Tuesday, November 9, 2010

వార్తలు చదువుతున్నది డి. వెంకట్రామయ్య

  

ఈ మధ్య అంతర్జాలం లో అలా విహరిస్తుంటే  రచన సంచికలు చూస్తుంటే డి. వెంకట్రామయ్య గారి పై ఫిబ్రవరి నెల రచన ప్రత్యెక సంచిక కనిపించింది. అది ప్రివ్యు ఎడిషన్. ఆయన్ని తలచుకోగానే " వార్తలు చదువుతున్నది డి. వెంకట్రామయ్య" అన్న మాటలు వినిపిస్తాయి. ఆ సంచికలో ఎ.బి.కే.ప్రసాద్ గారు, బండారు శ్రీనివాసా రావు గారు ఇంకా ఎందరో డి.వి. గురించి చాల చక్కటి విషయాలు తెలియ జేశారు. మూడు దశాబ్దాలు ఆకాశవాణి లో అనౌన్సర్ గా , న్యూస్ రీడర్ గా  పని చేసిన వెంకట్రామయ్య గారు మంచి కథకుడిగా కతాభిమానుల గుర్తింపు పొందారు. కార్మికుల కార్యక్రమం లో చిన్నక్క, ఏకాంబరం, రాంబాబు పాత్రలు సృశించి రెండు దశాబ్దాలకు పైగా శ్రోతల్ని ఆకట్టుకోవడమే కాకుండా రేడియో రాంబాబు అన్న పేరు సంపాదించుకున్నారు. ఇంకా ఈ సంచికలో ఎన్నో విషయాలు ఎన్నెన్నో విశేషాలు. ప్రివ్యు సంచిక ఇక్కడ చూడండి. ఆ సంచిక డిజిటల్ ప్రతి ఉంటె పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఇదే సంచిక నుంచి వారు ఆకాశవాణిలో నా అనుభవాలు" అనే పేరుతొ తమ అనుభవాలను చాలా చక్కగా మనకు తెలియని ఎన్నో విషయాలను వివరిస్తున్నారు. ఈ శీర్షిక మొదటి వ్యాఖ్య వారి మాటల్లో " శ్రోతల అదృష్టం కొద్ది నాకు పాటలు  చేత గాదు అందువల్ల ఆ ఒక్కటి వదిలేసి రేడియోలో ఇంకెన్ని రకాల పనులు చేయవచ్చో అవన్నీ చేసాను అంటారు.

 ఈ మధ్య వచ్చిన సంచికల్లో నేను ఈ అనుభవాలు  చదవడం జరిగింది.  మన తోలి ప్రధాని జవహర్ లాల్ మరణ వార్త ప్రకటన చేసిన అనుభవాలు రాస్తూ,   నెహ్రు గారు పోయిన్రోజు పగలు ద్యుటీలో ఉన్నప్పుడు ప్రైం మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రు ఈజ్ నో మోర్ అన్న వార్త చూసి ఆ తర్వాత అప్పుడు డ్యూటీ లో ఉన్న అనౌన్సర్ గా ఆ ప్రకటన చేస్తూ " ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రు కొద్ది సేపటి క్రితం కొత్త డిల్లీ లో ఆకస్మికంగా మరణించారని తెలియ పరచ టానికి చింతిస్తున్నాం..." అంటూ తెలుగులో తను, హిందీ మోహన్ సిన్హా అనే హిందీ అనౌన్సర్ అప్పుడు ప్రసారమౌతున్న కార్యక్రమాలు మధ్య మధ్యలో ఆపి ప్రకటించినట్లుగా  ఆ విషయాలు చాలా చక్కగా వివరించారు. ఇంకా ఎన్నో విశేషాలు తెలియజేస్తున్న ఆ రచన రేడియో ప్రియులు తప్పని సరి గా చదవలసిన రచన. 



1 comments:

తృష్ణ said...

ఒక సక్సెస్ఫుల్ న్యూస్ రీడర్ గా వార్తలు చదవటలోనూ, అనువాదం చేయటం ఎలాగో స్క్రిప్ట్ చదవటమ్లోనూ, ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చానని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. వెంకట్రామయ్యగారు రాసిన కథలు కూడా బాగుంటయండీ. ఆమధ్యన ఆయనకు కథకుడిగా రావిశాస్త్రిగారి స్మారక అవార్డ్ కూడా వచ్చిందండీ. ఎన్నో నాటకాలు, ఒక సినిమాకు స్క్రిప్ట్ కూడా ఈయన రాసారండి.
ఇటువంటి విశిష్ఠవ్యక్తులను గురించిన టపాలు తెలిసినవారందరూ రాస్తూ ఉంటే బాగుంటుందండీ.