బాల్యం .....చిన్నతనం.... ఏమి తెలియని వయస్సు, అయినా ఎంత హ్యాపీ గా గడిచాయి. ఇప్పుడు జ్ఞ్యాపకమొస్తే.....
మొదటి సారి మా ఇంటి దగ్గర ఉండే శుబ్రం అని ఒకతను అంటే మా మొదటిగురువు, మా ఇంటికి ఓ నాలుగు ఇండ్ల ఆవల ఉండేది వాళ్ళ ఇల్లు. మా ఉళ్ళో అప్పుడు అది మొట్టమొదట అ...ఆ...లు నేర్చుకోనేవారికి ప్రైమరీ స్కూల్ . ఇప్పుడు ఏవో ప్లే వే స్కూల్స్ ఉన్నాయిగా అల్లా అన్నమాట.చింతా చెట్టు కింద, చాపలు లేదా గోనే సంచులు వేసుకొని కూర్చొని చదివే వాళ్ళం. అప్పుడప్పుడు చింత కాయలు కుడా తినే వాళ్ళం లెండి. అలా కొన్నిరోజులు అక్కడ , తర్వాత ఒక అయ్యగారు ఉండేవాడు. అది యు.కేజీ అన్నమాట. అక్కడ కొద్దిగా స్ట్రిక్ట్ లెండి. కొద్దిగా ఏంటి "కోదండం" ఇప్పటివాల్లకు తెలియదు అనుకుంట! చదవకపోయినా, రాయకపోయినా అయ్యవారు కోదండం ఎక్కిచ్చేవారు. కోదండం అంటే ఓ తాడు పట్టుకొని వేల్లాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు కింద రేగు కంప కుడా పెట్టేవాడు. మరి కోపమొస్తే. ఇంకో పనిష్మెంట్ కూడా ఉండేదండి అది ఏంటంటే గోడ కుర్చీ . మనం కుర్చీ లాగ గోడకు అనుకోని ఎ ఆధారము లేకుండా ఓ పావు గంటో, అర్థ గంటో అలా కూర్చోవాలి. ఇవ్వన్ని మనం చూడడమే లెండి. మనకు లేవు. ఎందుకంటే మనం గుడ్ బాయ్ కదా, మీదుగా పట్వారి గారి మనవడినాయే.. మనకి కొంత కన్సిస్సన్ ఉండేది లెండి.....ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేతప్పుడు ఆ పక్కనే ఒక రేగు చెట్టు ఉండేది .ఎంచక్కా రేగు పండ్లు ఏరుకొని కొట్టుకొని తినే వాళ్ళం .ఇలా అక్కడ పెద్ద బాల శిక్ష అంతా చదివేసాం. ఇప్పుడు కుడా అక్కడక్కడ టీచర్ లు మంచి మంచి పనిష్మెంట్ లు ఇస్తున్నారట. ఈరోజు టి.వి. లో చూసానండి. మహబాద్ దగ్గర జమాండ్లపల్లి అనే ఉళ్ళో హెడ్ మాస్టర్ గారి కి కోపమోచ్చేసి , మండే పోయ్యిలోనించి కొరకాసు తీసుకొని అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా వాతలు పెట్టేసింది. మల్లి ఎంచక్కా చెబుతోంది అంటే వాళ్ళు అల్లరి చేసుకుంటూ తిరుగుతుంటే కోపం వచ్చేసి కాల్చిందట. పాపం ఆ పిల్లల వంటిపై ఎన్నెని కాలిన గాయాలు...జీవితాంతం ఆ బాల్యం గుర్తుండేలా......అన్యాయం....అమానుషం కదండీ.....డి.ఈ.ఓ.గారు ఆమెను సస్పెండ్ చేసారు గాని ఆమెను కుడా నిలబెట్టి ఓ పెద్ద కొరకాసు తీసుకొని ఆ పిల్లల చేత కాల్పిస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి ఉహించుకోండి. .......మళ్లీ కలుద్దాం ..అప్పటివరకు శెలవ్ ...
skip to main |
skip to sidebar
Wednesday, August 11, 2010
Saturday, August 7, 2010
దేఖ ఏక్ క్వాబ్
లతాజీ, కిషోర్ పాడిన సిల్సిలా లోని ఈ పాట ఎంత మధరం , అందమయిన దృశ్యాలు, మధురానుభూతులు అందించే సాహిత్యం తులిప్ పూల అందాలూ అన్నింటికీ మించి , అమితాబ్ రేఖ ఎంత అందమయిన ప్రేమ జంట , మరీ మరీ, వినాలనిపిస్తుంది. మీకోసం..
<">
<">
Friday, August 6, 2010
కలలు కల్లలైన వేళ.
రోజు పేపర్ లో ఎన్నో చదువుతుంటాం. కొన్ని మనకెందుకులే అని వదిలేస్తాం . కొన్ని చదివి అయ్యో పాపం అని ఒక నిట్టుర్పు వదిలి మన పనిలో పడతాం. కాని ఈరోజు డెక్కన్ క్రానికల్ లో చదివిన ఒక వార్త మనసును కదిలించి, రోజంతా వెంటాడుతు ఉంది. అదేంటంటే " SCHOOL BUS RUNS OVER LKG BOY".
హైదరాబాద్ లో మనికంట అనే అయిదు ఏళ్ల ఎల్.కే.జి అబ్బాయి హరిహరా గ్రామర్ స్కూల్లో చదువుతూ రోజాటిలాగే పాపం , బస్సు దిగగానే అగుపించే తల్లి కోసం ఆరాటపడుతూ, సంతోషంగా ఆ స్కూల్ బస్సు దిగి బస్సు ఎదురుగాకనపడుతున్న తల్లి తండ్రి లను చూస్తూ బస్సు ముందు నుంచే రోడ్డు దాటుతుండగా, ఆ బస్సు డ్రైవర్ చూసుకోకుండా బస్సును ముందుకు కదిలించాడు. అంతె, పాపం ఆ బస్సు చక్రాల కింద, ఆ పసిమొగ్గ ప్రాణాలు గాలిలో కలిసిపోయి. తల్లి తండ్రుల ఎదురుగానే, ఆ కొడుకు ప్రాణం లేకుండా మిగిలి పోయాడు. పాపం ఆ పిచ్చి తల్లి ఇంకా బతికి ఉన్నాడేమో అని విగత జీవి అయిన ఆ పసిమొగ్గ ను ఒడిలో పెట్టుకొని పిలుస్తూ కన్నీరు మున్నీరు అయిందని చదువుతుంటేనే మనసు ద్రవించి పోతుంది. కళ్ళు చెమర్చాయి. ప్రత్యక్షంగా కళ్ళెదుటే సంతోషంగా వస్తు ఒకేసారి ప్రానాలోదిలిన ఆ కొడుకును చుస్తే ఆ తల్లి తండ్రుల వేదన మాటల్లో చెప్పలేము.
పాపం ఆ పిల్లవాడి తండ్రి వెంకటేష్, చిన్న ఉద్యోగి అయినా, కొడుకు మంచిగా చదువుకోవాలని ఎన్నో ఆశలతో ఒక మంచి స్కూల్లో చదివిస్తూ, కళ్ళెదుటే ఆ కొడుకు మరణిస్తే, ఆ తండ్రి కడుపు కోత ........ ఒక చిన్న నిర్లక్ష్యం తో ఒక చిన్న మానవ తప్పిదంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. దీనికి ఎవ్వర్ని తప్పు పట్టాలి. సరి అయిన శిక్షణ లేని డ్రైవర్ లను తీసుకొన్న యాజమాన్యాలద,లేక పట్టిచ్చుకొనే ప్రభుత్వానిదా.? ఏది ఏమయినప్పటికీ వారి ఆశలు గాలిలో కలిసి పోయినై మరి వారి కలలు కల్లలయినాయి.
Wednesday, August 4, 2010
ధ్యానం
స్వామి జగదాత్మానంద గారి జీవనవికాసము నుండి "ధ్యానం" గురించి ...........
