Friday, August 20, 2010

తుమ్మేటి గారితో కాసేపు (2)

నేను ఇదివరకే చెప్పినట్లు నన్ను  తుమ్మేటి గారిని మల్లి కలిసేలా వారి కథలు  నన్ను పురిగొల్పాయి   అనడంలో ఎటువంటి సందేహము లేదు. అవి చదివిన , క్షమించాలి చూసి విన్న మరునాడే, జోరున వర్షం పడుతుంది. అయినా అదే వాన లో వారికీ ఫోన్ చేసి వారి ఇంటికి వెళ్లి కలిసా.  ప్రశాంతంగా ఉన్న ఇల్లు, పక్కనే ర్యాక్ లో ఎన్నో రకాల సాహిత్యం. వారితో మాట్లాడినంతసేపు నేను ఇంత పెద్ద రచయిత ముందు కుర్చున్ననా  ,అని ఒక ఫీలింగ్. ఎంత నిరాడంబరంగా. ఇక వారి మాటల్లో వారికి సాహిత్యం మరియు సాహిత్యలోకం పట్ల ఉన్న పట్టు అవగాహన ప్రతి మాటలో కన్పించింది. ఇప్పుడెందుకు మీరు రాయట్లేదు అన్న ప్రశ్నకు సింపుల్ గా ఎంతో మంది రాస్తున్నారు. కొత్తగా రాయటందుకు ఏముంది అంటారు.   వర్తమాన సమాజం పట్ల వారి ఆలోచన , విబిన్న ఆలోచన దృక్పథం ఎదుటివారిని వారిని మళ్ళి కలిసేలా కట్టిపడేస్తాయి.సెకండరీ గా రాయడం నాకిష్టం లేదు అని చెప్పారు.

అంతకుముందు రోజు నేను చుసిన వారి విడియో కథల గురించి చాలా సేపు మాట్లాడారు. బయట నా ఎదురుగా మాట్లాడుతున్న తుమ్మేటి గారికి, విడియో లో కథలను నర్రేట్  చేస్తున్న తుమ్మేటిగారికి ఏమి తేడ లేదు. నాతొ ఎలా మాట్లాడుతున్నారో అదే రీతిలో వారు కథ చెప్పిన విధానం , ఏదో మనం ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్లుగా , బాగుంది అన్నాను. ఒక చిన్న నవ్వు నవ్వి,  తన బాధ వ్యక్తం చేసారు. ఆ సి.డి లను వంద కాపీలు తీసి మిత్రులకు పంపితే ఒక్క ఆరుగురు మాత్రమే రెస్పాన్స్ ఇచ్చారని. 
 
 వారు చెప్పినట్లు ఈ రోజుల్లో ఉన్న క్షణ కాలం తీరిక లేని ఈ జీవితాల్లో ( నిజమేనా, మనం అలా అనుకున్తున్నమా  ) ఎంతమందికి పుస్తకాలు కొని చదివే ఓపిక ఉంది. అందరు ఎక్కువగా t .v  లకు అలవాటు పడుతున్న ఈ రోజుల్లో కథలను దృశ్య రూపకన్గా చూపిస్తే కథ అనేది పాటకులకు ఇంకా దగ్గరవుతుంది  కదా అంటారు.నిజమే నాకు ఈ సమయంలో గుర్తొచ్చింది .

కల్పనా రెంటాల గారు కుడా ఇలాంటి ప్రయత్నమే చేసి కవిత్వాన్ని శ్రవణ మాధ్యమంలో వినిపించారు. ఆడియో బ్లాగ్గింగ్  శీర్షికన వారు కూడా కవితలను వినిపిస్తూ వారు ఏమంటారంటే "  మౌనం గా లోపల్లోపల చదవటం కన్నా పైకి చదవటం వల్ల, పైకి చదివినది శ్రధ్ధగా వినటం వల్ల మరింత ఎక్కువగా మనసుకి హత్తుకొని దగ్గరవుతుందనిపిస్తుంది."   చదవడం కన్నా వినడంలో ఉన్న ఆనందం ఆ అందాన్ని వారన్నట్లు కవిత్వం యొక్క శబ్ద లయ సౌందర్యాని ఎంతో ఆస్వాదించవచ్చు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.నిజమే నేనుప్రత్యక్షంగా   ఆస్వాదించా.


తుమ్మేటి గారు  అలా అనడమే  కాదు, దానిని ఆ రూపకంగా  సి.డి. రూపకంలో తీసుకొచ్చారు. మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న ఇతివృత్తాలనే కథాంశాలుగా ఎన్నుకొని, వాటిని చాల చక్కగా  మనం మాట్లడుకొన్తున్నట్లుగ్గా చెప్పడం చుస్తే ఈ ప్రక్రియను ఆహ్వానిన్చాలనిపిస్తుంది.కథ మరియు ఆ కథాంశం మన మనసులకు ఇంకా  హత్తుకొని దగ్గరవుతుంది.


