కాళోజి కి పరిచయం అక్కర్లేదు. కాళోజి తెల్వనోల్లు లేరు. ప్రజా కవులు ఇద్దరెనటా , ఆ రోజుల్లో వేమన, ఆధునిక కాలం లో కాళోజి. ప్రజల గొడవే నా గొడవ చేసుకొని రచనలు చేసిన వ్యక్తి, అటువంటి కాళోజి గురించి ఆకాశవాణి లో ప్రసారమయిన ఈ కార్యక్రమం లో .పొట్లపల్లి శ్రీనివాస రావు గారు మరియు అనిశెట్టి రజిత గార్లు పాల్గొన్న చర్చ కదంబ కార్యక్రమం ఇక్కడ వినండి.
కొన్ని కాళోజి ముచ్చట్లు
ఎవని వాడుక భాష వాడే రాయాలె. ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తద అని ముందర్నే మనమనుకుడు, మనను మనం తక్కువ చేసుకొన్నట్లే, ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడిపలుకుల భాష, పలుకు బడుల భాష పలుకు బడుల భాష గావాలె.
నామాటలల్ల అక్కడక్కడ సభ్యతలేదనే ఆక్షేపణవస్తదని నాకెర్కే, కాని నాభాష, నాయాస, నాబతుకు, నా తెలంగాణ ప్రజల పట్లసభ్యతగా ప్రవర్తీంచని వాణితో నాకేం సభ్యత అనేదే నా జవాబు.
కవి గూడ నేతగాడే
బహు చక్కని సాలెగూడు అల్లువెడే
రాజకీయ బల్లీ(యు)ల
నోటికి అందక ఎగిరెడి పక్షీ(యు)ల
చూపుల కనుపించనట్టి
సుకుమారపు సూత్రాలతొ -
బహు చక్కని సాలెగూడు అల్లువాడె
కవి గూడ నేతగాడె
రాజకీయ బల్లీ(యు)ల
రక్తసిక్త హస్తాలతొ ఎగరేసిన
తెలతెల్లని కపోతాలు వాలగ, కూర్చొని పాడగ
కైత; సింగిణీల దీర్చు
కవి గూడ నేత గాడె
బహు చక్కని సాలెగూడు అల్లువాడే
సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు
ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
ఈ ఫోటో సాహిత్య అభిమాని "శివ" గారు ఈ పోస్ట్ చదివిన తర్వాత పంపిన ఫోటో. హైదరాబాద్ లో పి.వి. నరసింహారావు గారి చేతులమీదుగా "నా గొడవ" పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా తీసిన ఫోటో. శివ గారికి కృతజ్ఞ్యలతో .
6 comments:
టపా ప్రెజెంటేషను తీరు బాగుంది.
ధన్యవాదములు :)
కాళోజీ ని గుర్తు చేసుకోవడం బావుంది. చర్చా కార్యక్రమం ఇంకా వినలేదు లెండి.
గొడవపడి 'వెళ్ళిపోయిన ' కాళోజి గారి గురించి చాల చక్కని విషయాలతొరేడియొ ప్రసంగం వినిపించారు. శ్రీనివసరావు,రజిత గార్ల ప్రసంగం ప్రశ0సనీయం. కాళొజి గారి ఆత్మని ఇద్దరూ చక్కగా ఆవిష్కరించారు.వారికీ, మీకు నెనరులు.
భాను గారూ. మంచి వ్యాసం వ్రాసారు. కాళొజీగారి కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. ఆయన వ్రాసిన "నా గొడవ" పుస్తక (సొంత జీవిత కథ) ఆవిష్కరణ, హైదరాబాదు పబ్లిక్ గార్డెన్సులో అనుకుంటాను, అప్పటి ప్రధని శ్రీ పి వి నరసింహారావుగారి చేతులమీదుగా జరిగింది. వారి పుస్తకం వారి ఆటోగ్రాఫ్‌తో నాదగ్గర ఉన్నది. అప్పుడు నేను తీసిన ఫొటోలు కూడ నా దగ్గర ఉండాలి. వెతికి మీకు పంపుతాను. ఆయన చిన్న నాటి సాహసాలు, కవితావేశం అన్నీ కూడ ఆదర్శప్రాయం. ఆయనతో కొద్ది సమయం ముచ్చటించటం ఎప్పటికీ గుర్తుండే ఆనందకర సంఘటన.
కాళోజీగారి మీద చక్కటి సాహిత్య ప్రసంగం అందించారు ధన్యవాదములు
రంజని,కల్పనా, అక్షర మోహనం, శివ గార్లకు అందరికి ధన్యవాదాలు
koloji gurinchi chala baga present chesaru
Post a Comment