ఒక గిన్నెలో నుంచి మరొక గిన్నెలోకి నూనె పోస్తున్నప్పుడు ఏర్పడే తెగిపోని తైల ధార లాగ మనస్సు భగవంతుడి వైపు ప్రవహించే పద్ధతినే ధ్యానం అని అంటారు. జపం మరింత తీవ్రమైనప్పుడు అది ధ్యానం లో లీనమవుతుంది. శ్రీ రామకృష్ణులు ధ్యానం చేసేందుకు "హృదయం" చాల మంచి స్థానం అని చెబుతారు. కొన్ని సార్లు జ్ఞ్యానులు కనుబొమ్మల మధ్య, భక్తుల హృదయంలో ధ్యానం చేస్తారని చెప్పబడుతుంది. అప్పుడే మొదలుపెట్టిన వారికి ధ్యానం చేసేందుకు హృదయమే మేలైన స్థానం అనడంలో సందేహం లేదు. కాని ఈ హృదయం అనేది ఏమిటి? ఎక్కడుంది.
జాగ్రత్తగా పరిశీలిస్తే మనం మూడు రకాల హృదయాలు ఉన్నాయని చూడవచ్చు. శరీరం లోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపు చేసే హృదయం అందరికి తెలిసినదే. ఈ హృదయం తన పనిని తానూ చేయటం మాని వేస్తె శరీరం చేసే అన్ని పనులు ఆగి పోతాయి. కాని, "నేను నా గుండె లోతులలోనించి మాట్లాడుతున్నాను" ,"అతడి హృదయం పవిత్రమైనది" మొదలైన మాటలు అన్నప్పుడు మనం భావోద్రేకాలకు స్థానం అయిన హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాము. ఇది రెండవరకపు హృదయం. ప్రేమ, భక్తీ, నిస్వార్థత, కరుణ, సేవాభావం, వినయం ఇవ్వన్ని దయా గుణానికి , సౌహార్ద్ర భావానికి చిహ్నాలు. ఇక మూడవ హృదయం ఆధ్యాత్మిక హృదయం దీనినే అనాహత చక్రం అని కూడా అంటారు. (యోగ శాస్త్రములో స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు కలిసే కుడల్లను చక్రాలు అని పిలుస్తారు. )
హృదయం మీద ధ్యానం చేయాలనీ చెప్పినప్పుడు ఈ ఆధ్యాత్మిక మయిన హృదయం మీద అలా చెయ్యాలని వారి ఉద్దేశ్యం. మన శారిరకమయిన, జీవన సంబంధమైన అవసరాలను తీర్చుకోవటం కోసం , మన "అహంకారాన్ని" కాపాడుకోవడం కోసం మన యొక్క మానసిక శక్తులను మనలో చాలమంది అమితంగా వృధా చేస్తున్నారు. మనలో ఆధ్యాత్మిక చైతన్యం కలగాలంటే "మూలాధారం" లో నిద్రిస్తూ ఉన్న కుండలిని శక్తిని మేల్కొలిపి మనస్సుకున్న అన్ని సంకెళ్ళను త్రుంచి వేయడం అవసరం. దీనికి అర్థం ఏమిటంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు అనాహత చక్రం స్థాయి కి పైకి లేవాలి. రమణ మహర్షి చెప్పిన దాని ప్రకారం మనం "నేను"(అహం) అనే దాని యొక్క మూలాన్ని వెతుకుతూ పొతే అప్పుడు ఈ అనాహత చక్రాన్ని లేదా ఆద్యాత్మిక హ్ర్యుదయాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది.
కాని ఇది అంత సులభమైన పద్దతి కాదు. ఈ అహం అనేది ఎవరు? ఈ అహం ఎక్కడినుంచి పుడుతుంది? మనం మెలుకువ తో ఉన్న సమయం లో ఈ అహం అనేకమంది మనుష్యులతో కలుస్తూ ఉంటుంది. గాడమయిన నిద్రలో ఉన్న్డప్పుడు ఈ " అహం" ఎక్కడికి పోతుంది? నిదర లేచ్చినప్పుడు ఈ అహం ఎక్కడినించి వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఈ అహం యొక్క పుట్టుకను తెలుసుకోవాలను పయత్నించినపుచు ఒక స్థాయి ని దాటి ముందుకు కొనసాగలేని స్థితి ఒకటి వస్తుంది. ఇది ఆధ్యాత్మిక హృదయం ఉండే స్థానం. కాని ఎక్కువ మందికి ఇటువంటి అన్వేషణ ను పట్టు వదలకుండా కొనసాగించడం కష్టమవుతుంది. దీని కన్నా సులభమయిన పద్దతి ఏమిటంటే భగవంతునికి ప్రార్థన చేయడం.
ప్రార్థన ధ్యానానికి తోడుగా పనిచేసి , అందులోని కొరతలని పూరిస్తుంది. తీవ్రమయిన ప్రార్థనతో ధ్యానం మరింత సులభమవుతుంది. ధ్యానం చేయబోయే ముందు పది, పదిహేను నిమిషాలపాటు ఎకాగ్రమయిన మనస్సు తో ప్రార్థన చేస్తే మంచిది. మబ్బులు కమ్మినప్పుడు, వర్షం కుఇసినట్టే ప్రార్థన తీవ్రమయినప్పుడు మనస్సు పయికి లేచి భావోద్రేకాల - హృదయపు - స్థాయిని దాటి ఆహ్యత్మిక హృదయాన్ని చేరుకుంటుంది. భగవతుడి పట్ల తీవ్రమయిన వ్యాకులత ఇక్కడే మొదలవుతుంది. ధ్యానానికి పరిపూర్ణత ఇక్కడే కలుగుతుంది.

Tuesday, August 3, 2010
మరిన్ని జ్ఞ్యాపకాలు.............
తొలకరి జల్లు పడితే రైతుల కళ్ళల్లో చూసిన ఆనందం.......జ్ఞ్యాపకం
ఆ చిరుజల్లుల్లలో ఎగిరి తడిసి ముద్దైన ఆనందం ......జ్ఞ్యాపకం
తెల్ల వారు ఝామున రెల్లు గడ్డిపై మెరిసే మంచు బిందువులను చూసిన ఆనందం..... జ్ఞ్యాపకం
గడ్డిలో ఆరుద్ర పురుకులకై పడిన ఆరాటం......జ్ఞ్యాపకం
చెరువులో రాళ్ళతో కప్పగంతులు వేయించిన ఆనందం....జ్ఞ్యాపకం .
అక్కడే పడమరకు వాలి పోతున్న సూరీడు ఎరుపు .......జ్ఞ్యాపకం
ఆకాశంలో ఎగిరే కొంగల బారులు చూసి కేరినతలు కొట్టిన ఆనందం...జ్ఞ్యాపకం .
ఇంట్లో అందరికి అవ్వైన లింగావ్వ బొక్కి నోటి నవ్వుల.....జ్ఞ్యాపకం
సాయంత్రం చేలగట్ల పై బర్లు కాసే పిల్లవాడు వాయించిన పిల్లనగ్రోవి విన్న....జ్ఞ్యాపకం
గోదులివేళ.. ....జ్ఞ్యాపకం
రాత్రి నిద్రలోకి జరుకుంటుంటే ఎక్కడినుండో విన్న పల్లె పదాల .....జ్ఞ్యాపకం
పచ్చటి పైరుమించి వచ్చే పిల్ల గాలి....జ్ఞ్యాపకం
చేలల్లో పనిచేసే పడతులు పాడిన జానపదాల ....జ్ఞ్యాపకం .
చేలగట్టు మీదనుంచి నడుస్తుంటే జరా జరా జారి పోయిన పాము ....జ్ఞ్యాపకం
చిలక కొరికిన జామపండ్ల.........జ్ఞ్యాపకం
ఇంట్లో సీతాపలాలు రాశి గా పోసిన ....జ్ఞ్యాపకం
తెల్ల వారు ఝామున కోడి కొక్కొరోకో తో లేచిన......జ్ఞ్యాపకం .
