ్యింది, నేలేమో నన్ను నడిపించింది మరి నీలోని  గోప్పెంటి ని అడుగుతుంది. అయినా అతడు ఊరుకోకుండా వెలుగు నిన్ను తాకింది, చివరికి చినుకు కూడా తాకింది, నేనేం చేశాను, నా మీద ఎందుకు  ఇంత  పక్షపాతము అంది అడిగితె, ఆమె ఏమంటుందో చూడండి. వెలుగేమో నాకు దారి చూపింది , చినుకేమో నాకు లాల పోసింది, వీటితోటి నీకేం పోలిక అని అడుగుతుంది. దీనికి అతడు ఎంత అందంగా, ఎంత బాగా చెప్తాడో చూడండి...." అవి బ్రతికున్నప్పుడే తోడున్టాయమ్మ....నీ చితిలో నే తోడయి నేనోస్తానమ్మ...." జీవితంలో నువ్వు అనుకోనేవన్నీ అంటే గాలి, నేల, వెలుగు, చినుకు ఇవన్నీ నువ్వు బ్రతికున్నంత వరకే నీ తోడుంటాయి, కాని నేను మాత్రం చివరికి నీ చితిలో కూడా అంటే నీ మరణం లో కూడా నీతో ఉంటా.. దీన్నేమనాలి మాటల్లో....ఎంత అందమయిన భావన, ఆమెకు అంతకన్నా ఇంకేం కావాలి.  మరణంలో కూడా నీ తోడుంటా అంటే అతడికి ఆమెపై ఎంత ప్రేమ ఉండాలి...ఆ ప్రేమను వ్యక్త పరచటానికి ఇంతకన్నా  గొప్ప మాటలు లేవేమో..ఇది రాసింది చంద్రబోసు అనుకుంటా..  అనూప్ గొంతులో  ఈ పాట వింటుంటే వినాలనిపిస్తుంది. .

పంచదార బొమ్మ బొమ్మా .. పట్టుకొవద్దనకమ్మా..మంచుపూల కొమ్మ కొమ్మా .. ముట్టుకొవద్దనకమ్మా ..
చేతినే తాకొద్దంటే .. చెంతకే రావద్దంటే .. ఏమవుతానమ్మా
 ..
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …
పువ్వు పైన చెయ్యిస్తే .. కసిరి నన్ను తిట్టిందే .. పసడి పువ్వు నువ్వని పంపిందే ..నువ్వు రాకు నా వెంటయే .. ఈ పువ్వు చుట్టు ముళ్ళంట .. అంటుకుంటే వళ్ళంతా మంటేనంట ..
తీగ పైన చెయ్యిస్తే .. తిట్టి నన్ను నెట్టిందే .. మెరుపు తీగ నువ్వని పంపిందే ..మెరుపు వెంట ఉరుమంట .. ఉరుము వెంట వరదంట .. నే వరద లాగ మారితే ముప్పంట ..
వరదైన వరమని వరిస్తానమ్మా ..అ ఆ .. మునకైన సుఖమని ముడేస్తానమ్మా .. అ ఆ ..నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …
ఆ అ ఆ అ అ అ …
గాలి నిన్ను తాకింది .. నేల నిన్ను తాకింది .. నేను నిన్ను తాకితే తప్పా ..గాలి ఊపిరి అయ్యింది .. నేల నన్ను నడిపింది .. ఏమిటంట నీలోని గొప్ప ..
వెలుగు  నిన్ను తాకింది .. చినుకు కూడా తాకింది .. పక్షపాతమెందుకు నాపైన ..
వెలుగు దారి చూపింది .. చినుకు లాల పోసింది .. వాటితోటి పొలిక నీకెలా …
అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మ .. నీ చితిలో తోడై నేనొస్తానమ్మా ..
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …

7 comments:

ఇందు said...

అవునండీ నాకు చాలా ఇష్టం ఈ పాట!ముందు ఆ మ్యుసిక్ కి కొంచెం చిరాకేసినా..రాను రాను భలే నచ్చేసిందీ...ఆ లాస్ట్ లైన్స్ నాకు బాగా నచ్చాయి...

'చితిలోననినా తోడొస్తానమ్మా!' నాకు చాల హృద్యంగా అనిపిస్తుంది

వేణూశ్రీకాంత్ said...

బాగా రాశారు భానుగారు.

Anonymous said...

Hats off to Chandrabose.

భాను said...

@ఇందు గారూ
నేనీ టపా రాసింది కూడా ఆ లైన్స్ నచ్చి. ఎంత అద్బుతమయిన భావన, రియల్లీ హాట్సాఫ్ టు చంద్రబోసు.
@వేణు గారూ
ధన్యవాదాలు
@అనామిస్సు గారూ
అవును హాట్సాఫ్ తో చంద్ర బోస్. థాంక్స్

మనసు పలికే said...

చాలా మంచి పాట గురించి రాసారు:) మంచి టపా:)

జ్యోతి said...

నాకు కూడా ఆ రెండు లైన్స్ నచ్చి మొత్తం పాట గురించి ఎప్పుడో రాసాను. కాని ఇంతమంచి పాట రాసిన చంద్రబోసే రింగ రింగా అనే అసభ్యకరమైన పాట రాసాడని తెలిసి బాధకలిగింది.

http://jyothivalaboju.blogspot.com/2009/09/blog-post_09.html

భాను said...

@అపర్ణ గారూ
ధన్యవాదాలు
@జ్యోతి గారూ
ధన్యవాదాలు . నిజమీ మీరన్నట్లు ఆ రెండు లైన్లే మనకి బాగా నచ్చుతాయి. ఇక పొతే పాటలు రాయడం గురించి అయితే, కొన్ని పాటలు వాళ్ళ కోసం అంటే ఆత్మ సంతృప్తి కోసం రాసుకొంటారు గావచ్చు. ఇటువంటివి అందులోకి వస్తాయనుకుంటా. ఇక ప్రోఫెస్సనల్ రైటర్ అనేవాడు ఎవ్వరు ఏది అడిగితె అది సందర్భానికి తగ్గట్లు రాసివ్వల్సిందే కదా. రింగా రింగా అటువంటిదే అనుకుంటా. వీళ్ళకి ఒక స్టేజి వచ్చాక నేను రాయను అని దైర్యంగా అంటారేమో. అప్పటిదాకా వాళ్ళ కలం నుంచి అని వర్గాలను సంతృప్తి పర్చేటివి వాళ్లకు ఇష్టం లేకున్నా , డబ్బులకోసమో, లేదా దర్శకుల కోసమో, నిర్మాతల కోసమో చివరికి జనం కోసమో రాయక తప్పదనుకుంట. . ఎన్నో రకాల పాటలు పాడిన బాల సుబ్రహ్మణ్యం ఒక స్టేజి వచ్చాక నేను ఇంకా ఈ బూతు పాటలు పాడలేను అని సినిమా పాటలు తగ్గించుకోన్నట్లు గుర్తు.