Wednesday, August 4, 2010

ధ్యానం

స్వామి జగదాత్మానంద గారి జీవనవికాసము  నుండి "ధ్యానం" గురించి ...........


ఒక గిన్నెలో నుంచి మరొక గిన్నెలోకి నూనె పోస్తున్నప్పుడు ఏర్పడే తెగిపోని తైల  ధార లాగ  మనస్సు భగవంతుడి వైపు ప్రవహించే పద్ధతినే ధ్యానం అని అంటారు. జపం మరింత తీవ్రమైనప్పుడు అది ధ్యానం లో లీనమవుతుంది. శ్రీ రామకృష్ణులు ధ్యానం చేసేందుకు "హృదయం" చాల మంచి స్థానం  అని చెబుతారు. కొన్ని సార్లు జ్ఞ్యానులు కనుబొమ్మల మధ్య,   భక్తుల హృదయంలో ధ్యానం చేస్తారని చెప్పబడుతుంది. అప్పుడే మొదలుపెట్టిన వారికి ధ్యానం చేసేందుకు  హృదయమే మేలైన స్థానం అనడంలో సందేహం లేదు. కాని ఈ హృదయం అనేది ఏమిటి? ఎక్కడుంది.
      జాగ్రత్తగా పరిశీలిస్తే మనం మూడు రకాల హృదయాలు ఉన్నాయని చూడవచ్చు. శరీరం లోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపు చేసే హృదయం అందరికి తెలిసినదే. ఈ హృదయం తన పనిని తానూ చేయటం మాని వేస్తె శరీరం చేసే అన్ని పనులు ఆగి పోతాయి. కాని, "నేను నా గుండె లోతులలోనించి మాట్లాడుతున్నాను" ,"అతడి హృదయం పవిత్రమైనది" మొదలైన మాటలు అన్నప్పుడు మనం భావోద్రేకాలకు స్థానం అయిన హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాము. ఇది రెండవరకపు హృదయం.  ప్రేమ, భక్తీ, నిస్వార్థత, కరుణ, సేవాభావం, వినయం ఇవ్వన్ని దయా గుణానికి , సౌహార్ద్ర భావానికి చిహ్నాలు. ఇక మూడవ హృదయం  ఆధ్యాత్మిక హృదయం దీనినే అనాహత చక్రం అని కూడా అంటారు. (యోగ శాస్త్రములో స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు కలిసే కుడల్లను చక్రాలు అని పిలుస్తారు. )
         హృదయం మీద ధ్యానం చేయాలనీ చెప్పినప్పుడు ఈ ఆధ్యాత్మిక మయిన హృదయం మీద అలా చెయ్యాలని వారి ఉద్దేశ్యం. మన శారిరకమయిన, జీవన సంబంధమైన అవసరాలను తీర్చుకోవటం  కోసం , మన "అహంకారాన్ని" కాపాడుకోవడం కోసం మన యొక్క మానసిక శక్తులను మనలో చాలమంది అమితంగా వృధా చేస్తున్నారు. మనలో ఆధ్యాత్మిక చైతన్యం కలగాలంటే "మూలాధారం" లో నిద్రిస్తూ ఉన్న కుండలిని శక్తిని మేల్కొలిపి మనస్సుకున్న అన్ని సంకెళ్ళను త్రుంచి వేయడం అవసరం. దీనికి అర్థం ఏమిటంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు అనాహత చక్రం స్థాయి కి పైకి లేవాలి. రమణ మహర్షి చెప్పిన దాని ప్రకారం మనం "నేను"(అహం) అనే దాని యొక్క మూలాన్ని  వెతుకుతూ పొతే అప్పుడు ఈ అనాహత చక్రాన్ని లేదా ఆద్యాత్మిక హ్ర్యుదయాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది.
     కాని ఇది అంత సులభమైన పద్దతి కాదు. ఈ అహం అనేది ఎవరు? ఈ అహం ఎక్కడినుంచి పుడుతుంది? మనం మెలుకువ తో ఉన్న సమయం లో ఈ అహం అనేకమంది మనుష్యులతో కలుస్తూ ఉంటుంది. గాడమయిన నిద్రలో ఉన్న్డప్పుడు ఈ " అహం" ఎక్కడికి పోతుంది? నిదర లేచ్చినప్పుడు ఈ అహం ఎక్కడినించి వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఈ అహం యొక్క పుట్టుకను తెలుసుకోవాలను పయత్నించినపుచు ఒక స్థాయి ని దాటి ముందుకు కొనసాగలేని స్థితి ఒకటి వస్తుంది. ఇది ఆధ్యాత్మిక హృదయం ఉండే స్థానం. కాని ఎక్కువ మందికి ఇటువంటి అన్వేషణ ను పట్టు వదలకుండా కొనసాగించడం కష్టమవుతుంది. దీని కన్నా సులభమయిన పద్దతి ఏమిటంటే భగవంతునికి ప్రార్థన చేయడం.
          ప్రార్థన ధ్యానానికి తోడుగా పనిచేసి , అందులోని కొరతలని పూరిస్తుంది. తీవ్రమయిన ప్రార్థనతో ధ్యానం మరింత సులభమవుతుంది. ధ్యానం చేయబోయే ముందు పది, పదిహేను నిమిషాలపాటు ఎకాగ్రమయిన  మనస్సు తో ప్రార్థన  చేస్తే మంచిది. మబ్బులు కమ్మినప్పుడు, వర్షం కుఇసినట్టే ప్రార్థన తీవ్రమయినప్పుడు మనస్సు పయికి లేచి భావోద్రేకాల - హృదయపు - స్థాయిని దాటి ఆహ్యత్మిక హృదయాన్ని చేరుకుంటుంది. భగవతుడి పట్ల తీవ్రమయిన వ్యాకులత ఇక్కడే మొదలవుతుంది. ధ్యానానికి పరిపూర్ణత ఇక్కడే కలుగుతుంది.

0 comments: