ఈ వారం వార్త ఆదివారం అనుబంధం లో (అక్టోబర్ , 10 ) లో ప్రచురితమయిన (సృష్టి శీర్షికన) కాత్యాయని విద్మహే గారు "అస్తిత్వ సమస్యలోని సంక్లిష్టతల ఆవిష్కరణ" అంటూ రహమతుల్ల రచయిత యొక్క " నర్గిస్" కథ గురించి పరిచయం చేశారు. విద్మహే గారు రహమతుల్ల గురించి " అల్ప సంఖ్యాక వర్గంగా సమాజం చివరి అంచులకు నేట్టబడిన ముస్లిం మతమానవ సమూహాల జీవన వేదనలను కథలుగా మలుస్తూ తెలుగు కథా సాహిత్యానికి వస్తు గౌరవం పెంచుతున్న నేటి రచయిత రహమతుల్ల" అని అంటారు.
ఇది చదివాక ఈ మధ్యే నేను ఆకాశవాణి లో విన్న కథ ప్రసారం మరియు ప్రసార సమయంలో నేను రికార్డ్ చేసిన రహమతుల్ల గారి కథ గుర్తుకు వచ్చింది. నాకు రహమతుల్లా గారి గురించి తెలీదు. కాత్యాయని గారి రివ్యు చదివిన తర్వాత, రహమతుల్ల గారి " బా" అనే కథ కూడా చదివాను. తండ్రి గురించి , వారి జ్ఞ్యాపకలను, ముస్లిం సంప్రదాయాలను, పల్లెటూరి వాతావరణాన్ని చాలా చక్కగా వివరించారు. ఒకసారి చిన్నప్పటి పల్లెటూరి జ్ఞ్యాపకాలు, మనల్ని చుట్టుముట్టుతాయి. ఇంటరెస్ట్ అనిపించి అంతర్జాలం లో వెతికితే రహమతుల్ల గారి కథల సమీక్షలు కనిపించాయి. అవి ప్రాణహితలో, మరియ ప్రజాశక్తిలో చదవవచ్చు.
ఆకాశవాణి మరియు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు సంయుక్తంగా నల్గొండ లో నిర్వహించిన కార్యక్రమంలో కథకులే తమ కథలను చదివి విన్పించారు .అట్టి కార్యక్రమాన్ని ఆకాశవాణి ప్రసారం చేసింది. ఆకాశవాణి అట్టి ప్రసారంలో భాగంగా రహమతుల్ల గారు స్వయంగా తను రాసి చదివిన కథ ఈ " కరిమున్నిసా నవ్వు" .
రహమతుల్ల గారు తన చెల్లెలు జ్ఞ్యాపకాలను మన కళ్ళ ముందు సజీవంగా ఉంచుతారు. స్వచ్చమయిన నవ్వుతో అమాయకంగా పెరిగిన తన చెల్లెలు, పదమూడవ ఏటనే పెద్దమనిషి కాగానే చదువు మాన్పించడం ఇది సాయెబుల ఇళ్ళల్లో ఇదొక మామూలు విషయంగా, పద్దెనిమిదవ ఏటనే పెళ్లి చేయడం. ఆ తర్వార రెండేళ్లకే కొడుకును కనడం, తర్వాత కరీమున్నిస అనారోగ్యంతో అర్ధాంతరంగా జీవితాన్ని అనుభవించకుండానే ఈ లోకం వదిలి వెళ్ళటం , గురించి వివరిస్తూ మల్లెమొగ్గ, పువ్వులా వికసించి పరిమళాలు వెదజల్లక ముందే రాలిపోయింది. భర్తంటే ఒక దూరంతో కూడిన అనురాగం వీడి ఒక చనువుతో కూడిన స్వేచ్చ రాకముందే వెళ్ళిపోయింది అని అంటాడు. దేవుడు అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఏది అనుభవించకుండానే తిరిగి రప్పించుకున్నాడు అని తన చెల్లెలు జీవితం లో ఏది అనుభవించకుండా వేల్లిపోవడాన్ని చాలా బాధతో తెలియ జేస్తాడు. కథలో భాగంగా ముస్లిం సంప్రదాయాలును కూడా తెలియజేస్తారు . తన చెల్లెలు నవ్వు మేఘం కదులుతున్నట్లు ఉంటుందని ఎం చేసిన నవ్వుతు , కరీం అంటేనే నవ్వని ఆడపిల్ల నవ్వోద్దన్న నవ్వేదని నవ్వినప్పుడు బుగ్గమీద సొట్ట చాంద్ కోసంటి వీనస్ వెలుగులా ఉండేదని. ఎప్పుడు నవ్వుతు ఉండే కర్రీ అల్లా కు ప్యారీ బన్ గయీ , జిందగీ బారి హస్కే , పచ్చిస్ సాల్ హస హస్కే మరి. స్వేచ్చగా నవ్వనన్న నవ్వనియ్యకపోతిమి, నవ్వు నవ్వు కు అడ్డు కట్టలేస్తిమి , పాతికేళ్ళు నవ్వి వందేళ్ళు మమ్మల్ని నవ్వకుండా చేసింది. కరిమున్ ఒక నవ్వు . నవ్వు విశాదమేట్లయితడి. . అదొక దివ్యానుభూతి "హసి జైసీ కర్రీ హమేషా హమారీ యాదీ " అంటూ చేల్లెల్లి నవ్వును, చెల్లెలి జ్ఞ్యాపకాలను, సజీవంగా మన కళ్ళ ముందుంచుతాడు . చదివిన దాని కంటే విన్నప్పుడు కథలో ఆ అనుబుతిని ఇంకా ఎక్కువగా మనమిక్కడ పొందవచ్చు మీరు వినండి.
4 comments:
మంచి విషయం. రహమతుల్లాగారి పేరు సుపరిచయమే అయినా వారి కథలు గుర్తు రావట్లేదు. నా దగ్గరున్న సంఅకలనాల్లో ఉన్నాయేమో వెతకాలి. ఆడియో ఫైలు ఎర్రర్ మెసేజి వస్తోంది.
@కొత్త పాళీ గారు
థాంక్స్ . ఆడియో ప్లే అవుతుంది .చుడండి "తెలుగు కథకి జేజే" అన్న సంకలినిలో "భా" అని ఒక కథ ఉంది.
paapam chaala vishadanga vundandi. aa story ...chala manchi post chesharandi
రెహమతుల్లా గారి కథల పుస్తకమ్ ఈ మధ్యనే చదివానండి. మనసు ద్రవించిపోయింది. పరిచయమ్ రాద్దామ్ అంటే ఇంకా ద్రవించిన మనసు ఘనపదార్ధంగా మారటమ్ లేదు. really heart touching stories.
Post a Comment