Wednesday, November 10, 2010

అక్షరమే ఆయుధం...అలిశెట్టి ప్రభాకర్


అక్షరమే ఆయుధంగా జీవించిన అలిశెట్టి ప్రభాకర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే అంచెలంచెలుగా కవిత్వం రాసి జీవితమనే అనేక సంఘర్షణల వెనక మెడలో కెమేరాతో మదిని తొలిచే చిత్రాలను అందిస్తూ చిత్రకారుడిగా ముందుకు సాగిన వ్యక్తి. 1982 లో హైదరాబాద్ కు చేరిన అలిశెట్టి ఆంద్ర జ్యోతి దిన పత్రికలో సిటీ లైఫ్ పేరిట మినీ కవితలు అందించాడు. టిబీ అతన్ని మృత్యువుకు చేరువ అయిన  కాలంలో సిటీ లైఫ్ పారితోషికమే జీవనాదారమైంది.అంచెలంచెలుగా కవిత్వాన్ని అందించిన ప్రభాకర్ తనలో ఉన్న చిత్రకారుడు అంతరించి పోతున్న బాదేదో తనను వేదిస్తున్దంటు తరచూ చెప్పేవాడట. ఇప్పటికి మినీ కవిత లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న అలిశెట్టి 1993 , జనవరి 12  న ఈ సాహితీ లోకానికి దూరమైనాడు.
అతి ప్రయత్నం మీద దొరికిన " మరణం నా చివరి చరణం కాదు " అనే కవిత సంకలిని లో 65 కవితలలో కొన్ని  అముద్రిత కవితలు ఆయన గీసిన చిత్రాలు, తీసిన ఫొటోలతో ఉన్న ఈ సంకలిని లో కొన్ని నాకు నచ్చిన కవితలు.

మరణం నా చివరి చరణం కాదు/మౌనం నా చితాభస్మం కాదు/మనోహరాకాశంలో  లో విలపించే చంద్రబింబం/నా అశ్రు కణం కాదు,


ఘనీభవించే నిశ్శబ్దంలోనైన/కనురెప్ప తెరుచుకొనే చప్పుడు వినకుంటే ఎలా/

అశ్రుకణం/రాల్చలేని/శిదిలనేత్రం/అనుభూతిని /కోల్పోయిన/శిలాస్తన్యం/ ఆమె ఎవరు..ఆమె ఎవరు/అమావాస్యల/అట్టడుగున  పది/నలిగిపోయిన మొగిలిరేకు/పట్టపగలు/విద్వంసంలో /పడివిరిగిన/చంద్రవంక.

రహస్సంద్య అనే కవిత లో - చంద్ర గుప్తులూ, మౌర్యులూ. శాతవాహనులూ అంతరించి/చంద్రుడి చాటున  మబ్బులే మళ్ళీ రాజకీయాలు దోబూచులాడి/ప్రజల ప్రాణాలు తీస్తాయి/కాషాయం చెలరేగిరూళ్ళకర్ర విరిగిపోతుంది/భక్తీ పారవశ్యంతో రామశిలలు ఉప్పొంగి/రిజర్వేషన్ని రెండుగా చీలుస్తాయి/ధర్మం నాలుగు పాదాల నడుస్తూనే/చార్మినార్ చర్మం ఊడి మతం మళ్ళీ నెత్తురోడుతుంది/భయాన్ని పొదిమి  పట్టుకున్న పసిబిడ్డ ఖండ ఖండాలుగా నరకబడ్డ చుండూరు/భారత ఖండంలో నిశ్శబ్దంగానే ఉండిపోతుంది.


 విషాద సాక్షాత్కారం అనే కవిత లో కన్నీళ్ళని ఎ భాష లోకి అనువదించినా/విషాదం మూర్తీభవించిన స్త్రీ యే/సాక్షాత్కరిస్తుంది , అంటూ  నాలుగేళ్ల  మృదుత్వం/ మానభంగం శీర్షిక కింద/పడి చితికిన  హృదయ శకలాల్నించి// కళాశాల గోడలే కబంధ హస్తాలై/కబళించిన విద్యార్థినుల జీవితాల్నిచ్న్హి/కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి అంటుంటే ప్రణీత పై  ఆసిడ్ దాడులు. శ్రిలక్ష్మి లాంటి వాళ్ళు  గుర్తొచ్చి కన్నీళ్ళు రాక మానవు. ఎంత అధునాతనంగా ఎదిగినా/అసృబిందువునించి/స్త్రీ కింకా విముక్తి కలగలేదంటే/నిజంగా కన్నీరు సముద్రమై /నిజంగా కన్నీరు సముద్రమంతా అవేశమై/ అంటూ పోరాటం చేయాలంటాడు.

