Wednesday, October 13, 2010

రఫీ గారి మధురమయిన పాట ..నా మది నిన్ను పిలిచింది గానమై

 

రఫీ అనగానే మనకు గుర్తుకు వచ్చే పాట ఆరాధన సినిమా లోని " నామది నిన్ను పిలిచింది గానమై"  ఇదే పాట హిందీ లో కూడా రఫీ పాడాడు. ఉప్కార్ సినిమాలోని  " మేరె మితవ ..ఆజా తుజ్ కో  పుకారే మేరె గీత రే " రెండు పాటలు ఎంతో మధురంగా,  వింటుంటే వినాలనిపించే పాటలు. ఈ పాట వినగానే రఫీ సాబ్ మన గుండె తలుపుల్ని తట్టి , తెరిచి తెరవగానే నేరుగా వచ్చేసి మన గుండెలో తిష్ట వేసుకు కూర్చుంటాడు. అలా ఆ మధురిమలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. " తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరుపుల  రూపమై"    సి.నా. రే గారి సాహిత్యం ఎంత అందంగా ఉంది.

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...ప్రియతమా...
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను

తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను

వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

చిత్రం : అరాధన
గానం : మహమ్మద్ రఫీ
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం :సాలూరి హనుమంత రావ్ 




">

">

హిందీ లో.......

4 comments:

కొత్త పాళీ said...

మీ టేస్టుకి నమస్తే సార్. పాట బావుంటే బావుండచ్చుగాక, రఫీని ఈ పాటలో భరించడం మాత్రం నాకు చాఆఆలా కష్టం :)

voleti said...

నాకు కూడా ఈ "నా మది నిన్ను పిలిచింది గానమై" అన్న పాటంటే చాలా చాలా ఇష్టం.. ఓ ప్రియతమా ! అని రఫీ గారు మూడు సార్లు మధురంగా ఎత్తుకుని, తర్వాత ఎంతో గంభీరంగా "నా మది నిన్ను..." అంటూ పాడుతుంటే.. దానికి మన ఎన్.టి.ఆర్ అద్భుత నటనా సామర్ధ్యం తోడైతే... "ఇదిరా సినిమా అంటే.." అని అరవాలని వుంటుంది.. నా టీనేజ్ లొ ఒక్కణ్ణి వున్నప్పుడు గదిలో తలుపులేసుకుని గొంతెత్తి ఈ పాట్ ని మనసారా చాలా గట్టిగా పాడుకొనే వాణ్ణి..(గాయకుణ్ణి కాదుగా మన పాటకి ఎవరూ జడవకుండా) మళ్ళా ఆ రొజుల్ని తలపింప చేసారు.. థాంక్యూ వెరీ మచ్..

నాగేస్రావ్ said...

కొత్తపాళీగారు చెప్పినదానికి నూరుశాతం మద్దతు.
తెలుగు వాళ్ళు వేరే ఎవరు పాడినా రఫీపాడినదానికంటే బాగుంటుంది.

Anonymous said...

I do not agree with Kothapaali and nagesrao garu.
This song was a big hit when the movie was released.
Though Rafi's Telugu was not great he did a great job, in fact his telugu was better than many present day singers and actors..
This song remains evergreen in the telugu movie history.