చలికాలం ఇంటిముందు మంట తో చలి కాగిన.........జ్ఞ్యాపకం
ఇంటిముందు లేగ దూడల .....జ్ఞ్యాపకం
ఆ లేగ దూడలు తల్లి పొదుగులో పాలు తాగుతున్న ....జ్ఞ్యాపకం
రెల్లుగడ్డి, చెరువు అలలు, రామచిలుకలు, కొంగల బారులు,
ఎన్నో, ఎన్నెన్నో, పల్లె అందాల ...జ్ఞ్యాపకం
ఇంకా ఎన్నో ఎన్నెన్నో...................................

Monday, August 2, 2010
జ్ఞ్యాపకాలు
జ్ఞ్యాపకం .
మొట్టమొదట శుబ్రం దగ్గర అ...ఆ...లు నేర్చుకున్న . జ్ఞ్యాపకం
అయ్యవారి దగ్గర కోదండం చూస్తూ, అక్షరాలూ చివరి వరకు నేర్చ్కున్న జ్ఞ్యాపకం
ఇంటి పెరట్లో చింత చెట్టు కింద చింత కాయలు ఏరుకొని తిన్న.... జ్ఞ్యాపకం
ఎండాకాలం ఆరుబయట నాయినమ్మ పక్కన పడుకొని చుక్కలు చూస్తూ ఆమె చెప్పిన కథలు వింటూ నిద్రలోకి జారిన....జ్ఞ్యాపకం
పొద్దున్నే సద్దెన్నం తిని బడికి పోయిన ....జ్ఞ్యాపకం
తాతయ్య తో పొలం గట్ల వెంబడి నడిచిన.....జ్ఞ్యాపకం
ప్రతి శుక్రవారం బియ్యం శర్కర నాయినమ్మ ఇస్తే తీసుకోయి మజీద్ లో ఇచ్చిన... జ్ఞ్యాపకం .
తోటి పిల్లలతో ఉరి బయట పిల్ల కాల్వ లో సరదాగా ఆడిన ....జ్ఞ్యాపకం
ప్రతి ఏడు బతకమ్మలకు మా బతుకమ్మ ఉల్లో పెద్దగుండాలని అమ్మమ్మ పడ్డ కష్టం... జ్ఞ్యాపకం .
సద్దుల రోజు ఆడవాళ్ళూ "చిన్నీరి మీరు ఏమిట్లు చిన్నరక్క మీరు ఏమిట్లు" అంటూ ఇంటి ముందునుంచి పోయిన. జ్ఞ్యాపకం ....
పొలం దగ్గర రాత్రి ఒక్కడినే కావాలి పన్న ...జ్ఞ్యాపకం
మొదట స్కూల్ లో హెడ్ మాస్టర్ ముందు భయంగా నిలబడి పేరు చెప్పిన .... జ్ఞ్యాపకం .
సద్దుల రోజు అమ్మతోని చెరువు దగ్గరికి పోయి చెరువుగట్టు మీద ఆడిన ....జ్ఞ్యాపకం
నీళ్ళల్లో దీపాలతో బతుకమ్మ ను వదిలి పెడ్తే కేరింతలు కొడ్తూ ఆనందించిన ....జ్ఞ్యాపకం
ఎడ్లబండ్ల తో ఉల్లో అందరు పోటిగా తిరిగిన .....జ్ఞ్యాపకం
పీరీల పండక్కు దూల దూల అంటూ పీరీల వెంబడి పోయిన....జ్ఞ్యాపకం
సురభి నాటకాల వాళ్ళు వస్తే బాలనాగమ్మ చుసిన ....జ్ఞ్యాపకం
ముత్యాలమ్మ బావి దగ్గర ఆడవాళ్ళూ నీళ్ళు తీసుకెళ్ళే .......జ్ఞ్యాపకం
ఊరిబయట ఏరు పొంగితే బండ్లు కట్టుకొని పోయి చుసిన..... జ్ఞ్యాపకం .