మృత్యువు తనని కబలిస్తుందని మొదలే తెలుసు కాబోలు, పర్సనల్ పొయం అనే కవితలో తెరవెనక లీలగా/మృత్యువు  కదలాడినట్టు/తెరలుతెరలుగా దగ్గొస్తుంది/తెగిన తీగెలు సవరించాదానికన్నట్లు /గబగాబాపరుగేత్తుకోచ్చి నా భాగ్యం/గ్లాసుడు  నీల్లన్దిస్తుంది అని రాసుకుంటాడు. భాగ్యలక్ష్మి అనే కవిత లో వారి గురించి రాస్తూ ఇద్దరం కలిసి ఒక కలగా/కలగాపులగంగా కలిసిపోయిన్ రోజుల్లో/ఇంచుమించు  ఒకే కంచం లో/ఇంద్రధనుస్సుల్ని తుంచుకొని తిన్నరోజుల్లో/మా గుండెల్లో సమస్యలు మందని  రోజుల్లో/సిగరెట్ పీక లాంటి నన్ను/సిగలో పువ్వులా తురుముకొని/అంటూ  తనని ఏమి అడగని తన అర్ధాంగి గురించి రాస్తూ, గాజు కుప్పెల్లాంటి  నా కళ్ళలోనే ఆశల  అగరొత్తులు  వెలిగించుకోంది అంటాడు. ఇంకా ఎన్నో కవితలు మనల్ని కదిలించేవి, గుండెలకు హత్తుకు పోయేవి.కొన్నైతే. ఆలోచిమ్పజేసేవి కొన్ని  , ఉత్తెజపరిచేవి కొన్ని.



తను శవమై..
ఒకరికి వశమై...
తనువు పుండై...
ఒకరికి పండై...
ఎప్పుడూ ఎడారి అయి...
ఎందరికో ఒయాసిస్సై....



10 comments:

సుజాత వేల్పూరి said...

తాను పుండై....ఈ కవిత మాత్రం ఇంకెవరూ రాయలేరేమో!

అలిసెట్టి గురించి ఒకసారి సహవాసి గారు తన బ్లాగు లో రాశారు.

ఎంతో గాఢత ఉన్న కవితలు! ఎంతో బాధ్యత ఉన్న కవితలు!ఎంతో వ్యథ, బాధ, ఆక్రోశం మిళితమైన కవితలు... ప్రతి ఒక్కటీనూ!

అకాల మృత్యువు వరించకపోతే ఇంకెన్ని కవితలు సృజించే వాడో ప్రభాకర్!

అక్షర మోహనం said...

దీన్ని మించి లొతైన,ఎత్తైన,బరువైన,సున్నితమైన, అర్ద్రవంతమైన కవిత ఇంతవరకు రానే లేదు..రాదు కూడా..!ప్రభాకర్ నీకు వందనాలు.

భాను said...

@ సుజాత గారు ,
మొదటి సారి నా బ్లాగ్ లో అడుగు పెట్టిన మీకు ధన్యవాదాలు
@అక్షర మోహనం గారు
ధన్యవాదాలు

విజయవర్ధన్ (Vijayavardhan) said...

"ఘనీభవించే నిశ్శబ్దంలోనైన/కనురెప్ప తెరుచుకొనే చప్పుడు వినకుంటే ఎలా"
బాగుంది. అలిసెట్టి గారి గురించి మొదటిసారి చదువుతున్నాను. ధన్యవాదాలు భాను గారు.

కొత్త పాళీ said...

ఈయన్ని గురించి ఎక్కడా విన్న గుర్తు లేదు.
కొన్ని కొన్ని వాక్యాలు మూలాలు కదిలించేలా ఉన్నాయి.
పంచుకున్నందుకు నెనర్లు.

