skip to main |
skip to sidebar
ఈ వారం ఆంద్ర జ్యోతి ఆదివారం అనుబందం లో చదివిన మరియ నాకు నచ్చిన కవిత." పాత పుస్తకాలూ కొత్త వెల్తురూ" ఇది దర్బషయనం శ్రీనివాసాచార్య గారు రాసారు. ఎన్నో సార్లు ఫుట్ పాత్ లపై పాత పుస్తకాలు అమ్మేవాల్లను చూస్తుంటాం. కాని ఇంత మంచి భావాలు, చదువుతుంటే " ఎన్నెన్ని ఇళ్ళ నుండి తరలివచ్చాయో గాని ఇల్లు పక్కనే ఇల్లు ఉన్నట్లు...అంటూ ఇంకా ప్రేమతో బహుమానంగా ఇచ్చిన పుస్తకాలు కూడా రోడ్డెక్కడం గురించి రాస్తూ " ఓ పుస్తకంలో తళుక్కుమని ఓ సంతకం దర్శనమయింది " ఆప్యాయతతో" అంటూ చేసిన తడి సంతకం, తేది తో సహా- తడై పోయాను- బహుమానాలు సైతం ఇలా బజార్న పడినందుకు. అంటుంటే హృదయం తడై పోతుంది. పాత పాత అంటుంది బాహ్య స్వరూపాన్ని చూసే సుమా అంటాడు. నిజమే లోపల కావ్యాలూ, కథలూ , సాహిత్యం ఇంకా ఎన్నెన్నో దాచుకున్న పుస్తకాలకు పాతదనమేక్కడిది చదివినప్పుడల్లా కొత్త దనమే .ఫుట్పాత్ లపై పుస్తకాలు చూసినప్పుడల్లా మనసు అటు లాగుతుంది. మన పాదాలు అప్రయత్నంగా అటు అడుగులేస్తాయి. చేతులు ఆప్యాయంగా వాటిని తడుముతూ, ఆ పుస్తకాల్లోనించి వచ్చే ఆ పాత వాసనలు ఆస్వాదిస్తూ, ఏదో మనకు ఇష్టమయిన వాళ్ళను కలిసిన స్పర్శించిన అనుభూతి . మనం కొన్న కొనకపోయినా ఒకసారి చూడడం. అయినా కొనకుంటా ఉంటామా చెప్పండి. ఎక్కడో మనకు ఇష్టమయిన రచయిత పుస్తకమో, లేకపోతె ఎక్కడ మనకు దొరకని ఓ పాత పుస్తకం మన కళ్ళ కెదురుగా కనపడుతుంటే మనసు ఊరుకుంటుందా. అది మనచేతుల్లోకి మన స్వంతం అయిపోదూ! మీరు చదవండి ఈ కవిత ( ఆంద్ర జ్యోతి సౌజన్యం తో)
ప్రతీ ఆదివారం అతను బరువు బరువుగా వొచ్చి
ఈ గరుకైన రాతి ఫుట్పాత్ ను
మెత్తనైన పాత పుస్తకాలతో అలంకరిస్తాడు
అమ్మకానికి అనువైన అరమరికలో
ఎన్నెన్ని ఇళ్ళ నుండి తరలి వచ్చాయో గాని
ఇల్లు పక్కన ఇల్లు పక్కన ఇల్లు వున్నట్లు
ఇక్కడ పుస్తకం పక్కన పుస్తకం - ఇలా సిలసిల!
గడిచిన కాలపు దాఖలాగా దుమ్మొకింత పట్టి
పుస్తకాలు కొంచెం దుబ్బపట్టి మసకబారి మాసినట్లున్నాయి
అతను వస్త్రంతో ఒద్దికగా తుడుస్తూ దులుపుతున్నాడు
పాతదనం సాంతంగా పోతూందని కాదు గానీ
ఇంకా ఇంకా పాతగా కనపదోద్దని అంతే!
పాతవే గానీ అన్నీ ఒకేలా పాతబడలేదు
మరీ మరీ పాతవి, కొంచెం పాతవీ, ఇటీవలి పాతవీ....
పాతా పాతా అంటున్నది బాహ్య స్వరూపాన్ని చేసే సుమా!
కళ్ళముందు ఎన్నెన్ని శాస్త్రాలు ఎన్నెన్ని భాశ్యాలూ
ఎన్నెన్ని కల్పనలూ కావ్యాలూ అంతరంగాలూ
ఎందరెందరి లోకంటి చూపుల ఊహల లిఖిత ముద్రలివి
ఎట్లా అంచనా వేసేది వీటిని, ఇట్లా పైపైనే చూస్తూ....
ఆ పుస్తకంలోకీ ఈ పుస్తంలోకీ తొంగి చూస్తుంటే...
ఓ పుస్తకంలో తళుక్కుమని ఓ సంతకం దర్శనమయ్యింది
"ఆప్యాయతతో" అంటూ చేసిన తడి సంతకం, తేదీ తో సహా-
తడై పోయాను - బహుమానాలు సైతం ఇలా
బజార్న పడినందుకు - ఆప్యాయతలెక్కడ?
కొన్ని కాగితపు నోట్లూ, మరికొన్ని కృతజ్ఞతలూ ఇచ్చి
ఆ పుస్తకాన్ని కొనుక్కున్నా, సంతకపు తడితో సహా.....
ఇక్కడ చేరిన వాళ్ళంతా కొంటారని కాదు కానీ
అక్షరాగారాల చుట్టూ ఇందరు కొలువుతీరడం
అక్షరాలా అపురూపం కదా
ఒకడి బతుకు తెరువు ఎందరికో నేత్రోత్చవం!
ఇక పొద్దు వాలిపోతుండగా మెల్లగా అతను
పుస్తకాల్ని పాత పెట్టెల్లోకి సర్దడం మొదలెడతాడు
సర్దుతూ సర్దుతూ లెక్కలేసుకుంటూ చూసుకుంటూ
పొద్దటి బరువు ఎంత తగ్గిందని అనుకున్టాదనుకుంటాను
అతనూ పుస్తకాల వెల్తురూ వెళ్ళిపోయాక
ఖాళీ అయిన ఫుట్పాత్
ఇప్పుడు నిజానికి తెరుచుకున్నట్లా
ఒంటరి చీకట్లో ముసుకున్నట్లా
Sunday, December 5, 2010
పాత పుస్తకాలు

నా గురించి
ఇది కూడా నా బ్లాగేనండి
ఘంటసాల లలిత గీతాలు
నా అతిధులు
Blog Archive
-
▼
2010
(70)
-
▼
December
(18)
- నయీ సాల్ ముభారక్
- పంచదార బొమ్మ ..పట్టుకొవద్దనకమ్మ
- వంశీ అండ్ గోదారి గట్టు...వంశీ అభిమానులకు శుభ వార్త...
- నా తోబుట్టువులు వేశ్యలు
- "మిసిమి " పత్రికకి ఆ పేరెలా వచ్చింది
- పుస్తక ప్రదర్శన కు నేను వెళ్ళా
- తన్హాయి....నా అభిప్రాయాలు
- ప్రాణహిత పుష్కరాలు
- ధనుర్మాసం... మా అమ్మమ్మ ..పొంగలి
- సియస్త ...మధ్యహ్న నిద్ర
- మాయా దుప్పట్లు ...నా పాట్లు
- Dr.M.V.తిరుపతయ్య గారి జీవితం..సాహిత్యం....ఆకాశవాణి...
- పాత పుస్తకాలు
- ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి జీవితం-సాహిత్యం
- తెలంగాణా సాయుధ పోరాటం (౩)
- తెలంగాణా సాయుధ పోరాటం (2 )
- మా తెలుగు తల్లికి మల్లెపూదండ....టంగుటూరి సూర్య కుమారి
- తెలంగాణా సాయుధ పోరాటం (1 )
-
▼
December
(18)
18 comments:
అవును, ఆదివారం ఆబిడ్స్ వీధులన్నీ పాత పుస్తకాల సరికొత్త వాసనతో పరిమళిస్తుంటాయి. ఎవరెవరివో, ఎక్కడెక్కడినుంచో వచ్చి ఒక చోట చేరి పరిచయాలు చేసుకుంటుంటాయి. ఎవరి చేతికో ఒకరి చేతికి చేరాక, వీడ్కోలు చెప్పుకుంటాయి.