మామిడి తోటలో దొంగతనంగా మామిడికాయలు కొట్టుకొని తిన్న....జ్ఞ్యాపకం
ఎప్పుడు మొదటి బెంచ్ లోనే కూర్చున్న ....జ్ఞ్యాపకం
చెరువు మత్తడి పోస్తుందంటే పోలో మని వెళ్లి చుసిన ....జ్ఞ్యాపకం
సంక్రాంతి కి కుండల వాయినాలు అమ్మ ఇస్తుంటే చుసిన.....జ్ఞ్యాపకం
పొద్దున్నే గంగిరెద్దుల వాళ్ళు ఉదుకుంటు ఇంటి ముందరికి వచ్చిన....జ్ఞ్యాపకం
పేపెర్ బాయ్ అంటూ పెద్ద తాతయ్య నోరార పిలిస్తే వార్తలు చదివి విన్పించిన....జ్ఞ్యాపకం
బండ్లు కట్టుకొని పక్క ఉరికి పోయి ఇందిరా గాంది ని చుసిన......జ్ఞ్యాపకం
ఈత నేర్చుకుండామని బావి గట్టున నిలబడితే బావయ్య నీళ్ళలోకి తోసేసిన ...జ్ఞ్యాపకం .
దీపావళి కి నాన్న పటాకులు తెస్తే అక్కతో పంచుకొని వాటిని కాల్చిన....జ్ఞ్యాపకం
స్కూల్లో ఎప్పుడు ఫస్టు వచ్చిన......జ్ఞ్యాపకం .
సాయంత్రం చావట్లో బొబ్బడాలు కొనుక్కొని తిన్న ....జ్ఞ్యాపకం .
ఉగాది రోజు ఊరంతా తాతయ్య ఇంటి దగ్గరకి వస్తే అయ్యగారు పంచాంగం చదివిన ....జ్ఞ్యాపకం
హోలీ రోజు అందరం స్నేహితులం మోదుగ పూల తో రంగులు తయారు చేసుకొని ఉల్లో తిరిగిన ......జ్ఞ్యాపకం
మొదటిసారిగా సైకిల్ కంచి తొక్కినా......జ్ఞ్యాపకం
బాబాయి దగ్గర లెక్కలు నేర్చుకున్న ...జ్ఞ్యాపకం
సెలవుల్లో పనివాళ్ళతో పాటు పావలాకి సోల శేనక్కాయలు కొట్టిన జ్ఞ్యాపకం....
వాన పడుతుంటే చూరు కింద నీళ్ళ లో తడుస్తూ కాగితపు పడవల తో ఆడిన...జ్ఞ్యాపకం .
రాత్రి పుట డప్పు సాటిమ్పుతో ఉల్లో వాళ్ళకు విషయాలు చెప్తుంటే విన్న ....జ్ఞ్యాపకం
పొద్దున్నే సరదాగా బర్రేపాలు పితికిన.... జ్ఞ్యాపకం
రాత్రి పుట చిడతల రామాయణం , బుర్రకత , హరికత విన్న .......జ్ఞ్యాపకం
స్కైలాబ్ పడుతుందంటే తలుపులు వేసుకొని కూర్చున్న.....జ్ఞ్యాపకం
ఉల్లోకి తాటకి వేషం వస్తే బయపడి ఇంట్లో అమ్మ చాటు దాక్కున్న ....జ్ఞ్యాపకం
పొలాల వెంబడి, చెట్ల కింద, ఏటిగట్టున, పిల్ల కాల్వల్లో, చెరువుగట్టున, బడిలో ,
మామిడి తోటల్లో, చావట్లో, మజీద్ లో , గుడిలో, ఇంకా ఇంకా,
తాతయ్య వెంట, అమ్మమ్మ చేత్తో, అమ్మ చాటున,
నాయనమ్మ ఒడి లో ఎన్నో....ఎన్నెన్నో.....పల్లె .జ్ఞ్యాపకాలు ..