Wednesday, August 11, 2010

మధుశాల

">
ఈ మధ్య పద్మభూషణ్  శ్రీ హరివంశ రాయ్ బచన్ చే రచించబడి తెలుగు లోకి దేవరాజు మహారాజు గారిచే అనువదించబడిన " మధుశాల" కవిత అనే పుస్తకం చదివా. ఇది సమీక్ష కాదు. నాకు నచ్చి ఏదో మీతో దానిగురించి పంచుకుందామని ఈ ప్రయత్నం....
హరివంశ రాయ్ బచన్ 1907 - 2003  మధ్య తొంబై ఆరేళ్ళపాటు జీవించి ఎన్నో రచనలు చేసినారు. 30 కవితః సంపుటిలు మరో 50 ఇతర గ్రంధాలు రచించాడు. 1935 లో రాసిన ఈ మధుశాల అతని కి ఎంతో ప్రక్యాతి ని తెచ్చింది.    హిందీ రాష్ట్ర బాష కావడానికి ముక్యమయిన బుమికను పోషించారు. హిందీ సాహిత్య రంగం  లో "హాలావాదాన్ని" (మధువాదాన్ని) ప్రతిపాదించి పోషించిన వాడి గా పేరొందాడు. మట్టె ఈ కాయం మనసే ఉల్లాసం, క్షణ బంగురం ఈ జీవితఃమ్, అదే నా పరిచయం అని తనను తానూ పరిచయం చేసుకోనేవాదట. ఈ మధుశాల కవిత్వాన్ని ఎన్నో సభలలో తానూ స్వంతగా చదివి వినిపించేవాడట.
ఇక మధుశాల కవిత సంపుటి లో మొత్తం 135 కవితలు (రుబాయీలు)ఒక్కొక్కటి నాలుగు పాదాలుగా రచించబడినది. ప్రతి కవితలో " మధువు" ,"మధుపాత్ర", "సాకి" మరియు "మధుశాల" నాలుగు  పదాలు వాడుతూ సమకాలీన జీవితం, తాత్వికత, దేశభక్తి , మతసామరస్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక విషయాలపై కవితలల్లారు. ఇక్కడ మధువు అంటే మధువు కానక్కరలేదు మధుశాల అంటే మధుశాలే కాదు అని కవి అంతరార్థం. ఒక ధ్యేయానికి , ఒక గమ్యానికి అది సంకేతం, ధ్యేయాన్ని బట్టి ఒక్కొక్కరి మధుశాల మారుతూ ఉంటుంది అని రచయిత తన ముందుమాటలో తెలియజేసారు.
  కవిని సాకీ గా చెబుతూ కవిత్వమనే మధువును మధుపాత్రలో నింపుకొని వచ్చాడు అని ఎంత తాగిన ఖాళీ అవదు అంటూ పాటక  జనమే తాగేవారు, పుస్తకమే మధుశాల అంటాడు.  మధుశాల కు భావుకత్వాన్ని జోడిస్తూ " గోరింటాకు పండిన చేతితి మణి భూషిత  మధు పాత్ర తీసుకొని మిసమిసలాడే బంగారు చ్చయతో ద్రాక్ష రసం , సాకీ అందిస్తే తాగే యోధులు రకరకాల  సంప్రదాయ దుస్తులతో ఉంటె ఇంద్రధనస్సు పోటిపదడా రంగురంగుల మధుశాల  అంటాడు. 
ఒక చోట పూజారి ని సాకీ గా పవిత్రగంగా జలాన్ని  మధువుగా జపమాలలను మధు పాత్రల మాలగా ఇంకా తాగు అన్నదే మంత్రోచ్చారనగా , మందిరాన్నే  మధుశాలగా అభివర్ణిస్తాడు.  మసీదుకు తాళం వేసినా రాజుల కోటలు బీటలు వారిన, కోశాగారాలు గుల్లయి పోయినా ఏమయినా సరే, తెరిచి  ఉండనీ  మధుశాలను అని అజ్ఞ్యాపిస్తాడు. పనివాడైనా , యజమాని  అయినా మధువు దగ్గర ఒకటే అంటాడు.మనందరికీ ఏడాదికి ఒక్క సారే  హోలీ, దీపావళి కాని మధుశాల లో రోజు పగలే హోలీ ,రాత్రి దివాలి అని రాస్తాడు.
అమ్మను సాకి అయి పాలిస్తే తొలి తొలి  మధువులు అందిస్తే అని, ఇంకో చోట సూర్యుడు మధు వర్తకుడు ,సముద్రమే ఒక మధు కలశం, మేఘమే సాకి, వర్షపు జలమే మధుధార, అని వర్షపు రుతువును మధుశాలతో పోలుస్తాడు.
ప్రకృతిని వర్ణిస్తూ, "ప్రభాత ప్రాతః కాలం సాకి ఉషస్సు పంచుతూ సాగేనహో, భుమ్యాకాశం కలిసే చోట మధువులు పారెను కిరణాలై, మధు కిరణాలు తాగిన పక్షులు పాటలు పిచ్చిగా పాదేనహో ,ప్రతి ప్రభాతము ప్రకృతిలోన వికసిన్చునదే మధుశాల" ఎంత అందమయిన భావన.హిమజాల్న్ని మధువుగా  నదులను సాకిలుగా పచ్చగా  ఉగెను పంటపొలాలు తాగిన మత్తులో అంటూ వ్యవసాయ భారతాన్ని మధుశాల గా ఆవిష్కరిస్తాడు. దేశ భక్తిని వర్ణిస్తూ, రుదిరాని మధువుగా ఆశిస్సుల మధుపాత్ర తీసుకోని మున్డుకునడువు అతి ఉదారము గుణము భారతిది త్యాగ శీలి సాకి, బలికోరే స్వాతంత్ర్యమే కాలిక - ఇక బలి వెదికే మధుశాల అంటాడు. .
మనల్ని మందిరం,మజీదే విడగోట్టిందని, మధువు దగ్గర అందరు సమానులే, అందరి మనసులు కలిపేదే మధుశాల అంటాడు. చివరికి చనిపోయేటప్పుడు నా ఆధరంములపై   తులసి దళ పాత్ర కారాదు, జివ్హాగ్రముపై గంగాజలమధువు అంటూ, శవయాత్రలో సత్యం మధుశాల అనమంటాడు. చితిపై నెయ్యి బదులు మధువు పోయ్యమంటాడు.పరలోకప్రయానానికి  పిలిపించండి తాగేవాల్లను, తెరిపించండి మధుశాలను అంటాడు. ఇలా చెబుతూ పొతే ఎన్నో ఎన్నెన్నో...

