Wednesday, December 22, 2010

నా తోబుట్టువులు వేశ్యలు


ఏమి తోచక ఓ పుస్తకం చేతిలో తీసుకుంటే కనపడ్డ కవిత " నా తోబుట్టువులు వేశ్యలు"  Maureen Duffy కవిత కి యండమూరి తెలుగు అనువాదం

అరణం కోసమో - భరణం కోసమో
నియాన్ లైట్ల వెలుగుల్లో
చిరునవ్వు ఆభరణాలు ధరిస్తారు వాళ్ళు ,
వీధిమలుపుల్లో
రంగులు వెదజల్లే వాళ్ళ యవ్వనాలకు ధర
సందు చివర చీకట్లో
నువ్వు అంచనా కడతావు.

కాలం కాలువలో పెరిగిన
తనువు తరువుకి
బరువుగా కాసిన పెద్ద పెద్ద ఫలాలు
రుచి చూస్తె కుళ్లిపోయి వుంటాయి
నువ్వు విసుగ్గా పారేస్తావు

అందమయిన ఓ సాయంకాలం ఆ
అనుభవం గుర్తు తెచ్చుకొని విసుక్కొంటావు

కొనుగోలుదారుల ఆత్రపు తడి ఆర్చేశాక
రాత్రి పొత్తి కడుపు మీద ప్రత్యూష నిశ్శబ్దం మొగ్గ తొడుగుతుంటే
వాళ్ళు ఇళ్ళకు చేరి,
నీ వాసన ఉడుపులు విప్పెసుకుంటూ
నజరానాలను లెక్కబెట్టుకుంటారు,
నీ బండ చేతుల్లో నలిగిన వాళ్ళు,
తమ బలహీనమయిన చేతులు
ఒకరి చుట్టూ ఒకరేసుకొని
నిద్రకుపక్రమిస్తారు 

4 comments:

rojuko coffee rojuko blagu said...

nice one! thanks

Unknown said...

పాపం కదండీ .. ఏ జన్మలో ఎం చేసారో వాళ్ళు .. ..చాల బాధేస్తుంది ..

భాను said...

@రోజుకో కాఫీ గారూ
సారీ మీ పేరు తెలీదు. నచ్చినందుకు థాంక్స్
@కావ్య గారూ
అవునండీ.. ధన్యవాదాలు

Buchchi Raju said...

please watch
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.