భాను said...

@విజయ వర్ధన్ గారు మిగతావి కూడా చదవండి. థాంక్స్
@కొత్త పాళీ గారు మీరు వినకపోవడం ఆశర్యమే మరి. వేశ్య కవిత అంత బాగా ఎవరు రాయలేరేమో. మిగతావి కూడా చదవండి. ధన్యవాదాలు

Anwartheartist said...

మా చెడ్డీ బేచ్ రొజుల్నుంచి విన్న పేరిది , అ రొజుల్లొ ఆయన బొమ్మలు, కవిత్వం మాకు ఆ రొజుల ఇన్స్పిరేషన్, తొటి నేస్తులు ఎవరైనా అమ్మయిల మీద శ్రుతి మించి నొరుజారినపుదు కొంపెల్ల జనార్ధన రావు కోసంవొకటి, ప్రభాకర్ గారి వేశ్య కవిత్వం ఒకటి ఎత్తుకునే వాళ్ళం. బతుకు బలిసి ప్రభాకర్ గారిని మరిచాం గాని మీ వ్యాసం వల్ల మల్లీ ఆ రొజులు, ఆ కాగితాలు ,త్రిపురనేని శ్రీనివాస్ చివరి పేజి, అర్టిస్త్ టీవీ ప్రసాద్ మడత కాజా బొమ్మలు కనబడుతున్నయి.

ఆ.సౌమ్య said...

భాను గారు అలిశెట్టిగారు గారి గురించి రాసినందుకు ముందుగా ధన్యవాదములు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆయన చిత్రాలు నాకు బాగా గుర్తు. మా ఇంట్లో ఉన్న పాత ఆంధ్రజ్యోతులన్నీ ప్రభాకర్‌గారి బొమ్మల కోసం తిరగేస్తూ ఉండేదాన్ని ఎప్పుడూ. కొన్ని చిత్రాలు ఎలా అనిపించేవంటే "నాలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావా", "ఏం నీకు నువ్వు కనిపించట్లేదూ" అని సాధారణ ప్రేక్షకుడిని అడుగుతున్నట్టు ఉండేవి. కానీ ఆయన కవితలు మాత్రం ఎప్పుడూ చదివిన జ్ఞాపకం లేవు. ఇప్పుడే మీ ద్వారా పరిచయం అయ్యాయి. గుండెలోతులోనుండి వచ్చినట్టున్నావు. "వేశ్య" కవిత చదివి గుండె చిక్కబట్టుకుంది. ఆయన కవితా సంకలనం ముద్రణ కి నోచుకుందా? విశాలాంధ్రలో దొరుకుతుందా ? దయచేసి చెప్పగలరు.

భాను said...

@ అన్వర్ గారు
మీకు ఆ పాత రోజులు నా బ్లాగ్ ద్వారా గుర్తుకు తెచ్చినందుకు సంతోషం. మీ హ్ర్య్దయపూర్వక కామెంట్ కు ధన్యవాదాలు

@ సౌమ్య గారు
మొట్టమొదటి సారి నా బ్లాగ్ లో అడుగుపెట్టిన మీకు స్వాగతం. "నాలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావా", "ఏం నీకు నువ్వు కనిపించట్లేదూ" బాగుంది మీ వ్యాఖ్య.నిజమే. ఆయన కవితలు కూడా చదువు తుంటే ఆ అనుభూతులు అనుభవించాల్సిందే. కవిత సంకలనం విరసం వాళ్ళు ప్రచురించారు. అలిశెట్టి చనిపోయిన సరిగ్గా ఏడాది కి అంటే 1994 జనవరి 12 న మొదటి సారిగా ముద్రించారు. ఇప్పుడు దొరుకోతుందో లేదో తెలియదు. మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు

ఆ.సౌమ్య said...

లేదండీ నేనింతకుముందు కూడా మీ బ్లాగులో కామెంటు రాసాను, అప్పుడు కూడా మీరిలాగే స్వాగతం చెప్పారు. :)

ఓహో విరసం వాళ్ళు ముద్రించారా, అయితే వెతుకాలెండి.Thanks!