నీ హృదయపు లోతెంతుందో  మధు పాత్ర లోతంతుతుంది
నీ మనసున మతెన్తుందోమధువున మత్తతుంటుంది
నీ భావుకత అందం ఎంతో సాకి అంతటి సుందరమూ
ఎవ్వడేన్తటి  రసికుడయితే ,అంతటి రసమయము మధుశాల.

 జీవితం ఓక  సత్యం. పదం ఒక సత్యం ఈ రెండు వేర్వేరు, ప్రపంచ సాహిత్యమంతా పదాలతో రూపు దిద్దుకోన్నదే ,జీవితాన్ని అందుకోవడానికి పదాలు చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం - సాహిత్యం    అని అంటాడు హరివంశ రాయ్ బచన్.

6 comments:

తెలుగుయాంకి said...

చాలా చక్కని పరిచయము ఇచ్చినందుకు ధన్యవాదాలు

భాను said...

thanks

డా.ఆచార్య ఫణీంద్ర said...

కవిగా హరివంశరాయ్ బచన్, నటునిగా ఆయన కుమారుడు అమితాబ్ బచన్, ఇద్దరూ ’పద్మ భూషణ్’ పురస్కారాన్ని పొందడం - భారతీయ కళారంగంలో ఒక అరుదైన సన్నివేశం.

Kalpana Rentala said...

భాను గారు, సమీక్ష కాదు అంటూ చక్కగా సమీక్ష రాసి అందించారు కదా...ఒక్కటే లోపం. అక్షరదోషాలు ఈ పోస్ట్ లో చాలా ఎక్కువ వున్నాయి. మొదట్లో మరీ ఎక్కువ. అది తప్పితే మిగతా అంతా బావుంది. దేవరాజు మహారాజ్ గారి అనువాదం ఎలా వుండి మీకు? అయినా మీకు హిందీ బాగా వచ్చి వుంటే నేరుగా అందులో చదవటమే బెటారేమో కదా...

భాను said...

@paneedra garu

danyavadamulu

@kapanagaru

mee suchanalaku thanks.

Anonymous said...

sir... ee blog..dwara meeloni adbutha rachayithanu melkolapandi chalabaga manchivishayalu cheppuchunnaru mee blogu vishvavyapitham kavalani korukuntu mee abhimani SRINU/GDK RESERVATION/APSRTC