Saturday, August 28, 2010

పల్లె కన్నీరు పెడుతుంది

 ">

నాకు ఇష్టమయిన జానపదం , జన పదం   "పల్లె కన్నీరు పెడుతుంది" అన్న  గోరేటి వెంకన్న గారి పాట. నాకే కాదు తెలంగాణా లో ఈ పాట తెలవనివారు, ఈ పాటను హమ్ చేయని వారు ఉండరంటే అతిశయోక్తి ఏమి కాదనుకుంట. నేను మొదటి సారిగా. కుబుసం చిత్ర ఆడియో లో ఈ పాట విన్నాను. అప్పటినించి ఈ పాట నా ప్లే లిస్టు లో, నా గుండెల్లో కూర్చొని ఉంది.

 పల్లెలలో చిన్నతనం లో గడిపిన వ్యక్తిగా, పల్లెవాతావరణం కల్మషం గాని రోజుల్లో , పల్లెను చూసి ఆ వాతావరణాన్ని ఆ అందాన్ని అనుభవించిన  వ్యక్తి గా, ఈ పాట వింటుంటే, నిజంగా అప్పటికి , ఇప్పటికి ఎంత తేడ.  దుఖం రాక మానదు. ఈ పాట విన్నప్పుడుల్ల కళ్ళు చెమరుస్తాయి. ఎంత మంచి సాహిత్యం. "పల్లెకన్నీరు  పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బంది అయి పోతుందో  కనిపించని కుట్రల" అంటూ గోరేటి వెంకన్న మనకు మారిన పల్లెల దుస్థితి, పరిస్తితి ని గురించి కళ్ళకు కట్టినట్లుగా తెలియజేస్తారు. 

అభివృద్ధి పేరిట, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ పేరిట పల్లెల్లో మారిన వాతావరణం, అభివృద్ధి కంటే ఎక్కువ పల్లె రూపాన్ని  ఏ  దిశగా మార్చింది , కులవృత్తులు  ఎలా నాశన మయ్యాయో, ఎంతొ బాధతో వివరిస్తాడు. 

." చేతి వ్రుత్తులా  చేతులిరిగిపాయే  నా పల్లెల్లోన, నా గ్రామ స్వరాజ్యం గంగలోన పాయె ఈ దేశం లోన",  " తల్లి దుడ్ సేమియలకు దురమైనార సహెబుల పొరలు అంటూ ఉంటె దుఖం రాక మానదు. చివరికి నుదుట కుంకుమ కూడా పోయి "బొట్టు బిళ్ళలు నొసటి కొచ్చే గదరా  నా పల్లెల్లో","మన బుడ్డి దాసరి బతుకులాగామాయే" ట్రాక్టర్ లు యంత్రాలు వచ్చిన తర్వాత, " మా ఎద్దు బండి  గిల్లి గిరి పడ్డ ధమ్మో "    అంటుంటే గుండె ద్రవిస్తుంది.

 తొలకి జల్లుకు తడిసిన నేలా,  మట్టి పరిమలాలేమై  పోయేర " అంటూ అ పల్లె పరిమళాల గురించి అడుగుతుంటే........చివరికి పల్లె భూముల్లో "వానపాములు, నత్తగుల్లలు  ఎందుకు బతుకుతలేవు  అంటూ" , దీనికి కారణం పత్తి మందుల గత్తర వాసనరా అంటూ , పత్తి మందుల అప్పే రైతు కుతికె మీద కత్తి అయ్యింది అంటూ రైతు ఆత్మ హత్యల గురించి చెబుతుంటే.........కళ్ళకు నీళ్లు రాకుండా ఉంటాయా .

"బుక్క నోటిల పడ్డదంటే నేడు. ...అయ్యో  ఒక్కడు రాతిరి బయటికేల్లడంమో, ఇది ఏమి సిత్రమో" "బతుకమ్మ కోలాట పాటలు, భజన కీర్తనల మద్దెల మోతలు, బైరాగుల కిన్నెరా తత్వంములు కనుమరుగాయేర,  అరె స్టార్ టి.వి సకిలిస్తా ఉన్నదంమో" అంటూ ఎఫ్ టి వి ల పేరిట సామ్రాజ వాద  విషం ఎక్కుతుందని ఎంత హృద్యంగా ...