మనం రోజు చూసే  విషయాలపట్ల వారి విభిన్న ఆలోచనా ధోరణి చాల స్పష్టంగా ఈ కథల్లో కన్పిస్తుంది. ఈ కథలను  మరియు వీడియో లను నేను పరిచయం చేస్తాను అంటే సంతోషంగా ఒప్పుకొన్నారు. ఈ ప్రక్రియ ఎంత మంది లోకి పొతే అది అంత ప్రాచుర్యం పొందుతుంది. ఇంకా ఇలా ఎంతోమంది ముందుకు వస్తారు అని అంటారు. నిజమే. ఇంకా మీ స్నేహితులకి కూడా పరిచయం చేయండి అని చెబుతుంటే  వారికి ఈ ప్రక్రియ పట్ల ఉన్న తపన వారి కళ్ళల్లో స్పషంగా కనిపించింది. ఇంకా  ఎన్నో ఎన్నెన్నో విషయాలు వారితో మాట్లాడుతుంటే సమయం తెలిలేదు.  వారి విడియో కథలతో మల్లి కలుద్దాం.

7 comments:

Afsar said...

looking forward to the video updates. It would be a great effort and it's the need of the hour that Raghu's voice be heard!

కొత్త పాళీ said...

చాలా బాగుంది మీ ప్రయత్నం. తుమ్మేటి గారి కొన్ని కథలు నాకు చాలా ఇష్టం. సమకాలీన తెలుగు కథల్లో గొప్పవి అని తలుచుకున్నప్పుడల్లా ఆయన రాసిన చావువిందు కథ తప్పకుండా గుర్తొస్తుంది నాకు. ఆయన్ని 2003లో ఒకసారి కొద్దిసేపు కలిశాను కానీ వివరంగా ముచ్చటించే అవకాశం చిక్కలేదు.

ఆయన విడియో కథలకి స్పందన రాకపోవడం - ఇది కఠోర సత్యం. ఇటువంటి నిశ్శబ్దానికి కారణం బిజీ లైఫ్ కాదు, నిర్ల్కష్యం. క్లుప్తంగా చెప్పాలంటే మనవాళ్ళకి ఇంకోళ్ళు చేసిన మంచిపనిని మెచ్చుకునే అలవాటు లేదు. అదే ఏదన్నా సభ పెట్టి సన్మానం చేసి, వక్తల చేతిలో మైకు పెడితే ఒక్కొక్కరూ గంటసేపు పొగడ్తలు పొగుడుతారు, ఎవర్ని ఎందుకు పొగుడుతున్ణామో కూడా తెలీకుండా. అదిసర్లెండి గానీ ఈ విడియో సీడీల సమాచారం కనుక్కోండి, ఎక్కడ దొరుకుతున్నాయి, వెల యెంత - మన బ్లాగుల ద్వారా కోంత ప్రచారం కల్పించవచ్చు. సమాచారం తప్పక తెలియ చెయ్యండి.

భాను said...

నిజం చెప్పారు, మీ అబిప్రాయాలకి థాంక్స్ . ఈ వీడియొ లు తుమ్మేటి గారు ఇచ్చినవి నా వద్ద ఉన్నాయి. ఆ కతలను నా బ్లాగ్ ద్వార పరిచయం చేద్దామనుకుంటున్నాను. మీ కభ్యంతరం లేకపోతె మీ మెయిల్ అడ్రస్ ఇవ్వండి.

kalpanarentala said...

కొత్తపాళీ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మన వాళ్ళకు ప్రతి దాని పట్ల బోలెడు నిర్లక్ష్యం.
భాను గారు, మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మంచిది. ఈ బ్లాగుల ద్వారా కొంత తుమ్మెటి వీడియొ కథలకు ప్రచారం చేయవచ్చు. అలాగే అవి ఎక్కడ దొరుకుతాయి లాంటి సమాచారం కూడా అందచేయండి.

భాను said...

thanks kalpanagaru. ekkada dorukutayo telusukuni samacharamistanandi.

cbrao said...

కధా రచయిత తనే స్వయంగా కధ చదివి వినిపించె, కనిపించే వీడియో ప్రక్రియ బాగుంది. తుమ్మేటి గారి అనుమతి తో ఒక కధని Youtube లో పెట్టండి. వీడియో ఎక్కడ లభ్యమవునో తెలుపగలరు. ఇది చూడాలని ఆసక్తిగా ఉంది.
cbrao
Mountain View (CA)

మాగంటి వంశీ మోహన్ said...

తుమ్మేటి గారి కథల సంపుటి ఒక రెండున్నర సంవత్సరాల క్రితం నా వెబ్సైట్లో సాహితీ సంబంధ సెక్షన్లో ప్రచురించాను. మళ్లీ ఇన్నిరోజులకు ఆయనను గురించి ఇంటర్నెట్టులో చూడటం, వినటం. ధన్యవాదాలు.....

ఎలాగూ కామెంటు రాసాను కాబట్టీ, మీ ఈమెయిలు సంగతి ఎక్కడా కనపడలేదు కాబట్టీ, ఇక్కడే అడిగేస్తున్నాను...ఈవేళ మీరు ప్రచురించిన జానకీ రాణి గారి ఇంటర్వ్యూ నా వెబ్సైటు ఆకాశవాణి సెక్షన్లో పెట్టవచ్చా? వీలుంటే మీ అనుమతి maganti.org@gmail.com కు పంపించండి...అలాగే మీదగ్గర ఇంకేవన్నా ఆడియోలు ఉంటే కూడా పంచుకోండి..

మాగంటి వంశీ
www.maganti.org