Friday, August 6, 2010

కలలు కల్లలైన వేళ.

రోజు పేపర్ లో ఎన్నో చదువుతుంటాం. కొన్ని మనకెందుకులే అని వదిలేస్తాం . కొన్ని చదివి అయ్యో పాపం అని ఒక నిట్టుర్పు వదిలి మన పనిలో పడతాం. కాని ఈరోజు డెక్కన్ క్రానికల్ లో చదివిన ఒక వార్త మనసును కదిలించి, రోజంతా వెంటాడుతు ఉంది. అదేంటంటే "  SCHOOL BUS RUNS OVER LKG BOY".

 హైదరాబాద్ లో మనికంట అనే అయిదు ఏళ్ల ఎల్.కే.జి అబ్బాయి హరిహరా గ్రామర్ స్కూల్లో చదువుతూ రోజాటిలాగే పాపం , బస్సు  దిగగానే అగుపించే తల్లి కోసం ఆరాటపడుతూ, సంతోషంగా ఆ స్కూల్ బస్సు దిగి బస్సు ఎదురుగాకనపడుతున్న తల్లి తండ్రి లను చూస్తూ బస్సు ముందు నుంచే రోడ్డు దాటుతుండగా, ఆ బస్సు డ్రైవర్ చూసుకోకుండా బస్సును ముందుకు కదిలించాడు. అంతె,   పాపం ఆ బస్సు చక్రాల కింద, ఆ పసిమొగ్గ ప్రాణాలు గాలిలో కలిసిపోయి. తల్లి తండ్రుల ఎదురుగానే, ఆ కొడుకు ప్రాణం లేకుండా మిగిలి పోయాడు. పాపం ఆ పిచ్చి తల్లి ఇంకా బతికి ఉన్నాడేమో అని విగత జీవి అయిన ఆ పసిమొగ్గ ను ఒడిలో పెట్టుకొని పిలుస్తూ కన్నీరు మున్నీరు అయిందని  చదువుతుంటేనే మనసు ద్రవించి పోతుంది. కళ్ళు చెమర్చాయి.  ప్రత్యక్షంగా కళ్ళెదుటే సంతోషంగా వస్తు ఒకేసారి ప్రానాలోదిలిన ఆ కొడుకును చుస్తే ఆ తల్లి తండ్రుల  వేదన మాటల్లో చెప్పలేము.

 పాపం ఆ పిల్లవాడి తండ్రి వెంకటేష్, చిన్న ఉద్యోగి అయినా, కొడుకు మంచిగా చదువుకోవాలని ఎన్నో ఆశలతో ఒక మంచి స్కూల్లో చదివిస్తూ, కళ్ళెదుటే ఆ కొడుకు మరణిస్తే,  ఆ తండ్రి కడుపు కోత ........ ఒక చిన్న నిర్లక్ష్యం తో ఒక చిన్న మానవ తప్పిదంతో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. దీనికి ఎవ్వర్ని తప్పు పట్టాలి.  సరి అయిన శిక్షణ లేని డ్రైవర్ లను తీసుకొన్న యాజమాన్యాలద,లేక పట్టిచ్చుకొనే ప్రభుత్వానిదా.? ఏది ఏమయినప్పటికీ వారి ఆశలు గాలిలో కలిసి పోయినై మరి వారి కలలు కల్లలయినాయి. 

1 comments:

రాణి said...

డ్రైవర్ ని ఎందుకు అనడం? బుస్ లొంచి చిన్న పిల్లలు ఎలా కనిపిస్తారు. అంత చిన్న కుర్రాడు రోడ్ దాటకుండా తల్లిదండ్రులె రోడ్ కి ఇటు వైపు వచ్చి నిలబడచ్చుగా. స్కూల్ బస్ కాకపొయిన ఇంకా రోడ్ మీద వేరే వాహానాలు కూడా వెళ్తుంటాయిగా.