..కుల  వ్రుతులు మాయమవుతున్నాయి, కుటీర పరిశ్రమల్ ఎందుకుపెట్టారు అని ప్రశ్నిస్తాడు. బహుళ జాతి కంపెని ల మాయల భారత పల్లెలు నలిగిపోయి కుమిలె అంటూ ఉంటె.......పల్లెల్లో కుల వ్రుతులు మాయమైపోయి అందరు పట్టనాలల్లకు  వలస పోయి,  పల్లె కన్నీరు పెడుతుంది అంటే..... పల్లె కాదు మనం కనీరు పెట్టక మానం......

గోరేటి వెంకన్న గారే పల్లెటూరు అనే పాటలో, పల్లె అందాల గురించి చాలా చక్కగా చెప్పారు.  అలాంటి, పచ్చాని నా పల్లెటూరు, తొలకరి జల్లు పడితే కిలకిల నవ్వేటి నా పల్లె.....అమ్మఒడిలోన  ఉయ్యాల తీరు, గల గల పారేటి యేరు, గంతులేయంగా నిలిచింది చూడు,  ఇలాంటి పల్లెలు ఈ రోజు కన్నేరుపెడుతుంటే,  మన కళ్ళు కూడా కన్నీరు, మున్నీరవుతాయి. 

గోరేటి వెంకన్న, ఈ పాట వందేమాతరం  గళంలో, శ్రీహరి ముఖంలో , కళ్ళల్లో కనిపించే ఆ ఎక్ష్ప్రెశన్స,  రియల్లీ వండర్ఫుల్. ఆ పాట చిత్రీకరించిన విధానం, దర్శకుదేవ్వరో  గాని పల్లె  చూడని వాళ్ళ కు కూడా ఈ పాటను ఇష్ట పడేటట్లు , హృదయం ద్రవించి పోఎంతగా,     చిత్రీకరించిన వైనం అభినందనీయం.  శ్రీహరి  కళ్ళల్లో , ముఖం లో వ్యక్తం చేసిన ఆ expressions మనల్ని ఎప్పుడు  వెంటాడుతుంటాయి. 

( గోరేటి  వెంకన్న గారి పూర్తి పాట ఈ సినిమా లో  చిత్రీకరించా బడలేదు. గోరేతిగారు స్వంతంగా పడిన పాట, మరియు సాహిత్యం ఇంకో పోస్ట్ లో )

14 comments:

..nagarjuna.. said...

ఈ పాటను మొదటిసారి విన్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. "గ్రామస్వరాజ్యం గంగలోనపాయే ఈ దేశంలోన" ఒక్క వాక్యంలో భావం మొత్తాన్ని చెప్పారు గోరెంటి వెంకన్న. ఆయనే స్వయంగా పాడుతుంటే ఇంకా హృద్యంగా అనిపించింది

Anonymous said...

Heard the song. It is similar to a typical communist telangana song. I am not impressed. They talk only about one side, not about the development, like oil lamp to electric bulb, etaamu to ele pump, Ox-plough to tractors, insufficient animal manure to modern fertilizers to mention few.

These type of songs are used by Naxals and seperatists equally though they are totally unrelated. They serve to instigate stupid emotions even in the educated fools.

కొత్త పాళీ said...

అవును, గోరెటి వెంకన్న పాటలు ఆయనే పాడినప్పుడు కలిగే భావమే వేరు.

Anonymous said...

ee paata kamunistulidi,naxalitesdi kaadu sepertistuladi kaadu.palle geevanam istapade prathi okkari avedana.GORETI baadalo nijamundi intha manchi pata raasina venknnani abhinandaniyudu benjimen.

Kalpana Rentala said...

