Tuesday, August 3, 2010

మరిన్ని జ్ఞ్యాపకాలు.............

తొలకరి జల్లు పడితే రైతుల కళ్ళల్లో చూసిన ఆనందం.......జ్ఞ్యాపకం
ఆ చిరుజల్లుల్లలో ఎగిరి తడిసి ముద్దైన  ఆనందం ......జ్ఞ్యాపకం
తెల్ల వారు ఝామున రెల్లు గడ్డిపై మెరిసే మంచు బిందువులను చూసిన ఆనందం..... జ్ఞ్యాపకం
 

గడ్డిలో ఆరుద్ర పురుకులకై పడిన ఆరాటం......జ్ఞ్యాపకం
చెరువులో రాళ్ళతో కప్పగంతులు వేయించిన ఆనందం....జ్ఞ్యాపకం .
అక్కడే పడమరకు వాలి పోతున్న సూరీడు ఎరుపు .......జ్ఞ్యాపకం

ఆకాశంలో ఎగిరే కొంగల బారులు చూసి కేరినతలు కొట్టిన ఆనందం...జ్ఞ్యాపకం .
ఇంట్లో అందరికి అవ్వైన లింగావ్వ బొక్కి నోటి నవ్వుల.....జ్ఞ్యాపకం
సాయంత్రం చేలగట్ల పై బర్లు  కాసే పిల్లవాడు వాయించిన  పిల్లనగ్రోవి విన్న....జ్ఞ్యాపకం

గోదులివేళ.. ....జ్ఞ్యాపకం
రాత్రి నిద్రలోకి జరుకుంటుంటే ఎక్కడినుండో విన్న పల్లె పదాల .....జ్ఞ్యాపకం
పచ్చటి పైరుమించి వచ్చే పిల్ల గాలి....జ్ఞ్యాపకం

చేలల్లో పనిచేసే పడతులు పాడిన జానపదాల ....జ్ఞ్యాపకం .
చేలగట్టు మీదనుంచి నడుస్తుంటే జరా జరా జారి పోయిన పాము ....జ్ఞ్యాపకం
చిలక కొరికిన జామపండ్ల.........జ్ఞ్యాపకం

ఇంట్లో సీతాపలాలు  రాశి గా పోసిన ....జ్ఞ్యాపకం
తెల్ల వారు ఝామున కోడి కొక్కొరోకో తో లేచిన......జ్ఞ్యాపకం .
చలికాలం ఇంటిముందు మంట తో చలి కాగిన.........జ్ఞ్యాపకం

ఇంటిముందు  లేగ దూడల .....జ్ఞ్యాపకం
ఆ లేగ దూడలు తల్లి పొదుగులో పాలు  తాగుతున్న ....జ్ఞ్యాపకం

 రెల్లుగడ్డి, చెరువు అలలు, రామచిలుకలు, కొంగల బారులు, 

 ఎన్నో, ఎన్నెన్నో, పల్లె అందాల ...జ్ఞ్యాపకం
ఇంకా ఎన్నో ఎన్నెన్నో...................................

0 comments: