బాల్యం .....చిన్నతనం.... ఏమి తెలియని వయస్సు, అయినా ఎంత హ్యాపీ గా గడిచాయి. ఇప్పుడు జ్ఞ్యాపకమొస్తే.....
మొదటి సారి మా ఇంటి దగ్గర ఉండే శుబ్రం అని ఒకతను అంటే మా మొదటిగురువు, మా ఇంటికి ఓ నాలుగు ఇండ్ల ఆవల ఉండేది వాళ్ళ ఇల్లు. మా ఉళ్ళో అప్పుడు అది మొట్టమొదట అ...ఆ...లు నేర్చుకోనేవారికి ప్రైమరీ స్కూల్ . ఇప్పుడు ఏవో ప్లే వే స్కూల్స్ ఉన్నాయిగా అల్లా అన్నమాట.చింతా చెట్టు కింద, చాపలు లేదా గోనే సంచులు వేసుకొని కూర్చొని చదివే వాళ్ళం. అప్పుడప్పుడు చింత కాయలు కుడా తినే వాళ్ళం లెండి. అలా కొన్నిరోజులు అక్కడ , తర్వాత ఒక అయ్యగారు ఉండేవాడు. అది యు.కేజీ అన్నమాట. అక్కడ కొద్దిగా స్ట్రిక్ట్ లెండి. కొద్దిగా ఏంటి "కోదండం" ఇప్పటివాల్లకు తెలియదు అనుకుంట! చదవకపోయినా, రాయకపోయినా అయ్యవారు కోదండం ఎక్కిచ్చేవారు. కోదండం అంటే ఓ తాడు పట్టుకొని వేల్లాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు కింద రేగు కంప కుడా పెట్టేవాడు. మరి కోపమొస్తే. ఇంకో పనిష్మెంట్ కూడా ఉండేదండి అది ఏంటంటే గోడ కుర్చీ . మనం కుర్చీ లాగ గోడకు అనుకోని ఎ ఆధారము లేకుండా ఓ పావు గంటో, అర్థ గంటో అలా కూర్చోవాలి. ఇవ్వన్ని మనం చూడడమే లెండి. మనకు లేవు. ఎందుకంటే మనం గుడ్ బాయ్ కదా, మీదుగా పట్వారి గారి మనవడినాయే.. మనకి కొంత కన్సిస్సన్ ఉండేది లెండి.....ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేతప్పుడు ఆ పక్కనే ఒక రేగు చెట్టు ఉండేది .ఎంచక్కా రేగు పండ్లు ఏరుకొని కొట్టుకొని తినే వాళ్ళం .ఇలా అక్కడ పెద్ద బాల శిక్ష అంతా చదివేసాం. ఇప్పుడు కుడా అక్కడక్కడ టీచర్ లు మంచి మంచి పనిష్మెంట్ లు ఇస్తున్నారట. ఈరోజు టి.వి. లో చూసానండి. మహబాద్ దగ్గర జమాండ్లపల్లి అనే ఉళ్ళో హెడ్ మాస్టర్ గారి కి కోపమోచ్చేసి , మండే పోయ్యిలోనించి కొరకాసు తీసుకొని అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా వాతలు పెట్టేసింది. మల్లి ఎంచక్కా చెబుతోంది అంటే వాళ్ళు అల్లరి చేసుకుంటూ తిరుగుతుంటే కోపం వచ్చేసి కాల్చిందట. పాపం ఆ పిల్లల వంటిపై ఎన్నెని కాలిన గాయాలు...జీవితాంతం ఆ బాల్యం గుర్తుండేలా......అన్యాయం....అమానుషం కదండీ.....డి.ఈ.ఓ.గారు ఆమెను సస్పెండ్ చేసారు గాని ఆమెను కుడా నిలబెట్టి ఓ పెద్ద కొరకాసు తీసుకొని ఆ పిల్లల చేత కాల్పిస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి ఉహించుకోండి. .......మళ్లీ కలుద్దాం ..అప్పటివరకు శెలవ్ ...
skip to main |
skip to sidebar
నా గురించి
ఇది కూడా నా బ్లాగేనండి
ఘంటసాల లలిత గీతాలు
నా అతిధులు
Blog Archive
-
▼
2010
(70)
-
▼
August
(16)
- నేనెరిగిన మా నాన్న .. రతీంద్రనాథ్ టాగూర్
- అంధ భిక్షువు
- గోరేటి వెంకన్న..పల్లె కన్నీరు పెడుతుందో
- పల్లె కన్నీరు పెడుతుంది
- ఇదీ మన జీవితం
- తుమ్మేటి గారితో కాసేపు (2)
- ఆర్తితో ......., ఆరాటంతో......
- తుమ్మేటి గారితో కాసేపు (1 )
- మధుశాల
- బాల్యం
- దేఖ ఏక్ క్వాబ్
- కభి కభి మేరె దిల్ మే ఖయాల్ ఆతా హై
- కలలు కల్లలైన వేళ.
- ధ్యానం
- మరిన్ని జ్ఞ్యాపకాలు.............
- జ్ఞ్యాపకాలు
-
▼
August
(16)
0 comments:
Post a Comment