ఆ వాతావరణమంతా ఒక రకమైన అవ్యక్త ప్రేమతో,ఎదురు చూస్తున్న పుస్తకం దొరకొచ్చన్న ఉత్సాహంతో, ఎప్పటికీ దొరకదనుకున్న పుస్తకం దొరినపుడు ఉద్వేగంతో,దొరికిన పుస్తకానికి చివరి పేజీలు లేకపోతే కొద్దిపాటి నిరాశతో,ఎంతో కొత్తగా, పాతగా, వింతగా ఉంటుంది. కొన్నా కొనకపోయినా పాత పుస్తకాల వీధుల్లో పచార్లు చేయడం ఒక గొప్ప అనుభూతి!
ఇది నా కోణం!
నాకు ఎదురైన పరిస్థితిని వివరిస్తాను. గమనించడం లోకం ఎలా మారిపోయిందో...
నా పర్యవేక్షకత్వంలో ఇప్పటివరకు ఇరవైమంది ఎం.ఫిల్.డిగ్రీలు పొందారు. నలుగురు పిహెచ్.డి. చేస్తున్నారు. ఇంకా అనేకమంది ఇతరులకు నేను పరిశోధనలో సాయం చేస్తుంటాను. ఈ క్రమంలో నా దగ్గర ఉన్న నా పుస్తకాలను తీసుకువెళ్లి చదివి తిరిగి ఇచ్చేవాళ్లూ ఉన్నారు. గత ఆదివారం ఆబిడ్స్ లో పాతపుస్తకాలను అలవాటు ప్రకారం వెతుక్కుంటుంటే నా దగ్గరనుంచి పరిశోధక విద్యార్థులు తీసుకువెళ్లిన పుస్తకాలు అరడజనుకు పైగా ఒకే చోట కనిపించాయి. నా సంతకం, నేను మార్జిన్లలో రాసుకున్న స్వంతదస్తూరిలోని కామెంట్లు, ఆ పుస్తకాలకు నేనిచ్చే క్రమసంఖ్యలు ఇవి చూసి నేను వాటిని గుర్తుపట్టాను. నా పుస్తకాలను నేనే మళ్లీ సగం ధరకు కొనుకున్నా.
నా పుస్తకాలను ఇతరులకు ఇవ్వడం మా ఆవిడకు నచ్చదు. నేను పుస్తకాలు కొనడానికి వెళ్లేటప్పుడు నాతో పాటు వచ్చి ఇదెందుకు వద్దులే మరోసారు కొందువులే అని నన్ను నిరుత్సాహపరిచే పనిని చాలా సమర్థవంతంగా చేస్తుంటింది. అలాంటి నా భార్య నా పుస్తకాలను నేనే మళ్లీ కొంటున్నప్పుడు చూసిన చూపు లక్షభావాలను ఒక్కసారి నా ముందు ఆవిష్కరించింది. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అని తాను పలికిన ఒక్కవాక్యం నాకు పర్వతమెత్తు తిరస్కారాన్ని చూపింది. ఇంతకన్నా దుర్భరస్థితి పుస్తకప్రేమికునికి ఉంటుందంటారా
పాతవే గానీ అన్నీ ఒకేలా పాతబడలేదు
మరీ మరీ పాతవి, కొంచెం పాతవీ, ఇటీవలి పాతవీ....
పాతా పాతా అంటున్నది బాహ్య స్వరూపాన్ని చేసే సుమా!
వర్ణించలేను నేను మీ కవితను..అంత బాగుంది మరి
చక్కని కవిత అండీ.. పుస్తకాల షాపులో తిరుగుతూ పుస్తకాలు చూస్తూ నచ్చినవి ఎంచుకునే అనుభవం ఒకలాంటిదైతే, రణగొణ ధ్వనుల మధ్య, కొద్దిపాటి తోపులాటలతో కూడిన ఫుత్పాట్ల మీద పాత పుస్తకాలను ఎంచుకోడం మరోరకం అనుభవం.. దేనికదే వైవిద్యభరితం.. పాత పుస్తకాల వాసనని నాసిక ముందు ఉంచినందుకు ధన్యవాదాలు...
బాగుంది మీ టపా..కానీ కామెంట్ వ్రాద్దామనుకున్నప్పుడు అక్కడ ఉన్న 'పండిత్ జీ' గారి వ్యాఖ్య చూసి చాల బాధేసింది. పాపం కదా అనిపించిందీ..మా గుంటూరులో బ్రిడ్జ్ దగ్గర ఆదివారం రోజు పెడతారు..ఎన్నెని పుస్తకాలో..కొన్ని బాగున్నాయని చేతులోకి తీసుకోగానే...ఏదో ఒక పేజీ ఊడిపోవడం...బాధ కలగడం...ఏంటో కదా!!కానీ ఒక్కొసారి నా అల్మారాలో ఉన్న పుస్తకాలని చూస్తే..కొద్దిరోజుల్లొ ఇవి కూడా పాతపుస్తకాలైపోతాయేమో అనిపించి బాధేస్తుంది :( చేదు,తీపి మిశ్రమంలా ఉంది మీ టపా..
@సుజాత గారు
నిజమే మీరు చెప్పింది మనం కొన్న కొనక పోయిన పుస్తకాలను చూడడం ఓకే అనుభూతి. ధన్యవాదాలు
@పండిత్జీ
మీకు ఎదురయిన సంఘటన చాలా బాధాకరమైనది. ఇది చదివి కొంత మందైన మారితే సంతోషమే కదా. మీ అనుభవం పంచుకున్నందుకు ధన్యవాదాలు
@అశోక్ గారు
థాంక్స్
@మురళి గారూ
పాత పుస్తకాల ను చూడడం ఆస్వాదించడం మీరన్నట్లు ఒక రకమయిన అనుభవం ధన్యవాదాలు
@ఇందు గారూ
అల్మారా లో ఉన్నవి పాతవైతే పర్వాలేదు.. బద్రంగా మీ దగ్గరే ఉంచి అప్పుడప్పుడు తీసి చదువుతుంటే పాత జ్ఞ్యాపకాలు ముసురుకొంతాయి. అదో రకమయిన అనుబూతి. ధన్యవాదాలు
కవిత బావుంది. "అక్షరాగారం" మంచి పదప్రయోగం.
నా హైదరాబాదు రోజులు గుర్తొచ్చాయి. ఆదివారం అనగానే మధ్యాన్నం 12.30 కల్లా ఇంత ముద్ద తినేసి, బస్ ఎక్కి అబిడ్స్ వెళ్ళిపోయి ఇక ఆ పుస్తాక సాగరంలో కొట్టుకుపోయేదాన్ని చీకటివేళవరకూ. కావాలనుకున్న పుస్తకాలు దొరకడం ఒక ఎత్తయితే, అనుకోని వరంగా దొరికిన పుస్తకాలు మరెంతో మధురం.
సుజాత గారూ....
"కొన్నా కొనకపోయినా పాత పుస్తకాల వీధుల్లో పచార్లు చేయడం ఒక గొప్ప అనుభూతి! ".... ఆ పుస్తకాల్లో ఉన్న అన్ని అక్షరలా నిజం.
@pandit jee
అయ్యో చాలా దారుణం..., మీరు చెప్పినది విని చాలా బాధ అమిపించింది. పుస్తకాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పాటించడం ఎంతైనా అవసరం...ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి.
భాను గారు,
ఈ కవిత తడిదనం నన్ను కదిలించింది. మాటలు రావడం లేదు. పైన పండిత్జీ గారి వ్యాఖ్య చూసాక పదాలు మరీ కరువయ్యాయి.
ఇంత చక్కని కవితను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
@సౌమ్య
ధన్యవాదాలు
@అపర్ణ
మీకూ ధన్యవాదాలు
భాను గారూ
పాత పుస్తకాల మీద టపా చాలా బాగుందండీ. శ్రీనివాసాచార్య గారి కవిత కూడా చాలా బాగుంది.
అరుణ పప్పు గారు ఒకసారి "సైకతశిల్పం" అని ఒక కధ రాశారు, పాత పుస్తకాలతో, షాప్ తో అనుబంధం ఉన్న ఒక మనిషి కధ. చాలా ఆర్ద్రంగా ఉంటుంది. అది గుర్తుకొచ్చింది.
నాకు కూడా నేను ఇండియాలో ఉన్నప్పుడు వైజాగ్ రోడ్ల మీద పుస్తకాల షాపుల్లో తిరిగిన రోజులు గుర్తుకొచ్చాయి. ఇక్కడ కూడా నోస్తాల్గియా వచ్చినప్పుడల్లా బుక్ షాప్ కి వెళ్లి విండో / కంఫర్ట్ షాపింగ్ చేస్తుంటాను. "ఒకడి బతుకు తెరువు ఎందరికో నేత్రోత్చవం! " ఎంత లోతైన భావం! సుజాత గారు చెప్పినట్టు "కొన్నా కొనకపోయినా పాత పుస్తకాల వీధుల్లో పచార్లు చేయడం ఒక గొప్ప అనుభూతి".
పండిత్జీ గారి వ్యాఖ్య చూసి బాధ అనిపించింది. నాకు కూడా ఇలాంటి అనుభవాలు బాగానే ఉన్నాయి. నేను ఇక్కడికి తెలుపు.కామ్, avfk.కామ్ నుండి చాలా పుస్తకాలు తెప్పించుకున్నాను. కొందరు వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, మీ దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి కదా, మా వాళ్ళు చదువుకుంటారు, కాలక్షేపం అవుతుంది అని తీసుకువెళ్ళే వారు. పెద్దవాళ్ళు వెళ్ళాక ఎన్ని సార్లు గుర్తు చేసినా, ఇస్తాము, తెస్తాము అనేవారు కానీ ఎక్కడా కనపడే వారు కాదు. అస్తమానూ ఫోన్ చేసి అడగితే ఏమనుకుంటారో అని వెధవ సంకోచం. కొన్ని సార్లు నేనే వాళ్ళ ఇంటికి వెళ్లి, వేరే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కోసం అడిగారు అని తెచ్చుకునేదాన్ని. కొందరి దగ్గరయితే అసలు తిరిగి రానే లేదు. ఇల్లు మారినపుడు ఎక్కడ పెట్టామో కనిపిచడం లేదు అని చెప్పడం. అలా డజన్ల కొద్దీ పోగొట్టుకున్నాక , నేనే తెలివి మీరి ఎవరైనా అడిగితే వదిలించుకోవాలనుకున్న యండమూరి (అనైతికం ఒక్కటే ఉంచుకున్నాను :-)) ) , యద్దనపూడి నవలలు లాంటివి ఇచ్చేసి కృష్ణార్పణం అనుకోవటం మొదలు పెట్టాను. అలా చాలా మంచి పుస్తకాలు పోగొట్టుకున్నాను. ఇక్కడికి తెప్పించుకోవాలి అంటే పుస్తకాల ఖరీదు కన్నా, షిప్పింగ్ ఎక్కువ అవుతుంది. అది గుర్తొస్తే బాధ నిపిస్తుంది. మన అనుభవాలు చదివిన కొందరైనా, తీసుకున్నవి తిరిగి సరిగ్గా ఇవ్వటం అలవాటు చేసుకుంటే అంతే చాలు.
పద్మవల్లి
@పద్మవల్లి
మీ అనుభూతులు షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఆ కథ చదవలేదండీ. ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా. పుస్తకాలు తీసుకేల్లెవాల్లకు తీసుక పోయేటప్పుడు ఉన్న శ్రద్ధ మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదండి. మనమేమో ఇంటరెస్ట్ తో కొనుక్కుంటాం .మీరన్నట్లు ఇది చదివాక కొంతమంది అయినా తమ అలవాటు మార్చుకుంటే సంతోషమే కదండీ.
భాను గారూ
అరుణ గారి బ్లాగ్లో కథకి లింక్ ఇక్కడ. అరుణ గారి అన్నీ రచనలూ నాకు నచ్చుతాయి. వీలైతే ఆవిడ మిగిలిన టపాలు కూడా చూడండి.
http://arunapappu.wordpress.com/2010/06/22/%e0%b0%b8%e0%b1%88%e0%b0%95%e0%b0%a4-%e0%b0%b6%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%aa%e0%b0%82/
కావాలంటే కథ నేరుగా ప్రాణహిత సైట్లో చదవచ్చు.
http://www.pranahita.org/2010/06/karigipoyina_saikata/
పద్మవల్లి
http://manishi-manasulomaata.blogspot.com/2009/05/blog-post_04.html
భాను గారూ, పద్మవల్లి గారూ, ఈ నా పోస్టు మీరు చదివి తీరాలి మరి!
సుజాత గారూ
మీ పోస్ట్ చాలా రోజుల క్రితమే చదివానండీ. మళ్ళీ మొన్న అనైతికం పోస్ట్ తో పాటు మల్లి చదివాను. మీ బ్లాగ్ లోనే వేరే కామెంట్ పెడతాను.
పద్మవల్లి
@ పద్మవల్లి గారు
లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. తీరిగ్గా చదువుతాలెండి.
@సుజాత గారు
మీ టపా చదివా. బాగుంది
Post a Comment