మాకు కూడా ఈ పాట చాలా ఇష్టం. కారు లో వెళ్ళేటప్పుడు తరచూ ఈ పాట వింటూ వుంటాము. గోరటి వెంకన్న గారిని ఇక్కడ డల్లాస్ మీటింగ్ లో కలుసుకున్నాపుడు చాలా సంతోషం గా అనిపించింది.

మరో సారి ఈ పాట వినేలా చేసినందుకు ధన్యవాదాలు.

Anonymous said...

పాట బాగుంది. వెంటనే వెయ్యేళ్ళు వెనక్కు తిరోగమిద్దాం.

స్వామి ( కేశవ ) said...

veyyellu venakki tirogaminhakkarledu, tirogaminchalsina avasarmu ledu.,

pallelu tana vunikini kolpotunnayane rachayita bhavalu ardam cheskoka poyina parledu, daya chesi helana matram cheyyoddu.

thank u for song ..

durgeswara said...

నిజంగా వెంకన్నాగారు ప్రజాకవి .ప్రజల హృదస్పమ్దనలకవి

..nagarjuna.. said...

@Anonymous': అది కమ్యునిస్టు పాటకాదు, తిరోగమనం అలవర్చుకొమ్మని చెప్పేది కాదు సార్, కొన్ని దశాబ్దాల ముందు ఇండిపెండెంట్, self sustaining systemగా ఉన్నా ’గ్రామం’ అనే వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అనే అవేదన. చేతివృత్తులను కనీసం సంఘటితమన్నా చేయలేని మన భావాలు ఆదర్శాల మీద విసురు. And if you feel that development is in 'imported' items i have nothing to say...you may assume whatever you feel

madhu said...

Great song, Thank you for making us listen this song again!!!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఇప్పటికీ పల్లె ఎందుకు కన్నీరు పెడుతుందో తెలుసుకోలేని వాళ్ళే పలకులవుతున్నారు. మల్టిప్లెక్సులూ, షాపింగ్ మల్ లూ, విదేశీ కర్లే అభివృద్ధికి చిహ్నాలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ కన్నీటి ప్రవాహం ఇప్పట్లో ఆగేనా?

Anonymous said...

వందేళ్ళ క్రింద వున్న వ్యవస్థ కాలానుగుణంగా మారుతోంది. అప్పటిలా ఓ ఖాదీ ధోతీనో చీరనో కట్టుకోవడానికి ఎంతమంది ముందుకొస్తారు? కృత్రిమ ఎరువులు, మందులూ వాడకుండా వందేళ్ళలో నాలుగింతలైన ప్రజలకి తిండెలా పెడతారు? ఇవన్నీ కవి ఆలోచించడు, అతనికి కావాల్సింది ఓ పాట, మెచ్చుకునే జనం. మనం ఆలోచించాలి. ఇంకా బొగ్గులకుంపట్లు, కమ్మరి కొలిమి, గానుగ నూనె, ఏతాము, మట్టి కుండలు అంటూ కూచుంటే 1.2బిలియన్ జనాభాకు తిండెవడు పెడతారు? పాట బాగుంది, గోరేటి ఎంకన్న మంచిగా పాడిండు, కాదంటలే. ఆచరించడానికి కాలానుగుణంగా లేదు. ఆకాలంలో అత్యవసరంగా ఒక్క ఫోను చేయాలంటే జిల్లా కేంద్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి. భూతవైద్యులు తప్ప డాక్టర్ కావాలంటే బండిమీద రోగిని 50మైళ్ళు తోలుకపోయే పరిస్థితి.

sudha said...

భాను గారు,
ఈపాట అంటే నాకు చాలా ఇష్టం మీ అభిరుచికి నా అభినందనలు.

Bolloju Baba said...

ఈ పాటంటే నాకూ ఇష్టమే

ఈ పాటపై నా పోస్టు ఇక్కడ

http://sahitheeyanam.blogspot.com/2008/10/blog-post_26.html

అనానిమస్ గారి అభియోగాలికి పై పోస్టులో డా. దార్ల గారి కామెంటుకు ఇచ్చిన సమాధానంలో నా అభిప్రాయాలు చెప్పాను.

బొల్లోజు బాబా