నమస్తే అన్నలూ ..అక్కలూ ...చేల్లెమ్మలూ. తమ్ముళ్ళూ అందరికి పెడతాండ....దండం. అందరు బాగున్నారే. చూత్తాంటే చూత్తాంటే పాత సంవత్చరం ఖతం అయిపొయింది. కొత్త ఏడాది వత్తాండే. ఇప్పుడే గీడ కూసోని సొంచాయించిన, గీ ఏడాదిల ల మనం ఎం గొప్ప పని జేసినం అని..ప్చ్ ఎం కానోస్తలే. ఏదో దినాలు, నెలలు, అయిపోతాండే. ఏడ యేసిన గొంగళి గాడనే ఉన్నట్లు మనం ఏడ ఉన్నమో ఆడనే ఉన్నాం. సంవత్చరం అయిపోవచ్చే. గప్పుడు కే.సి.ఆర్. చచ్చుడో, తెలంగాణా వచ్చుడో అని ఆయన అన్నం గిన్నం ఎం తినకుంటే అదేంది" ఆమరణ నిరాహార దీక్ష "శురూ జేసే. చూత్తాంటే ఈడ జేసిన్ద్రని ఆడ , ఆడ జేసిన్ద్రని ఈడ లొల్లి మీద లొల్లి, బస్సులు తగులబెట్టిరి. ఆఖరికి పాపం అభం శుభం తెల్వని పోరగాండ్లు వాళ్ళను వాళ్ళు తగలబెట్టుకోనిరి. గట్ల చూత్తాంటే కొత్త సంవంత్చారం జై తెలంగాణా , జై ఆంధ్రా అంటూ మొదలాయే. ఆడికి మన చిదంబరం ఏదో మంత్రమేసి కృష్ణ కమిటీ ఎసి ఆడికి ఆ ముచ్చట ఖతం జేసిండు గదా. నాకు జర్ర గబ్రాయించింది లే ఎందుకంటే అరె గీ లోల్లిల మన పోరగాండ్ల చదువులు ఏడ ఖరాబ్ అయితఎమోనని. ఏదో మొత్తానికి మనకి టైం కల్సి వచ్చి ఆ గండం గట్టెక్కింది.
నడిమిట్ల ఏమయ్యిందంటే.....ఏమయ్యిందే. ఆ నేనయితే గీ తెలుగులా బలాగ్గింగ్ శురూ జేసినా. ఏదో అట్లా నడిపిస్తాన. ఆడ ఒకళ్ళు ఈడ ఒకళ్ళు దోస్తులయ్యిండ్రు. మొన్న గాడ పట్నం ల ఈ-తెల్గు అని పెడ్తే ఆడికి గుడక పోయోచ్చిన. చిన్నంగ చిన్నంగ ఏదో ఈ బ్లాగ్గింగ్ చ్జేస్తాన. ఆ ఇదేమ గొప్పతనం లే.
కోసకోచ్చేసర్కి కృష్ణ కమిటీ రిపోర్ట్ గోర్మేంట్ కి పాయె ఇంకా ఆరు రోజులట ఎమొస్తాదో ఏమో, మల్ల గీ కొత్త సంవత్చరం లోల్లులు, గడ్బడ్లు, బందులు ధర్నాలతో శురూ అయేటట్టు కన్పద్తాంది, మల్ల పోరగాండ్ల చదువులు అటుకేక్కేతట్టుంది గాదె. మా కాడ ఏమంటారంటే "రెడ్డొచ్చె మొదలాడే" అని గట్లుంది కథ మళ్ళీ మొదలాయే. ఎం జేస్తం మనం చూస్కుంట కూసున్డుదేనాయే. కాని ఇదే మా తాతగారి జాగీర్..ఇది మా అయ్య సొమ్ము...ఇది మా తల్లిగారిల్లు...ఇది మా ఇలాకా.. మాది మాక్కావాలి అంటే తప్పెందే. ఏడికి పోతం. ఈడనే ఉంటాం . సరే ముచ్చట ఏడికో పోతాంది. అది ఒగ్గెయ్యి. యాది మరిచిన. అస్సలు గీ కొత్త ఏడాదిల ఎమన్నా జేద్దమంటే ఎంత సొంచాయిన్చినా ఎం మనసులకి రాట్లే. ఎవురన్న ఎమన్నా కొత్త ఇవిడియాలు ఇస్తారా మరి. సరే మరి గీడకి ఇగ ఆపేస్త గాని... అందరకి ఈ కొత్త సంవత్చరం మంచిగుండాలె , అందరికి నయీ సాల్ కీ ముభారాక్ చెబ్తాండా. మీరంతా గా సమ్మక్క సారలమ్మ దీవెనలతో చల్లగుండాలే. మరి నాతొ ఉంటె ఎట్లనే. పోయి ఎంజాయ్ చేయార. మల్లోక్కసారి అందరికి నయీ సాల్ ముభారాక్.. ఇగ ఉంటానే మరి.
10 comments:
భాను గారు, మీక్కూడా నయా సాల్ ముబారక్:)
Nice post..
నయా సాల్ లో ఏం జేయాల్నో చెప్పకనే చెప్పినవ్ కదన్నా.
ముబారక్ హో ముబారక్ ఆప్ కూ ఔర్ ఆప్ కి పరివార్ కో భీ
అపర్ణ గారి కామెంట్ లో Nice ని cool తో రిప్లేస్ చేసుకుని నాకామెంట్ గా మళ్ళీ చదువుకోండి :)
@అపర్ణ గారూ
మీ ముభారక్ కి నా షుక్రియా. మీకు మళ్ళీ నూతన వత్సర శుభాకాంక్షలు
@అనానిమస్
షుక్రియా ఇంకేం తమ్మీ శురూ చెయ్యి మరి
@స్వామి
థాంకులు మీకూ మీ కుటుంబానికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు
@వేణు గారూ
మీకేమో కూల్ ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు
@రావు గారూ
ధన్యవాదాలు మీకూ మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీకు సుక దండం...అరే మీరు గాట్ల రాస్తే మేము పొరగాడ్లం సనా సంతోసపడిపోతం.:))మీరు గట్ల రాస్తే సాన మస్తుగున్నది..అరే భాయ్ మీకుసుకా నయా సాల్ ముబారక్ హొ.
happy new year
tamme bhaanu,,, meeku bhee nayee saal kaa mubaarak..
audiyaalu gaavalna? mastunnayi, mundugala bobbadaala katha cheppaka pothivi...iga suru cheyyi tammee..
meeku mee family ki happy new year andee
భానుగారు....ముందుగా సారి! సారీ! లేట్ గా పెడుతున్నా ఈ వ్యాఖ్య! మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు :) మీకు ఎన్నెల రామాయణం బాగా పట్తేసినట్టుందీ...నాకు కొద్ది రోజులు అదే పరిస్థ్థితిలేండీ! హా! చిన్న టపా వేసారు.ఈసారి ఎన్నెల గరిలాగే మాంఛి తెలంగాణా యాసలో పెద్ద టపా వేయాలి.ఎన్నెల రామాయణం అయిపోయిందీ....ఇక 'భాను భారతం' అని మీరు భారతం మొదలుపెట్టేయండి మరి!
@మాల కుమార్ గారూ
మీకూ హాప్పీ న్యు ఇయర్
@ఎన్నెల గారూ
షుక్రియ అక్కో. అడియాలు పంపున్ద్రి , బొబ్బదాల కథ చెప్తా మల్ల ....మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు, మీకు మీ కుటుంబానికి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
@ఇందు గారూ
థాంక్స్ లేట్ గా నైన నా బ్లాగ్లో కామెంటినందుకు. మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ..హ..హ్హ.. భలే చెప్పారు. ఒకటా రెండా మూడు పోస్ట్లాయే... మీ సలహా ఏదో బానే ఉంది భాను భారతం ట్రై చెయ్యాలి...అవును మీరే రాస్తే ఎలా ఉంటుందో... ధన్యవాదాలు
Post a Comment